Guppedantha Manasu June 25th Episode: గుప్పెడంత మనసు- సేమ్ రిషిలా రంగా- సరోజతో వసుధార ఛాలెంజ్- 15 రోజుల్లో తేలనున్న నిజం-guppedantha manasu serial june 25th episode ranga lashes at saroja and saves vasudhara guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu June 25th Episode: గుప్పెడంత మనసు- సేమ్ రిషిలా రంగా- సరోజతో వసుధార ఛాలెంజ్- 15 రోజుల్లో తేలనున్న నిజం

Guppedantha Manasu June 25th Episode: గుప్పెడంత మనసు- సేమ్ రిషిలా రంగా- సరోజతో వసుధార ఛాలెంజ్- 15 రోజుల్లో తేలనున్న నిజం

Sanjiv Kumar HT Telugu
Jun 25, 2024 08:09 AM IST

Guppedantha Manasu Serial June 25th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూన్ 25వ తేది ఎపిసోడ్‌లో రిషి లాగే రంగా చేసే పనులు కూడా ఉంటాయి. దాంతో వసుధార మరింత బలంగా నమ్ముతుంది వసు. తర్వాత రౌడీలు రంగాను చూసి రిషి అని గుర్తుపడతారు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూన్ 25వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూన్ 25వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రంగాతో కొబ్బరిబొండం తాగుతూ దానిలో ఉన్న పోషకాల గురించి చెబుతుంది వసుధార. అవేవి నాకు చెప్పకని మీ రిషి సార్ అని ఉంటాడు కదా. మీ ప్రవర్తన చూస్తే ఎవరికైనా చిర్రెత్తికొస్తుంది. మిమ్మల్ని భరించినా రిషి సార్‌కు నిజంగా దండం పెట్టాలి అని రంగా అంటుంది. దాంతో వసుధార బాధపడుతుంది.

వసుధారను ఏడిపించిన రంగా

కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార. మిమ్మల్ని భరించలేకే మీ నుంచి దూరంగా రిషి సార్ వెళ్లిపోయి ఉంటాడు. మీరు పదే పదే ఏదో చెప్పి విసిగిస్తుంటారు. అందుకే వెళ్లిపోయి ఉంటాడు అని ఇంకా రంగా ఏదో అనబోతూ వసుధారను చూసి రంగా షాక్ అవుతాడు. అయ్యో మేడమ్.. నేను ఏదో పొరపాటుగా అన్నాను. మీరు బాధపడి ఉంటే క్షమించండి అని రంగా అంటాడు. మీ రిషి సార్ కూడా ఇలాగే ఓదార్చుతాడు కదా. అలా అని మళ్లీ నన్ను రిషి సార్ అనకండి అని రంగా అంటాడు.

ఇంతలో ఒకతను వచ్చి రంగాను పలకరిస్తాడు. ఈ అమ్మాయి ఎవరు. నువ్ ప్రేమిస్తున్నావా అని అతను అంటాడు. ఓయ్.. అవేం మాటలు అన్నా. తెలిసిన అమ్మాయి అని రంగా అంటాడు. ఇంతలో రంగాకు ఫోన్ వస్తే పక్కకు వెళ్లి మాట్లాడుతాడు. రంగా నీకెలా తెలుసు అని వసుధారను అతను అడిగితే.. అది పక్కన పెట్టండి. మీకు ఎంతకాలం రంగా తెలుసు అని వసుధార అడుగుతుంది. దాంతో చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అమ్మ. వాడు చాలా మంచివాడు అని అతను చెబుతాడు.

ఎంక్వైరీ చేస్తున్నారేంటీ

ఎవరికైనా కష్టం వస్తే వెంటనే తీరుస్తాడు. వాడున్న చోట డబ్బు అవసరం లేదు. సంతోషమే ఉంటుంది. అలాంటి వాడు మా ఇంట్లో ఎందుకు పుట్టలేదా అనిపిస్తుందని రిషి గొప్పదనం లాగే చెబుతాడు. వాడు పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో అదృష్టవంతురాలు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అని అతను చెబుతుంటే రంగా వస్తాడు. నీ గురించే అడుగుతుందని అతను అంటే.. నేను రిషి సార్ కాదన్న ఇలా ఎంక్వైరీ చేస్తున్నారా. దారిలో కనిపించనావాళ్లందరిని అడిగి రండి అని ఆటో ఎక్కించుకోకుండా రంగా వెళ్లిపోతాడు.

ఇంతలో ఒకావిడ వచ్చి రంగా ఆటో ఎక్కించుకోవట్లేదేంటమ్మా అని ఆమె అడుగుతుంది. రంగా నీకు తెలుసా అని వసుధార అడుగుతుంది. రంగా తెలియకుండా ఉంటాడా. తను బంగారం. గుణవంతుడు. నా తాగుబోతు భర్త నా బిడ్డను పనికి పంపుతుంటే రంగానే మానిపించి నా బిడ్డను చదివిపిస్తున్నాడు. చదువు అంటే రంగాకు చాలా ఇష్టం. తను చదువుకోకపోవడమే అందుకు కారణం కావచ్చు అని ఆమె వెళ్లిపోతుంది.

పీడ విరగడి అవుతుంది

మీ పేరు మాత్రమే మారింది. కానీ పనులు మాత్రం అలాగే ఉన్నాయి. మీరే రిషి సార్ అని వసుధార అనుకుంటుంది. మరోవైపు రౌడీలకు వసుధారను చూపిస్తుంది సరోజ. బావ కూడా దగ్గరలేదు. దీన్ని పట్టిస్తే పీడ విరగడైపోతుంది అని సరోజ అనుకుంటుంది. దాంతో రౌడీలు వసుధార వెంటపడతారు. వసుధార నా బావనే రిషి సార్ అంటావా అని ఇంటికి వెళ్లిపోతుంది సరోజ. తన వెంట పడుతున్న రౌడీలను వసుధార చూసి షాక్ అవుతుంది. దాంతో పారిపోతుంది.

అటు నుంచి ఆటో వేసుకుని రంగా వస్తాడు. మేడమ్ ఎక్కండి అంటాడు. దాంతో వసుధార ఆటో ఎక్కుతుంది. అప్పుడే రౌడీలు ఆటో ఫొటో తీస్తారు. అప్పుడే రంగా బయటకు చూస్తాడు. దాంతో రంగా మొహం ఫొటోలో వస్తుంది. కోపడటం, ఆపదలో ఉన్నప్పుడు కాపాడటం. మీరే మా రిషి సార్ అని వసుధార మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే ఈరోజుతో తన దరిద్రం పోతుంది అని సరోజా సంతోషిస్తుంటుంది. అన్న మేడమ్ ఎక్కడ అని ఇంట్లో అతను అడుగుతాడు.

సరోజపై రంగా ఫైర్

తను రాదు. బావ ఒక్కడే వస్తాడు అని సరోజ అంటుంది. ఇంతలో ఇద్దరూ వస్తారు. అది చూసి సరోజా షాక్ అవుతుంది. ఇది వచ్చిందేంటీ. ఇది తప్పించుకుందా. ఇదేంటీ నా ప్లాన్ బెడిసికొట్టిందని సరోజా అనుకుంటుంది. ఎందుకే రౌడీలకు మేడమ్ గురించి చెప్పావని రంగా నిలదీస్తాడు. నువ్ చెప్పడం నేను చూశాను అని రంగా అంటాడు. దాంతో సరోజ భయపడుతుంది. మేడమ్‌ గారిని ఆ రౌడీల నుంచి కాపాడి తీసుకొస్తే.. నువ్వెళ్లి వాళ్లకే అప్పజెపుతావా అని రంగా ఫైర్ అవుతాడు.

తను మన ఇంట్లో ఉంటుంది. తనకు ఏమైనా జరిగితే మనదేనే బాధ్యత అని రంగా అంటాడు. నా భయం నాది అని సరోజ అంటే.. ఏంటే నీ భయం. లేనిపోని అనుమానాలు పెట్టుకుని మేడమ్‌పై అసూయ పెట్టుకోకు అని రంగా అంటాడు. నేను తప్పు చేసినట్లు అంటావేంటీ అని సరోజ అంటే.. నీదే తప్పు సరోజ అని రాధమ్మ బుద్ది చెబుతుంది. అలా గడ్డి పెట్టు అని రంగా వెళ్లిపోతాడు. నీ సమస్య ఏంటో తెలియదు కానీ, అంతవరకు ఇక్కడే ఉండు అని వసుధారకు చెప్పి రాధమ్మా వెళ్లిపోతుంది.

వీడేరా వాడు

సర్.. మీరు రంగా కాదు సర్. మీరు రిషినే. కానీ, ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి అని వసుధార అనుకుంటుంది. మరోవైపు రౌడీలను కొడతాడు లీడర్. తను ప్రతిసారి తప్పించుకుంటుంది. దీనంతటికి కారణం ఆటో డ్రైవరే. అసలు ఎక్కడ ఉంటాడు వాడు అని రౌడీ అంటాడు. వాడి ఫొటో తీశాను అని చూపిస్తే.. వీడిని ఎక్కడో చూశానే అని రౌడీ లీడర్ అనుకుంటాడు. తర్వాత రిషి గుర్తుకొచ్చి.. వీడు వాడేనా.. వాడే వీడా.. అయినా వాడు చనిపోయాడు కదా. అంటే వాడు బతికే ఉన్నాడా అని రౌడీ అంటాడు.

వాడు ఎవడు అన్నా అని మరో రౌడీ అడిగితే.. ఈ కథకు హీరో రిషి.. రిషీంద్ర భూషణ్ అని రౌడీ అంటాడు. కట్ చేస్తే వసుధారపై సరోజ ఫైర్ అవుతుంది. ఏనాడు అనని నా బావ నా మీద కోప్పడుతున్నాడని సరోజ అంటుంది. అసలు నీ మనసులో ఏం పెట్టుకుని వచ్చావ్ అని సరోజ అంటే.. అసలు నేను ఏం చేశానని రౌడీలకు పట్టించావ్ అని వసుధార అడుగుతుంది. నా బావ జీవితంలోకి వస్తున్నావ్ అని ఇద్దరూ గొడవపడతారు.

వసుధార ఛాలెంజ్

తను రిషి సార్ కాదని చెబుతుంటే వినవేంటీ అని సరోజ అంటే.. వినను. అసలు మా గురించి నీకెం తెలుసు. అయినా నీ తప్పు కాదులే. మా రిషి సార్ క్యారెక్టర్‌కు ఏ అమ్మాయి అయినా ఇష్టపడుతుంది. సర్‌ను మర్చిపో. ఇప్పుడు కాస్తా కష్టంగానే ఉంటుంది అని వసుధార అంటుంది. ఏంటీ. నీకు ఏదో సమస్య ఉందనుకుంటే.. నువ్ పెద్ద ప్లానే వేశావు. నువ్ ఇప్పుడే మా ఇంట్లోంచి వెళ్లిపో అని సరోజ వార్నింగ్ ఇస్తుంది. నేను వెళ్లను అని వసుధార అంటుంది.

నువ్ వెళ్తావా. నేను మెడపట్టి గెంటించనా అని సరోజ అంటే.. వెళ్తాను. కానీ, ఒంటరిగా కాదు. రిషి సార్‌తో. రంగానే రిషి సార్ అని 15 రోజుల్లో నిరూపిస్తాను. తానే రిషి సార్ అని, వసుధారే నా భార్య అని రంగా ఒప్పుకున్నాకే. ఇద్దరం కలిసి వెళ్తాం అని సరోజతో వసుధార ఛాలెంజ్ చేస్తుంది.

WhatsApp channel