Brahmamudi September 5th Episode: తాతయ్యకు ఎదురుతిరుగుతానన్న కావ్య- కల్యాణ్‌కు అప్పు సర్‌ప్రైజ్- అపర్ణపై మర్డర్ ప్లాన్
Brahmamudi Serial September 5th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 5వ తేది ఎపిసోడ్‌లో రాహుల్ దోషిగా ఇంటికి తిరిగిరావడంతో కావ్యపై కోప్పడతాడు రాజ్. తాతయ్య ఆరోగ్యం బాగుండదని అంటాడు. మీ స్థానం కోసం తాతయ్య నిర్ణయానికి కూడా ఎదురుతిరుగుతానని కావ్య అంటుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో రాహుల్‌కి ఎవరు సహాయం చేయలేదని నానా మాటలు అన్న రుద్రాణికి చెక్ పెడుతుంది కావ్య. కానీ, రాజ్ మాత్రం కావ్యను అడ్డుకుంటాడు. ఇప్పటివరకు చేసిన ఇన్వెస్టిగేషన్ చాలు. వెళ్లి ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకొచ్చింది చాలు. కనకపోయిన పెంచిన కూతురిగా మా అత్తకు ఆడపడుచు హోదాను ఇచ్చారు. తనను అనే అనుభవం, వయసు నీకు లేవు అని రాజ్ వారిస్తాడు.
సారీ అత్తా.. నువ్ ఎంతగా చెప్పిన నేను వినలేదు. సారీరా రాహుల్ జరిగింది పీడకల అనుకుని మర్చిపో అని రాజ్ అంటాడు. ఏది మర్చిపోవాలి రాజ్. ఇంట్లో అందరూ నేరస్థులు అని నన్ను అన్నది మర్చిపోవాలా. ఏనాడు ఒక్క మాట అనని పెద్దత్త నన్ను కొట్టిన చెంపదెబ్బ మర్చిపోవాల. నీ భార్య చేసిన సన్మానం మర్చిపోవాల. ఆఫీస్‌లో నన్ను అందరూ నేరస్థుడు అని మాట్లాడుకోవడం నేను భరించలేను అని రాహుల్ వెళ్లిపోతాడు.
వయసు తక్కువ కాబట్టి
శుభం.. ఈ ఇంటికి, కంపెనీకి పట్టిన దరిద్రం దానంతటే అదే వదిలిపోయిందని స్వప్న అంటుంది. రాజ్.. నువ్ ఎక్కువ ఫీల్ అవ్వకు అని చెప్పి వెళ్లిపోతుంది స్వప్న. సీతారామయ్య రాజ్‌తో మాట్లాడుతాడు. తాతయ్య పిలిచారట. జరిగినదానికి కంగారుగా ఉందా. రాహుల్ తిరిగొచ్చాడు కదా అని రాజ్ అంటాడు. లేదు భయంగా ఉంది. రాహుల్ విషయంలోనే కాదు. నీకు వయసు తక్కువ కాబట్టి అర్థం కావట్లేదు. నా అనుభవం నాకు చెబుతుంది. త్వరలోనే ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలు అయిపోవడానికి సిద్ధంగా ఉందని సీతారామయ్య అంటాడు.
ధాన్యలక్ష్మీ ఎప్పుడైతే ఆస్తి కావాలని గొడవ మొదలు పెట్టిందో ఆరోజే ఇంటికి బీటలు వారాయి. దీన్ని వదిలేస్తే.. ఈ ఇల్లు కూలిపోతుంది. చీలిక అయిపోతుంది. నా కోరిక ఒక్కటే రాజ్. నా ఊపిరి ఉన్నంతవరకు కుటుంబం కలిసే ఉండాలి. కల్యాణ్ వెళ్లిపోవడంతో మొదలై రాహుల్ అరెస్ట్ అయి తిరిగిరావడంతో నిప్పు రాజుకుంది. అది రావణకాష్టంగా మారి ఇంట్లో గొడవలు పెట్టకుముందే నువ్ దాన్ని చల్లార్చాలి. అందరూ కలిసి ఉండేలా చేస్తానని మాట ఇస్తావా అని సీతారామయ్య అంటాడు.
దానికి రాజ్ మాట ఇస్తాడు. మీరు భయపడుతున్నట్లుగా ఏం జరగదు. నేను మాటిస్తున్నాను. గొడవలు జరగడం కాదు. వెళ్లిపోయిన కల్యాణ్‌ను తిరిగి తీసుకొస్తాను అని రాజ్ అంటాడు. ఈ మాట చాలురా నేను ఇక చనిపోయినా పర్వాలేదు అని సీతారామయ్య అంటాడు. అలా అనకండి తాతయ్య.. మేమంతా కలిసి ఉండటం మీరు చూడాలి అని రాజ్ అంటాడు. మరోవైపు రాహుల్ నవ్వుతాడు. కావ్యను ఎలా దెబ్బ కొట్టానో చూశావా అని రాహుల్ అంటాడు.
కోపంగా రాజ్
ఎలా బయటపడ్డావ్ అని రుద్రాణి అంటుంది. ఈ సమస్య వస్తుందని నాకు ముందే తెలుసు. అందుకే నా ప్లేస్‌లో నేరం ఒప్పుకునేందుకు ఒకడిని సెట్ చేశాను అని రాహుల్ అంటాడు. ఇప్పుడు నా కొడుకువి అనిపించుకున్నావ్ అని రుద్రాణి అంటుంది. ఆ కావ్య మనకు చేసిన ద్రోహానికి ఇంటి నుంచి పంపించేలా చేస్తాను. ఈరోజు నేను చేసిన పనికి కావ్యపై రాజ్ కోపంగా ఉంటాడు. చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ మంచితనం చాలు వాళ్లిద్దరిని విడగొట్టేందుకు అని రాహుల్ అంటాడు.
రాజ్ దగ్గరికి వెళ్లిన కావ్య భోజనం తినలేదు. ఈ పాలైన తాగండి అని కావ్య అంటుంది. నేను పాలు విసరకొట్టకముందే తీసుకెళ్లు అని రాజ్ అంటాడు. పక్కన పాలు పెట్టి నాపై ఎందుకంత కోపం అని కావ్య అడుగుతుంది. ఒక్క రోజు ఆగి ఉంటే అయిపోది కదా. నీ వల్ల రాహుల్ అరెస్ట్ అయ్యాడు. ఇంకా నువ్ రాహుల్ తప్పు చేశాడని నమ్ముతున్నావా అని రాజ్ అంటాడు. నేను నమ్ముతున్నాను. ముమ్మాటికి రాహుల్ తప్పు చేశాడు. తెలివిగా తప్పించుకున్నాడు అంతే అని కావ్య అంటుంది.
నీ అర్థంలేని అభిప్రాయాల వల్ల ఇల్లు ముక్కలైపోయేలా ఉంది. తాతయ్య ఆరోగ్యం దెబ్బతినేలా ఉంది అని రాజ్ అంటాడు. ఇప్పుడు ఇల్లు ముక్కలు ఎందుకు అవుతుందో నాకు అర్థం కావడంలేదు అని కావ్య అంటుంది. రాహుల్ బదులు నేను అరెస్ట్ అయి ఉంటే.. నేను కూడా బెయిల్ మీద వచ్చేవాడినని రాజ్ అంటాడు. లేదు. రాహుల్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి సాక్ష్యాలు తారుమారు చేసి వచ్చాడు. మీరైతే నిజాన్ని బయటకు రానిచ్చేవారు కాదు. జైలుకు వెళ్లేవారు. బెయిల్ కూడా వచ్చేది కాదు అని కావ్య అంటుంది.
అప్పు కోసం కల్యాణ్
అది నా సమస్య అని రాజ్ అంటాడు. నేను మీరు వేరు కాదండి. మిమ్మల్ని కాపాడుకోవడమే కాదు కంపెనీ బాగోగులు కూడా చూసుకోడం కూడా. నేను ఇంటి కోడలినే. నాకు మీరే ముఖ్యం. నా భర్త ఏ స్థానంలో ఉండాలో దాన్ని పదిలంగా కాపాడటం కోసం నేను ఎవరినైనా ఎదురుకుంటాను. తాతయ్య నిర్ణయాన్ని అయినా సరే తప్పు పడతాను అని కావ్య అంటుంది. నీకు లేనిపోని పెద్దరికాలు నెత్తిన పెట్టుకోవడం ఎక్కువైది. అలుసు ఇచ్చాను కదా అని నచ్చినట్లు చేయకు అని రాజ్ అంటాడు.
నేను చేసింది న్యాయం అనిపించినప్పుడు, నా అత్తిల్లు పచ్చగా ఉండటానికి నేను ఏమైనా చేస్తాను అని కావ్య అంటుంది. సరే ఏం చేసినా సరే ముందు నాకు చెప్పు. నాతో డిస్కస్ చేయు. నీ దూకుడుతనంతో తాతయ్య సఫర్ అవుతున్నారు. ఇకనుంచి ఏం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. అది చెప్పి చేయాల్సిన బాధ్యత నీకుంది. పాలు అవసరం లేదు. తీసుకెళ్లు అని రాజ్ వెళ్లిపోతాడు. మరోవైపు రాత్రి పడుకున్న కల్యాణ్ పక్కన అప్పు ఉండదు.
అది చూసి కంగారుపడతాడు కల్యాణ్. బయటకెళ్లి చూస్తాడు కల్యాణ్. కానీ, ఎక్కడ కనిపించకపోయేసరికి అప్పుకు కాల్ చేస్తాడు. అప్పు ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. దాంతో కంగారుగా కిందకు వెళ్లి అంతా వెతుకుతాడు కల్యాణ్. ఎక్కడ కనిపించకపోయేసరికి వచ్చి మెట్లపై కూర్చుంటాడు. ఇంతలో అప్పు డెలీవరీ బ్యాగ్‌తో వస్తుంది. రాగానే అప్పుపై అరుస్తాడు కల్యాణ్. నీకు బుద్ధుందా, చెప్పి వెళ్లొద్దా. ఇది నీ పుట్టిల్లా నీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి అని కల్యాణ్ ఫైర్ అవుతాడు.
ప్రేమ ఎక్కువై
కనిపించకపోయేసరికి నీకు ఫస్ట్ టైమ్ కోపం వచ్చింది. కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావ్ అని అప్పు అంటుంది. అవును కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఎక్కడికి వెళ్లావ్ అని కల్యాణ్ అడుగుతాడు. పిజ్జా డెలివరీ ఉండింది. నైట్ షిఫ్ట్ వేసుకున్నాను అని అప్పు అంటుంది. నేను నిన్ను పని చేయొద్దన్నాను కదా. పోషించగలను అని నాపై ఆమాత్రం నమ్మకంలేదా అని కల్యాణ్ కోప్పడతాడు. నమ్మకం లేక కాదు. ప్రేమ ఎక్కువై దా చెబుతాను అని ఇంట్లోకి తీసుకెళ్తుంది అప్పు.
కల్యాణ్‌ను కళ్లు మూసుకోమంటుంది అప్పు. అప్పుడు కేక్ ఓపెన్ చేసి కుర్చీపై పెడుతుంది. ఇప్పుడు కళ్లు తెరువు.. మా కూచి బంగారానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని అప్పు అంటుంది. నా బర్త్ డే కోసం నైట్ డ్యూటి చేసి ఇంతా కష్టపడ్డావా. సారీ అప్పు. అనవసరంగా నీపై అరిచాను. అసలు నా పుట్టినరోజు అన్న విషయమే మర్చిపోయాను అని ఎమోషనల్ అవుతాడు కల్యాణ్. తర్వాత కల్యాణ్‌కు గిఫ్ట్ ఇచ్చి ఓపెన్ చేయమంటుంది అప్పు.
అందులో పెన్స్, పేపర్ బండిల్స్ ఉంటాయి. నువ్ ఈ యేటి మేటి కవికి కదా.. కవితలు రాసుకో అని అప్పు అంటుంది. నేను రాసుకుంటూ ఉంటే ఇల్లు ఎలా గడుస్తుంది అని కల్యాణ్ అంటాడు. సరే ఖాలీటైమ్‌లో రాసుకో అని అప్పు చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో అపర్ణను చంపి, కావ్యపై నెట్టాలని రాహుల్ ప్లాన్ చేస్తాడు. అపర్ణ వేసుకునే ట్యాబ్లెట్స్ మార్చి ఇవి పెట్టాలి అని రుద్రాణికి రాహుల్ చెబుతాడు.