Guppedantha Manasu April 15th Episode: గుప్పెడంత మనసు- మను తండ్రి నేనే.. నిజం చెప్పిన మహేంద్ర.. శైలేంద్ర ప్లాన్ ఫెయిల్
Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఏప్రిల్ 15వ తేది ఎపిసోడ్‌లో మీటింగ్‌లో మను తండ్రి గురించి అంతా అడుగుతారు. దాంతో తానే మను తండ్రి అని చెప్పేస్తాడు మహేంద్ర. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Guppedantha Manasu Serial Episode 1050: గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో డీబీఎస్టీ కాలేజీలో పేరెంట్స్ లెక్చరర్ మీటింగ్ జరుగుతుంటుంది. ఒక్కో స్టూడెంట్‌ను, వాళ్ల తల్లిదండ్రులను పిలిచి అటెండెన్స్ ఎందుకు తక్కువగా ఉంటుంది, ఎందుకు కాలేజీకి రావట్లేదు, ఇలా చేస్తే డీటెన్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో వన్ ఇయర్ వేస్ట్ అవుతుందని హెచ్చరిస్తుంది వసుధార.
చెడు వదిలేయండి
కాలేజీ అంటే ఏదో అనుకుంటారు. ఎంజాయ్ మెంట్ అనుకుంటారు. కానీ అది కాదు. ఒక జాబ్ తెచ్చుకోండి. నలుగురు హెల్ప్ చేయండి. అందులో ఉంటుంది అసలైన ఎంజాయ్ మెంట్ అని మహేంద్ర అంటాడు. మీరు ఎప్పుడూ చదువుకోండి, సినిమాలు చూడకండి అని చెప్పం. సినిమాలు చూడండి. కానీ, అందులో మంచి తీసుకోండి. చెడు వదిలేయండి అని ఫణీంద్ర చెబుతాడు. ఇంకో స్టూడెంట్‌ను పిలిచి ఎందుకు అటెండెన్స్ తక్కువగా ఉందని వసుధార అడుగుతుంది.
వాళ్ల పేరెంట్స్ లేచి చెడు సావాసాలు ఎక్కువైతున్నాయి అని అంటారు. ఏదో ఒక కారణాలు చెప్పి కాలేజీకి సెలవు పెట్టొద్దు అని వసుధార అంటుంది. ఇలాగే ఒక్కో స్టూడెంట్‌ను పిలిచి వార్నింగ్ ఇస్తుంటారు. ఇంట్లో కష్టంగా ఉందని పనికి తీసుకెళ్తున్నాను అని ఓ స్టూడెంట్ తండ్రి అంటాడు. వాటిని ఏదోలా పరిష్కరించుకోవాలి కానీ, కొడుకును కాలేజీ మానిపిస్తారా. తండ్రి అంటే ఎలా ఉండాలి. కొడుకు వేసే ప్రతి అడుగులో తోడుగా ఉండాలి. దిక్సూచిలా మారాలి అని మను చెబుతాడు.
నాన్న గురించి చెప్పండి
ఎప్పుడూ భుజం తడుతూ ప్రోత్సహిస్తూ ఉండాలి అని మను అంటాడు. ఇంతలో శైలేంద్ర ఒకరి తండ్రికి సైగ చేస్తాడు. దాంతో అతను లేచి తండ్రి గురించి ఎంత గొప్పగా చెప్పారండి. మీ నాన్న గారు మిమ్మల్ని ఎంత గొప్పగా పెంచుంటే మీరంతా చక్కగా మాట్లాడుతారు. ఒకసారి మీ నాన్న గారి గురించి చెప్పండి సార్ అని అతను అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. మను మాత్రం కోపాన్ని అణుచుకుంటాడు. మేమంతా విని ఆదర్శంగా తీసుకుంటాం అని అతను అంటాడు.
శైలేంద్ర, వారి తండ్రి, రిషి తండ్రి మహేంద్ర, వసుధార తండ్రి చక్రపాణి అని చెప్పిన అతను మీ తండ్రిగారి పేరు ఏంటీ సార్ అని అతను అడుగుతాడు. హలో ఇప్పుడు వాళ్ల నాన్న గురించి ఎందుకు అని కావాలనే మధ్యలో దూరుతాడు శైలేంద్ర. మీ అందరి పేర్లు చెప్పాను. వాళ్ల తండ్రి పేరు కూడా చెప్పాలి కదా. వాళ్ల తండ్రి ఏం చేస్తారో చెబితే ఆదర్శంగా తీసుకుంటాం అని అతను అంటాడు. అలా ఏం అవసరం లేదు. మీరు మను గారికి కోపం తెప్పించే మాటలు మాట్లాడకండి అని శైలేంద్ర అంటాడు.
తండ్రి ఎవరో తెలియదట కదా
ఇందులో కోపం తెప్పించే మాటలు ఏమున్నాయండి. వాళ్ల నాన్న గురించి కదా అడిగింది అని అతను అంటే.. ఇంకొ స్టూడెంట్ తల్లి లేచి దాంట్లో తప్పేముంది అని అంటుంది. అయ్యో.. మీకు అర్థం కావట్లేదు అండి. మను గారికి వాళ్ల తండ్రి గారి గురించి తెలియదండి అని శైలేంద్ర అంటాడు. ఇంతలో లేచిన మరో స్టూడెంట్ తల్లి అవును నేను విన్నాను. ఆయనకు తన తండ్రి ఎవరో తెలియదట కదా అని అంటుంది. తండ్రి ఎవరో తెలియని వాడు తండ్రి బాధ్యతల గురించి ఎలా చెబుతాడు అని మరొకరు అంటారు.
ఆయనకు ఈ మాటలు ఏ తండ్రి చెప్పారో తెలియాలి కదా అని అతను అంటాడు. చూడండి అతనికి తన తండ్రి తెలియకపోవడం అతను దౌర్భాగ్యం అని దేవయాని అంటుంది. తల్లి కూడా తెలియదా అని అతను అంటే.. వాళ్ల భార్య ఉండి ఎందుకు లేదు. అనుపమ గారు అని చెబుతుంది. అంటే ఆవిడకు కూడా తండ్రి ఎవరో తెలియదా అని అతను అంటాడు. దాంతో చేతిలో ఉన్న ఫైల్ విసిరేసి రేయ్.. అని అరుస్తాడు మను.
మను తండ్రిని నేనే
మనును వసుధార ఆపుతుంది. శైలేంద్ర ఉండి కూల్ మను గారు అంటాడు. ఏంటండి మా మీద అరుస్తారు. నీతిగా లేని మీరు నీతులు చెబితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అని అతను అంటాడు. ఇక్కడ మీటింగ్ ఏంటీ నువ్ మాట్లాడుతుంది ఏంటీ అని ఫణీంద్ర అంటే.. అవును సార్. మీరు సరిగ్గా లేనప్పుడు నీతులు ఎలా చెబుతారు అని అతను అంటాడు. కొంతమందికి తండ్రి ఉండడు. కొందరికి చనిపోతాడు. పూర్తిగా ఏది తెలియకుండా ఎలా ఉంటుంది అని అతను అంటాడు.
దాంతో కోపంగా అవును నాకు తండ్రి లేడు అని మను చెప్పబోతుంటే.. తండ్రి ఉన్నాడు అని మహేంద్ర అరుస్తాడు. దాంతో అంతా షాక్ అవుతారు. అంతా లేచి నిల్చుంటారు. అందరూ మహేంద్రవైపే చూస్తారు. మనుకు తండ్రి ఉన్నాడు అని మహేంద్ర అంటే.. ఎవరు సార్ అని అతను అడుగుతాడు. ఎవరో కాదు నేనే అని మహేంద్ర చెబుతాడు. దాంతో అంతా మరింత షాక్ అవుతారు. అనుపమ, మను అలా చూస్తుండిపోతారు.
పర్సనల్స్ మీకు అవసరం లేదు
మనుకు తండ్రిని నేనే అని మరోసారి గట్టిగా చెబుతాడు మహేంద్ర. దాంతో స్టూడెంట్స్ తల్లిదండ్రులు చెవులు కొరుక్కుంటారు. మను నా కొడుకు. అందరికీ వినపడిందా. మళ్లీ చెప్పాలా. నేనే మను తండ్రిని అని మళ్లీ చెబుతాడు మహేంద్ర. అయితే, సార్ ఇన్ని రోజులు అని స్టూడెంట్ తండ్రి అంటాడు. ఇంకేం మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు తండ్రి ఎవరో చెప్పాను. ఇంకా మీకు పర్సనల్ డీటెల్స్ అవసరం లేదు అని మహేంద్ర అంటాడు.
మీటింగ్ అయిపోంది వెళ్లిపోండి అని చెప్పేస్తారు. దాంతో అంతా వెళ్లిపోతారు. అనుపమ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మహేంద్ర కూడా వెళ్లిపోతాడు. మహేంద్రను కన్నీళ్లతో మను చూస్తుండిపోతాడు. కట్ చేస్తే కాలేజీ బయట అంతా మాట్లాడుకుంటారు. ఏంటీ మహేంద్ర నువ్ అలా మాట్లాడటం ఏంటీ. అసలు మను నీ కొడుకు ఏంటీ అని ఫణీంద్ర అంటాడు. అంతా సమాధానం చెప్పమని అడుగుతారు. చెప్పాను కదా ఇంకా చెప్పడానికి ఏం లేదని మహేంద్ర అంటాడు.
దేవయాని ఫైర్
నువ్ మన కుటుంబాన్ని బజారుకు ఈడ్చావ్ కదా ఛీ ఛీ. ఇది చాలా చిన్న విషయం కాదు. పెద్ద విషయం. దీనిపై మన కుటుంబం ఆధారపడి ఉంది. చెప్పు మహేంద్ర అలా ఎందుకు చేశావ్ అని దేవయాని అంటే.. చేయాలనిపించింది అని మహేంద్ర అంటాడు. ఇప్పుడు నిలదీయారేంటీ అని ఫణీంద్రను అంటుంది దేవయాని. గతంలో మహేంద్ర తాగుడుకు ఏదో మాట అంటే.. తను ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దానికి కారణం నేనే అని నన్ను నానా మాటలు అన్నారు అని గుర్తు చేస్తుంది దేవయాని.
మరి ఇప్పుడు నీ తమ్ముడు ఇంత పెద్ద తప్పు చేస్తే మౌనంగా ఎందుకున్నారు అని దేవయాని అంటే.. నేను ఎలాంటి తప్పు చేయలేదని మహేంద్ర అంటాడు. తప్పు కాకుంటే. మాకు ఇంకా షాకింగ్ గా ఉంది. నువ్ చేసిన పనికి మీ అన్నయ్య చూడు. ఎలా చిన్నబుచ్చుకున్నారో. ఎంత అవమానకరంగా ఫీల్ అవుతున్నారో. నేను ఇన్నేళ్లలో ఆయనను చూడలేదు. జీవితం కోల్పోయినట్లు ఎలా ఉండిపోయారో చూడు. ఎందుకు అలా చేశావ్ చెప్పు అని దేవయాని అంటుంది.
వెళ్లిపోయిన ఫణీంద్ర
మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం మారదు అని మహేంద్ర అంటాడు. మను నీ కొడుకు ఎలా అయ్యాడు అని ఫణీంద్ర అడుగుతాడు. దేవయాని కూడా మళ్లీ అడుగుతుంది. వదినాగారు మను నా కొడుకు. ఇందులో చెప్పడానికి ఇంకా ఏం లేదు అని మహేంద్ర అంటాడు. ఏంటో మహేంద్ర. నాకు అయితే ఏం అర్థం కావట్లేదు అని వెళ్లిపోతాడు ఫణీంద్ర. దేవయాని కూడా చీదరించుకుని వెళ్లిపోతుంది. వెంటనే శేలేంద్ర వెళ్లిపోతాడు. వసుధార, మహేంద్ర ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.