Brahmamudi September 27th Episode: రాజ్‌పైకి అస్త్రంగా కావ్య- రుద్రాణి, అనామిక ప్లాన్- భార్య వర్సెస్ భర్త- ఆట మొదలు!-brahmamudi serial september 27th episode anamika wicked scheme with rudrani raj vs kavya brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi September 27th Episode: రాజ్‌పైకి అస్త్రంగా కావ్య- రుద్రాణి, అనామిక ప్లాన్- భార్య వర్సెస్ భర్త- ఆట మొదలు!

Brahmamudi September 27th Episode: రాజ్‌పైకి అస్త్రంగా కావ్య- రుద్రాణి, అనామిక ప్లాన్- భార్య వర్సెస్ భర్త- ఆట మొదలు!

Sanjiv Kumar HT Telugu
Sep 27, 2024 09:09 AM IST

Brahmamudi Serial September 27th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 27వ తేది ఎపిసోడ్‌లో రాజ్ ఎండీగా ఆఫీస్‌కు వెళ్తాడు. దాంతో అనామికకు రుద్రాణి కాల్ చేస్తుంది. అప్పుడు కావ్యనే రాజ్‌పై అస్త్రంగా వదులుతున్నట్లు, భార్య వర్సెస్ భర్త మొదలు అయిందని అనామిక చెబుతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 27వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 27వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో కావ్య ఆఫీస్‌కు వెళ్తుంటే.. టిఫిన్, లంచ్ బాక్స్ రెడీ చేసి ఇస్తుంది కనకం. టిఫిన్ చేస్తే లేట్ అవుతుందని, లంచ్ బాక్స్ మాత్రం తీసుకెళ్తుంది కావ్య. ఇంతలో తండ్రి కృష్ణమూర్తి ఎదురై ఆటోకు డబ్బులు ఉన్నాయ అని అడుగుతాడు. కావ్య ఉన్నాయని చెబుతుంది. చూపించమంటే.. కావ్య చూపించదు.

బిజీగా ఉంటే ఎలా

నీకు పెళ్లయినా, అత్తారింట్లో ఉన్నా నీ బాధ్యత ఎప్పుడు నాదేనమ్మా అని ఆటోకు డబ్బులు ఇస్తాడు కృష్ణమూర్తి. దాంతో ఎమోషనల్‌గా ఫీల్ అయిన కావ్య వెళ్లిపోతుంది. కావ్యను ఆఫీస్‌కు పంపడానికి మీరు తోడుగా ఉండటం నాకు సంతోషంగా ఉన్నా.. కొంచెం బాధగా ఉందండి. అక్కడ అల్లుడు గారు ఆఫీస్ బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు ఇలా బిజీగా ఉంటే వాళ్లు ఎప్పుడు కలుస్తారు అని కనకం చెబుతుంది. కొన్నింటికి కాలమే సమాధానం చెబుతుందని వెళ్లిపోతాడు కృష్ణమూర్తి.

మరోవైపు రాజ్ ఆఫీస్‌కు బయలుదేరుతాడు. వీడు ఆఫీస్‌కు వెళ్తే నా కొడుకుకు గుర్తింపు రాదని రుద్రాణి అనుకుంటుంది. ఇందిరాదేవి, అపర్ణ ఆశీర్వాదం తీసుకుంటాడు రాజ్. జరగకూడనివి అన్ని జరుగుతున్నాయి. అంటే, ఏది మన చేతిలో ఉండదని గుర్తు పెట్టుకో. కల్యాణ్ వస్తే తప్పా ఆఫీస్‌కు వెళ్లకూడదన్న వాళ్లే నిన్ను వెళ్లమన్నారు. అలాగే కావ్యను కూడా నువ్వే తీసుకొస్తావ్ అని అపర్ణ అంటుంది.

మన కంపెనీ వంద సంవత్సరాలుగా మొదటి స్థానంలో ఉంది. నీ చేతికొచ్చాకా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఇంకా మంచి పేరు తీసుకురా అని ఇందిరాదేవి అంటుంది. వెళ్లేముందు గుడికి వెళ్లి వెళ్లు అని అపర్ణ చెబుుతంది. దాంతో రాజ్‌ వెళ్లిపోతాడు. తర్వాత అనామికకు రుద్రాణి కాల్ చేస్తుంది. మళ్లీ రాజ్ కంపెనీ బాధ్యతలు తీసుకున్నాడు. ఏదో పడగొడతాను అన్నావ్ అని రుద్రాణి అంటుంది. రాజ్ వచ్చిన రారాజ్ వచ్చిన ఏం చేయలేడు. ఈపాటికే కంపెనీ పతనానికి బీజాలు పడ్డాయి అని అనామిక అంటుంది.

కావ్యనే అస్త్రంగా

రాజ్‌పై కావ్యనే అస్త్రంగా ఉపయోగిస్తున్నాను. తనతో డైరెక్ట్‌గా కాకుండా ఇన్‌డైరెక్ట్‌గా డిజైన్స్ చేయించుకుంటున్నామని తను వేసిన ప్లాన్ గురించి చెబుతుంది అనామిక. అన్నింటికి రంగం సిద్ధమైంది. భార్య వర్సెస్ భర్త. ఆట మొదలు కానుంది అని అనామిక చెబుతుంది. సౌండ్స్ గుడ్ అని రుద్రాణి కాల్ కట్ చేస్తుంది. మరోవైపు గుడిలో రాజ్, కావ్య గుడి గంట ఒకేసారి కొట్టేందుకు ప్రయత్నిస్తారు. ఒకరినొకరు చూసి చీదరించుకుంటారు రాజ్, కావ్య.

ఇద్దరూ మాటలతో పోట్లాడుకుంటారు, సైటెర్స్ వేసుకుంటారు. మళ్లీ కాసేపటికి గుడి గంట కొట్టేందుకు ఒకేసారి ట్రై చేస్తారు. గంట కొట్టేందుకు గొడవ పడతారు. దాంతో పూజారిని పిలిచి రెండు గంటలు పెట్టమని, మగవాళ్లకు ఒకటి, ఆడవాళ్లకు మరోటి అని రాజ్ అంటాడు. వచ్చినప్పటినుంచి గొడవ పడుతున్నారు. మీరిద్దరు భార్యాభర్తల అని పూజారి అంటాడు. దాంతో ఎవరమ్మా.. నువ్, మీ ఆయన ఏం చేస్తాడు అని రాజ్ అంటాడు. హా.. బూత్ బంగ్లాలో నివాసముంటాడు అని కావ్య పంచ్ వేస్తుంది.

ఇది అక్కడికి తిప్పి ఇక్కడికి తిప్పి బూత్ బంగ్లాకే వెళ్తుంది రాక్షసి అని రాజ్ అనుకుంటాడు. మీ భార్య మీతో కాపురం చేస్తుందా. ఒంటినిండా కొలెస్ట్రాల్ కనిపిస్తుందని కావ్య అంటుంది. ఎవరినో పిలిచినట్లు పిలిచి రాజ్ గంట కొడతాడు. చీటింగ్ మీకు అలవాటే కదా అని కావ్య అంటుంది. పూజారి అర్చన చేస్తూ భార్య పేరు చెప్పమంటాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని రాజ్ అంటాడు. దాంతో అయ్యో ఇంకా పెళ్లి కాలేదా. ఏమైనా లోపమా. మంచి డాక్టర్‌కు చూపించుకోండి. ఇంకా లేట్ అయితే పిల్లను ఎవరు ఇవ్వరు అని పూజారి అంటాడు.

రాజ్‌ను తిట్టిన పూజారి

దానికి కావ్య నవ్వుతుంది. తనకు పెళ్లి అయింది. మా ఆయన బూత్ బంగ్లాలో ఊడుస్తాడు. నేను బొమ్మలతో సంపాదించిన డబ్బు లాక్కుంటాడు. సుందరి అనే ఆ యవ్వారం ఉందండి. ఆయనకు లేని అలవాటు లేదు. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఇంట్లోంచి పంపించేశాడు. వాళ్లింట్లో ఎవరు తప్పు చేసిన నన్నే అంటాడు. చెప్పుడు మాటలు విని నన్నే తిడతాడు అని రాజ్ చేసిందంతా కావ్య చెబుతుంది. ఆ దేవుడు ఉన్నాడు కదా. అతనికి దేవుడు బుద్ది చెబుతాడు. ఓ రోజు వచ్చి కాళ్లు పట్టుకుని బతిమిలాడుతాడు అని పూజారి అంటాడు.

అది కూడా జరిగింది. కానీ, మనిషిపై ప్రేమ తగ్గినప్పుడు కలిసి బతకలేం కదా అని కావ్య అంటుంది. మీ ఆయన ఎవరో కనిపిస్తే.. గంటసేపు గంట కొటడతాను. అప్రాచ్యుడు అని పూజారి అంటాడు. తర్వాత పూజారి పూజ చేస్తాడు. పూజారి వెళ్లగానే కావ్య, రాజ్ గొడవ పడతారు. వెళ్లి హాస్పిటల్‌లో చూపించుకోండి అని కావ్య సెటైర్ వేస్తుంది. ఇంతలో అక్కడికి జనాలు వస్తారు. వాళ్ల గుంపుకు రాజ్, కావ్య దగ్గరవుతారు. తర్వాత ఇద్దరూ హారతి తీసుకుంటారు.

కావ్య ఏదో చెప్పబోతుంటే.. రాజ్ వినకుండా వెళ్తుంటాడు. ఇంతలో మెట్లపై అరటి తొక్కపై కాలు వేసి పడబోతాడు. దాంతో కావ్య పట్టుకుంటుంది. చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు అని రాజ్ అంటే.. సారీ అండి ఇలా ఇంకోసారి పట్టుకోని అని వదిలేస్తుంది కావ్య. దాంతో రాజ్ కిందపడిపోతాడు. మీకు అత్తయ్యగారు సేవలు చేయడం ఇష్టంలేక ఆపాను. చీప్ ట్రిక్స్ కావు అని వెళ్లిపోతుంది కావ్య. పంతులు వచ్చి లేపి భార్యలతో పెట్టుకోకూడదు నాయన అని చెబుతాడు.

ఉద్యోగులకు రాజ్ వార్నింగ్

తను నా పెళ్లాం అని ఎలా తెలిసింది అని రాజ్ అడుగుతాడు. మీరు కిందపడకుండా ఆపింది కదా నాయన. వాళ్లతో పోటీ పడితే గెలవడం కష్టం నాయన. గొడవ పడితే ఆపడం కష్టం. ఎంత దూరంగా ఉన్నా ఆ బంధాన్ని విడదీయడం కష్టం నాయన అని పంతులు అంటాడు. తొక్కలో ఫిలాసఫీలు ఆపి ఒ తొక్కను డస్ట్ బిన్‌లో వేయండి అని రాజ్ వెళ్లిపోతాడు. మరోవైపు రాజ్ కంపెనీలో ఎంప్లాయిస్ అంతా చిల్ అవుతుంటారు.

మా కంపెనీలో ఉన్నంత ఫ్రీడమ్ ఉండదు. అసలు బాసే ఉండడు. రాత్రికి పబ్‌కు వెళ్దాం అని ఒకతను మాట్లాడతాడు. అదంతా రాజ్ చూస్తాడు. చూసి షాక్ అయి ఒక్కకరి దగ్గరికి వెళ్లి అబ్జర్వ్ చేస్తాడు. అప్పుడే రాజ్‌ను గమనించిన ఎంప్లాయిస్ అంతా ఖంగుతింటారు. శ్రుతి అని గట్టిగా అరిచిన రాజ్ వీళ్లంతా మీటింగ్ హాల్‌లో ఉండాలంటాడు. అయిపోయింది. మీ జాబ్‌లు ఇక కష్టమే అని శ్రుతి చెబుతుంది. కట్ చేస్తే అంతా మీటింగ్ హాల్‌లో ఉంటారు.

ఈ నెల సాలరీ మీ అకౌంట్‌లో పడిందా. బోనస్‌లు అందుతున్నాయా. ఇంక్రిమెంట్‌లు ఇచ్చారా అని రాజ్ అడుగుతాడు. ఇవన్నీ నేను ఉన్నంతవరకు అన్ని సక్రమంగా జరిగాయి. కంపెనీ లాభాల్లో ఉంటే దాన్ని బట్టి మీకు బోనస్ ఇచ్చాం. మీకు ఏమైనా కష్టంగా అనిపిస్తుంది. బాస్ ఉంటేనే మీరు రెగ్యూలర్‌గా పని చేస్తారా. నేను కఠినమైన నిర్ణయం తీసుకుంటే మీ స్థానంలో కొత్త స్టాఫ్‌ను తీసుకురాగలను అని రాజ్ వార్నింగ్ ఇస్తాడు.

సామంత్ ఛాలెంజ్

మరోవైపు కావ్య వేసే డిజైన్స్ సామంత్ కంపెనీకి చేరుతున్నట్లు ఏమాత్రం డౌట్ రాకూడదని మేనేజర్‌కు చెబుతుంది అనామిక. ఈసారి మేము చాలా పెద్ద కంపెనీతో టైఅప్ అవ్వాలనుకుంటున్నాం. వాళ్లకు నచ్చినవిధంగా మీరు డిజైన్స్ వేసి ఇవ్వాలి అని కావ్యతో మేనేజర్ అంటాడు. బెస్ట్ ఇస్తానని కావ్య చెబుతుంది. మరోవైపు మీకంటే నెంబర్ వన్ పొజిషన్‌లో నేను ఉంటాను అని రాజ్‌తో సామంత్ ఛాలెంజ్ చేస్తాడు.