Karthika deepam september 19th episode: శ్రీధర్ రెండో భార్యను చూసేసిన పారు, జ్యోత్స్న- దీప దయతో కోలుకున్న కార్తీక్
Karthika deepam 2 serial today september 19th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కాశీ తన పెళ్లి గురించి స్వప్న వాళ్ళ నాన్నతో మాట్లాడమని పారిజాతం, జ్యోత్స్నను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ శ్రీధర్ ను చూసి ఇద్దరూ షాక్ అవుతారు.
Karthika deepam 2 serial today september 19th episode: మా అమ్మ దృష్టిలో మా నాన్న దేవుడు. ఎంత ప్రేమగా చూస్తాడు అంటే ఆ ప్రేమ చూపించడం ఈ మధ్య తగ్గించాడు. కానీ ఆ ప్రేమ చూసి నేను జలసీగా ఫీల్ అయ్యే వాడిని. ఓ మంచి భర్త ఎలా ఉండాలని నిద్రలేపి అడిగినా మీ నాన్నలా ఉండాలని అంటుంది. భరించడానికి మా నాన్న మామూలు మోసం చేయలేదు.
తట్టుకోలేని నిజం ఏంటి?
నిజం తెలిస్తే మా అమ్మ తట్టుకోగలదా అని కార్తీక్ దీపను అడుగుతాడు. నువ్వు చెప్పకపోయినా నిజం తెలుస్తుందని కాంచన ఎంట్రీ ఇస్తుంది. కార్తీక్, దీప టెన్షన్ పడతారు. నిజం ఎవరూ చెప్పకపోయినా ఏదో ఒక రోజు తెలుస్తుంది. కానీ ఆ నిజం ఏంటి? అని ప్రశ్నిస్తుంది.
తట్టుకోలేని నిజం ఏంటి? దాని గురించి మీరిద్దరూ ఎందుకు మాట్లాడుకుంటున్నారని అడుగుతుంది. పెళ్లి గురించి అడిగానని దీప కవర్ చేస్తుంది. రెస్టారెంట్ పనులు పూర్తయిన తర్వాత పెళ్లి అంటే జ్యోత్స్న తట్టుకోలేదు కదాని దీప అంటుందని కార్తీక్ అబద్ధం చెప్తాడు.
నా బలం, బలహీనత వీళ్ళే
ముందు పెళ్లి తర్వాత రెస్టారెంట్ పనులు చూసుకోండి అని కాంచన అంటుంది. దీప ఇన్ డైరెక్ట్ గా కాంచనకు విషయం చెప్పేందుకు చూస్తుంది. మీ మనసుకు ఏదైనా గాయం అయితే తట్టుకోగలరా అని అడుగుతుంది. తట్టుకోగలను కాకపోతే నాకు బలం, బలహీనత ఉంటాయి.
నా బలం, బలహీనత నా భర్త, కొడుకు. వీళ్ళ విషయంలో ఏం జరిగినా తట్టుకోలేను. ప్రాణం పోయిన తట్టుకోగలను కానీ వీళ్ళకు ఏం జరిగిన భరించలేనని అంటుంది. తల్లి మాటలకు కార్తీక్ బాధపడతాడు. నీకు కష్టం రానివ్వను అని కార్తీక్ చెప్తాడు. కాశీ పారిజాతాన్ని స్వప్న ఇంటి దగ్గరకు రమ్మని చెప్తాడు.
స్వప్న ఇంటికి పారిజాతం
కాశీ నిన్ను రమ్మంటే నన్ను ఎందుకు తీసుకొచ్చావని జ్యోత్స్న కోప్పడుతుంది. వాడు నీ సొంత తమ్ముడు వాడికి అవమానం జరిగితే నీకు జరిగినట్టే కదాని పారిజాతం అంటుంది. వాడికి నాకు ఏ రిలేషన్ లేదు. నేను దశరథ, సుమిత్ర కూతురిని మాత్రమే ఇది గుర్తు పెట్టుకో అని జ్యోత్స్న సీరియస్ అవుతుంది.
కాశీ స్వప్న ఇల్లు వాళ్ళకు చూపిస్తాడు. నానమ్మ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నేను అనామకుడిని కాదని నాకు మంచి ఫ్యామిలీ ఉందని స్వప్న వాళ్ళ నాన్నకు తెలియాలని అంటాడు. పారిజాతం తెగ కటింగ్ లు ఇస్తుంది. గ్రాని వేషాలు చూసి జ్యోత్స్న తల పట్టుకుంటుంది.
శ్రీధర్ రెండో భార్యను చూసేసిన పారు
ఆవేశంగా స్వప్న ఇంట్లోకి వెళ్లబోయిన పారిజాతం శ్రీధర్ ని చూసి ఒక్కసారిగా ఆగిపోయి షాక్ అవుతుంది. జ్యోత్స్న కూడా శ్రీధర్ ను చూస్తుంది. మా మావయ్యను చూసి మీరు ఎందుకు షాక్ అవుతున్నారని కాశీ వాళ్ళను అడుగుతాడు. అతను ఎవరో మీకు తెలుసా అంటే పారిజాతం తెలియదు అనేస్తుంది.
కాసేపటికి కావేరీ శ్రీధర్ దగ్గరకు వస్తుంది. అదిగో మా అత్త కూడా వచ్చేశారని కాశీ అంటాడు. తనని చూసి పారిజాతం వాళ్ళు బిత్తరపోతారు. కాశీని వెళ్లిపొమ్మని పారిజాతం అంటుంది. పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటామని చెప్పి పంపించేస్తుంది. అల్లుడు నువ్వు ఇంత గుండెలు తీసిన బంటువు అనుకోలేదు.
నిజం చెప్పొద్దన్న పారు
మరీ ఇంత మోసమా నాకు నరసింహ గుర్తుకు వచ్చాడని జ్యోత్స్న అంటుంది. ఈ విషయం ఇంట్లో చెప్పొద్దని పారిజాతం అంటుంది. ఈ విషయం తెలిస్తే గొడవలు జరిగిపోతాయని పారిజాతం సర్ది చెప్తుంది. ఇప్పుడే వెళ్ళి తాతయ్యతో విషయం చెప్పేస్తానని జ్యోత్స్న అంటుంది.
శ్రీధర్ కు రెండో పెళ్లి జరిగిందని తెలిస్తే మీ తాత కార్తీక్ తో పెళ్లి జరగనివ్వడు. అస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసేస్తాడని పారిజాతం ఆపుతుంది. కార్తీక్ మెల్లగా నడవడం చూసి దీప, కాంచన సంతోషిస్తారు. జ్యోత్స్నతో ఏడడుగులు వేయడానికి కార్తీక్ బాబు రెడీ ఉన్నారని చెప్పి ముహూర్తాలు పెట్టించమని దీప అంటుంది.
దీప మంచితనాన్ని కాంచన మెచ్చుకుంటుంది. కార్తీక్ పట్ల నువ్వు చూపించిన శ్రద్ధ వల్లే త్వరగా కోలుకున్నాడని అంటుంది. కార్తీక్ కూడా థాంక్స్ చెప్తాడు. నా వల్ల అయిన గాయం నా వల్లే మానిపోయింది అంటే సంతోషంగా ఉందని దీప అంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.