Guppedantha Manasu April 29th Episode: గుప్పెడంత మనసు- దొరికిన రాజీవ్ డెడ్ బాడీ- కోర్టుకు మను- శైలేందపై దేవయాని డౌట్-guppedantha manasu serial april 29th episode devayani doubt on son shailendra guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu April 29th Episode: గుప్పెడంత మనసు- దొరికిన రాజీవ్ డెడ్ బాడీ- కోర్టుకు మను- శైలేందపై దేవయాని డౌట్

Guppedantha Manasu April 29th Episode: గుప్పెడంత మనసు- దొరికిన రాజీవ్ డెడ్ బాడీ- కోర్టుకు మను- శైలేందపై దేవయాని డౌట్

Sanjiv Kumar HT Telugu
Apr 29, 2024 08:22 AM IST

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఏప్రిల్ 29వ తేది ఎపిసోడ్‌లో పోలీసులకు రాజీవ్ డెడ్ బాడీ దొరకడంతో మను మరింత గట్టిగా ఇరుక్కుంటాడు. మరోవైపు ఇదంతా శైలేంద్రే చేశాడని దేవయాని అనుమానంగా మాట్లాడుతుంది. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఏప్రిల్ 29వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఏప్రిల్ 29వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Episode 1062: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రాజీవ్‌ను గన్‌తో బెదిరించి వెళ్లబోయిన మను ఆగి.. ఒక్కటి గుర్తు పెట్టుకో.. వసుధార గారు అంటే రిషి భార్య అని చెప్పేసి వెళ్లిపోతాడు. ఇది సార్ జరిగింది అని మను పోలీస్‌కు చెబుతాడు. సార్ ఈ స్టోరీలు మాకొద్దు. కోర్టుకు చెప్పండి అని పోలీస్ అంటాడు. మరి అక్కడ రాజీవ్ బాడీ లేదు కదా సార్ అని వసుధార అంటుంది.

లీగల్‌గానే పోదాం

చంపినవాడు బాడీని ఎందుకు ఉంచుతాడు. అది ఎక్కడైనా పడేయవచ్చు. ఆ బాడీని రికవరీ చేసే పని మాది. అప్పుడు మీకు పూర్తి ఆధారాలు దొరుకుతాయి. బాడీలో బుల్లెట్స్ ఉంటాయి కదా. మనుషుల మీద నమ్మకం పెట్టుకోవచ్చు. కానీ, ఇంత మూర్ఖంగా నమ్మొద్దు. మీరు ఇంకా ఎక్కువ సేపు ఉండకూడదు. మీరు నాతో ఆర్గ్యూ చేయకండి. లీగల్‌గానే ముందుకు వెళ్దాం అని చెప్పేసి వెళ్లిపోతాడు పోలీస్. దాంతో అంతా ఆలోచనలో పడిపోతారు.

అనుపమ మేడమ్ గారు రాలేదా అని మను అడిగితే.. వచ్చింది. కానీ నిన్ను ఇలా చూడలేక బయటే ఉండిపోయింది. తను నీ గురించి చాలా బాధపడుతుంది. నేను వెళ్లి మాట్లాడి వస్తాను అని మహేంద్ర బయటకు వెళ్తాడు. మరోవైపు శైలేంద్రను పిలిచి దేవయాని మాట్లాడుతుంది. ఆ రాజీవ్ చనిపోవడం ఏంటీ. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇన్నాళ్లు మనతోనే ఉండేవాడు. మన ముగ్గురం ఒక గ్రూప్‌లా ఉండేవాళ్లం. దానికి డీఆర్ఎస్ అని పేరు కూడా పెట్టాం అని దేవయాని అంటుంది.

చచ్చాడనే కదా

నేను మార్చాను కదా మామ్ ఎస్‌డీఆర్ అని శైలేంద్ర అంటాడు. సరే ఇప్పుడు వాడు లేడు అనేసరికి బాధగా ఉంది. వాడు నువ్వు నాకు రెండు కళ్లు అనుకున్నాను అని దేవయాని అంటుంది. అదేంటి నీ రెండు కళ్లు నేనే అన్నావ్ కదా అని శైలేంద్ర అంటాడు. సరేరా. నువ్వే నా రెండు కళ్లు. నిజంగా రాజీవ్ చనిపోయాడా. నిజంగా వాడేనా అని దేవయాని అంటుంది. వాడు చచ్చాడనే కదా మనును పోలీసులు తీసుకెళ్లారు. నీకు కష్టంగా ఉన్నా.. ఇది నిజం అని శైలేంద్ర అంటాడు.

వాడు చనిపోయినందుకు నీకు బాధ లేదా. ఇన్నాళ్లు మనకోసం పని చేశాడు కదా అని దేవయాని అంటుంది. నాకెందుకు బాధ. అలాంటి ఎమోషన్స్ ఈ శైలేంద్రకు ఉండవని అంటాడు. దాంతో కొంపదీసి దీనిలో నీ హస్తం ఉందా అని దేవయాని అనుమానంగా అడుగుతుంది. నన్నే అనుమానిస్తున్నావా అని శైలేంద్ర అంటాడు. నిజంగా వాడిని మనునే చంపాడా అని దేవయాని అంటే.. ఆ డౌట్ నీకెందుకు వస్తుందని శైలేంద్ర తిరిగి ప్రశ్నిస్తాడు.

అడ్డు తొలగిపోయింది

ఆ రాజీవ్ గాడు పెద్ద జాదుగాడు. రిషికే భయపడేవాడు. గతంలో వసుకు రోజుకో స్టోరీ చెప్పి రిషిని భయపెట్టాడు. జైలు నుంచి తప్పించుకున్నాడు. అసలు రాజీవ్‌ను చంపింది మనునే అని దేవయాని అంటుంది. అంటే నేను చంపాను అంటావా. అదే నీ డౌటా. అయినా వాడినెవడినో చంపితే మనకేంటీ. ఆ మనుగాడు బుక్కైపోయాడు. ఇప్పుడు మనకు అడ్డు తొలగిపోయింది. ఇప్పుడు మనం గమ్యం ఏంటో చూద్దాం. కావాలంటే వాడి చావుకు రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి పాటిస్తారు తల్లీకొడుకులు.

మరోవైపు అనుపమతో మహేంద్ర మాట్లాడుతాడు. ఇంత డల్ అయిపోయావ్. మనుకు ఏం కాదు. ధైర్యంగా ఉండాలి అని మహేంద్ర అంటాడు. నాకు భయంగా ఉంది. మను అలా చేయడుకదా. ఒకరి ప్రాణాలు తీసే వ్యక్తి కాదు కదా అని అనుపమ అంటుంది. అవును, తను కూడా అదే చెప్పాడు. కానీ, ఆధారాలు అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. గన్ బుల్లెట్స్ మ్యాచ్ అయ్యాయి. సీసీటీవీలో మను షూట్ చేసినట్లు ఉంది మహేంద్ర అంటాడు.

ఎలా కాపాడుకోవాలో

దాంతో షాక్ అయినా అనుపమ అంటే నిజంగానే రాజీవ్‌ను మను షూట్ చేశాడా అని అడుగుతుంది. వాళ్లిద్దరు గొడవపడ్డారట. కావాలనే బెదిరించడానికి గన్ మిస్ ఫైర్ చేశాడట. అదే విషయం మను పీఏ కూడా చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చేయని తప్పుకు మను శిక్ష అనుభవించాల్సి వస్తుంది. దత్తత తీసుకుందామనుకున్నాను. ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పిన మహేంద్ర రిషి, రిషి వెన్నునొప్పి గురించి ఎంతో బాధపడినట్లు చెబుతాడు.

వాడికి అమ్మా అనే పిలుపును దూరం చేశాను. ఎన్నో రకాలుగా బాధపెట్టాను. కానీ, వాడు ఆ బాధలను కూడా అలవాటు చేసుకున్నాడు. పదిమందికి పెట్టడమే కానీ, చేయి చాచని మను ఇలాంటి కేసులో ఇరుక్కోవడం ఏంటీ అని అనుపమ అంటుంది. నువ్వేం కంగారుపడకు. మనును ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని మహేంద్ర అంటాడు. ఇంతలో పోలీస్ స్టేషన్‍కు ఏంజెల్ వస్తుంది. ఏం జరుగుతుందో నాక్కూడా తెలియట్లేదు అని ఏంజెల్ అంటుంది.

నువ్ నమ్ముతున్నావా

దత్తత ఇష్టం లేక మేము రాలేదు. ఇప్పుడు నువ్ రాజీవ్‍‌ను హత్య చేశావంటున్నారు. నిజంగానే చంపేశావా. అసలు నీకు ఇంత ఆవేశం ఏంటీ మను. ఒకవేళ రెచ్చగొట్టిన. కంట్రోల్‌లో ఉండాలి కదా. ఇప్పుడు నువ్వే కదా బాధపడుతున్నావ్. రేపు తీర్పు ఏం వస్తుందో. లైఫ్ స్పాయిల్ అవుతుంది అని ఏంజెల్ అంటుంది. ఏంటీ ఏంజెల్ నువ్ మను గారు చంపారంటే నమ్ముతున్నావా అని వసుధార అంటుంది. తప్పు చేయకుండా పోలీసులు ఎందుకు తీసుకొస్తారు అని ఏంజెల్ అంటుంది.

పోలీస్ స్టేషన్‌లో ఉన్నవాళ్లందరు తప్పు చేసినట్లు కాదు. బయట ఉన్నవాళ్లు మంచోళ్లు అని కాదు. కొన్నిసార్లు పరిస్థితులు అలా వస్తాయి. మను గారిని కూడా అలాగే పరిస్థితులు పగబట్టాయని చెప్పిన వసుధార.. జరిగిందంతా ఏంజెల్‌కు చెబుతుంది. ఇదంతా కాదు మను నువ్ నిజం చెప్పు. నువ్ నిజంగా రాజీవ్‌ని చంపావా అని ఏంజెల్ అడుగుతుంది. లేదు అని మను సమాధానం ఇస్తాడు. ఇది చాలు. నాకూ నీపై పూర్తి నమ్మకం ఉంది. నీ నిజాయితీపై నమ్మకం ఉందని ఏంజెల్ అంటుంది.

రాజీవే డ్రామాలు

పోలీసులు నిన్ను తీసుకొచ్చిన నేను నిన్ను నమ్ముతున్నాను. విశ్వంతో మాట్లాడి పెద్ద పెద్ద లాయర్స్‌ను తీసుకొస్తాను. నీకు ఎలాగైనా బెయిల్ వచ్చేలా చేస్తాను అని ఏంజెల్ అంటుంది. మను గారు షూట్ చేసినాస.. రాజీవ్ చనిపోయినా బాడీ దొరకలేదు. ఇంతవరకు పోలీసులు బాడీనీ ఐడెంటిఫై చేయలేదు అంటే.. ఏదో జరిగింది. ఎవరో కుట్రలు పన్నుతున్నారని పిస్తోంది. ఒకవేళ మా రాజీవ్ బావే డ్రామాలు ఆడుతుండొచ్చు అని వసుధార అంటుంది.

అది కూడా కావొచ్చు. నాకు బాగా తెలుసు. నేను రాజీవ్‌ను షూట్ చేయలేదు. ఆ రాజీవే పోలీసులకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు అని మను అంటాడు. ఇంతలో మేడమ్.. అంటూ వచ్చి ఇంకా మీరు అతన్నే నమ్ముతున్నారా అని పోలీస్ అంటాడు. నిజంగా చనిపోయి ఉంటే డెడ్ బాడీ ఉంటుంది కదా. తప్పు చేసి ఉండరు కదా అని. కానీ, ఇప్పుడు డెడ్ బాడీ దొరికింది. కానీ దాన్ని గుర్తుపట్టని విధంగా కాల్చి బూడిద చేయాలని ప్రయత్నించారు దుర్మార్గులు అని పోలీసు అంటాడు.

డీఎన్‌ఏ టెస్ట్

దాంతో అంతా షాక్ అవుతారు. ఎంత నేరస్థుడైన కానీ ఎక్కడో ఓ చోట తప్పు చేసి దొరికిపోతారు. ఆ విషయం వారికి అర్థం కావడంలేదు. ఇక్కడ ఒక్కటి కాదు చాలా మిస్టేక్స్ చేశారు. అందుకే చాలా ఈజీగా పట్టుకోగలిగాం అని పోలీసు అంటాడు. అది నిజంగా రాజీవ్ డెడ్ బాడీనేనా అని మహేంద్ర అడుగుతాడు. ఇప్పుడు ఫొరెన్సిక్ వాళ్లు కూడా డెడ్ బాడీ దగ్గర సాంపిల్స్ కలెక్ట్ చేశారు. డీఎన్ఏ టెస్ట్‌కు పంపించాను. కచ్చితంగా ఆధారాలు బయటపడతాయి. ఇంకా పక్కా ఆధారాలతో సర్‌ను కోర్టుకు తీసుకెళ్తాం అని పోలీస్ అంటాడు.

ఇక మీరు ఎంత నమ్మకం పెట్టుకున్నా.. పూజలు చేసినా అతన్ని కేసు నుంచి తప్పించలేరు అని పోలీస్ చెప్పేసి వెళ్లిపోతాడు. కట్ చేస్తే.. ఇదే విషయం అనుపమకు చెబుతాడు మహేంద్ర. అనుపమ కంగారుపడుతుంటే.. అది ఎవరిదో అయి ఉంటుంది. తను నిక్షేపంగా, నిర్దోషిలా బయటకు వస్తాడు. ఆ రాజీవ్ ఏదో మాయ చేసి ఉంటాడు అని ఏంజెల్ అంటుంది. విశ్వంతో మాట్లాడి ఎక్స్‌పీరియెన్స్ ఉన్న లాయర్లతో మాట్లాడుతాను అని ఏంజెల్ అంటుంది.

చెప్పే రీతిలో చెబుతాను

వద్దు. అసలే నాన్నకు ఆరోగ్యం బాలేదు అని అనుపమ అంటుంది. ఈ టైమ్‌లో సార్‌ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని వసుధార అంటుంది. అలాంటిదేం జరగదు. ఎలాంటి టెన్షన్ లేకుండా నేను చెప్పే రీతిలో చెబుతాను కదా అని ఏంజెల్ అంటుంది. ఇంతటితో గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

IPL_Entry_Point