Brahmamudi September 24th Episode: వినాయకుడి పూజలో రాజ్ కావ్య- అప్పుకు గిఫ్ట్‌గా పోలీస్ డ్రెస్- కనకంకు రుద్రాణి అవమానం-brahmamudi serial september 24th episode kalyan motivates appu to reach goal raj kavya puja brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi September 24th Episode: వినాయకుడి పూజలో రాజ్ కావ్య- అప్పుకు గిఫ్ట్‌గా పోలీస్ డ్రెస్- కనకంకు రుద్రాణి అవమానం

Brahmamudi September 24th Episode: వినాయకుడి పూజలో రాజ్ కావ్య- అప్పుకు గిఫ్ట్‌గా పోలీస్ డ్రెస్- కనకంకు రుద్రాణి అవమానం

Sanjiv Kumar HT Telugu
Sep 24, 2024 07:13 AM IST

Brahmamudi Serial September 24th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 24వ తేది ఎపిసోడ్‌లో కావ్య చేసిన వినాయకుడి విగ్రహం రాజ్ ఇంటికి చేరుతుంది. కావ్యను రమ్మని కాల్ చేయమని రాజ్‌కు చెబితే ఒప్పుకోడు. దాంతో కావ్య చీరను రాజ్ పక్కన పెట్టి పూజ జరిపిస్తారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 24వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 24వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో తన ఇంటి గడప తొక్కద్దు అని కావ్యతో రాజ్ అంటాడు. అవును మరి చెక్ బుక్ పట్టుకుని ఎవరు మా ఇంటి గడప తొక్కారో అని కావ్య అంటుంది. నీకు కాపురం చేయడమే రాదని రాజ్ అంటే.. అవును మరి, బూత్ బంగ్లాలో కాపురం ఎవరికీ చేయొస్తదని కావ్య అంటుంది. ఇప్పుడు బూత్ బంగ్లా టాపిక్ ఎందుకు తెచ్చావ్ అని రాజ్ అంటాడు.

ముసుగు టాపిక్

మీరు ముసుగు టాపిక్ తీసుకురాలేదా అని కావ్య అంటుంది. వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నిందలు పడతారంటే ఏమో అనుకున్నాను. నీ మొహం చూశాను. ఇంకా ఎన్ని నిందలు పడాలో అని రాజ్ అంటే.. చంద్రుడిలాంటి నా మొహం చూస్తే.. అహంకారి లాంటి మీవాళ్లకు కూడా మంచే జరుగుతుందని కావ్య అంటుంది. నీ మొహం చంద్రుడిలా ఉంటుందా.. అడ్డంగా పడ్డా బిందలా ఉంటుంది ఛీ ఛీ. సైకిల్ తీయ్ అని రాజ్ అంటాడు.

నేను తీయను. మీరే కారును పక్క నుంచి తిప్పుకుని వెళ్లండని సైకిల్‌ను అడ్డంగా పెడుతుంది కావ్య. దాంతో చేసేదేం లేక కారు పక్కకు తిప్పుకుని రాజ్ వెళ్లిపోతాడు. కావ్యను తిట్టుకుంటూ వినాయక విగ్రహాలు చూస్తాడు రాజ్. అన్ని చూసిన రాజ్ ఆఖరుకు కావ్య చేసి తీసుకొచ్చిన విగ్రహం చూసి అదే కావాలి అంటాడు. అది వేరే వాళ్లు స్పెషల్‌గా ఆర్డర్ చేసుకున్నారు అని షాప్ అతను చెబుతాడు. కానీ, రాజ్ వినకుండా అదే కావాలి అంటాడు.

వీడేవడో మొండోడిలా ఉన్నాడు. ఎక్కువ సేపు లాగితే.. ఎక్కువ డబ్బులు ఇవ్వొచ్చు అనుకున్న షాప్ అతను దానికి ఐదు వేలు ఇచ్చి ఒకరు స్పెషల్‌గా ఆర్డర్ చేసుకున్నారు అని చెబుతాడు. నేను పదివేలు ఇస్తాను. కావాలంటే నీ షాప్‌ మొత్తం కూడా కొనగలను అంటాడు రాజ్. దాంతో పదివేలా అని అనుకున్న షాప్ అతను ఆ విగ్రహాన్ని రాజ్‌కు అమ్మడానికి ఒప్పుకుంటాడు. డబ్బు తీసుకుని విగ్రహం పంపిస్తాడు. కట్ చేస్తే.. విగ్రహం ఇంట్లో ఉంటుంది.

ఒక్కటి కొడతాను

పూజకు అన్ని ఏర్పాట్లు రాజ్ చేశాను అంటే.. ముందు కావ్యకు కాల్ చేయు.. పూజలో భార్యాభర్తలు ఇద్దరూ కూర్చోవాలి అని ఇందిరాదేవి అంటుంది. అర్థమైంది.. ఇందుకేనా నన్ను ముందుకు తోశారు అని రాజ్ అంటాడు. అవును, పూజా ఏర్పాట్లు చేసేటప్పుడు నీకు కావ్య గుర్తుకు రాలేదా. ఇన్ని రోజులు తనే ఈ ఏర్పాట్లు చూసుకునేది. కావాలంటే నేను వెళ్లి తీసుకొస్తాను. రాను అంటే బతిమిలాడుతాను. అయినా రాను అంటే ఒక్కటి లాగి పెట్టి కొడతాను అని అపర్ణ అంటుంది.

నువ్ ఫోన్ చేయిరా అని సుభాష్ అంటే.. నమస్తే వినాయక.. ఈ ఇంట్లో భార్య పక్కనే ఉన్నవాళ్లే పూజ చేస్తారట. నేను మాత్రం ఒక నమస్కారం, రెండు గుంజీళ్లు, మూడు ప్రదక్షిణలు సమర్పించుకుంటా అని సోఫాలో కూర్చున్న రాజ్ మీరు ఎవరైనా కూర్చుంటారా అని అందరినీ అడుగుతాడు రాజ్. లేకుంటే అందరూ నలుగురు కూర్చోండి అని రాజ్ అంటాడు. స్వప్న నచ్చజెప్పడానికి ట్రై చేస్తుంటే మధ్యలో చాలని రాజ్ ఆపుతాడు.

రాముడి గురించి గొప్పగా చెబుతూ రాజ్‌ను ఒప్పించేందుకు ఇందిరాదేవి ప్రయత్నిస్తుంది. నేను యుగపురుషుడుని కాదు మగ పురుషుడుని. దేవుడి పూజ అని చెప్పి ఆ రాక్షసిని ఇంటికి తీసుకురావాలా. నా దగ్గర ఏ పప్పులు ఉడకవు అని రాజ్ అంటాడు. హమ్మయ్య.. వీడు దేవుడుకే భయపడట్లేదు అంటే.. ఈ మనుషులు చెప్పేది విని కావ్యను ఎక్కడ తీసుకొస్తాడో అని భయపడ్డాను అని రుద్రాణి అనుకుంటుంది. బావ వీడిని ఏం చేద్దాం అని ఇందిరాదేవి అంటుంది.

చీర పక్కన పెట్టుకుని

వాడికి భార్య విలువ ఇంకా తెలిసిరావట్లేదు. ఇంకా కుర్ర చేష్టలు చేస్తున్నాడు. అలాంటివాడికి ఏం చెబుతాం అని సీతారామయ్య అంటాడు. వ్రతాలు నోములు చేసినప్పుడు, భర్త దేశాటనకు పోయినా.. భార్య అనారోగ్యంతో ఉన్నా.. వాళ్ల బట్టలు పక్కన పెట్టుకుని పూజా చేయొచ్చని సంస్కృతి చెబుతుంది. కాబట్టి, కావ్య చీర పక్కన పెట్టుకుని పూజ చేయి అని ఇందిరాదేవి అంటుంది. ఇదేం పితకలాటకం అని రాజ్ అంటే.. సీతారామయ్య కర్ర పట్టుకుని రాజ్‌ను బెదిరిస్తుంది ఇందిరాదేవి.

దాంతో పూజలో కూర్చుంటాడు రాజ్. విగ్రహాం చాలా బాగుందని ఇందిరాదేవి అంటుంది. నా సెలక్షన్ అలాగే ఉంటుంది. పదివేలు పెట్టి స్పెషల్‌గా కొన్నాను అని రాజ్ అంటాడు. తొండమేంట్రా కుడివైపు ఉందని ప్రకాశం అంటే.. అది మంచిదే. ఎడమవైపు ఉంటే భోగాలు ఇస్తాడు. కుడివైపు ఉంటే.. మోక్షం ప్రసాదిస్తాడు. ఇది విశేషమైన విగ్రహం అని ఇందిరాదేవి అంటుంది.

ఈ జీవకళ చూస్తుంటే.. ఎందుకో ఇది కావ్య తయారుచేసినట్లు అనిపిస్తుందని అపర్ణ అంటుంది. నువ్వేం కళలు వెతకాల్సిన అవసరం లేదని అపర్ణ అంటుంది. కావ్య చీర తీసుకొచ్చి పక్కన పెడుతుంది స్వప్న. ఇంతలో కావ్య పిలిచినట్లు రాజ్‌కు అనిపిస్తుంది. పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది. దాంతో కావ్య చీర ఉన్న పీటను దూరంగా జరుపుతాడు రాజ్. దగ్గరిగా పెట్టమని అపర్ణ అంటుంది. రాజ్ పూజ చేస్తుంటే.. రాజ్ పక్కన కావ్య ఉన్నట్లు అపర్ణ ఊహించుకుంటుంది.

సంతోషంగా ఉండాలి

ఊహించుకుని తెగ ఎమోషనల్ అవుతూ సంబరపడుతుంది. దాంతో దుగ్గిరాల ఇంట్లో రాజ్, కావ్య ఇద్దరూ పూజ చేసినట్లుగా అవుతుంది. స్వప్న వెళ్లి అపర్ణకు హారతి ఇస్తుంది. హారతి తీసుకున్న అపర్ణ స్వప్నను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. చుట్టూ చూసి బాధపడుతుంది. ఏమైంది ఆంటీ అని స్వప్న అడిగితే.. కన్నీళ్లు తుడుచుకుంటూ ఏం లేదని అపర్ణ అంటంది. స్వామి నా కొడుకు కోడలు కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అపర్ణ.

మరోవైపు కల్యాణ్ గదిలో కూడా వినాయకుడి పూజను బంటి చేసి హారతి ఇస్తాడు. థ్యాంక్స్‌రా బంటి నువ్ లేకపోతే పూజ చేయడం కష్టమయ్యేది అని కల్యాణ్ అంటాడు. నేను రోజు ఎవరికొ ఒకరికి ఇలా సాయం చేస్తూనే ఉంటాను అని బంటి అంటాడు. అప్పు పంచ్‌లు వేస్తుంది. కల్యాణ్ గిఫ్ట్ ఇస్తానంటూ ఒకటి తీసుకొస్తాడు. ఈరోజు గిఫ్ట్ ఏంటీ అని గిఫ్ట్ చూస్తుంది అప్పు. దాంట్లో పోలీస్ డ్రెస్ ఉంటుంది. నువ్ మరిచిపోయిన నీ గోల్‌ను మళ్లీ మొదలుపెట్టాలి అని కల్యాణ్ అంటాడు.

అనామిక అవమానించిందని ఇలా చేస్తున్నావా అని అప్పు అంటుంది. కాదు. నా బాధ్యత గుర్తుకొచ్చింది. ఇల్లు గడవం గురించి నేను చూసుకుంటాను. ఇవాల్టీ నుంచి నువ్ ఆలోచించాల్సింది ఒక్కటే. నువ్ పోలీస్ అవడం గురించి అని చెప్పిన కల్యాణ్ ఆ డ్రెస్‌ను గోడకు వేలాడీస్తాడు. దాన్ని చూసినప్పుడల్లా నీలో పట్టుదల రావాలని కల్యాణ్ చెబుతాడు. దాంతో ప్రేమగా కల్యాణ్‌ను హగ్ చేసుకుంటుంది అప్పు. మరోవైపు రాజ్ అందరికీ ప్రసాదం ఇస్తాడు.

ఈ సాకుతో దులిపేసుకోవాలని

ఇంతలో అక్కడికి కనకం వస్తుంది. వదినా గారు అని కనకం పిలుస్తుంది. దాంతో కావ్య కూడా వచ్చిందేమో అని చుట్టూ చూస్తుంది అపర్ణ. రా కనకం ముందు భగవంతుడికి నమస్కారం చేసుకో అని ఇందిరాదేవి చెప్పగానే నమస్కరిస్తుంది కనకం. కావ్య చీరను చూస్తుంది. రాజ్ ప్రసాదం ఇస్తాడు. ఏంటీ పిలవని పేరంటానికి వచ్చావ్ అని రుద్రాణి అంటుంది. ఈ సాకుతో కూతురుని అత్తారింటికి పంపించి చేతులు దులిపేసుకోవాలని వచ్చావా అని రుద్రాణి అవమానిస్తుంది.

నా కూతురికి అల్లుడుకి మధ్య బంధం ఇంకా తెగిపోలేదు అనడానికి నా అల్లుడి పక్కన ఉన్న నా కూతురు చీరే సాక్ష్యం. నా కూతురు చేసిన వినాయకుడి విగ్రహం ఈ ఇంటికే వచ్చి చేరింది. నా కూతురు చేసిన దేవుడే ఈ ఇంటికి వచ్చాడు. నా కూతురు రాదా అని కనకం అంటుంది. దాంతో అపర్ణ సంతోషపడితే.. రాజ్ షాక్ అవుతాడు.