Guppedantha Manasu April 22nd Episode: గుప్పెడంత మనసు- అనుపమను వేధించిన వసుధార.. మను తండ్రి ఎవరో చెప్పనున్న పెద్దమ్మ-guppedantha manasu serial april 22nd episode vasudhara commands anupama on manu father guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu April 22nd Episode: గుప్పెడంత మనసు- అనుపమను వేధించిన వసుధార.. మను తండ్రి ఎవరో చెప్పనున్న పెద్దమ్మ

Guppedantha Manasu April 22nd Episode: గుప్పెడంత మనసు- అనుపమను వేధించిన వసుధార.. మను తండ్రి ఎవరో చెప్పనున్న పెద్దమ్మ

Sanjiv Kumar HT Telugu
Apr 22, 2024 09:08 AM IST

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఏప్రిల్ 22వ తేది ఎపిసోడ్‌లో మహేంద్ర-మను-అనుపమకు రాయబారిగా మారుతుంది వసుధార. మనును దత్తతకు ఒప్పించేందుకు వసుధార వెళ్తుంది. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఏప్రిల్ 22వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఏప్రిల్ 22వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Episode 1056: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో దత్తత కార్యక్రమానికి మను రాడని చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు మహేంద్ర. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమో మావయ్య. మీరు ఒకే కోణంలో ఆలోలిచించకండి మావయ్య. మీరు మనును దత్తత తీసుకుంటే ఎదురయ్యే పరిస్థితుల గురించి ఒక్కసారి ఆలోచించండి అని వసుధార అంటుంది.

లోకం ఆలోచించదు

ఆలోచించే తీసుకున్న అమ్మా. ఎలాంటి మార్పు లేదు అని మహేంద్ర అంటాడు. దీని వల్ల ఎలాంటి లాభం లేదేమో మావయ్య. అనుపమ గారు ఎప్పటికీ మను తండ్రి చెప్పరనిపిస్తుంది. అలాంటప్పుడు ఎందుకు అని వసుధార అంటుంది. నేను ఎందుకు చేస్తున్నానో నీకు ముందే చెప్పాను. మళ్లీ అడుగుతావేంటీ అని మహేంద్ర అంటాడు. అది నాకు అర్థం అవుతోంది. కానీ, లోకం అలా ఆలోచించదు కదా అని వసుధార అంటుంది.

లోకులు కాకులు. ఎదుటివాళ్ల పరిస్థితిని అర్థం చేసుకోదు. నాకు లోకంతో పని లేదు. నా స్నేహితురాలికి ఈ లోకం ఆలోచించదు. ఇంకా సూటిపోటి మాటలతో వేధిస్తారు. అలాంటి లోకంతో నాకు పనేంటి. మన చుట్టువాళ్లు ఏం ఆలోచిస్తున్నారో ఆలోచిస్తే ఏ పని చేయలేం. చేసేదాంట్లో న్యాయం ఉంటే చాలు అని మహేంద్ర అంటాడు. అది కాదు అని వసుధార అంటే.. ఇదంతా చేస్తుంది మను తండ్రి ఎవరో అనుపమ చెబుతుందని. అలా జరగకుంటే నేనే మను తండ్రి స్థానంలోకి వెళ్తాను అని మహేంద్ర అంటాడు.

పుట్టెండు దుఖంలో

నువ్ చెప్పు నేను చేస్తుంది తప్పా. నీకు ఏమనిస్తుంది అని మహేంద్ర అడుగుతాడు. తప్పు కాదు మావయ్య. కానీ దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని వసుధార అంటుంది. నాకు మనును చూస్తే పరాయివాడిలా అనిపించట్లేదు. మనకు సాయం చేస్తున్నట్లు అనిపించలేదు. ఒక కొడుకుగా తన బాధ్యత నెరవేరుస్తున్నట్లు ఉంది అని మహేంద్ర అంటాడు. రిషి ఎక్కడున్నాడో తెలియని పుట్టెడు దుఖంలో ఉన్న నాకు మను కనిపించాడు. తను మాట్లాడుతుంటే రిషితో మాట్లాడినట్లు, తను నాతో ఉన్నట్లు అనిపిస్తుందని మహేంద్ర అంటాడు.

తన తండ్రి గురించి అంతా అంటే మను పడే వేదన చూసి తట్టుకోలేకపోయాను. నాకు అర్థం కానీ విషయం ఏంటంటే మను అంతలా బాధపడితే నాకు ఎందుకు అంత బాధగా అనిపించింది. తనను అన్న ప్రతి మాట నా కళ్ల ముందు ఎందుకు కదలాడింది. అందుకే నేను ఇలా చేస్తున్నాను అని మహేంద్ర అంటాడు. కానీ, మను దత్తతకు ఒప్పుకోవట్లేదు కదా అని వసుధార అంటే.. అదేకదా నా బాధ. నాకు ఒక సహాయం చేస్తావా అని వసుధారను అడుగుతాడు మహేంద్ర.

ఒంటరిగా ఉండటం

మను దత్తత కార్యక్రమానికి వచ్చేలా చేస్తావా. ఎలా అయినా వచ్చేలా చేస్తావా. దీనికి ఎలాంటి ఆటంకాలు జరగకూడదు. చెప్పమ్మా తీసుకొస్తావా అని మహేంద్ర అడుగుతాడు. దాంతో వసుధార సైలెంట్‌గా ఉంటే.. మహేంద్ర కూడా మౌనంగా ఉండిపోతాడు. మరోవైపు తాళిని చూస్తూ వసుధార గురించి ఆలోచిస్తాడు రాజీవ్. నేను ఏం చేసిన ఈ తాళీ నీ మెడలో పడట్లేదు. నువ్ దానివి అవ్వట్లేదు. నువ్ ఒంటరిగా ఉండటం చూడలేకపోతున్నాను అని రాజీవ్ అనుకుంటాడు.

నిన్ను సొంతం చేసుకోవడం పక్కన పెడితే.. ఈ మధ్య నీ మొహం చూడటం కూడా కరువైపోయింది అని రాజీవ్ అనుకుంటుండగా.. పక్క నుంచి కారులో వసుధార వెళ్తుంది. వసుధారను రాజీవ్ చూస్తాడు. దేవుడా.. ఏంటీది.. ఏంటీ వింత. నేను తలుచుకోడం. నా మరదలు పిల్ల కనపడటమా. నమ్మలేకపోతున్నానే. దేవుడా ఉన్నావ్. నావైపే ఉన్నావ్. వసుధార మన మధ్య ఏదో కనెక్షన్ ఉంది. నా ఇంటెన్షన్ తప్పు కానీ, నా ప్రేమ మాత్రం నిజం. అవును నా మరదలు ఒంటరిగా ఏ పని మీద వెళ్తుంది అని రాజీవ్ అనుకుంటాడు.

ప్రాణాలు ఇవ్వగలను

నేను ఇప్పుడు తనను ఫాలో అయి అక్కడ సిచ్యువేషన్ చూద్దాం. ఒకవేళ పరిస్థితులు అనుకూలిస్తే వసు నాకు సొంతం అవుతుందేమో అని రాజీవ్ ఫాలో అవుతాడు. మనును వసుధార కలుస్తుంది. మళ్లీ ఇప్పుడు రాయబారానికి వచ్చారా. ఇంతకుముందు సత్యనారాయణ గారి విషయంలో అదే చేశారు. నాకు ఆ దత్తత ఇష్టం లేదు. గట్టిగా చెబితే ఆయన చనిపోతానని అంటున్నారు. ఎలా చెప్పగలను. ఆయన కోసం ప్రాణాలు అయిన ఇవ్వగలను. కానీ, ఇలా మాత్రం చేయలేను అని మను అంటాడు.

ఇన్నాళ్లు పడిన బాద దత్తత కాగానే పోతుందా. నేను ప్రశాంతంగా ఉండగలనా. ఉండలేను. నా కన్నతండ్రి ఎవరో తెలిసేంతవరకు నా మనసు ఆరాటపడుతూనే ఉంటుంది. నేను ఈ క్షోభ అనుభవిస్తూనే ఉంటాను అని మను అంటే.. అది కాదండి అని వసుధార అంటుంది. ఈ దత్తత పక్కన పెట్టండి. ఏ కొడుక్కి అయినా తన తండ్రి ఎవరో చెప్పకుండా ఉంటారా అని మను అంటాడు. దీనంతటికి కారణం అనుపమ మేడమ్. మీకు విషయం చెప్పకుండా తప్పు చేస్తున్నారు అని వసుధార అంటుంది.

క్షోభ పెట్టకని చెప్పండి

మేడమ్ మా అమ్మను తప్పుపట్టకండి. తను చెప్పట్లేదంటే ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది. గట్టిగా అడిగినందుకు నన్ను దూరం పెట్టారు. నేను కొడుకునే కదా. నాకు చెప్పొచ్చు కదా. నోరారా అమ్మ అని పిలవలేకపోయాను. నా తండ్రి చెడ్డవాడు అయితే చెడ్డవాడని చెప్పమనండి, ఎలాంటి వాడు అయినా చెప్పమనండి. చనిపోయి ఉంటే.. చనిపోయాడని చెప్పమనండి. కానీ, ఇలా నన్ను మౌనంగా క్షోభ పెట్టకని చెప్పండి అని మను ఎమోషనల్ అవుతాడు.

అందరూ నా తండ్రి గురించి అంటే వేలకొద్ది గునపాలు నా గుండెను కోసినట్లు అయింది. నా తండ్రి ఎవరో చెప్పమని మేడమ్‌ని అడుగుతారా చెప్పండి అని మను అనేసి వెనక్కి చూసేసరికి వసుధార కారులో వెళ్లిపోతుంటుంది. అది చూసి మను షాక్ అవుతాడు. అదంతా పక్కనే ఉన్న రాజీవ్ వింటాడు. అసలు విషయం ఇదా. బాగానే రాయాబారాలు చేస్తోంది. అందరి బాధను అర్థం చేసుకుంటున్నావ్ కానీ, నా బాధను అర్థం చేసుకోవట్లేదు అని రాజీవ్ అనుకుంటాడు.

పసితనంలో దొరికాడు

అనుపమ దగ్గరికి వెళ్లిన వసుధార మను దత్తత గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మను అమ్మనాన్నల గురించి నాకు తెలిసిపోయింది అని వసుధార అంటుంది. దాంతో షాక్ అయిన అనుపమ.. లేచి నిలబడి.. వాట్ అని అంటుంది. మను తండ్రే కాదు.. తన తల్లి కూడా ఎవరో మీకు తెలియదు కదా. మను ఒక అనాథ. తను పసితనంలో మీకు ఎక్కడో దొరికాడు. అప్పటి నుంచి మీరే అన్ని అయి పెంచుతున్నారు. అందుకే తన తండ్రి గురించి అడిగినందుకు దూరం పెట్టారు అని వసుధార అంటుంది.

మను అనాథ అని చెబితే.. బాధపడతాడని మీరు నిజం చెప్పట్లేదు కదా అని వసుధార అంటుంది. అలా అని ఎవరు చెప్పారు నీకు అని అనుపమ అంటుంది. తన తండ్రి గురించి క్షణం క్షణం ఆలోచిస్తూ మదన పడుతున్నాడు. అదే ఇప్పుడు ఈ విషయం చెప్పారనుకోండి.. తన బాధకు విముక్తి కలుగుతుంది. మీకు ఎలాంటి మచ్చ రాదు అని వసుధార అంటుంది. వసుధార చాలు ఆపుతావా అని అనుపమ అంటుంది.

ఇంకెవరికి చెప్పొద్దు

మేడమ్ ప్లీజ్.. కొంచెం నా మాట వినండి. మను అనాధ అని చెబితే అన్ని చక్కబడతాయని వసుధార అంటుంది. వాడు అనాథ అని ఎవరన్నారు. మను అనాథ కాదు అని అనుపమ అంటే.. మరి మను తండ్రి ఎవరు చెప్పండి మేడమ్.. తన తల్లి మీరైతే తన తండ్రి ఎవరు అని వసుధార అంటుంది. నీకెందుకు చెప్పాలని అనుపమ అంటుంది. సరే నాకు అవసరం లేదు. మను గారికి చెప్పండి. ఆయనకు చెబితే ఇంకెవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని వసుధార అంటుంది.

ఎవరికీ ఎప్పుడు ఏం చెప్పాలో నాకు తెలుసు. ఒకరు చెప్పే పరిస్థితిలో లేను అని అనుపమ అంటే.. మను తండ్రి ఎవరో చెప్పరా అని వసుధార అంటుంది. చెప్పను అని అనుపమ అంటుంది. ఎందుకు మీకు కూడా తెలియదా అని వసుధార అంటే.. గట్టిగా అరుస్తుంది అనుపమ. ఎందుకు మేడమ్ అరుస్తున్నారు. బాధగా ఉందా. ఇలాంటి ప్రశ్నలే మను గారు ఎదుర్కొంటుంటే ఎలా ఉంటుందో తెలుస్తోందా. ఇలాంటి కన్నతల్లి ఎక్కడా ఉండదు. ఇంత మొండిగా ఎందుకు ఉంటున్నారు వసుధార అంటుంది.

బతికే ఉన్నాడు

మను విషయంలో తప్పు ఎక్కడ జరిగింది.. లేదంటే మను తండ్రి చనిపోయారా అని వసుధార అడుగుతుంది. వసుధార ఏంటీ నువ్ మాట్లాడేది అని అనుపమ అంటుంది. అవును మేడమ్. మను తండ్రి చనిపోయి ఉంటారు. అందుకే మీరు చెప్పట్లేదు. ప్రతిసారి ఇదే మాట అంటాను. మను వాళ్ల నాన్న లేరు చనిపోయారు. చనిపోయారు.. చనిపోయారు అని వసుధార అంటుంది. లేదు బతికే ఉన్నాడు అని అనుపమ పెద్దమ్మ ఎంట్రీ ఇస్తుంది. దాంతో వసు, అనుపమ షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.