Guppedantha Manasu June 15th Episode: గుప్పెడంత మనసు- రంగా రిషి కాదని తెలుసుకున్న వసుధార- శైలేంద్రను మోసం చేసిన రౌడీలు-guppedantha manasu serial june 15th episode vasudhara knows ranga is not rishi guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu June 15th Episode: గుప్పెడంత మనసు- రంగా రిషి కాదని తెలుసుకున్న వసుధార- శైలేంద్రను మోసం చేసిన రౌడీలు

Guppedantha Manasu June 15th Episode: గుప్పెడంత మనసు- రంగా రిషి కాదని తెలుసుకున్న వసుధార- శైలేంద్రను మోసం చేసిన రౌడీలు

Sanjiv Kumar HT Telugu
Jun 15, 2024 09:05 AM IST

Guppedantha Manasu Serial June 15th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూన్ 15వ తేది ఎపిసోడ్‌లో రంగా తన రిషి కాడని తెలుసుకున్న వసుధార మళ్లీ కుప్పకూలిపోతుంది. మరోవైపు రౌడీలు శైలేంద్రను మోసం చేస్తారు. మను తండ్రి మహేంద్రే అని దేవయాని, శైలేంద్ర తెలుసుకుంటారు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూన్ 15వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూన్ 15వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో దెబ్బ తగిలిన వసుధారను ఆటో డ్రైవర్ రంగా తన ఇంట్లో ఉంచి ట్రీట్‌మెంట్ ఇస్తాడు. లేచిన వసుధార రిషి సార్ అంటుంది. అది విని అంతా షాక్ అవుతారు. లేచిన వసుధార రంగాను సంతోషంతో హగ్ చేసుకుంటుంది. అంతా అవాక్కయి చూస్తారు.

బావను ముట్టుకుంటారేంటీ

నాకు తెలుసు సార్. మీరున్నారని నాకు తెలుసు. నా నమ్మకం నిజమైంది అని వసుధార అంటుంది. దాంతో ఎవరండి మీరు. నేను రంగను. రిషి సార్ ఏంటండి. నేను రంగను. ఆ రౌడీల నుంచి కాపాడాను. గుర్తు లేదా అని రంగ అంటాడు. మళ్లీ రిషి అంటూ హగ్ చేసుకుంటే పక్కనున్న వాళ్లు ఆపుతారు. నా బావను ముట్టుకుంటారేంటీ అని రంగా మరదలు అంటుంది. దాంతో వసుధార షాక్ అయి చూస్తుంది. అంతా మా రంగా అంటారు.

దాంతో వసుధారకు తలతిరుగుతుంది. మళ్లీ వసుధారను మంచంపై పడుకోబెడతాడు రంగా. అదేంటీ అలా పట్టుకుంటుందేంటీ. ఎవరైనా సరే తలకు దెబ్బ తగిలితే గతం మర్చిపోతారు. ఈవిడేంటీ కొత్త వాళ్లను తన వాళ్లు అనుకుంటుంది అని రంగా మరదలు సరోజా అంటుంది. తర్వాత అంతా వెళ్లిపోతారు. దీంతో జాగ్రత్తగా ఉండాలని సరోజ అనుకుంటుంది. మరోవైపు శైలేంద్ర కంగారుపడుతూ పాండుగాడి ఫోన్ కోసం ఎదురుచూస్తుంటాడు.

బిజినెస్ పార్టనర్‌కు

రిషి గాడి లాగే వసుధార మట్టిలో కలిసిపోతేనే నాకు మనశ్శాంతి అనుకుంటూ కాల్ చేస్తుంటాడు శైలేంద్ర. అది ధరణి చూస్తుంది. ఈయన కంగారుగా ఫోన్ చేస్తున్నారంటే మళ్లీ ఏదో ఎధవ పని చేస్తున్నారని అర్థం అని శైలేంద్ర దగ్గరికి వెళ్తుంది ధరణి. ఏం చేస్తున్నారండి అని అడుగుతుంది. ఏం చెప్పిన రచ్చ రచ్చ చేస్తుంది అని శైలేంద్ర అనుకుంటాడు. ఫోన్ ఎవరికీ చేస్తున్నారని ధరణి అడిగితే.. బిజినెస్ పార్టనర్‌కు ఫారెన్‌లో బిజినెస్ పార్టనర్‌కు అని శైలేంద్ర అంటాడు.

వాళ్లకు అక్కడ రాత్రి కదా అండి. మిస్‌డ్ కాల్ చూసుకుని వాళ్లే చేస్తారని ధరణి అంటుంది. చాలా ఇంపార్టెంట్ కాల్. లావాదేవులు ఉన్నాయి. కొన్ని లెక్కలు చూసుకోవాలి అని శైలేంద్ర అంటాడు. లెక్కలు అంటే ఎవరికో హానీ చేస్తున్నారా అని ధరణి అనుకుంటుంది. కాఫీ, వాటర్ అంటూ శైలేంద్రను విసిగిస్తుంది ధరణి. దాంతో చేతులెత్తి మొక్కి వెళ్లమంటాడు శైలేంద్ర. మిమ్మల్ని వదిలి వెళ్లాలంటే కష్టంగా ఉంది. మీరు వచ్చేదాకా ఇక్కడే ఉంటానని అంటుంది ధరణి.

వసుధారను చూడాలి

కోపం తెప్పించకు వెళ్లమని శైలేంద్ర గట్టిగా అనడంతో ధరణి వెళ్లిపోతుంది. మరోవైపు రౌడీలు గొయ్యి తీసు మిగతా రౌడీలు ఇంకా రాలేదని కంగారుపడిపోతుంటారు. ఆ రౌడీలు ఒక బొమ్మకు చీర కట్టి తీసుకొస్తారు. ఇంతలో శైలేంద్ర కాల్ చేసి ఏమైందని అడుగుతాడు. పని మధ్యలో ఉన్నామని, డిస్టర్బ్ చేయకండని చెబుతాడు రౌడీ. వసుధారను చూడాలని, వీడియో కాల్ చేస్తానంటాడు శైలేంద్ర. ఇందాకే కదా కారులో చూపించాను. మళ్లీ ఏంటీ సార్ అని రౌడీ అంటాడు.

వసుధారకు చివరిసారిగా కన్నిటీ వీడ్కోలు చెబుదామని. ఒక్కసారి చూపించురా అని శైలేంద్ర అంటాడు. సరేనని అంటాడు రౌడీ. శైలేంద్ర వీడియో కాల్ చేసే లోపల వాళ్లు బొమ్మను ఫేస్ కనిపించకుండా మట్టి కప్పుతారు. తర్వాత వీడియో కాల్‌లో అది వసుధారల లేదని, బొమ్మలా ఉందని, ఒక ఫొటో తీసి పంపించమని శైలేంద్ర అడుగుతాడు. ఆమె కుందనపు బొమ్మలాగే ఉంటుంది. మీరు చెప్పారని చంపాం అంతే. ఫొటో తీస్తే అది వెంటనే బ్యాకప్ అవుతుంది. అది ఎవరైన చూస్తే ఇద్దరం ఇరుక్కుంటాం అని రౌడీ కవర్ చేస్తాడు.

దూరం జరుగు

సరే జాగ్రత్త అని శైలేంద్ర కాల్ పెట్టేస్తాడు. కట్ చేస్తే ఇంట్లో అందరిని పిలిచి తల స్నానం చేయమని చెబుతాడు శైలేంద్ర. ఎందుకు చేయమంటున్నావ్ అని దేవయాని అడిగితే.. నీకో శుభవార్త చెబుతాను అని శైలేంద్ర అంటాడు. ఇప్పుడు నువ్ స్నానం చేయమంటుంది ఆ శుభవార్త కోసమేనా. అది ముందే చెప్పు అని దేవయాని అడుగుతుంది. దాంతో ధరణిని దూరం జరగమని చెప్పిన శైలేంద్ర.. వసుధరా లేదు మమ్మీ అని శైలేంద్ర అంటాడు.

తను లేకపోతే మనం స్నానం చేయడమేంట్రా అని దేవయాని అంటుంది. లేదు అంటే.. భూమ్మీద లేదు. రాత్రికి రాత్రే స్కెచ్ వేశాను. స్కేచ్ ప్రకారం లేపేశాను. దానికి నూకలు చెల్లిపోయాయి. నీతో ముందుగా చెపితే వర్కౌట్ కావట్లేదు. అందుకే చెప్పలేదు. కావాలంటే ఈవెనింగ్ వాక్‌కు వెళ్లి డెడ్ బాడీని చూసొద్దాం. సిటీ అవుట్ స్కర్ట్‌లో ఉందని శైలేంద్ర అంటాడు. ఏంటండి స్కెచ్, కప్పట్టేశారని ధరణి అడుగుతుంది. నువ్ వినకు అని చెప్పాను కదా అని శైలేంద్ర అరుస్తాడు.

స్కెచ్ గురించి అన్నారు

ఇంతలో వచ్చిన ఫణీంద్ర ఏంట్రీ నీ స్నానాల గోల. ఎందుకు చేయమని అంటున్నావని ఫణీంద్ర అడుగుతాడు. దాంతో శైలేంద్ర సైలెంట్‌గా ఉంటాడు. ఏంట్రా ఏం చెప్పాలో అనుకోలేద అని అడిగిన దేవయాని గ్రహాలు, ఇవాళ చేస్తే మంచిదని కవర్ చేస్తుంది. కుళ్లుకుతంత్రాలు మనుసులో ఉంటే స్నానం చేస్తే మంచి జరుగుతుందా అని ఫణీంద్ర ఫైర్ అవుతాడు. అంతేనా అని ఫణీంద్ర అడిగితే.. లేదు మావయ్య. ఏదో స్కెచ్ అని అన్నారని ధరణి బుక్ చేస్తుంది.

దాంతో స్కెచ్ ఏంటని ఫణీంద్ర అడిగితే.. కాలేజీ బాగు కోసం స్కెచ్ వేస్తాను అని చెబుతున్నాను అని శైలేంద్ర అంటాడు. నువ్ చెడగొట్టకుండా ఉంటే చాలు అని ఫణీంద్ర అంటాడు. మీరు స్నానం చేయడం మర్చిపోకండి అని దేవయాని అంటే.. సరే చస్తాను అని ఫణీంద్ర వెళ్లిపోతాడు. మీరెందుకు చావడం ఆల్రెడీ వసుధార చచ్చింది కదా అని దేవయాని అనుకుంటుంది. తర్వాత అంతా వెళ్లిపోతారు. కట్ చేస్తే.. దేవయాని షాక్ అవుతూ.. ఏంటీ మను మహేంద్ర కొడుకా అని అడుగుతుంది.

మను తండ్రి మహేంద్రే

నువ్ చెబుతుంది నిజమేనా, నాకు నమ్మకం కలగట్లేదు అని శైలేంద్రతో దేవయాని అంటుంది. నేను కూడా నమ్మలేదు. కానీ, వసుధారే లెటర్ రాసి పెట్టింది అని శైలేంద్ర చెబుతాడు. దాంతో ఏది ఆ లెటర్ అని దేవయాని అడిగితే.. తీసి చూపిస్తాడు. వసుధార రాసింది దేవయాని చదువుతుంది. మీ తండ్రి ఎవరో కాదు మా మావయ్య. మహేంద్ర భూషణ్ గారే మీ తండ్రి. ఇంతకంటే ఏం చెప్పలేను. మా మావయ్యను ఏమి చేయొద్దు అని వసుధార రాసింది దేవయాని చదువుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner