Guppedantha Manasu May 27th Episode: గుప్పెడంత మనసు- తండ్రిని కనిపెట్టమని కన్నతండ్రినే వేడుకున్న మను- మాటిచ్చిన మహేంద్ర-guppedantha manasu serial may 27th episode mahendra promise to manu finding real father guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu May 27th Episode: గుప్పెడంత మనసు- తండ్రిని కనిపెట్టమని కన్నతండ్రినే వేడుకున్న మను- మాటిచ్చిన మహేంద్ర

Guppedantha Manasu May 27th Episode: గుప్పెడంత మనసు- తండ్రిని కనిపెట్టమని కన్నతండ్రినే వేడుకున్న మను- మాటిచ్చిన మహేంద్ర

Sanjiv Kumar HT Telugu
May 27, 2024 09:17 AM IST

Guppedantha Manasu Serial May 27th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ మే 27వ తేది ఎపిసోడ్‌లో తన తండ్రి ఎవరో తెలుసా అని వసుధారను అడుగుతాడు మను. నిజం తెలిసిన వసుధార చెప్పకుండా తప్పించుకుంటుంది. అలాగే కొడుకు అయిన మనుకు మహేంద్ర మాటిస్తాడు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ మే 27వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ మే 27వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో తండ్రి గురించి తెలియదని సమాజంలో ఎలాంటి నిందలు, మాటలు పడేవాడో వసుధారకు చెప్పుకుని ఎమోషనల్ అవుతాడు మను. ఎలాగైనా నా తండ్రి గురించి తెలుసుకోకుండా ఉండను ఉండలేను అని మను అంటాడు. వసుధార ఏదో చెప్పబోతుంటే మను అడ్డుపడతాడు. దత్తతకు ముందు రోజు కాల్ చేసినప్పుడు వసుధార చెప్పిన మాటలను గుర్తు చేస్తాడు మను.

సమాధానం చెబుతానందా

నేను దత్తత కార్యక్రమానికి నేను రావడానికి రెండే రెండు కారణాలు. ఒకటి అనుపమ మేడమ్‌కు అది ఇష్టమని, రెండోది నేను అక్కడకు వస్తే నా తండ్రి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని. మీరు అనుపమ మేడమ్ గారితో నేను చెప్పిన విషయం గురించి చెప్పారా. నా బాధ వేదన అంతా అర్థమయ్యేలా చెప్పారా అని మను అడుగుతాడు. అడిగాను అని వసుధార చెబుతుంది. మరి అప్పుడు ఆమె ఏమంది. నా ప్రశ్నకు సమాధానం చెబుతానందా అని మను అంటాడు.

వసుధార సైలెంట్‌గా ఉండటంతో లేదన్నమాట. పోని మీకైనా చెప్పిందా. నా తండ్రి ఎవరో మీకైనా చెప్పిందా. మీకు తెలిస్తే నాకు చెప్పండి ప్లీజ్ అని మను రిక్వెస్ట్ చేస్తాడు. మను తండ్రి మహేంద్రే అనే విషయం గుర్తు చేసుకుంటుంది వసుధార. ఆ ప్రశ్న మోయలేకపోతున్నాను. సమాధానం కోసం నా మనసు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. అప్పుడు నా మనసు స్థిమితంగా ఉండటం లేదని తన ఆవేదన చెప్పుకుంటాడు మను. నా తండ్రి ఎవరో తెలుసా తెలీదా అని స్ట్రెస్ చేసి అడుగుతాడు.

ఎవరి కోసం దాస్తున్నారు

వసుధార మౌనంగా ఉండటంతో.. మీరు మౌనంగా ఉన్నారంటే మీకు సమాధానం తెలుసున్నమాట. మీరు కూడా ఇలా మౌనంగా ఉండి నన్ను ఇంకా వేధించకండి మేడమ్. ప్లీజ్ మేడమ్ మీరైనా నా తండ్రి ఎవరో చెప్పండి అని మను అడిగితే.. వసుధార సడెన్‌గా వెళ్లిపోతుంది. మను పిలిచినా ఆగదు. చూస్తుంటే మీకు నా తండ్రి ఎవరో తెలుసనిపిస్తుంది. కానీ, మీరు ఆ నిజాన్ని ఎందుకు, ఎవరి కోసం దాచిపెడుతున్నారో నాకు తెలుసు అని మను అనుకుంటాడు.

కట్ చేస్తే వసుధార చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు మను. ఇంతలో జ్యూస్ తీసుకుని వస్తుంది మను బామ్మ. ఇప్పుడేం వద్దని మను అంటాడు. ఎందుకు ఓల్డీ నాకే ఇలా జరుగుతుంది. నాలాంటి సమస్య ఎవరికీ ఉండదు. ఏళ్లుగా ఇలా సమస్య ఉండదు. నా తండ్రి ఎవరో తెలియనందుకు నా మీద నాకే జాలి వేస్తుంది. ఇన్నాళ్లు తెలియనందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నా తండ్రి గురించి ఎవరెవరికో తెలుసు. కానీ నాకు తెలియదు అని మను ఆవేశంగా ఊగిపోతూ అంటాడు.

నీకెలా తెలుసు

ఎవరికీ తెలుసు అని బామ్మ అడుగుతుంది. ఆ వసుధార మేడమ్‌కు తెలుసు అని మను చెబుతాడు. దాంతో బామ్మ షాక్ అవుతుంది. వసుధారకు తెలుసని నీకెలా తెలుసని బామ్మ అడుగుతుంది. అదేంటీ అలా అడిగావ్. వసుధారకు తెలుసని నీకెలా తెలుసు. ఎందుకు ఎగ్జైట్ అవుతున్నావ్ అని మను అడుగుతాడు. దాంతో దొరికిపోయేలా ఉన్నానని నాది కాదు నీకు యాంగ్జైటీ.. నీ తండ్రి గురించి తనకు తెలుసని నీకెలా తెలుసు అని బామ్మ అడుగుతుంది.

లాస్ట్ టైమ్ మాట్లాడినప్పుడు డౌట్ వచ్చింది. అదే విషయం అడిగితే.. తను సైలెంట్‌గా ఉంది. అందుకే తనకు తెలుసు అని కన్ఫర్మ్ చేసుకున్నాను అని మను అంటాడు. సైలెంట్‌గా ఉంటే తెలుసు అని ఎలా అనుకుంటావ్. తెలిస్తే తెలుసు అని చెప్పేది కదా అని బామ్మ అంటుంది. ఏదైనా సమస్య ఉండి చెప్పడం లేదో అని మను అంటాడు. నా జీవితం ఎందుకు ఇలా ఉంటుందో అని బాధేస్తుంది. నీకు తెలుసు కదా నా తండ్రి ఎవరో. నువ్వెందుకు చెప్పడం లేదు అని మను అంటాడు.

బాగా అర్థం అవుతోంది

అదేంటీ నాన్న మన మధ్య ఒప్పందం ఉంది కదా. నువ్ అడగకూడదని ఒప్పందం పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం కలిసి ఉన్నామంటే ఆ ఒప్పందం వల్లే కదా. దాన్ని మనం దాటలేం అని బామ్మ అడుగుతుంది. అంతే మీరు ఎవరు చెప్పకండి. మీరు మీ పరిధిలో బాగానే ఉన్నారు. కానీ, నలిగిపోయేది నేను. కానీ ఒక్కటి మాత్రం నాకు బాగా అర్థం అవుతోంది. నా తండ్రి ఎవరో నాకు తెలిసే క్షణాలు దగ్గర్లోనే ఉన్నాయని తెలుస్తోంది అని మను అంటాడు.

ఎందుకు నాన్న నీకు ఇన్ని కష్టాలు. మహేంద్ర నీకు తండ్రిలాగా ఉంటాడని చెప్పాడు కదా. ఇంకెందుకు వేరే వారి గురించి వెతుకుతావ్ అని బామ్మ చెబుతుంది. అంత సింపుల్‌గా ఎలా చెబుతావ్ ఓల్డీ. వేరే వాళ్లను తండ్రిని ఎలా అనుకోను. కానీ, మహేంద్ర గారి గురించి చెప్పి నాకు మంచి ఐడియా ఇచ్చావ్. నా తండ్రి ఎవరో తెలుసుకునే దారి దొరికింది అని మను అంటాడు. ఏంటీ నాన్న అది అని బామ్మ అడిగితే.. చెబుతా.. వెయిట్ అండ్ సీ అని వెళ్లిపోతాడు మను.

ఎలాంటి చలనం లేదు

మరోవైపు శైలేంద్ర కావాలనే మనును రెచ్చగొడుతున్నాడు, మానసికంగా వేధిస్తున్నాడు. దాంతో మను ఎంత వేదనకు గురి అవుతున్నాడో మహేంద్రకు వసుధార చెబుతుంది. వాడు ఎలా మాట్లాడుతాడో కాన్ఫరెన్స్‌లోనే చూశాను. శైలేంద్ర ఒక శాడిస్ట్. ఆరోజు మను బాధ చూసే కదా ఇంటికొచ్చి అనుపమపై సీరియస్ అయింది. కానీ, ఆమెలో ఎలాంటి చలనం లేదు. ఇక మను బాధపడటంలో లాభం ఏముంది. అందుకే శైలేంద్రకు మను ఎంత దూరం ఉంటే అంత మంచిది అని మహేంద్ర అంటాడు.

చెప్పినంత ఈజీకాదు దూరంగా ఉండటం. తండ్రి ఎవరో చెప్పకుండా కన్నతల్లి వేధిస్తుంది. పాపం తండ్రి పక్కనే ఉన్నా తెలుసుకోలేని అభాగ్యుడు అని వసుధార అంటుంది. దాంతో మహేంద్ర, అనుపమ షాక్ అవుతారు. ఏంటీ వసుధార నువ్ అనేది అని మహేంద్ర అడిగితే.. తేరుకుంటుంది వసుధార. షాక్ అవుతుంది. తన తండ్రి తన పక్కనే ఉన్నాడంటున్నావేంటీ అని మహేంద్ర అంటాడు. తండ్రి లాంటి మీరు పక్కన ఉండగా తెలుసుకోలేకపోతున్నారు అని వసుధార చెబుతుంది.

రుణపడి ఉంటాను

నేను అదే మాట్లాడదామని వచ్చాను అని మను ఎంట్రీ ఇస్తాడు. మీరు నన్ను కొడుకులా భావిస్తున్నానని చెప్పారు కదా. చూశారు కూడా. మీకొడుక్కి తొడగాల్సిన కంకణం నాకు తొడిగారు. తండ్రి పేరు చెప్పలేక అందరిముందు తలదించుకున్న నాకు మీరే తండ్రి అని చెప్పారు. అవమానాలన్నీ దూరం చేయడానికి దత్తత తీసుకుందామనుకున్నారు అని జరిగిన విషయాలు చెబుతాడు మను. ఇన్ని రకాలుగా సాయం చేసిన మీరు నాకు ఇంకొక్క సహాయం చేయండి. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని మను అడుగుతాడు.

ఏం సాయం మను చెప్పు అని మహేంద్ర అంటాడు. నా నిజమైన తండ్రి ఎవరో మీరు కనిపెట్టాలి సార్ అని మను అంటాడు. దాంతో వసుధార, అనుపమ షాక్ అయి లేస్తారు. మీరు నా తండ్రి కావడమనేది తాత్కాళికమే. నా నిజమైన బాధను పోగొట్టాలంటే మీరు నా నిజమైన తండ్రి ఎవరో చెప్పాలని మను అంటాడు. కానీ, మను నాకు ఎవరో తెలియదు కదా అని మహేంద్ర అంటాడు. అందుకే సార్.. కనుక్కుని చెప్పమంటున్నాను అని మను అంటాడు.

ఇంకెవరిపై ఉంటుంది

ఏంటీ మను అలా అంటావ్. మహేంద్ర ఎందుకు కనుక్కోవడం అని అనుపమ అంటుంది. మీరు ఎలాగు చెప్పరు కదా. అందుకే నా దారి నేను వెతుక్కుంటున్నాను. మన అనే మనుషులు మూడు రకాలు సార్. కన్నీళ్లు పెట్టేవాళ్లు.. కన్నీళ్లు తుడిచేవారు.. కన్నీళ్లే రాకుండా సంతోషంగా చూసేవాళ్లు. నాకు మీద అలాంటి నమ్మకం ఉంది అని మను అంటాడు. కన్నతండ్రిపైన కాకుంటే ఇంకెవరిపై నమ్మకం ఉంటుంది అని మనసులో అనుకుంటుది వసుధార.

ఆకలి తీర్చేవాడి దగ్గరే కదా సార్ చేతులా చాచేది అని కన్నతండ్రి ఎవరో తెలుసుకోమ్మని చేతులు చాచుతాడు మను. నా తండ్రి గురించి తెలుసుకునేందుకు ఎంతోమంది దగ్గర ప్రాధేయపడ్డాను. బెదిరించాను. కాళ్లా వేల్లా పడ్డాను. చివరి ఆశగా మీ దగ్గరికి వచ్చాను. ఒక కొడుకులా అడుగుతున్నాను. నా నిజమైన తండ్రిని కనిపెట్టి తీసుకురండి. చెప్పండి సార్ తీసుకువస్తారా అని మను అడుగుతాడు. తీసుకొస్తాను మను అని మహేంద్ర అంటాడు.

మాటిచ్చిన మహేంద్ర

తీసుకోని వస్తానని ప్రామిస్ చేసి చెప్పండి సార్ అని మను చేయి చాపుతాడు. వసుధార, అనుపమ కంగారుపడిపోతుంటారు. చేతిలో చేయి వేసి మహేంద్ర మాట ఇస్తాడు. మను కన్నతండ్రిని వెతికి తీసుకొస్తానని మహేంద్ర మాట ఇస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.