Brahmamudi September 28th Episode: బ్రహ్మముడి- అవార్డ్ కోసం రాజ్ సామంత్ పోటీ- కావ్యకు దొరికిపోయిన అనామిక-12 కోట్ల నష్టం-brahmamudi serial september 28th episode kavya gets deceived raj kissed kavya anamika caught brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi September 28th Episode: బ్రహ్మముడి- అవార్డ్ కోసం రాజ్ సామంత్ పోటీ- కావ్యకు దొరికిపోయిన అనామిక-12 కోట్ల నష్టం

Brahmamudi September 28th Episode: బ్రహ్మముడి- అవార్డ్ కోసం రాజ్ సామంత్ పోటీ- కావ్యకు దొరికిపోయిన అనామిక-12 కోట్ల నష్టం

Sanjiv Kumar HT Telugu
Sep 28, 2024 10:19 AM IST

Brahmamudi Serial September 28th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 28వ తేది ఎపిసోడ్‌లో ఎక్స్‌పో అవార్డ్ కోసం రాజ్, సామంత్ పోటీ పడుతుంటారు. ఈసారి తానే గెలుస్తానని, నీ ఓటమి ఎప్పుడో మొదలైందని రాజ్‌తో సామంత్ ఛాలెంజ్ చేస్తాడు. తర్వాత కావ్య మెడపై రాజ్ ముద్దుపెట్టుకుంటాడు. బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 28వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 28వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో ఆఫీస్‌లో ఉద్యోగులకు రాజ్ వార్నింగ్ ఇస్తాడు. నేను అగ్రెసివ్ డెసిషియన్ తీసుకుని మీ బదులు కొత్త స్టాప్‌ను తీసుకోగలను. కానీ, ఇన్నాళ్లు పని చేసిన మిమ్మల్ని రోడ్డున పడేయడం ఇష్టం లేదు. కష్టపడి పనిచేయాలనుకున్న వాళ్లే ఉండాలి. ఇలా లేజీగా ఉండేందుకు ఇష్టపడేవారు వెళ్లొచ్చు అని రాజ్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు.

ప్రతి సంవత్సరం జరిగి ఎక్స్‌పోలో మన కంపెనీ నుంచి ప్రదర్శనకు డిజైన్స్ వెళ్తాయి కదా. నామినేషన్స్‌కు ఇన్వైట్ చేశారు కదా. మరి మన దగ్గరి నుంచి డిజైన్స్ పంపించారా. చెప్పు శ్రుతి అని రాజ్ అడుగుతాడు. లేదు అని శ్రుతి చెబుతుంది. ఇంకా కొన్ని రోజులే ఉందే. నేను సీఈఓని కలిసి ఇంకొంత అవకాశం ఇవ్వమని అడుగుతాను. పదేళ్లుగా మనకు అవార్డ్ వస్తుంది. అది మన కంపెనీకి ఐఎస్ఐ మార్క్ లాంటింది. ఇప్పుడు కంపెనీ ఉన్న పరిస్థితుల్లో ఈ అవార్డ్ మనకు రావడం చాలా ముఖ్యం అని రాజ్ అంటాడు.

ఎక్స్‌క్లూజివ్ డిజైన్స్

రేపటిలోగా క్రియేటివ్ డిజైన్స్ చేయండి అని రాజ్ అంటే.. లాస్ట్ ఇయరు కావ్య మేడమ్ డిజైన్స్ చేశారు. అవార్డ్ వచ్చిందని శ్రుతి చెప్పింది. లాస్ట్ ఇయర్ మాత్రమే కావ్య మేడమ్ ఉన్నారు. అంతకుముందు మనమే డిజైన్స్ వేసుకున్నాం. రేపటిలోగా ఎక్స్‌క్లూజివ్ డిజైన్స్ రెడీ కావాలని చెప్పి వెళ్లిపోతాడు రాజ్. మరోవైపు కావ్యతో అనామిక మేనేజర్ మాట్లాడుతాడు.

మనం పెద్ద కంపెనీతో టై అప్ అవుతున్నాం. అయితే, మనలా వాళ్లకు డిజైన్స్ పంపడానికి చాలా మంది ఉన్నారు. వాళ్లందరిని కాదని ఆ కాంట్రాక్ట్ మనకు రావాలంటే మన డిజైన్స్ అంత క్రియేటివ్‌గా ఉండాలి. కానీ, మనకు టైమ్ చాలా తక్కువ ఉందని మేనేజర్ అంటాడు. సరే సర్.. నా బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేస్తాను అని కావ్య వెళ్లిపోతుంది. కావ్య వెళ్లగానే అనామిక దగ్గరికి వెళ్లి జరిగింది చెబుతుంది. తను వేసే డిజైన్స్ సామంత్ గ్రూప్‌కు వెళ్తున్నట్లు ఏమాత్రం అనుమానం రాకూడదు అని అనామిక అంటుంది.

మరోవైపు ఎక్స్‌పో సీఈవో దగ్గరికి వెళ్తున్న రాజ్‌కు సామంత్ ఎదురవుతాడు. హాయ్ రాజ్ ఎలా ఉన్నావ్ అని సామంత్ అంటే.. నేను ఆనందంగా ఉన్నాను అంటే నీ ఆనందం పోతుంది కదా అని రాజ్ అంటాడు. ఏం చేద్దాం. మనం చేసే బిజినెస్ అలాంటిదని సామంత్ అంటాడు. బిజినెస్ ఏదైనా కావచ్చు. దానికంటే ముందు మనం మనుషులం కదా. అందరం సంతోషంగా ఉండాలని మర్చిపోయావ్ అనుకుంటే అని రాజ్ అంటాడు.

సక్సెస్ ఇలా మాట్లాడిస్తుంది

కేవలం సక్సెస్ నీతో ఇలా మాట్లాడిస్తుంది. చాలా రోజుల తర్వాత కంపెనీ బాధ్యతలు తీసుకుంటున్నావని తెలిసింది. ప్రత్యర్థి ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి కదా అని సామంత్ అంటాడు. నావైపు చూస్తూ ఉంటే నీకు వచ్చేది ఓటమే అని రాజ్ అంటాడు. ఆ ఓటమి నా నుంచి నీ వైపు వచ్చి చాలా రోజులు అయింది. నువ్వే గుర్తు పట్టడంలేదు. ఇప్పటికీ నీ క్లైంట్స్ అందరూ నా దగ్గరకు వచ్చారు. ఇక త్వరలో జరిగే ఈ ఎక్స్‌పోలో గెలిచి నా కంపెనీని ఫస్ట్ ప్లేస్‌లో నిలబెట్టడం ఉందని సామంత్ అంటాడు.

కలలు కనకు. ఈసారి కూడా మా కంపెనీనే గెలుస్తుంది అని వెళ్లిపోతాడు రాజ్. ఇంతలో సామంత్‌కు అనామిక కాల్ చేస్తుంది. కావ్య డిజైన్స్ చేయడానికి ఒప్పుకుందా అని సామంత్ అడిగితే.. ఒప్పుకోకుండా ఎలా ఉంటుందని అనామిక అంటుంది. పాపం ఆ విషయం తెలియక రాజ్ నాపైనే ఛాలెంజ్ చేసి వెళ్లిపోయాడు. వాడి భార్యే వాడికి శత్రువుగా మారి వాన్ని ఓడిస్తుందని తెలుసుకోలేకపోతున్నాడు అని సామంత్ అంటాడు. వాడు ఓడిపోవడం తొలిసారిగా చూస్తాడు. ముందు నామినేషన్ వేసి రా అని అనామిక అంటుంది.

ఆల్రెడీ నిన్నే వేశాను అని సామంత్ అంటాడు. నీకోసం ఇంట్లో ఎదురుచూస్తుంటాను త్వరగా రా అని అనామిక చెప్పి కాల్ కట్ చేస్తుంది. మరోవైపు అప్పును ఎస్సై ట్రైనింగ్‌ కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోకి తీసుకెళ్తాడు. మరి పైసలు ఎలారా అని అప్పు అంటే.. అదంతా నేను చూసుకుంటాను అని కల్యాణ్ అంటాడు. అప్పు, కల్యాణ్ వెళ్తారు. మీ భార్యను తీసుకొస్తా అన్నారు. ఎక్కడ అని కోచింగ్ సెంటర్ అతను అంటాడు. దాంతో అప్పును చూపిస్తాడు కల్యాణ్.

కోచింగ్‌కు 60 వేలు

ఓ అమ్మాయా.. అబ్బాయి అనుకున్నాను అని పొరపాటు పడిన కోచింగ్ సెంటర్ అతను గ్రూప్ ట్రైనింగ్, పర్సనల్ ట్రైనర్ ఉంటారు. పర్సనల్ ట్రైనర్ ఎక్స్‌పెన్సివ్ అని అంటాడు. అందరితో కలిసి తీసుకుంటే ఎంతవుతుందని అప్పు అడుగుతుంది. నెలకు పదివేలు. ఆరు నెలలు ట్రైనింగ్ కాబట్టి 60 వేలు. అడ్వాన్స్ 20 వేలు. మిగతా 40 వేలు వన్ మంత్‌లో కట్టాలి. కొంతమంది టఫ్‌గా ఉందని ట్రైనింగ్ మధ్యలోనే వెళ్లిపోతున్నారు అని కోచింగ్ సెంటర్ అతను అంటాడు.

దాంతో ఆలోచించుకుని మళ్లీ వస్తామని కల్యాణ్‌ను బయటకు తీసుకొస్తుంది అప్పు. మన దగ్గర డబ్బు ఎక్కడుంది. రాత్రికి రాత్రే నేను ఎస్సై అవ్వాల్సిన అవసరం లేదు. నిన్ను కష్టపెట్టి ఆ డబ్బుతో నేను పోలీస్ అవకుంటే డిపార్ట్‌మెంట్‌కు వచ్చే నష్టమేం లేదని అప్పు అంటుంది. మరోవైపు ఆడిటర్‌తో జరిగిన మీటింగ్ గురించి సుభాష్‌కు చెబుతాడు రాజ్. 12 శాతం డిప్రెసియేషన్ చూపించారు. అంటే దాదాపుగా 12 కోట్ల నష్టం వస్తుంది. ఇన్నిరోజులు కంపెనీ నుంచి పట్టించుకోకపోయేసరికి రావాల్సిన ఆర్డర్స్ వెనక్కి వెళ్లిపోయాయి అని రాజ్ అంటాడు.

ఇంతకుముందులా మనం బాధ్యతగా లేమని టాక్ వస్తోందని రాజ్ అంటాడు. అర్థమైంది. ఇన్నిరోజులు లేంది. నువ్ ఇప్పుడు వచ్చి ఇంట్లో ఆఫీస్ విషయాలు ఎందుకు చెబుతున్నావో అర్థమైంది. కొన్నాళ్లు రాహుల్ వెళ్లాడు కదా. అప్పుడు కావ్య వాన్ని ఫ్రాడ్‌గా నిలబెట్టాలని చూసింది. ఇప్పుడు రాజ్ కూడా అలాగే చేస్తున్నాడు అని రుద్రాణి అంటుంది. అత్త.. ఇప్పటివరకు నేను లాస్ గురించి పట్టించుకోలేదు. మేము పట్టించుకోకపోవడమే కారణం అనుకున్నాను. ఇప్పుడు తవ్వటం మొదలుపెడతాను. ఎవరు ఎంత మింగారో బయటపడుతుంది. అంతవరకు ఆగు అని రాజ్ అంటాడు.

దాంతో రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు. చచ్చింది గొర్రె. రాజ్ ఏం చెప్పాడో విన్నావుగా. నువ్వే అనవసరంగా గెలుక్కున్నావ్. నేను, అన్నయ్య కూడా సాయం చేస్తాం అని ప్రకాశం అంటాడు. బాబాయ్ ఈ సోది ఎప్పుడు ఉండేదే. దీని నుంచి మనం బయటపడాలంటే ఎక్స్‌పో నుంచి అవార్డ్ తీసుకోవాలి. దాంతో మళ్లీ నెంబర్ వన్ అవుతాం అని రాజ్ అంటాడు. అవార్డ్ తెచ్చేంత డిజైనర్స్ ఎవరున్నారు. అది ఒక్కరి వల్లే సాధ్యమవుతుంది మన కావ్య అని సుభాష్ అంటాడు.

ఎక్స్‌పోలో డిజైన్స్ పెట్టను

ఆ పేరుతో అయినా నా కోడలిని ఇంటికి తీసుకురా అని అపర్ణ అంటుంది. కావ్య డిజైన్స్ ట్రెండీగా ఉంటాయని సుభాష్ అంటాడు. వందేళ్లుగా కావ్య వేస్తేనే అవార్డ్ వస్తుందా అని రుద్రాణి అంటుంది. నీకు నా కొడుకు కోడలు కలవాలని లేనట్టుంది అని అపర్ణ అంటుంది. అవార్డ్ కోసం ఒకరిమీద ఆధారపడను. తన వల్లే అవార్డ్ వస్తుందంటే ఎక్స్‌లో మన డిజైన్స్ కూడా పెట్టను. కంపెనీ కోసం ఎన్ని మార్కెట్ స్ట్రాటజీస్ అయినా వాడతాను. కానీ, తన సాయం కోరను. నేనే దగ్గరుండి ఎక్స్‌క్లూజివ్ డిజైన్స్ వేయించి అవార్డ్ గెలుస్తాను అని రాజ్ చెబుతాడు.

శభాష్ రాజ్.. అదిరా నా మేనల్లుడు అంటే.. వీళ్లకే నీ మీద నమ్మకం లేదు అని రుద్రాణి అంటుంది. దాంతో రాజ్ వెళ్లిపోతాడు. మరోవైపు కావ్య డిజైన్స్ వేస్తుంటంది. పక్కన పేపర్స్ పడి ఉంటాయి. ఇదివరకు కావ్య డిజైన్స్ వేస్తూ ఏకాగ్రతతో లేకుండా ఉన్నప్పుడు రాజ్ ఇచ్చిన సలహాను గుర్తు చేసుకుంటుంది. ఇష్టమైన వాళ్లకు, ప్రేమించిన వాళ్లకు ముద్దు పెట్టాలి అని రాజ్ చెబుతాడు. నాడీ తంత్రాన్ని ముద్దుతో ప్రేరేపిస్తే మెదడు నుంచి సంతోషాన్ని ఉత్పత్తి చేసే ఆక్సోటోసిన్ పంపిస్తుంది. అది మనసును, మెదడును ఉత్తేజపరుస్తుందని రాజ్ అంటాడు.

ఏకాగ్రతగా ఉండాలనుకున్నప్పుడు ఒక్క ముద్దు బాగా పనిచేస్తుంది అన్న రాజ్ కావ్య మెడపై ముద్దుపెడుతాడు. అది తలుచుకున్న కావ్య బాధగా ఫీల్ అవుతుంది. ఎంతమర్చిపోదామనుకున్న ఆ జ్ఞాపకాలే వెంటాడుతున్నాయేంటీ అని కావ్య అనుకుంటుంది. ఇంతలో వచ్చిన కనకం కింద పడిన పేపర్స్ చూస్తుంది. రేపు ఆఫీస్‌లో డిజైన్స్ ఇస్తానని చెప్పాను. నాకేమో కాన్సంట్రేషన్ కుదరడం లేదు అని కావ్య అంటుంది.

అనామికను చూసేసిన కావ్య

నీ మైండ్‌లో ఏం గుర్తు వస్తుందే అది పేపర్‌పైనే ఉందని కనకం చెబుతుంది. అందులో కావ్య మెడపై రాజ్ ముద్దుపెట్టుకోవడం ఉంటుంది. అది చూసి కావ్య షాక్ అవుతుంది. ఇది గీసాను ఏంటీ అని కావ్య అడిగితే.. నీ మనసులో ఉంది అదే అని కనకం చెబుతుంది. మరోవైపు రాజ్ కూడా డిజైన్స్ గీయడానికి అవస్థలు పడతాడు. ఇందిరాదేవి వచ్చి ఏంట్రా ఇది అంటుంది. కళాకృతి వాళ్లకు రిక్వెస్ట్ పెడుతూ మెయిల్ రాయాలి. టైప్ చేస్తే తప్పు తప్పుగా వస్తుంది. అందుకే ముందు రఫ్‌గా రాస్తున్నా అని రాజ్ అంటాడు.

కానీ, పేపర్‌పై కళావతి ఇండస్ట్రీస్ అని రాసి ఉంటుంది. రాజ్ పక్కనే ఇందిరాదేవి కూర్చుంటుంది. కట్ చేస్తే అపర్ణ ఆయాసపడుతుంటే రాజ్ వచ్చి రెస్ట్ తీసుకోమ్మని చెబుతాడు. వెళ్లి నా కోడలిని తీసుకురావాలని అంటుంది అపర్ణ. మరోవైపు కావ్యకు డిజైన్స్ తీసుకురమ్మని చెప్పావా. ఇంకా రాలేదేంటని మేనేజర్‌పై సామంత్ ఫైర్ అవుతుంటాడు. ఇంతలో వచ్చిన కావ్య సామంత్, అనామికను చూసినట్లు చూపించారు. ఇదే జరిగితే అనామిక దొరికిపోయినట్లే అవుతుంది.