Karthika deepam september 26th episode: స్వప్నను నానా మాటలు తిట్టిన పారిజాతం, తిరిగి గట్టిగా ఇచ్చేసిన స్వప్న-karthika deepam 2 serial today september 26th episode parijatham scolds deepa who is in trouble with kasi swapna marria ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam September 26th Episode: స్వప్నను నానా మాటలు తిట్టిన పారిజాతం, తిరిగి గట్టిగా ఇచ్చేసిన స్వప్న

Karthika deepam september 26th episode: స్వప్నను నానా మాటలు తిట్టిన పారిజాతం, తిరిగి గట్టిగా ఇచ్చేసిన స్వప్న

Haritha Chappa HT Telugu
Sep 26, 2024 09:41 AM IST

Karthika deepam 2 serial today september 26th episode: కార్తీకదీపం సీరియల్ విజయవంతంగా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్ లో కాశీ, స్వప్న పెళ్లిని కాశీ కుటుంబీకులు వ్యతిరేకిస్తారు. దీపను నానా తిట్లు తిడతారు.

కార్తీక దీపం లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం లేటెస్ట్ ఎపిసోడ్ (Star maa)

Karthika deepam 2 serial today september 26th episode: దీప దగ్గరుండి కాశీ -స్వప్నలా పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్‌తో స్వప్న పెళ్లిని ఆపి, గుడిలో కాశీ స్వప్నలకు దగ్గరుండి వివాహం చేసింది దీప. అనంతరం కాశీ, స్వప్నలు కార్తీక్ దగ్గరకొచ్చి ఆశీర్వాదాన్ని అడుగుతారు. కార్తీక్ మంచి మనసుతో వారిద్దరిని ఆశీర్వదిస్తాడు. కాశీతో... స్వప్నను చాలా జాగ్రత్తగా చూసుకోమని, ఆమె అల్లరి పిల్ల అని చెబుతాడు. ఆ తర్వాత తన తల్లి సుమిత్రను తీసుకొని ఇంటికి వెళ్తాడు.

మరోవైపు స్వప్న ఎక్కడికి వెళ్లిందో తెలియక టెన్షన్ పడుతున్న శ్రీధర్ కు స్వప్న ఫోన్ చేస్తుంది. సాయంత్రం ఇంటికి వస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఈ లోపు సుమిత్ర కూడా శ్రీధర్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తుంది. శ్రీధర్ హడావుడిగా సుమిత్ర ఇంటికి బయలుదేరుతాడు.

ఇంటికి వచ్చిన కాశీ - స్వప్నలు

ఇక కార్తీక్ ఇంట్లో సుమిత్ర కుటుంబీకులంతా ఎంతో సంతోషంగా ఉంటారు. జ్యోత్స్న, కార్తీక్ పెళ్లికి ముహూర్తం పెడతారు. దీనివల్లే వారు ఎంతో ఆనందంగా ఉంటారు. అదే సమయంలో కాశీ, స్వప్నలు పెళ్లి బట్టలతో వచ్చి వారి ముందు నిలుచుంటారు. అది చూసిన పారిజాతం ఒక్కసారిగా షాక్ తింటుంది.

పారిజాతం తిట్ల దండకం

కాశీ - స్వప్నను ఇంట్లోకి రాకుండా చేసేందుకు నానాతిట్లు తిట్టాలని అనుకుంటుంది పారిజాతం. అలా తిడితే వారు ఇంటి నుంచి వెళ్లిపోతారని భావిస్తుంది. నోటికి వచ్చిన తిట్లని తిట్టడం మొదలుపెడుతుంది. ముఖ్యంగా స్వప్నని టార్గెట్ చేసి నానా తిట్లు తిడుతుంది. మధ్యలో శివన్నారాయణ కూడా స్వప్నను తిడుతూ ఉంటాడు. అన్ని తండ్రి పోలికలే వచ్చాయంటూ మాట్లాడతాడు. నీ రక్తంలోనే ఇలాంటి పనులు చేయడం వారసత్వంగా ఉందని అంటాడు. స్వప్న కుటుంబీకుల వల్ల తమ పరువు పోతోందని విమర్శిస్తాడు. ఆశీర్వదించడానికి కూడా ఎవరూ ముందుకు రారు. అయినా కాశీ - స్వప్న అలానే గుమ్మం ముందు నిలిచి ఉంటారు. వారు తిట్టిన తిట్లకు కోపం తెచ్చుకున్న కాశీ... తాము దిక్కుమొక్కు లేకుండా పెళ్లి చేసుకోలేదని దీపనే దగ్గరుండి పెళ్లి చేసిందని చెప్పేస్తాడు.

దీపనే దగ్గరుండి పెళ్లి చేసిందని తెలుసుకున్న పారిజాతం ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. దీపను నోటికొచ్చిన తిట్లు తిడుతుంది. అదే సమయంలో అక్కడికి దాసు కూడా వస్తాడు. దాసుకు కూడా దీప చేసిన పని చెబుతూ నానా తిట్లు తిడుతుంది. స్వప్న దిక్కుమొక్కు లేనిదని, అలాంటి దాన్ని కాశీకి అంటగట్టిందని అంటుంది. ఆ మాటకి స్వప్నకు చాలా కోపం వస్తుంది.

స్వప్న మాట్లాడుతూ... తాను దిక్కుమొక్కూ లేని దాన్ని కాదని, తనకు కూడా తల్లిదండ్రులు ఉన్నారని చెబుతుంది. దానికి శివన్నారాయణ పెద్దలకు చెప్పకుండా ఇలా పెళ్లి చేసుకోవడం తప్పు కాదా, మీ నాన్న ఎవరో చెప్పు అని అడుగుతాడు. దానికి అక్కడే ఉన్న కార్తీక్, దీప కూడా జోక్యం చేసుకుంటారు. వారిని తిట్టవద్దని చెబుతారు. ఈ తిట్ల పురాణంతోనే ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది. ఇక రేపు ఏమవుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే.

టాపిక్