Guppedantha Manasu June 18th Episode: గుప్పెడంత మనసు- తానే రిషినని ఒప్పుకున్న రంగా- వసుధార భర్తనంటూ! నోరు జారిన శైలేంద్ర-guppedantha manasu serial june 18th episode ranga shocking revelation says he is rishi guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu June 18th Episode: గుప్పెడంత మనసు- తానే రిషినని ఒప్పుకున్న రంగా- వసుధార భర్తనంటూ! నోరు జారిన శైలేంద్ర

Guppedantha Manasu June 18th Episode: గుప్పెడంత మనసు- తానే రిషినని ఒప్పుకున్న రంగా- వసుధార భర్తనంటూ! నోరు జారిన శైలేంద్ర

Sanjiv Kumar HT Telugu
Jun 18, 2024 08:27 AM IST

Guppedantha Manasu Serial June 18th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూన్ 18వ తేది ఎపిసోడ్‌లో లెటర్‌లో రాసి ఉంటే బాగుండేదని వసుధార గురించి శైలేంద్ర నోరు జారుతాడు. మరోవైపు తానే రిషినని, వసుధార భర్తనని రంగా ఒప్పుకుంటాడు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూన్ 18వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూన్ 18వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో మహేంద్రను వసుధార గురించి ఏమైనా తెలిసిందా అని ఫణీంద్ర అడుగుతాడు. లేదు. ఎక్కడికి వెళ్లిందో తెలియట్లేదు అని మహేంద్ర అంటే.. ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తోందని మను అంటాడు. వసుధార ఇలా చేస్తుందని తెలిసి ఉంటే రిషి టాపిక్ తీసుకొచ్చేవాడిని కాదు అని ఫణీంద్ర ఫీల్ అవుతాడు.

లెటర్ రాసి పెట్టి

ఇప్పుడు ఎండీ బాధ్యతలు ఎవరికీ అప్పజెప్పాలో అర్థం కావట్లేదు అని ఫణీంద్ర అంటాడు. అవును.. వసుధార వెళ్లేముందు ఆ లెటర్‌లో పేరు రాసి పెట్టి పోయినా అయిపోయేది అని శైలేంద్ర నోరు జారుతాడు. దాంతో ఏం లెటర్ అని మను అడుగుతాడు. ఏం లెటర్ అని మహేంద్ర, ఫణీంద్ర కూడా చూస్తారు. కనీసం లెటర్ రాసి పెట్టి పోయిన అయిపోయేది అంటున్నా. లెటర్‌లో ఎవరి పేరు అయిన రాసి ఉంటే బాగుండేది. నీ పేరు రాసినా బాగుండేది కదా బ్రదర్ అని శైలేంద్ర అంటాడు.

తర్వాత ఎలా రాస్తుందిలే. వసుధారకు తెలుసు కదా. నువ్ మా ఫ్యామిలీ కాదని. ఎండీ సీటులో మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను తప్పా ఎండీ సీటులో కూర్చునేందుకు ఎవరు లేరు అని శైలేంద్ర అంటాడు. మన ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోవాలి. కరెక్టే. కానీ, దానికి అర్హత కూడా ఉండాలి అని మహేంద్ర అంటాడు. మినిస్టర్ గారి సమక్షంలో బోర్డ్ మీటింగ్ పెట్టి ఆయన ఎవరి పేరు చెబితే వారే ఎండీ సీటులో కూర్చుంటారు అని ఫణీంద్ర అంటాడు.

జీవితమే వృథా

దాంతో షాక్ అయిన శైలేంద్ర.. ఆ ముసలోడు చస్తే నా పేరు చెప్పడు అని అనుకుంటాడు శైలేంద్ర. మినిస్టర్‌తో మాట్లాడి బోర్డ్ మీటింగ్ ఏర్పాట్లు చూద్దాం పదా అని ఫణీంద్ర అంటే.. అదంతా నువ్ చూసుకో అన్నయ్య. నా మనసు సహకరించడం లేదు. అయినా వాళ్లందరు కనుమరుగైపోతున్నారు. జగతి చనిపోయింది. రిషి ఏమయ్యాడో తెలియదు. ఇప్పుడు వసుధార కనిపించట్లేదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే ఇప్పటికే డీబీఎస్టీ కాలేజీ గురించి నానారకాలుగా అనుకుంటున్నారు. అసలు జీవితమే వృథా అనిపిస్తుందని మహేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు.

ఫణీంద్ర ఓదార్చుతాడు. దాంతో ఇద్దరు ప్రేమగా హగ్ చేసుకుంటారు. అది చూసి శైలేంద్ర మనసులో సెటైర్లు వేసుకుంటాడు. ఇప్పుడు బ్యాక గ్రౌండ్ సాంగ్ వేసుకోవాలా.. అన్నదమ్ముల అనుబంధం అంటూ వెటకారంగా అనుకుంటాడు. మరోవైపు రిషి సార్ అంటూ వసుధార కలవరిస్తుంది. మెలకువ వచ్చి లేస్తూ గ్లాస్ కిందపడేస్తుంది వసుధార. ఇంతలో రాధమ్మా వచ్చి తనను తాను పరిచయం చేసుకుని మందులు ఇస్తుంది.

నా మనవడు కదా కాపాడింది

ఏ తల్లి కన్నబిడ్డవో నా మనవడిని కాపాడావు. వాడికి తగలాల్సిన దెబ్బ నీకు తగిలిందంట కదా. వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నా ప్రాణం విలవిల్లాడిపోతుంది అని ఎమోషనల్ అయిన రాధమ్మా ఇప్పుడెలా ఉందని చెబుతుంది. రిషి సార్ ఎక్కడ అని వసుధార అడిగితే.. రిషి సార్ ఎవరమ్మా. నిన్ను రౌడీల నుంచి నా మనవడు కాపాడాడు కదా అని రాధమ్మ అంటుంది. ఆయనే రిషి సార్. నా రిషి సార్ అని వసుధార అంటుంది.

వాడు రిషి సార్ ఏంటమ్మా నా మనవడు రంగా అని రాధమ్మ చెబుతుంది. దాంతో కాదని వసుధార అంటే.. తర్వాత మాట్లాడుకుందాం. విశ్రాంతి తీసుకో. పడుకో అని చెబుతుంది రాధమ్మా. ఏంటీ పిల్ల రంగాను పట్టుకుని రిషి సారు రిషి సారు అంటుంది అనుకుని వెళ్లిపోతుంది రాధమ్మా. మరోవైపు శైలేంద్ర కోపంతో అరుస్తాడు. ఇంత దరిద్రంగా ఉందేంట్రా నీ జాతకం. వసుధార చనిపోయినా కూడా ఎండీ సీటు దక్కలేదు కదా. వసుధార చెబితే నన్ను ఎండీని చేస్తారు కదా. కానీ, మట్టిలో కప్పేస్తాను కదా అని శైలేంద్ర అనుకుంటాడు.

నాకే బెడిసికొడుతుంది

ఏం చేసినా నాకే బెడిసి కొడుతుంది. ఒకసారి పాండుగాడికి కాల్ చేసి నిజంగా వసుధారను చంపేశాడో అడుగుదామని కాల్ చేస్తాడు శైలేంద్ర. అరేయ్.. వసుధారను నిజంగా చంపేశారా అని శైలేంద్ర అంటే.. అదేంటీ సార్ అలా అడుగుతారు. గొయ్యిలో కప్పేట్టాసాం. వీడియో కాల్‌లో చూపించాం కదా అని పాండు అంటాడు. చంపిన వాళ్లను బతికించవచ్చా అని శైలేంద్ర అడిగితే.. మాకు చంపడమే తెలుసు అని రౌడీ అంటాడు.

సరే డెడ్ బాడీ లొకేషన్ అయినా పంపించు అని శైలేంద్ర అంటే.. సరే సార్ రండి రెండ్రోజుల్లో వచ్చి మీరే డెడ్ బాడీని చూస్తే గానీ నమ్మట్లేదు అని రౌడీ కాల్ కట్ చేస్తాడు. దాంతో మిగతా రౌడీలు షాక్ అవుతారు. అలా చెప్పావేంటని అడిగితే.. వాడు మన రెగ్యులర్ కస్టమర్‌రా వదులుకోకూడదు. వాడికి నిజం తెలిస్తే మన ప్రాణం మీదకు వస్తుంది. ఆ అమ్మాయిని, ఆ డ్రైవర్ గాన్ని వదలకూడదు. ఆ అమ్మాయి ఆచూకీ తెలుసుకుని ఆ గొయ్యిలో పాతిపెట్టాలి అని పాండు అంటాడు.

ఇతను మా రంగా బావా

మరోవైపు నిన్ను పట్టుకుని రిషి సార్ అంటుందేంట్రా అని రంగాను అడుగుతుంది రాధమ్మా. నిద్రలో రిషి సార్ అని కలవరించిన వసుధార లేచి హాల్లోకి వస్తుంది. రిషిని వసు పట్టుకోబోతుంటే సరోజ అడ్డుకుంటుంది. పదే పదే రిషి సార్ అంటున్నావ్. ఇంతకీ ఎవరతను అని రాధమ్మ అడుగుతుంది. రిషి సార్ నా ప్రాణం. నా భర్త అని వసు అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. రిషి సార్ నీ భర్త. కానీ, ఇతను రంగా నా బావా అని సరోజ అంటుంది.

ఎందుకు అబద్ధం చెబుతున్నారని వసుధార అంటే.. అమ్మో ఇది నా బావను భర్త చేసుకునేలా ఉంది. నీ భర్త నీ దగ్గర లేకుండా ఇక్కడ ఎందుకు ఉంటాడు అని సరోజ అంటుంది. కాలం పగపట్టింది. రాక్షసులు మమ్మల్ని విడదీశారు. ఆయన్ను వెతుక్కుంటూ వస్తుంటేనే ఇలా జరిగింది. అప్పుడే రిషి సార్ నన్ను కాపాడాడు అని వసుధార అంటుంది. నిన్ను కాపాడింది నా బావే అని అక్కడున్న వాళ్ల గురించి చెబుతుంది సరోజ.

నేను తన రిషి సార్‌నే

ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు అని రంగా దగ్గరికి వెళ్లి మీరైనా చెప్పండి. నేను మీకు గుర్తు ఉన్నాను కదా. లేదా అలిగారా అని అడుగుతుంది వసుధార. అడుగుతుంది కదా బావ చెప్పు అని సరోజ అంటుంది. నేను.. అని రంగా ఆగిపోతే.. అలా ఆగిపోతావేంటీ బావ చెప్పు అని సరోజ అంటుంది. నేను తన రిషి సారునే అని రంగా అంటాడు. దాంతో అంతా షాక్ అయితే.. వసుధార సంతోషపడుతుంది. బావ. నువ్ అబద్ధం చెబుతున్నావ్ అని సరోజ కోపంగా అంటుంది.

లేదు. నేను అబద్ధం చెప్పట్లేదు. తన రిషి సార్‌నే. అవును నానమ్మా నేను తన భర్తనే. మీ మనవడిని కాదు అని రంగా అంటాడు. దాంతో రంగాను గట్టిగా హగ్ చేసుకుంటుంది వసుధార. అంతా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner