Karthika deepam september 27th episode: బయటపడిన శ్రీధర్ బండారం- బయటకు పోరా కుక్క అంటూ శివనారాయణ ఆగ్రహం
Karthika deepam 2 serial today september 27th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శ్రీధర్ రెండో పెళ్లి విషయం శివనారాయణ కుటుంబం ముందు బట్టబయలు అవుతుంది. అల్లుడు తప్పు చేశాడని తెలుసుకుని కొడతాడు. తన ఇంట్లో స్థానం లేదంటూ బయటకు పోరా కుక్క అని అవమానకరంగా మాట్లాడతాడు.
Karthika deepam 2 serial today september 27th episode: పారిజాతం స్వప్నను ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. మా అమ్మానాన్నలను ఏం అనొద్దు వాళ్ళని అనే అధికారం మీకు లేదు, ఈ పెళ్లి జరిగింది తన ఇష్టప్రకారమేనని చెప్తుంది. తర్వాత అయినా ఈ పెళ్లి విషయం తెలిస్తే మీ నాన్నకు తెలిస్తే మాతో గొడవ జరుగుతుంది కదా అలా జరగకుండా ఉండాలంటే మీ నాన్నని పిలిపించు నేను మాట్లాడతానని శివనారాయణ చెప్తాడు.
మీ నాన్న ఎవరు?
వద్దని చెప్పి కవర్ చేసేందుకు పారు ట్రై చేస్తుంది కానీ వర్క్ అవుట్ కాదు. మీ నాన్న ఎవరు, ఏం చేస్తుంటారని శివనారాయణ అడుగుతాడు. అప్పుడే శ్రీధర్ ఇంటికి వస్తాడు. కార్తీక్ తల్లికి విషయం తెలియకుండా ఉండేందుకు జాగ్రత్త పడతాడు. కానీ స్వప్న మాత్రం మీరు మాకు సపోర్ట్ గా ఉండాలి కదాని అడుగుతుంది.
దీప కూడా స్వప్నను వెళ్దామని అంటే శివనారాయణ ఆపుతాడు. నువ్వు పెళ్లి చేసినా కూడా ఇప్పుడు ఇది ఈ ఇంటి సమస్యగా మారిపోయింది. శివనారాయణ మనవడు ఎవరినో తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడని ప్రచారం చేస్తాడని దాని వల్ల ఈ ఇంటి గౌరవం పోతుందని సమస్యను పరిష్కరించాలని అంటాడు.
శ్రీధర్ ఎంట్రీ
మీ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను మాట్లాడుకుందామని చెప్తాడు. శ్రీధర్ గురించి తెలిసిన వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీధర్ స్వప్న, కాశీలను చూసి షాక్ అవుతాడు. మీరు ఇక్కడికి ఎలా వచ్చారని స్వప్న అడుగుతుంది.
మీ ఫ్రెండ్ కి మీ నాన్న కూడా తెలుసా అని కాంచన కార్తీక్ ని అడుగుతుంది. స్వప్న శ్రీధర్ దగ్గరకు వెళ్ళి మాట్లాడుతుంది. నేను ఎవరో తెలియక నన్ను ఇక్కడ అందరూ తక్కువ చేసి మాట్లాడుతున్నారని స్వప్న అంటుంది. శివనారాయణ మీ నాన్నకు ఫోన్ చేయమంటే అతనితో మాట్లాడుతున్నావ్ ఏంటని అడుగుతాడు.
స్వప్న నా కూతురు
ఇతనే మా డాడీ అనేసరికి అందరూ షాక్ అవుతారు. స్వప్న నా కూతురు అని చెప్పు డాడీ అని అడుగుతుంది. కాంచన కంగారు పడుతూ ఏడుస్తుంది. మీ నాన్నకు ఫోన్ చేయమంటే మా అల్లుడిని పట్టుకుని డాడీ అంటావ్ ఏంటని శివనారాయణ అనడంతో స్వప్న షాక్ అవుతుంది.
అల్లుడిని నిలదీస్తాడు. ఈయనే మా ఫాదర్ పేరు శ్రీధర్ అనేసరికి కాంచన గుండె ముక్కలవుతుంది. అసలేం జరుగుతుందని కాంచన ఏడుస్తూ అడుగుతుంది. స్వప్న ఇంటి గోడ మీద ఉన్న కార్తీక్ ఫ్యామిలీ ఫోటో చూస్తుంది. తన తల్లికి ఏం కాకూడదని కార్తీక్ మనసులో దేవుడిని వేడుకుంటాడు.
కార్తీక్ వీళ్ళ కొడుకు
ఫ్యామిలీ ఫోటోలో మీరు ఉన్నారు ఏంటని స్వప్న తండ్రిని అడుగుతుంది. అతను మా అల్లుడు, కాంచన భర్త. కార్తీక్ వీళ్ళ కొడుకు అని శివనారాయణ నిజం చెప్పడంతో స్వప్న షాక్ అవుతుంది. ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు అంటే ఏంటి డాడీ ఇదంతా వీళ్ళు చెప్పేది నిజమా అని తండ్రిని నిలదీస్తుంది.
ఈ అమ్మాయి మిమ్మల్ని డాడీ అని ఎందుకు పిలుస్తుందని శివనారాయణ అల్లుడిని ప్రశ్నిస్తాడు. నీకు ముందే పెళ్లి అయిందా డాడీ అని అటు స్వప్న కూడా ప్రశ్నిస్తుంది. నా కూతురితో పెళ్లి అయింది. పారిజాతం చెప్పింది నిజమే నువ్వు ఎవరో పద్దతి లేని దానిలా ఉన్నావ్.
కావేరి నా రెండో భార్య
నువ్వు అందరినీ ఇలాగే డాడీ అని పిలుస్తావా అని శివనారాయణ అనుమానంగా అడుగుతాడు. మావయ్య నా కూతురిని ఏమి అనకండి అని శ్రీధర్ అనేసరికి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. స్వప్న తన కూతురు అని ఒప్పుకుంటాడు. అనాథను చేరదీసి పెంచారా? అని శివనారాయణ అంటే నేను అనాథను కాదు మా అమ్మ పేరు కావేరి అంటుంది.
బయటకు పోరా కుక్క
నన్ను క్షమించు కాంచన అని తన కాళ్ళు పట్టుకుంటాడు. ఇంకేం మాట్లాడొద్దని కార్తీక్ ఆపుతాడు. శ్రీధర్ మావయ్య అని పిలిస్తే చచ్చిపోయాడు. మీ మావయ్య ఈరోజుతో చచ్చిపోయాడు నీ చేతలతో నువ్వే చంపేశావు. నా కూతురు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ప్రాణం అనుకున్న నా ఇంటి గౌరవాన్ని చంపేశావు.
తప్పు చేసిన వాళ్ళకు టప్పుడు మనుషులకు నా ఇంట్లో చోటు లేదు వెళ్లిపొమ్మని అంటాడు. నేను చెప్పేది ఒక్కసారి వినండి అని శ్రీధర్ అంటే బయటకు పోరా కుక్క అనడంతో అందరూ షాక్ అవుతారు. మళ్ళీ జీవితంలో నీ మొహం నాకు చూపించకు అని వార్నింగ్ ఇస్తాడు.
శ్రీధర్ తలదించుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. దాసు కాశీని తీసుకుని వెళ్ళిపోతాడు. అందరూ ఏడుస్తూ వెళ్లిపోతారు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.