Guppedantha Manasu June 27th Episode: గుప్పెడంత మనసు- వసుధారను పొగరు అన్న రంగా- రిషి అనడానికి సాక్ష్యం- పాపం శైలేంద్ర
Guppedantha Manasu Serial June 27th Episode: గుప్పెడంత మనసు సీరియల్ జూన్ 27వ తేది ఎపిసోడ్‌లో వసుధారను పొగరు అని రిషి డైలాగ్ అంటాడు రంగా. దాంతో వసు సంతోషపడుతుంది. మరోవైపు మను, మంత్రి తమ ప్లాన్‌తో శైలేంద్రను దెబ్బ కొడతారు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో డీబీఎస్టీ కాలేజీ బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి చెబితే అలా జరగనివ్వకండని, రిషీంద్ర ఫ్యామిలీనే కాలేజీని చూసుకుంటుందని, తాను చూసుకుంటానని, ఎండీ సీటులో తాను కూర్చుంటానని శైలేంద్ర అంటాడు.
పెద్ద సమస్యగా మారుతుంది
కానీ, అలా జరగనివ్వం కదా అని ఒక మెంబర్ అంటాడు. మరో లేడి మెంబర్ శైలేంద్ర సారే ఎండీ సీటులో కూర్చోవాలి అని అంటుంది. దాంతో మీరు ఎండీ సీటుకే ఇలా కొట్టుకుంటే ఎలా. రేపు నువ్ ఎండీ సీటులో కూర్చుంటే నువ్ ఏం చేసిన తప్పు బడతారు. ఫైల్స్‌పై సంతకం చేయకుండా వ్యతిరేకిస్తారు. అది పెద్ద సమస్యగా మారుతుంది. అప్పుడు స్టూడెంట్స్ భవిష్యత్ పాడవుతుందని మంత్రి అంటాడు. ఇప్పటికే కాలేజీ పడిపోయిందని అంటున్నారు, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటే ఇంకా పడిపోయిందని అంటారని శైలేంద్ర అంటాడు.
నేను ఇప్పుడే తీసుకుంటామని చెప్పట్లేదు. వారం రోజులు టైమ్ ఇచ్చాను. అంతవరకు ఆలోచించి చెప్పండి. రిషి, జగతి, వసుధార విషయంలో ఎలాంటి అనుమానాలు ఉండలేదు. ఇప్పుడు మీరు ఎండీ కావాలంటే వసుధార రావాలి అని మంత్రి చెబుతాడు. వసుధార లేదు కదా అని శైలేంద్ర అంటే.. అంతా షాక్ అవుతారు. లేకపోవడం ఏంటీ అని మంత్రి అంటాడు. అంటే రానని వెళ్లిపోయింది కదా. అందులోనూ తనకు ఆత్మాభిమానం ఎక్కువ. మీలాగా నాలాగా కాదు అని శైలేంద్ర అంటాడు.
ఇలాంటివే వస్తాయి
దాంతో మంత్రి షాక్ అవుతాడు. రేయ్ ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా అని ఫణీంద్ర హెచ్చరిస్తాడు. సారీ సార్ నాలాగా కాదు అని శైలేంద్ర అంటాడు. వసుధార ఎలా వస్తుందని శైలేంద్ర అంటే.. అయితే రిషి రావాలి అని మంత్రి అంటాడు. చనిపోయాడని అఫీషియల్‌గా ప్రకటించిన తర్వాత ఎలా వస్తాడని శైలేంద్ర అంటే.. అల్టర్‌నేటివ్ అడిగితే.. ఇలాంటివే వస్తాయి. కాబట్టి వసుధార రాని. అప్పటివరకు ఎలా జరుగుతుందో అలాగే జరగని అని మీటింగ్ అయిపోయిందని మంత్రి వెళ్లిపోతాడు.
మా తాత కట్టించిన కాలేజీపై గవర్నమెంట్ పెత్తనం ఏంటీ అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. రేయ్ ఎక్కువగా ఆశపడకు. నీకు సపోర్ట్ చేసిన ఈవిడి నిజంగా నీ టాలెంట్ చూసే చెప్పిందా. లేదా డబ్బులు ఇచ్చి చెప్పించావా అని ఫణీంద్ర అంటాడు. ఆవిడ నా టాలెంట్ గుర్తించింది. మీరే గుర్తించట్లేదు. నాకు బయట కాదు. ఇంట్లో ఉన్న శత్రువు మీరే అని శైలేంద్ర అంటే.. ఏడిశావ్‌లే అని ఫణీంద్ర వెళ్లిపోతాడు. రేయ్ మనుగా నువ్ ఒక్కడివే అడ్డుగా ఉన్నావ్. ఏం చేయాలో తెలియట్లేదు అని శైలేంద్ర ఆలోచిస్తుంటాడు.
వసుధార కోసం
మరోవైపు వసుధార కనిపించట్లేదు, కనిపించిందా అని రాధమ్మను అడుగుతాడు రంగా. ఎక్కడ లేదని కంగారుపడతాడు రంగా. భోజనం చేసే సమయంలో మనం అన్న మాటలకు ఫీల్ అయి వెళ్లిపోయారా అని వసుధారను వెతికేందుకు వెళ్తాడు రంగా. తాను కూడా వస్తానని సరోజ అంటే వద్దని ఒక్కడే వెళ్తాడు. ఊరంతా ఆటోలో వెతుకుతుంటాడు రంగా. తనకోసం రౌడీలు వెతుకుతున్నారు. ఇప్పుడు తను కనిపించడం లేదు. ఏం జరుగుతుందో ఏమో అని రంగా ఆలోచిస్తుంటాడు.
ఇంతలో ఓ టీ షాప్ దగ్గర టీ తాగుతూ వసుధార కనిపిస్తుంది. అది చూసి కోపంతో హేయ్.. నిన్ను అని చేయెత్తి కొట్టబోతాడు రంగా. తర్వాత ఆగిపోతాడు. నీకు అసలు బుద్ధుందా లేదా. ఎవరినీ అడిగి వచ్చావ్. అసలు ఎందుకు వచ్చావ్ అని రంగా ప్రశ్నిస్తాడు. నాకు టీ తాగాలనిపించింది. ఇక్కడ బాబాయ్ సరిగా పెట్టలేదు. నేనే పెట్టుకుని తాగుతున్నాను అని వసుధార అంటుంది. మీకోసం ఊరంతా వెతుకుతున్నాను. మీకు ఎమైందో భయపడ్డాను అని రంగా అంటాడు.
మీరు ఒప్పుకోవచ్చు కదా
నిజంగా నాకోసం వెతికారా అని సంతోషపడుతుంది వసుధార. నాకోసం ఎందుకు వెతికారు. నాకు ఏమైతో మీకేంటి అని వసుధార అంటుంది. మీకేమైనా అయితే అది నా బాధ్యత. మీకోసం రౌడీలు వెతుకుతున్నారు. మిమ్మల్ని కాపాడి తీసుకొచ్చాను. మీకు ఏమైనా అయితే పోలీసులకు నేను సమాధానం చెప్పాలి అని రంగా అంటాడు. దానికి బదులు మీరే రిషి సర్ అని ఒప్పుకోవచ్చు కదా అని వసుధార అంటే.. నేను రంగాను అని అంటాడు.
లేదు రిషి సార్ అని వసుధార వాదిస్తుంటే.. పొగరు అని రిషి డైలాగ్ రంగా కొడతాడు. దాంతో మరింత సంబరపడిపోతుంది వసుధార. ఇంకోసారి అనండి. నన్ను అనే హక్కు మీకే ఉంది రిషి సార్ అని వసుధార అంటే.. మీరు అసలు తగ్గరా మేడమ్. ఎదుటి వాళ్ల సైడ్ నుంచి ఆలోచించరా అని రంగా అంటాడు. నేను తగ్గను అని వసుధార అంటుంది. రండి మేడమ్ ఇంటికి వెళ్దాం అని రంగా అంటే రానని వసుధార మొండికేస్తుంది.
ఇదంతా వీళ్ల ప్లానా
దాంతో వసుధార చేయి పట్టుకుని తీసుకెళ్తాడు రంగా. దాంతో మరింత హ్యాపీగా ఫీల్ అయిన వసుధార మీ స్పర్ష నాకు తెలుస్తోంది. మీరు రిషి సారే అని వసుధార అనుకుంటుంది. మరోవైపు మనం అనుకున్నట్లుగానే బోర్డ్ మీటింగ్‌లో చెప్పినందుకు థ్యాంక్స్ అని మను మంత్రితో అంటాడు. అది శైలేంద్ర వింటాడు. ఇదంతా వీళ్ల ప్లానా. నా వెనుక ఇంత ప్లాన్ చేశారా అని శైలేంద్ర అనుకుంటాడు. అలా చెప్పకుంటే దుర్మార్గుల చేతిలోకి కాలేజీ వెళ్లిపోతుందని చెప్పావ్ గా అందుకే చెప్పాను అని మంత్రి అంటాడు.
మీరు చెప్పిన కారణాలకు వాళ్లు ఒప్పుకున్నారు. రిషి సార్ రావడం అసాధ్యం. వసుధార వచ్చిన శైలేంద్రను ఎండీగా చెప్పదు అని మను అంటాడు. అవును, ఈ కాలేజీ అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో గొప్ప పనులు చేశారు. అలాంటి కాలేజీ డౌన్ అవ్వడం నాకు ఇష్టం లేదని వెళ్లిపోతాడు మంత్రి. మను తిరిగి వెనక్కి వస్తుండగా శైలేంద్ర ఎదురెళ్తాడు. మినిస్టర్ అలా మాట్లాడటానికి నువ్వా కారణం అని శైలేంద్ర అంటే.. అవును అని మను చెబుతాడు.
గొప్పగా చెప్పడం అలవాటైంది
నా వెనుక ఇంతపెద్ద నాటకం ఆడుతారా. నా వెనుకే గోతులు తీస్తారా అని శైలేంద్ర అంటాడు. ఈ బోర్డ్ మీటింగ్‌లో అయినా ఆ మినిస్టర్ గాడు నా పేరు చెబుతాడనుకున్నా. కానీ, నువ్ అడ్డు పడ్డావ్. ఇన్నిసార్లు అడ్డుపడటం మంచిది కాదు. శత్రు శేషం ఉంచుకోకూడదు. నా చరిత్ర నీకు తెలియదని శైలేంద్ర అంటాడు. నేర చరిత్రను గొప్పగా చెప్పుకోవడం అలవాటు అయింది వెధవలకు. నువ్ చెప్పడం తప్పా ఏం చేయలేవని మను అంటాడు.
డైలాగ్స్ కాదు. యాక్షన్ కూడా చేస్తాను. రెడీగా ఉండు అని శైలేంద్ర అంటే.. గుడ్ లక్. ఏం చేస్తావో చేసుకో అని మను వెళ్లిపోతాడు. వెంటనే రౌడీకి కాల్ చేసి మను గాడిని చంపేయాలని శైలేంద్ర చెబుతాడు. ఒకసారి కాలేజీలో అటాక్ చేశావ్‌గా వాడే అని శైలేంద్ర అంటాడు. వాడా ఒక్కసారి నా నుంచి తప్పించుకున్నవాడిపై మళ్లీ అటాక్ చేయను. ఎందుకంటే వాడికి భూమ్మీద నూకలు ఉన్నట్లే. అది దైవ నిర్ణయం. దాన్ని మనం మర్చలేం సార్. డబుల్ కాదు. ట్రిపుల్ పేమెంట్ ఇచ్చిన చేయలేను అని రౌడీ అంటాడు.
రిషి సార్ కథ
నేను చేయలేను. మీరే చంపేయండి. లేదంటే మార్కెట్‌లో చాలమంది ఉన్నారు అని రౌడీ చెబుతాడు. మరోవైపు వసుధార చెప్పకుండా వెళ్లినందుకు చాలా కంగారుపడ్డామని, అలా ఇంకోసారి వెళ్లకని, రంగా చాలా ఫీల్ అయ్యాడని, అసలు ఎందుకు వెళ్లావని రాధమ్మా అడుగుతుంది. జ్ఞాపకాలు, గతం గుర్తుకు వచ్చి ఒంటరిగా ఉండాలనిపించి వెళ్లానమ్మా అని వసుధార చెబుతుంది. అసలు నీ గతమేంటీ, రిషి సార్ ఎవరు, ఆయన కథేంటీ అని అడుగుతారు.
నా రిషి సార్ జెంటిల్‌మెన్. ఒక ప్రిన్స్. ఒక సీరియస్ సింహం అని స్టార్ట్ చేసిన వసుధార తన జీవితంలో జరిగినవి గుర్తు చేసుకుంటూ గొప్పగా చెబుతుంది వసుధార. అలా చెబుతూ ఎమోషనల్ అవుతుంది వసుధార. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.