Karthika deepam september 18th episode: జ్యోత్స్నకు దీప వార్నింగ్- శ్రీధర్ బెదిరించిన విషయం కార్తీక్ తో చెప్పిన కాశీ
Karthika deepam 2 serial today september 18th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తన గురించి నోటికొచ్చినట్టు మాట్లాడంతో జ్యోత్స్నకు దీప వార్నింగ్ ఇస్తుంది. తన జీవితంలో తన కూతురికి తప్ప మరెవరికీ స్థానం లేదని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి మీ బావను దూరం చేసుకోవద్దని అంటుంది.
Karthika deepam 2 serial today september 18th episode: జ్యోత్స్న మాటలకు దీప కోపంగా తన మీదకు చెయ్యి ఎత్తుతుంది. హద్దు దాటి మాట్లాడితే చెంప పగలగొడతానని వార్నింగ్ ఇస్తుంది. నేను ఇక్కడికి వచ్చింది వంట చేయడానికి, నువ్వు అనుకున్నది చేయడానికి కాదు. నీ స్థానంలోకి రావాలని నేను ఎందుకు అనుకుంటాను.
దీప వార్నింగ్
అసలు నాతో నీకు పోలిక ఏంటి. నువ్వు ఎక్కువ ఊహించుకుని భయపడుతున్నావ్. నా జీవితంలో నా కూతురికి తప్ప ఇంకెవరికీ స్థానం లేదు. నేను ఇదంతా చేయడానికి కారణం ఉంది. నేను చావకుండా నా కూతురు అనాథ కాకుండా కాపాడిన కార్తీక్ బాబుకు నేను చూపించే కృతజ్ఞత ఇది.
కృతజ్ఞతకు అర్థం తెలియని దానివి నువ్వు. ఇలాగే ఆలోచిస్తే నీ బావను నువ్వే దూరం చేసుకుంటావు. ఇప్పటికీ నా మాటలు నమ్మకపోతే అది నీ ఖర్మ. పద్ధతి మార్చుకో లేదంటే జరిగేది దేవుడు కూడా మార్చలేడని దీప గట్టిగా చెప్తుంది. శౌర్య కార్తీక్ తో ముచ్చట్లు చెప్తూ ఉంటుంది.
స్వప్న వాళ్ళ డాడీ వార్నింగ్ ఇచ్చారు
కాశీ కంగారుగా దీపను కలుస్తాడు. అటు స్వప్న పరిస్థితి ఎలా ఉందోనని కార్తీక్ ఫోన్ ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్వప్న వాళ్ళ నాన్నను చూశావా అని దీప అడిగితే వంద మందిలో ఉన్న గుర్తు పడతానని చెప్తాడు. కాశీని చూసి కార్తీక్ షాక్ అవుతాడు. స్వప్న వాళ్ళ డాడీ నాకు ఫోన్ చేశారు.
ఫోన్ చేయడం ఏంటి కలవలేదా? అని కార్తీక్ అడిగితే లేదని చెప్తాడు. ఇంకోసారి నా కూతురు జోలికి వస్తే చంపేస్తానని స్వప్న వాళ్ళ డాడీ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారని చెప్పడంతో దీప వాళ్ళు షాక్ అవుతారు. అదేంటి స్వప్న వాళ్ళ డాడీ పెళ్ళికి ఒప్పుకున్నారని నాకు ఫోన్ చేసి చెప్పిందిగా అని కార్తీక్ అంటాడు.
మా నాన్నకు నిజం తెలిసింది
నాకు ఫోన్ చేసి నోటికొచ్చినట్టు తిట్టాడు. నేను ఫోన్ చేస్తానని స్విచ్ ఆఫ్ చేశాడు. నేను సైలెంట్ గా ఉంటే స్వప్న నాకు దూరం అవుతుంది. ఏదో ఒకటి చేయాలని టెన్షన్ పడతాడు. కార్తీక్ తిడతాడు. స్వప్నకు ఏం కాదని నచ్చజెప్పి కాశీని ఇంటికి వెళ్ళమని చెప్తారు.
నేను మిమ్మల్ని నమ్ముకున్నాను మీరే మా పెళ్లి చేయాలని అంటాడు. మా నాన్న కాశీకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు అంటే దాసు మావయ్య కొడుకు అని తెలిసిపోయి ఉంటుంది. అందుకే ఇలా చేశాడు. స్వప్నకు వేరే పెళ్లి చేస్తే అది బతకదు, కాశీ కూడా బతకడని కంగారుపడతారు.
నీ కన్న కూతురు నేనా దీపనా?
మీ అమ్మకు నిజం చెప్తే అని దీప అంటుంది. అప్పుడు మనమే అమ్మని చంపినట్టు అవుతుంది. మా నాన్నకు ఇద్దరు భార్యలు ఉన్నారేమో కానీ నాకు మాత్రం అమ్మ ఒక్కటే ఉంది. ఏదో ఒకటి చేసి అమ్మను కాపాడుకోవాలని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న ఇంట్లో మీటింగ్ పెడుతుంది.
ఈ ఇంటి వారసురాలిని అవమానించిందని పారిజాతం తెగ ఆవేశంగా మాట్లాడుతుంది. ఎంతో సహనంగా ఉండే దీప చెయ్యి ఎత్తింది అంటే నువ్వు ఏమన్నావని శివనారాయణ కూడా అడుగుతాడు. సుమిత్ర కూడా నువ్వే దీపను ఏదో అని ఉంటావని అంటుంది. నీ కన్న కూతురు నేనా ఆ దీపనా? అని సుమిత్రను నిలదీస్తుంది.
త్వరలోనే పెళ్లి చేస్తా
మీరు అసలు నన్ను కన్న కూతురిలా చూడటం లేదని జ్యోత్స్న ఆవేశపడుతుంది. దీప ఏ తోడు లేని మనిషివి అందుకే జాలి ఉంటుంది. కానీ నువ్వు ఈ ఇంటికి ఉన్న ఒక్కగానొక్క వారసురాలివి అని సుమిత్ర అంటుంది. మీరు పెళ్లి గురించి ఆలోచించమని జ్యోత్స్న అడుగుతుంది.
కార్తీక్ కోలుకోగానే ఒక మంచి రోజు చూసి పెళ్లి చేస్తానని దశరథ హామీ ఇస్తాడు. స్వప్న దిగులుగా కూర్చుని ఉంటే కాశీ ఎవరికీ కనిపించకుండా తనను కలిసేందుకు వస్తాడు. నాన్న ఇంట్లోనే ఉన్నాడు చూస్తే ప్రాబ్లం అవుతుంది వెళ్లిపొమ్మని చెప్తుంది. మీ డాడీ మమ్మల్ని అసలు కలవలేదని చెప్తాడు.
అర్థరాత్రి స్వప్నను కలిసిన కాశీ
జరిగింది మొత్తం బావను కలిసి విషయం మొత్తం చెప్పాను. ఏం జరుగుతుందో తెలియక భయం వేసి వచ్చానని చెప్తాడు. నేను మా పారిజాతం నానమ్మను తీసుకొచ్చి మాట్లాడిస్తానని కాశీ ధైర్యం చెప్తాడు. ఆవిడ మాట్లాడితే తప్పకుండా ఒప్పుకుంటారని అంటాడు. కావేరీ రావడంతో కాశీ ఆమెకు కనిపించకుండా దాక్కుంటాడు.
కార్తీక్ కాశీ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ సమస్యకు పరిష్కారం మీ అమ్మగారికి నిజం చెప్పడమే. చిన్న చిన్నగా ఆమె మనసును సిద్ధం చేయాలని దీప అంటుంది. మా అమ్మ దృష్టిలో మా నాన్న దేవుడు. మా అమ్మకు జ్యూస్ కలిపి ఇవ్వడం దగ్గర నుంచి వంట కూడా చేస్తాడు.
ఎంత ప్రేమ చూపిస్తాడంటే మా అమ్మ అదృష్టానికి నేను జెలసీ ఫీల్ అయ్యేవాడిని అని చెప్తాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.