Guppedantha Manasu June 19th Episode: గుప్పెడంత మనసు- రంగానే రిషి సార్, ప్రూవ్ చేస్తానన్న వసుధార- కమెడియన్‌గా శైలేంద్ర-guppedantha manasu serial june 19th episode vasudhara challenge to prove ranga is rishi guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu June 19th Episode: గుప్పెడంత మనసు- రంగానే రిషి సార్, ప్రూవ్ చేస్తానన్న వసుధార- కమెడియన్‌గా శైలేంద్ర

Guppedantha Manasu June 19th Episode: గుప్పెడంత మనసు- రంగానే రిషి సార్, ప్రూవ్ చేస్తానన్న వసుధార- కమెడియన్‌గా శైలేంద్ర

Sanjiv Kumar HT Telugu
Jun 19, 2024 08:21 AM IST

Guppedantha Manasu Serial June 19th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూన్ 19వ తేది ఎపిసోడ్‌లో నువ్ తన భర్త అని, రిషి సార్ అని ఎందుకు చెప్పావని రంగను నిలదీస్తుంది సరోజ. తన ప్రాణాలు కాపాడేందుకు అని రంగ చెబుతాడు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూన్ 19వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూన్ 19వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో తానే రిషినని, వసుధార భర్తను అని రంగ చెబుతాడు. దాంతో నాన్నా ఏమంటున్నావురా అని రాధమ్మా కంగారుపడిపోతుంది. అవును నానమ్మా.. నేను తన భర్తనే. మీ మనవడిని కాదని రంగ అంటాడు. దాంతో సర్ అని రంగను హగ్ చేసుకుంటుంది వసుధార. ఇన్నాళ్లు నా నిరీక్షణ ఫలించింది. చెప్పండి సర్ అసలు ఏమైంది. మీరు బాగున్నారా అని వసుధార అడుగుతుంది.

కాలేజీ సామ్రజ్యాన్ని కాపాడాలి

తను నానమ్మ అంటుంది. ఆమె బావ అంటుంది. అసలు ఇక్కడికి ఎలా వచ్చారు అని వసుధార అడిగితే.. అదంతా తర్వాత చెబుతా అని రంగ అంటాడు. పదండి సార్ మన ఇంటికి వెళ్దాం. అక్కడ మావయ్య మీకోం గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. మన కాలేజీ చేయి దాటి పోయేలా ఉంది. మనం వెళ్లి మన కాలేజీ సామ్రజ్యాన్ని కాపాడాలి అని తీసుకెళ్తుంది వసుధార. రంగ ఆపుతాడు. మనం మన ఇంటికి వెళ్దాం కానీ, ఇప్పుడు కాదు. తర్వాత వెళ్దాం అని రంగ అంటాడు.

ఇప్పుడే వెళ్లాలి సార్ అని వసుధార అంటే.. ఇప్పుడు కాదు. నేను చెప్పింది వింటావ్ కదా. నీ ఆరోగ్యం కుదుటపడ్డాకా వెళ్దాం అని రంగ అంటాడు. మీ మాట వింటాను సార్ అని లోపలికి వెళ్తుంది వసుధార. మరోవైపు ఫణీంద్ర దగ్గరకు వెళ్లిన దేవయాని బోర్డ్ మీటింగ్ దేని గురించి జరిగిందని అడుగుతుంది. ఎండీ పదవి గురించి జరిగిందని ఫణీంద్ర అంటే.. దానికి మీటింగ్ ఎందుకండి. శైలేంద్ర ఉన్నాడు కదా. వాడికి ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు వారసుడిగా శైలేంద్రకు ఆ హక్కు ఉంది అని దేవయాని అంటుంది.

ఏముందో చూడకుండా

వారసత్వం పక్కన పెడితే అర్హత ఉండాలి అని ఫణీంద్ర అంటాడు. ఇంకేం అర్హత కావాలి. ఫారెన్‌లో చదువుకున్నాడు. ఆఫీస్‌కు రోజు వస్తున్నాడు. అవగాహన ఉంది. మన శైలేంద్ర చాలా ధైర్యస్థుడు. ఎలాంటి కఠిన పరిస్థితులు వచ్చినా ధైర్యంగా నిలబడతాడు అని దేవయాని అంటుంది. నీకు వాడి మీద ఎందుకు ఓవర్ కాన్ఫిడెన్స్. కాలేజీకి కోటి రూపాయలు అప్పు తీసుకున్నప్పుడు అగ్రిమెంట్ పేపర్ మీద ఏముందో చూడని తెలివి తక్కువ వెధవ అని ఫణీంద్ర అంటాడు.

అప్పుడంటే ఫీల్డ్‌కు కొత్త. తర్వాత జగతి, వసుధార వద్ద వర్క్ నేర్చుకున్నాడు. ఒక్కసారి వాడికి ఎండీ పదవి అప్పజెప్పండి. రిషి కంటే బాగా చేస్తున్నాడని మీరే అంటారు అని దేవయాని అంటుంది. దాని గురించి బోర్డ్ మీటింగ్‌లో ఓ నిర్ణయానికి వచ్చాం. దీంట్లో నువ్ ఎక్కువగా ఇన్వాల్వ్ కాకు అని ఫణీంద్ర తేల్చి చెప్పుతాడు. మరోవైపు మినిస్టర్, మను మాట్లాడుకుంటారు. ఇంతలో శైలేంద్ర వస్తాడు. అక్కడ మనును చూసి శైలేంద్ర షాక్ అవుతాడు.

సీటుకు ఎసరు పెట్టేలా ఉన్నాడు

ఏంటీ సర్‌ప్రైజ్ అంటాడు శైలేంద్ర. నీ ఎక్స్‌ప్రెషన్ చూస్తే షాక్‌లా ఉందే అని మను అంటాడు. ఏ విషయం గురించి మాట్లాడుదామని వచ్చావ్ అని శైలేంద్ర అడిగితే.. కాలేజీ గురించే. వసుధార మేడమ్ లేదు. ఇప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి అని మను అంటాడు. వీడు నా ఎండీ సీటుకే ఎసరు పెట్టేలా ఉన్నాడు అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. నువ్వెందుకు వచ్చావ్ అని శైలేంద్రను అడుగుతాడు మినిస్టర్.

నేను కూడా కాలేజీ గురించే మాట్లాడుదామనే వచ్చాను అని శైలేంద్ర అంటాడు. ఏ విషయం గురించి అని మినిస్టర్ అడిగితే.. ఇండియా గెలిచిన మ్యాచ్ గురించి చెబుతాడు. దాంతో ఏం మాట్లాడుతున్నావని మినిస్టర్ అడుగుతాడు. అంటే సార్ కాలేజీ స్టూడెంట్స్‌ను స్పోర్ట్స్‌లో ఇన్వాల్వ్ చేయాలని హింట్ ఇస్తున్నాను అని శైలేంద్ర అంటాడు. దాంతో మను నవ్వుకుంటాడు. నేను స్పోర్ట్ మినిస్టర్ కాదే. అసలు విషయం చెప్పు అని మినిస్టర్ అంటాడు.

మీరు తీసుకునే నిర్ణయంతో

ఇప్పుడేం స్ట్రైక్ అవ్వట్లేదే అని గోల్కొండ కోట గురించి ఏదేదో కామెడీగా చెబుతాడు. అసలు పాయింట్ చెప్పట్లేదే అని మినిస్టర్ అంటే.. మను చెప్పిన విషయం గురించే నేను చెప్పడానికి వచ్చాను. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, అడ్మినిస్ట్రేషన్. మీరు ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను శిరసా వహిస్తాను అని శైలేంద్ర అంటాడు. అవును సార్ మీరు తీసుకున్న నిర్ణయం ప్రకారం, మీరు ఇచ్చే గైడెన్స్‌తో ముందుకు వెళ్తాం అని మను అంటాడు.

సరే అని మినిస్టర్ అంటాడు. తర్వాత మను, శైలేంద్ర వెళ్లిపోతారు. కట్ చేస్తే ఏంటీ బావ నువ్ రిషి సారా. రంగ కాదా. తను అలా అనుకుంటే అనుకోని. మరి మా రంగ బావ ఏడి. నువ్ రంగ కాదంటే నా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అలా ఎలా ఒప్పుకుంటావ్. నువ్ తన భర్త అని ఎలా అంటావ్ అని సరోజ నిలదీస్తుంది. నోటికి వచ్చింది వాగకు. డాక్టర్ ఏం చెప్పింది. తను మానసికంగా ఇబ్బందిపడకూడదు అని చెప్పింది కదా అని రంగ అంటాడు.

కాపాడేందుకే అబద్ధం చెప్పాను

ఇప్పుడు నేను రిషి అనుకుంటుంది. నిజం కాదని తెలిస్తే షాక్‌కు గురై మతి భ్రమించిపోతుంది. అందుకే అలా చెప్పాను అని రంగ అంటాడు. ఇప్పుడు తను రిషి అనుకుని ఇక్కడే తిష్ట వేస్తే ఎలా అని సరోజ తన గోడు చెప్పుకుంటుంది. నేను రిషి అనగానే తను ఎంత సంతోషపడింది. ఇంకో మూడు నాలుగు రోజుల్లో రికవరీ అవుతుంది. డాక్టర్‌ను పిలిచి ఆమె పరిస్థితి అడిగితే.. అప్పుడు నేను రిషి కాదు రంగ అని చెబుతాం. తర్వాత వాళ్ల ఇంటికి పంపిస్తాం అని రంగ అంటాడు.

అయినా నువ్ అబద్ధం చెప్పడం నాకు నచ్చలేదని అని సరోజ అంటే.. తనను కాపాడటానికి అబద్ధం చెప్పానే. కంగారుపడకు అని రంగ అంటాడు. ఇంతలో మీరు చెప్పింది అబద్ధం కాదు సర్ అని వసుధార అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఇప్పుడు వీళ్లతో చెప్పిందంతా అబద్ధం అని చెప్పండి సార్. ఎందుకు వీళ్లు ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకీ నాటకం ఆడుతున్నారు. మీరు రంగ ఏంటీ. మీరు డ్రైవర్ ఏంటీ అని వసుధార అడుగుతుంది.

రిషి సార్ అని రుజువు చేస్తా

మీరు రిషి సార్ కాదని ఎందుకు అంటున్నారు అని వసుధార అంటే.. ఎందుకంటే నేనే రిషి సార్‌ను కాదు కాబట్టి అని రంగ అంటాడు. మీరు అబద్ధం చెబుతున్నారు. నిజమేంటో నాకు తెలుసు. మీ మనసుకు కూడా తెలుసు. నా మనసు చెబుతుంది. మీరే రిషి సార్ అని రుజువు చేసేవరకు ఈ ఇంట్లో నుంచి నేను కదలను కాగా కదలను అని లోపలికి వెళ్లబోతూ కింద పడబోతుంది వసుధార. ఇంతలో రంగ వచ్చి పట్టుకుంటాడు.

దాంతో రంగను ప్రేమగా చూస్తుంది వసుధార. ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. మీ చూపే చెబుతుంది సార్. మీరు రిషి సార్ అని వసుధార అనడంతో రంగ వదిలేస్తాడు. జాగ్రత్తగా ఉండండి మేడమ్ గారు. తలకు కట్టు ఎందుకు తీశారు అని రంగ అంటాడు. తగ్గిపోయింది సార్ అందుకే అని లోపలికి వెళ్లిపోతుంది వసుధార. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner