Karthika deepam september 21st episode: నరసింహను చితక్కొట్టిన దీప- పరువే ముఖ్యమన్న శివనారాయణ, స్వప్న ఆత్మహత్యాయత్నం-karthika deepam 2 serial today september 21st episode swapna harms herself as sridhar thrashes kasi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam September 21st Episode: నరసింహను చితక్కొట్టిన దీప- పరువే ముఖ్యమన్న శివనారాయణ, స్వప్న ఆత్మహత్యాయత్నం

Karthika deepam september 21st episode: నరసింహను చితక్కొట్టిన దీప- పరువే ముఖ్యమన్న శివనారాయణ, స్వప్న ఆత్మహత్యాయత్నం

Gunti Soundarya HT Telugu
Sep 21, 2024 07:18 AM IST

Karthika deepam 2 serial today september 21st episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తనను చంపడానికి వచ్చిన నరసింహ మీద దీప ఎదురుదాడికి దిగుతుంది. కర్ర తీసుకుని చితక్కొడుతుంది. దెబ్బలు తట్టుకోలేక నరసింహ పారిపోతాడు.

కార్తీకదీపం 2 సీరియల్ సెప్టెంబర్ 21వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ సెప్టెంబర్ 21వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today september 21st episode: నరసింహ దీప మీద మరోసారి దాడి చేస్తాడు. కత్తితో పొడిచేందుకు ప్రయత్నిస్తాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది. దీప నరసింహను తోసేసి కర్ర తీసుకుని పిచ్చ కొట్టుడు కొడుతుంది. దెబ్బలకు భయపడి నరసింహ పారిపోతాడు.

ఈ పెళ్లి జరగదు

భయంతో ఊరు వదిలి వెళ్ళిపోయాడు అనుకున్నాను కానీ వీడు దారి కాసి నన్ను చంపాలని చూశాడంటే ఇంటికి కూడా వస్తాడు. శౌర్యను జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటుంది. కాశీ నానమ్మ ఇంకా ఫోన్ చేయలేదు ఏంటని ఆలోచిస్తూ ఉంటాడు. దాసు వస్తే ఇదే విషయం చెప్తాడు.

ఈ పెళ్లి జరగదని దాసు అనడంతో కాశీ ఏమైందని కంగారుగా అడుగుతాడు. వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు కదా. రెండు నెలల వరకు నువ్వు ఈ పెళ్లి గురించి మాట్లాడకని చెప్తాడు. కానీ కాశీ మాత్రం వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే మేం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటామని అంటాడు.

కాశీని మర్చిపో

నేను చేసిన తప్పు నువ్వు చేయవద్దు అందరూ లేకుండా ఆ అమ్మాయిని అనాథను చేయొద్దని దాసు చెప్తాడు. రెండు నెలలు ఆగమని చెప్తాడు. స్వప్నకు సంబంధాలు చూస్తున్నారు. ఏదో ఒకటి చేయాలని డైరెక్ట్ గా స్వప్నను కలిసి మాట్లాడాలని అనుకుంటాడు.

స్వప్న ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. కావేరి వచ్చి కాశీని మర్చిపో నీ లైఫ్ బాగుండాలంటే శ్రీకాంత్ ని పెళ్లి చేసుకో. నీ పెళ్లి కాశీతో జరగడం నాకు ఇష్టం లేదు. మీ డాడీ చెప్పినట్టు విను అంటుంది. చెప్పినంత ఈజీ కాదు మర్చిపోవడం చావనైనా చస్తాను కానీ మీరు చెప్పిన పెళ్లి చేసుకొనని స్వప్న అనుకుంటుంది.

నిజం తెలిసేలోపు పెళ్లి జరగాలి

పారిజాతం టెన్షన్ తో పోయేలా ఉంటుంది. మావయ్య రెండో పెళ్లి చేసుకుంటే నాకేంటి నాకు ఏం ప్రాబ్లం అని జ్యోత్స్న అంటుంది. ఈ విషయం తెలిస్తే మీ తాతయ్య పెళ్ళికి ఒప్పుకోరని పారు చెప్తుంది. ఎందుకు తాతయ్య రెండో పెళ్లి చేసుకోలేదా ఏంటని అడుగుతుంది.

మీ తాతయ్య భార్య చనిపోతే పిల్లలని చూసుకోవడానికి నన్ను పెళ్లి చేసుకున్నారు. కానీ అల్లుడు కాంచన బతికి ఉండగానే ఇంకో దాని మెడలో తాళి కట్టాడని అంటుంది. అల్లుడు చేసిన చండాలం అందరికీ తెలిసేలోపు నువ్వు కార్తీక్ కి పెళ్ళాం అయిపోవాలి. లేకపోతే ఈ పెళ్లి జరగదని పారు చెప్తుంది.

అలాంటి వ్యక్తికి విలువ లేదు

ఎవరి పెళ్లి జరగదని శివనారాయణ అడుగుతాడు. మా ఫ్రెండ్ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నామని జ్యోత్స్న చెప్తుంది. శ్రీధర్ గురించి ఇన్ డైరెక్ట్ గా చెప్తుంది. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చేసింది కరెక్ట్ కాదా అని అడుగుతుంది. ఆయన చేసింది కరెక్ట్ ఈ పెళ్లి జరగకూడదు. అనేసరికి జ్యోత్స్న షాక్ అవుతుంది.

తండ్రి తప్పు చేస్తే శిక్ష కొడుక్కి వేస్తారా అంటుంది. తాళి కట్టేది కొడుకే అయినా వియ్యం అందేది కుటుంబంతో భర్త చనిపోయిన తర్వాత భార్య పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు. కానీ భార్య ఉండగా తాళి కడితే అది అక్రమ సంబంధం అవుతుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న మనిషికి సమాజంలో విలువ లేదని చెప్తాడు.

పరువే ముఖ్యం

అలాంటి మనిషి వియ్యంకుడు అని ఎలా చెప్పుకుంటారు. కాశీ తండ్రి దాసు పని మనిషిని పెళ్లి చేసుకుని నా పరువు తీశాడని శివనారాయణ చెప్తాడు. నాన్న ఈ తప్పు చేసినా ఇదే పని చేస్తారా అని జ్యోత్స్న అడుగుతుంది. నేను తప్పు చేసినా నాన్న ఇదే నిర్ణయం తీసుకుంటారని దశరథ చెప్తాడు.

తప్పుడు మనుషులతో సంబంధాలు కలుపుకోవడం కాదు వాళ్ళ నీడను కూడా తాకను. నాకు పరువే ముఖ్యమని శివనారాయణ తెగేసి చెప్పడంతో జ్యోత్స్న, పారు షాక్ అవుతారు. అందరికీ నిజం తెలిసే లోపు పెళ్లి జరిగిపోవాలని పారిజాతం చెప్తుంది. ఈ నిజం దీపకు తెలియదా అని జ్యోత్స్న అంటుంది.

చెయ్యి కోసుకున్న స్వప్న

కాశీ స్వప్న ఇంటికి తనతో మాట్లాడతాడు. మన గురించి ఎవరూ పట్టించుకోనప్పుడు మన ప్రేమను మనమే కాపాడుకోవాలని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. శ్రీధర్ వచ్చి కాశీని కొడతాడు. నా కూతురు కావాల్సి వచ్చిందా అని కొడతాడు. నువ్వు ఏం చేసిన సరే నేను నీ కూతురినే పెళ్లి చేసుకుంటానని కాశీ చెప్తాడు.

స్వప్న చెయ్యి కట్ చేసుకుంటుంది. కాశీని నువ్వు చంపేస్తే నేను బతికి ఉండలేనని అంటుంది. కూతురి పరిస్థితి చూసి శ్రీధర్ తల్లడిల్లిపోతాడు. దీప నరసింహ దాడి చేసిన విషయం అనసూయకు చెప్తుంది. శౌర్యను జాగ్రత్తగా చూసుకోవాలని అంటుంది. నరసింహ జైలుకు వెళ్ళాలి వాడు చేసిన తప్పు వాడికి తెలియాలని అంటుంది.

కార్తీక్, జ్యోత్స్నకు పెళ్లి అయిపోయిన తర్వాత మనం ఊరు వెళ్లిపోదామని దీప చెప్తుంది. కాశీ దీపకు ఫోన్ చేసి స్వప్న ఇంట్లో జరిగిన గొడవ చెప్తాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.