Guppedantha Manasu June 26th Episode: గుప్పెడంత మనసు- వసుధారకు రంగా షాకింగ్ ట్విస్ట్- ఇక ప్రభుత్వానికే కాలేజీ బాధ్యతలు-guppedantha manasu serial june 26th episode ranga twist to vasudhara manu frustration guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu June 26th Episode: గుప్పెడంత మనసు- వసుధారకు రంగా షాకింగ్ ట్విస్ట్- ఇక ప్రభుత్వానికే కాలేజీ బాధ్యతలు

Guppedantha Manasu June 26th Episode: గుప్పెడంత మనసు- వసుధారకు రంగా షాకింగ్ ట్విస్ట్- ఇక ప్రభుత్వానికే కాలేజీ బాధ్యతలు

Sanjiv Kumar HT Telugu
Jun 26, 2024 07:58 AM IST

Guppedantha Manasu Serial June 26th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూన్ 26వ తేది ఎపిసోడ్‌లో ఏంజెల్ చేసిన అవమానంతో శైలేంద్ర రగిలిపోతాడు. తన బెల్టుతో తానే తెగ కొట్టుకుంటాడు. మరోవైపు వసుధారకు ఊహించని విధంగా రంగా షాకింగ్ ట్విస్ట్ ఇస్తాడు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూన్ 26వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూన్ 26వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రంగానే రిషి సార్ అని 15 రోజుల్లో నిరూపిస్తానని, తన నోటితోనే తన రంగా కాదని, వసుధారే తన భార్యను అందరితో చెప్పేలా చేస్తాను. అప్పుడు నీకు అర్థం అవుతుంది నేను చెప్పేది. ఇంకో 15 రోజుల్లో నీ బావ అంటున్న నా రిషి సార్‌తో ఇక్కడి నుంచి వెళ్లిపోతాను. చూస్తూ ఉండు అని వసుధార ఛాలెంజ్ చేసి వెళ్లిపోతుంది.

బెల్టుతో కొట్టుకున్న శైలేంద్ర

ఇది ఎవరు అసలు. ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది. అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి అని సరోజ అనుకుంటుంది. మరోవైపు తన గదిలో ఏంజెల్ అన్న మాటలకు కోపంగా తనను తానే బెల్టుతో కొట్టుకుంటాడు శైలేంద్ర. ఎవరికీ నువ్వంటే లెక్కలేదు. మను వాళ్ల హార్ట్ బ్రేక్ అయ్యేలా ప్లాన్ చేయాలి. నేనేంటో అందరికీ చూపించాలి అని శైలేంద్ర అనుకుంటూ తెగ కొట్టుకుంటాడు. ఇంతలో ధరణి వచ్చి ఆపుతుంది. ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు, దేనికి ఫ్రస్టేషన్ అని అడుగుతుంది.

ఎండీ సీటు. అది నాకు దక్కకుండా పోతుందనిపిస్తుంది. వసుధార ఉన్నన్నాళ్లు నాకు అడ్డు పడింది. ఇప్పుడు తను అందనంతా దూరం పోయిన ఆ సీటు నాకు దక్కట్లేదు అని శైలేంద్ర నోరుజారుతాడు. ఏమన్నారు. అందనంతా దూరం పోయిందా అని ధరణి అనుమానంగా అడుగుతుంది. అదే రిజైన్ చేసి ఎవరికీ కనిపించకుండా దూరంగా పోయింది కదా. అందుకే అలా అన్నాను. నేను ఎండీ అవ్వలేకపోతున్నాను. అందుకే ఫ్రస్టేషన్ తట్టుకోలేక ఇలా చేస్తున్నాను అని మళ్లీ కొట్టుకుంటాడు శైలేంద్ర.

ఎవరినైనా ప్రేమించావా

ఎండీ అవ్వాలి. ఆ సీటులో కూర్చోవాలి అంటూ తెగ కొట్టుకుంటాడు శైలేంద్ర. దాంతో అది జరగదు లెండి. కొట్టుకోవడం అయిపోయాక చెప్పండి వెన్న పూస్తాను అని ధరణి వెళ్లిపోతుంది. ఇదేంటీ ఆపకుండా వెళ్లిపోయింది. ఎవరికీ కావాలి వెన్న అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. మరోవైపు మను ఫోన్ చూస్తూ ఉంటే ఏంటో బాగా బిజీ ఉన్నట్లు ఉంటావ్. ఎదురుగా మనుషులు ఉన్నారు. వారితో మాట్లాడుదాం. బావ నిన్నోటి అడిగుతా చెబుతావా అని ఏంజెల్ అంటుంది.

ఏంటీ అని మను అంటే.. నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని ఏంజెల్ అడిగితే.. ప్రేమించాను. మా అమ్మను అని మను చెబుతాడు. ఇంతకుముందు కూడా ఇలాగే చెప్పావ్. అందరూ అమ్మను ప్రేమిస్తారు. ఎవరైనా అమ్మాయిని ప్రేమించావా అని ఏంజెల్ అడుగుతుంది. నాకు ప్రేమించేంత పనులు లేవు అని మను అంటే.. అందరికీ పనులు ఉంటాయి. అలా అని ప్రేమించడం మానేస్తున్నారా. పెళ్లి చేసుకోవట్లేదా, కుటుంబంతో ఉండట్లేదా అని ఏంజెల్ అంటుంది.

అర్థం చేసుకోలేకపోతున్నారు

అందరికీ లక్ష్యాలు ఉంటాయి. కానీ, నా లక్ష్యం వేరు అని మను అంటే.. మీ నాన్న ఎవరో తెలుసుకోవడమే కదా. నువ్వు ఇలా ఉంటే ఆయన్ను తెలుసుకోలేవు. ముందు మీ నాన్నను ప్రేమించు. ఆయనను నిలదీద్దామని ద్వేషం పెంచుకుంటున్నావ్. అలా కాకుండా మీ నాన్నని ప్రేమించు. ఆ ప్రేమే నీ దగ్గరికి తీసుకొస్తుంది అని ఏంజెల్ అంటుంది. అందరూ సలహాలు ఇచ్చేవాళ్లే. కానీ నా బాధ ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. నీకు ఆ శైలేంద్రకు తేడా లేదు అని మను చెబుతాడు.

వాడు అలాగే నేను అనామకున్ని అంటాడు. నువ్ అర్థం చేసుకుంది. వాడు అర్థం చేసుకుంది వేరు. అయినా నా బాధ గురించి ఎవరు అర్థం చేసుకోరు అని కోపంగా వెళ్లిపోతాడు మను. కట్ చేస్తే రంగా, వసు వాళ్లంతా భోజనం చేస్తుంటారు. సరోజ వచ్చి చేపల పులుసు తీసుకొస్తుంది. ఇక్కడ వసుధార చారు, సరోజ చేపల పలుసు వడ్డించడానికి చిన్నిపాటి గొడవ పడతారు. ముందు చారు తిని తర్వాత చేపల పులుసు తింటారు అని రాధమ్మా చెబుతుంది.

అంత ఉప్పు వేస్తారా

రిషి సార్ ఈ టేస్ట్ మీకు కచ్చితంగా నచ్చుతుంది అని వసుధార మనసులో అనుకుంటుంది. చారు తిన్న రంగా నానమ్మ ఇది నువ్ కాదు కదా చేసింది అని అడిగితే.. ఇవాళ వంట తనే చేసింది. నేను వద్దన్నా పట్టు బట్టి చేసింది. ఈరోజు వంటంతా తనే చేసింది. ఏ నాన్న బాలేదా అని రాధమ్మ అడుగుతుంది. చారు ఇలా చేస్తే నాకు నచ్చదని నీకు తెలుసు కదా అని రంగా అంటాడు. నీకు అసలు బుద్ధుందా చారులో అంత ఉప్పు వేస్తారా అని సరోజా అంటుంది.

సరోజా నువ్ ఏం అనకు. అయినా గెస్టులుగా వచ్చినవాళ్లతో వంట చేయించడం ఏంటీ. వాళ్లు ఇవాళ ఉండి రేపు వెళ్లిపోతారు. అలా చేయించకు నానమ్మ అని రంగా వెళ్లిపోతుంటే.. సరోజ ఆపుతుంది. ప్లేట్ మార్చి రంగాకు చేపల పలుసు వడ్డిస్తుంది సరోజ. వసుధార ఫీల్ అవుతుంటే.. వాడు అన్నడాని బాధపడకు. అన్నం దగ్గర వాడు అలాగే ఉంటాడు అని రాధమ్మ చెబుతుంది. నీకు నచ్చిందా బాగుందా అని సరోజ అడిగితే.. బాగుందని రంగా చెబుతాడు.

మీరెవరో నేనెవరో

దాంతో గెలిచాను అన్నట్లుగా సరోజ వసుధారను చూస్తుంది. నువ్ చిన్నగా తిను బావ. ఎవరి కళ్లు అయిన పడి దిష్టి తగులుతుందని సరోజ అంటుంది. దాంతో వసుధార ఫీల్ అవుతుంది. తర్వాత మీకు నచ్చనివిధంగా వంట చేసినందుకు సారీ అని వసుధార అంటే.. అందుకు కాదు. మీరు వంట చేసినందుకు నాకు కోపం వచ్చింది. మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. అవన్నీ పక్కన పెట్టండి. ఈరోజు వంట చేయడం, రేపు ఇంకోటి, ఆ తర్వాత మరోటి చేయడం కరెక్ట్ కాదని రంగా అంటాడు.

కొన్నాళ్ల తర్వాత మీరెవరో నేనెవరో అని రంగా వెళ్లిపోతాడు. మరోవైపు డీబీఎస్టీ కాలేజీ ఎండీ బాధ్యతల గురించి మీటింగ్ జరుగుతుంది. ఎండీ బాధ్యతలు స్వీకరించేందుకు ఇద్దరు బరిలో ఉన్నారు. మను, శైలేంద్ర. మీలో మీరు డిస్కస్ చేసుకుని ఒక పేరు చెప్పండి అని మంత్రి అంటాడు. అందరూ నా పేరే చెబుతారు. నేను కన్న కల నెరవేర్చుకున్నాను అని శైలేంద్ర అనుకుంటాడు. ఒక్కొక్కరు ఒక్కో పేరు చెబుతారు.

ప్రభుత్వం తీసుకుంటుంది

తర్వాత ఫణీంద్రను మరింత అడిగితే.. ఆ అర్హత ఎవరికి ఉందో వారికే అప్పజెప్పండి. ఎవరైనా నాకు ఓకే. నేను పూర్తి సహాకరం అందిస్తాను అని ఫణీంద్ర అంటాడు. అదేంటీ డాడ్ నా పేరు చెప్పొచ్చు కదా అని శైలేంద్ర అనుకుంటాడు. మహేంద్రను అడిగితే.. మను పేరు చెబుతాడు. అనుపమను అడిగితే.. ఈ కాలేజీకి శని పట్టుకుంది సార్. అందుకే ఇలాంటి పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. నేను ఎవరి పేరు చెప్పలేను. అందరి నిర్ణయమే నా నిర్ణయం అంటుంది.

అందిరి అభిప్రాయాలు సరిగ్గా లేవు. అందుకే ఎవరికీ బాధ్యతలు అప్పజెప్పాలని తేల్చలేం. మీకు వారం టైమ్ ఇస్తున్నాను. మీరందరూ ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోండి. లేకుంటే ఈ కాలేజీని గవర్న్‌మెంట్ హ్యాండోవర్ చేసుకుంటుందని మినిస్టర్ చెబుతాడు. అలా కుదరదు సార్. కాలేజీకి రిషీంద్ర భూషణ్ ఫ్యామిలీ నుంచే ఎండీగా వస్తున్నారు. ఇప్పుడున్నవాళ్లలో నేను తప్పా ఇంకెవరు లేరు. నేను చేస్తాను సార్ అని శైలేంద్ర అంటాడు. అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner