Guppedantha Manasu June 5th Episode: గుప్పెడంత మనసు- వసుధారపై ఇష్టం లేకే వెళ్లిపోయిన రిషి- ఎస్సైతో వసు ఛాలెంజ్-guppedantha manasu serial june 5th episode vasudhara breaks down challenge to si guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu June 5th Episode: గుప్పెడంత మనసు- వసుధారపై ఇష్టం లేకే వెళ్లిపోయిన రిషి- ఎస్సైతో వసు ఛాలెంజ్

Guppedantha Manasu June 5th Episode: గుప్పెడంత మనసు- వసుధారపై ఇష్టం లేకే వెళ్లిపోయిన రిషి- ఎస్సైతో వసు ఛాలెంజ్

Sanjiv Kumar HT Telugu
Jun 05, 2024 08:33 AM IST

Guppedantha Manasu Serial June 5th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూన్ 5వ తేది ఎపిసోడ్‌లో వసుధార అంటే ఇష్టం లేకే రిషి సార్ వెళ్లిపోయి ఉంటారని ఎస్సై అంటాడు. దాంతో వసు ఫీల్ అవుతుంది. అలాగే శైలేంద్రను తిడుతూ గడ్డి పెడుతుంది దేవయాని. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూన్ 5వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూన్ 5వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రేయ్ నీకు బుద్ధి ఉందా. మనం చేసిన నేరాలను మన నోటి తోనే చెబుతావా అని శైలేంద్రపై దేవయాని ఫైర్ అవుతుంది. జగతికి జ్యూస్‌లో విషం ఇచ్చిన చంపిన విషయాన్ని చెప్పడాన్ని శైలేంద్ర గుర్తు చేసుకుంటాడు. దీన్నే ఓవర్ కాన్ఫెడెన్స్ అంటారు. అసలు వసుధార అంటే ఏమనుకున్నావురా. తను తెగిస్తే మాములుగా ఉండదు అని దేవయాని అంటుంది.

సరిగ్గా అంచనా వేయలేకపోయావ్

నా కనుసైగళ్లలో ఉంచుకున్న రిషిని మార్చేసిందిరా. నేను ఎంత ట్రై చేసిన ఇంటి కోడలు అయింది. నిన్ను కూడా రోడ్డు మీద నిలబెట్టి ఏం చేసిందో చూశావుగా అని దేవయాని అంటుంది. అది అప్పుడు. ఇప్పుడు తన బలం రిషి లేడు. తను బాధలతో పీకల్లోతూ కూరుకుపోయింది అని శైలేంద్ర అంటాడు. అసలు వాళ్ల మనసులో ఏముందో తెలుసా. నువ్ వాళ్లను సరిగ్గా అంచనా వేయలేకపోయావ్ కాబట్టే నిన్ను దెబ్బ కొడుతున్నారు. నీకు అసలు ఓపిక లేదు అని దేవయాని అంటుంది.

ఇక నువ్ ఏం చేయలేవని నాకు అర్థమైంది. సైలెంట్‌గా ఓ మూలన కూర్చో అని దేవయాని తిడుతుంది. దాంతో అలా గడ్డి పెట్టండి అని ధరణి ఎంట్రీ ఇస్తుంది. నేను ఏం చేయాలో నీకు తెలుసా అని శైలేంద్ర ఫైర్ అయితే.. లేదు.. మీరు సరిగా వర్క్ చేయలేరని అత్తయ్య అంటున్నారు కదా. ఆకాశంలో చందమామను చూస్తాం కానీ అందుకోవడానికి ట్రై చేసినా దొరకదు అని ధరణి అంటుంది. పొంతనలేకుండా మాట్లాడుతున్నావని దేవయాని అంటే.. ఎందుకు లేదని ధరణి అంటుంది.

తప్పుగా మాట్లాడానా

అంటే చందమామ ఎండీ సీటా. నాకు అది దక్కదని చెప్పడం ధరణి ఉద్దేశమా అని చిరాకు పడతాడు శైలేంద్ర. అలా ఇరిటేట్ కాకండి. మీరు ఇంతలా మారుతారని అనుకోలేదు అని తాగిన విషయం గుర్తు చేస్తుంది. అలా ఎప్పుడు తాగకండని చెబుతుంది ధరణి. ఈ ఇంట్లో నాకు విలువ లేదని కోపంతో వెళ్లిపోతాడు శైలేంద్ర. నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అత్తయ్య లేదు కదా. ఉన్నదే కదా అన్నాను. హర్ట్ అయితే అవ్వని అని వెళ్లిపోతుంది ధరణి.

ఈ ధరణి దేని గురించి మాట్లాడుతుంది. అసలు ఎందుకు వచ్చింది. ఏం విన్నది. దీన్ని ఏదో ఒకటి చేయాలి అని దేవయాని అనుకుంటుంది. మరోవైపు దేవయాని అన్న మాటలు చాలా బాధగా ఉన్నాయని, ఎంత ధైర్యం ఉన్నవాళ్లైన కొన్నింటికి బాధపడతారని, తన మాటలు వింటుంటే ఎందుకు బతికి ఉన్నానా అనిపిస్తుందని వసుధార అంటుంది. అలాంటి వాళ్లు అలాగే మాట్లాడుతారు. మా ఫ్రెండ్షిప్‌కు కూడా పెడర్థాలు తీసింది కదా అని అనుపమ, మహేంద్ర సర్ది చెబుతారు.

ఏం చేయలేకపోయాను

ఒకవైపు ఒక ప్రాణం నాకు దూరంగా ఉంది. మరోవైపు ప్రాణం లాంటి కాలేజ్ సమస్యల్లో ఉంది. రాక్షసుల బారి నుంచి కాలేజీని కాపాడుకుంటూ వచ్చాను. కానీ, రిషి సార్ విషయంలో ఏం చేయలేకపోతున్నాను అని వసుధరా అంటుంది. మేము కూడా అలాగే ఉన్నాం కదా. రిషి జాడ తెలియడంలేదు. రిషినే నా ప్రాణం, సంతోషం అనుకున్నాను. కానీ అలాంటి నా కొడుకు కనిపించకుండా పోయాడు. నా ముందే నిన్ను అన్ని మాటలు అంటుంటే ఏం చేయలేకపోయాను. జగతి చనిపోయినప్పుడే నేను కూడా పోయింటే బాగుండేది అని మహేంద్ర అంటాడు.

అవేం మాటలు అని అనుపమ అంటుంది. నువ్ అలా ఉండకు. మావయ్యగా నేను చూడలేకపోతున్నాను అని మహేంద్ర అంటాడు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని వసుధార చెబుతుంది. చెప్పమ్మా ఏం చేద్దాం అని మహేంద్ర అంటాడు. నేను నా మాటకే కట్టుబడి ఉందామనుకుంటున్నాను అని మనసులో అనుకున్న వసుధార వెళ్లిపోతుంటుంది. ఎక్కడికమ్మా అని మహేంద్ర అడిగితే.. మీరు కూడా నాతో రావొచ్చని వసుధార అంటుంది.

డీఎన్ఏ రిపోర్ట్స్

వసుధార, మహేంద్ర కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు. రిషి గారి గురించి కంప్లైంట్ ఇచ్చిన కేసు ఎక్కడిదాకా వచ్చిందని ఎస్సైని అడుగుతుంది వసుధార. అది ఎప్పుడో కేసు క్లోజ్ అయింది కదా. ఆయన చనిపోయారని ప్రూవ్ అయింది కదా అని ఎస్సై అంటాడు. రిషి సార్ చనిపోవడం ఏంటీ. ఆయన ఇంకా బతికే ఉన్నారు. రిషి సార్ జాడ తెలుసుకోండి అని వసుధార అంటుంది. మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. డీఎన్ఏ రిపోర్ట్స్, డెడ్ బాడీ అన్ని రిషి సారే అని చెప్పాయి కదా అని ఎస్సై అంటాడు.

అవన్ని తప్పులు సార్. రిషి సార్ ఎక్కడో ఉన్నారు. ఆ ప్లేస్ కనుక్కోండి సార్ అని వసుధార అంటుంది. మనం ఏం నమ్మితే అలాగే అనిపిస్తుంది. ముందు మీరు రియాల్టీలోకి రండి ఎస్సై అంటాడు. ఇంతకుముందు మను విషయంలో కూడా ఇలాగే నాది తప్పుడు నమ్మకం అన్నారు. రాజీవ్ బతికే ఉన్నాడని తేలింది కదా అని వసుధార అంటుంది. ఏదో ఒక కేసులో అలా జరిగింది. అలా అన్ని కేసుల్లో జరగదు అని ఎస్సై అంటాడు.

రిషి సార్ మీకు దూరంగా ఉన్నారు

సర్ నేను మీతో వాదించడానికి రాలేదు. ప్లీజ్ రిషి సార్ ఎక్కడున్నారో తెలుసుకోండని వసుధార అంటుంది. రిషి సార్ గురించి ఇన్నాళ్లుగా ఎందుకు తెలియడం లేదు. ఒకటి ఆయనకు మీరంటే ఇష్టం లేక దూరంగా వెళ్లిపోయి ఉంటారని ఎస్సై అంటాడు. మా బంధం గురించి మీకు చెప్పిన అర్థం కాదు అని వసుధార అంటుంది. సరే రిషి సార్ బతికి ఉన్నారని ఒక్క క్లూ తీసుకురండి. నేను కేస్ రీ ఓపెన్ చేసి నేను వెతుకుతాను అని ఎస్సై అంటాడు.

సరే నేనే వెతుకుతాను. ఆధారం సంపాదిస్తాను అని వసుధార అంటుంది. రిషి సార్ లాంటి వాళ్లు బతికి ఉన్నారంటే నలుగురికి సంతోషమే కదా అని ఎస్సై అంటాడు. దాంతో వసుధార, మహేంద్ర వెళ్లిపోతారు. ఎస్సై అన్న మాటలు తలుచుకుంటుంది వసుధార. ఏం చేయాలనుకుంటున్నావ్ అని మహేంద్ర అంటాడు. ఏం చేయాలో తెలియట్లేదు. గడువు కూడా పూర్తి కావొస్తుందని అని వసుధార అంటుంది.

నేను ఇంకా బతికే ఉన్నాను

మనకంటే రిషి సార్ గురించి తెలియట్లేదు. సారైనా మన దగ్గరికి రావాలి కదా. సార్‌కు నాపైనా కోపమా. అలిగారా. లేదు ఆయన ఎప్పటికీ అలా నాపై కోప్పడరు. నా కంట్లో నీళ్లు తిరుగితేనే రిషి సార్ భరించరు. అలాంటిది ఇన్నాళ్లు ఎందుకు దూరంగా ఉన్నారు అని రిషి కోసం చేసిన పనులను మహేంద్రకు చెబుతుంది వసుధార. అందరూ రిషి సార్ గురించి ఏదేదో అంటున్నారు. కానీ, నేను ఇంకా బతికే ఉన్నాను కదా. నా ఊపిరి ఆగిపోయినప్పుడు రిషి సార్‌కు ఏమైనా అయినట్లు అని వసుధార అంటుంది.

రిషి సార్ బతికి ఉన్నాడనటానికి ఆధారం నేను బతికి ఉండటమే అని వసుధార అంటుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నాను. నీ నమ్మకమే నిజం కావాలి అని మహేంద్ర అంటే.. అది నీ భ్రమ బాబాయ్ అని శైలేంద్ర ఎంట్రీ ఇస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner