Brahmamudi August 1st Episode: బ్రహ్మముడి- కల్యాణ్ అప్పు పెళ్లి చేయించనున్న రుద్రాణి- కవిని ఘోరంగా అవమానించిన కనకం
Brahmamudi Serial August 1st Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 1వ తేది ఎపిసోడ్‌లో ధాన్యలక్ష్మీకి పెళ్లి పత్రకి ఇచ్చిన కనకం తర్వాత రుద్రాణికి, ఇందిరాదేవి దంపతులకు ఇస్తుంది. కల్యాణ్‌ను మాత్రం పెళ్లికి రాకూడదని అవమానిస్తుంది. దాంతో కావ్యపై రాజ్ ఫైర్ అవుతాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో ధాన్యలక్ష్మీ మొదటి శుభలేఖ ఇచ్చి రమ్మని చెబుతుంది. తర్వాత ఇందిరాదేవి దగ్గరకు వెళ్లి ఈ ఇంట్లో ఒక్క కార్డ్ ఇవ్వాల్సిందిపోయి మూడు కార్డ్స్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. దానికి కారణం మీకు తెలుసు అని చెబుతుంది కనకం.
ఆశీర్వాదం తీసుకున్న కనకం
రుద్రాణి దగ్గరకు వెళ్లిన కనకం నా కూతురు పెళ్లి.. మీరు.. మీలా అనుమానించడం నేర్చుకున్న వాళ్లు అనుకున్న పెళ్లి కొడుకు కాదు. కాబట్టి నా కూతురు మీద, నీ కుటుంబంలో ఉన్న నా కూతుళ్లపై మీద దృష్టి పెట్టకుండా, ఎలాంటి పనులతో చెడగొట్టకుండా నా కూతురు పెళ్లికి వచ్చి ఆశీర్వదించండి అని చెబుతుంది. తర్వాత స్వప్నకు నీ భర్తకు, మీ అత్తమామకు చెప్పి తీసుకురావే అని చెబుతుంది కనకం. అనంతరం ఇందిరాదేవి, సీతారామయ్యకు కార్డ్ ఇచ్చి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది కనకం.
అప్పుడు ఇంతకీ ఈ పెళ్లి అయిన సవ్యంగా జరుగుతుందా అని రుద్రాణి అంటుంది. దాంతో అంతా కోప్పడతారు. అంటే చివరి నిమిషంలో పెళ్లి కొడుకు మాయమైపోయాడని, పీటల మీద పెళ్లి ఆగిపోయిందని, ఎలాగు వచ్చిన పేరు వచ్చిందని కల్యాణ్‌తో పెళ్లి చేయించాలని, ఇలాంటి కుట్రలు ప్లాన్ చేయట్లేదు కదా అని రుద్రాణి అంటుంది. మంచి కుట్రను బయటపెట్టావ్. నిన్ను చచ్చిన క్షమించకూడదని అర్థమైందని స్వప్న అంటుంది.
సమాధానం చెప్పడానికే
రుద్రాణి అని కనకం అంటుంది. నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావా అని రుద్రాణి అంటుంది. ఏమే అనాలా.. ఒసేయ్ అని పిలవాలా అని స్వప్న అంటుంది. నువ్ నేను చచ్చేదాకా నిన్ను రుద్రాణి గారు అని పిలవడం జరగదు అని కనకం అంటుంది. ఇందాకా ఏదో వాగావ్ కదా.. దానికి సమాధానం చెప్పడానికే వచ్చాను అని కల్యాణ్ దగ్గరికి వెళ్తుంది కనకం.
బాబు మీరు గొప్పవారు, సున్నితమనస్కులు. పైగా కవిగారు. మీలాంటి సరస్వతి పుత్రుడు ఇంటికి వస్తే కాళ్లు కడిగేలా మర్యాదాలు చేయకుండా అవమానించాను. అందుకు కారణం మీకు తెలుసు అని ధాన్యలక్ష్మీ రుద్రాణి వైపు చూస్తుంది కనకం. మీ స్నేహితురాలి పేరు. ఈ సందర్భంగా మీరు నాకు ఓ మాట ఇవ్వగలరా. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మా ఇంటి పెళ్లకి మీరు రావొద్దు అని చేతులు మొక్కి వేడుకుంటుంది కనకం.
గుండెల్లో పెట్టుకుని
ఎందుకు ఏంటీ అనేది మీకు ఇక్కడున్న వాళ్లందరికీ తెలుసు. నా కూతురు పెళ్లి ఎలాంటి గొడవలు లేకుండా జరగాలని కోరుకుంటున్నాను. నాకు నా కూతురికి ఎలాంటి మచ్చ రాకూడదు అంటే మీరు ఆ పెళ్లిలో ఉండకూడదు. అర్థం చేసుకోండి అని పెద్ద షాక్ ఇస్తుంది కనకం. దాంతో కల్యాణ్ ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు. కనకం పుట్టెడు దుఖాన్ని గుండెల్లో పెట్టుకుని కూడా పిలవడానికి నువ్వే వచ్చావ్. మే అందరం పెళ్లికి వస్తాం. నీకు అండగా ఉంటాం అని ఇందిరాదేవి అంటుంది.
ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయండి. మేము చూసుకుంటాం అని అపర్ణ చెబుతుంది. దాంతో నమస్కరించి వెళ్లిపోతుంది కనకం. మరోవైపు అప్పు బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. కనకం, కృష్ణమూర్తి వెళ్లి మాట్లాడుతారు. రేపు నీ పెళ్లి. తర్వాత మా అందరినీ వదిలిపెట్టి వెళ్లిపోవాలనేగా ఆలోచిస్తున్నావ్ అని కృష్ణమూర్తి అంటాడు. దాంతో ఏడుస్తూ తండ్రి భుజాలపై పడిపోతుంది. ప్రతి ఆడపిల్లకు ఇలాంటి పరిస్థితి ఎదురు అవుతుందని కనకం ఓదార్చుతుంది.
పిల్లల కోసమే
అయినా ఇప్పుడు ఏడుస్తున్నావ్ కానీ.. రేపు నీ మొగుడితో సంతోషంగా ఉంటే మేము కాల్ చేసినప్పుడు బిజీగా ఉన్నానని పెట్టేస్తావ్. నా మొగుడు నా కాపురం అని మా మీద అరుస్తావ్ అని కృష్ణమూర్తి అంటాడు. కొత్తగా పెళ్లైన అమ్మాయికి మొదట్లో అంతా అయోమయంగానే ఉంటుంది. ఒక్కసారి పిల్లలు పుట్టాకా వాళ్ల గురించే ఆలోచిస్తారు. వాళ్లకోసమే పరుగులు పెడతుంది. ఇదిగో ఇలా వయసు అయ్యాకా మనకోసం అంటూ ఆలోచించుకుంటూ ఉంటాం అని కనకం అంటుంది.
ఆడపిల్ల అంటే పెళ్లి పిల్లలు అంతేనా అమ్మా అని అప్పు అంటుంది. ఈతరం ఆడపిల్లలు పెళ్లి అంటే ఇంతే అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏ కాలమైన అమ్మాయి అనుకున్నది సాధించడానికి కావాల్సిన స్వాతంత్ర్యం దొరుకుతుంది. కానీ, అది ఎప్పుడు దొరుకుతుందంటే తను గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు. అనవసర భయాలు పక్కన పెట్టు నీ జీవితం నువ్ కోరుకున్నట్లే సంతోషంగా ఉంటుంది. సరేనా అని కృష్ణమూర్తి అంటాడు.
ఘోరంగా అవమానించినట్లే
ఏడుస్తూనే సరే అంటుంది అప్పు. పొద్దున్నే మంగళస్నానాలు ఉన్నాయి. త్వరగా పడుకో అని కనకం అంటుంది. ఈ సీన్ చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. మరోవైపు మీ అమ్మ ఏమనుకుంటుంది. పిన్నికి పత్రిక ఇచ్చి కల్యాణ్‌ను రావొద్దని అంటుంది. ఇది మాత్రం నాకు వాడిని ఘోరంగా అవమానించినట్లే అనిపిస్తుంది అని రాజ్ ఫైర్ అవుతాడు. మా అమ్మ సంస్కారం కూడా పక్కన పెట్టి ఎందుకు అలా చేసింది మీకు అర్థం కాలేదా అని కావ్య అంటుంది.
అప్పు కోసం కల్యాణ్ ఎన్ని చేశాడు అవన్ని అప్పు, మీ అమ్మ మర్చిపోయారా అని రాజ్ అంటాడు. మర్చిపోలేదు. అనామిక చేసిన గాయం మర్చిపోలేదు. అప్పుకు ఎలాంటి మాట రాకూడదు అంటే ఎక్కడివాళ్లు అక్కడే ఉండటం మంచిది. రేపు పెళ్లికి కవిగారు వస్తే మీ రుద్రాణి లాంటి వాళ్లు, పిన్ని లాంటి వాళ్లు అప్పును నానా మాటలు అంటే.. అది విని మాత్రం కవిగారు బాధపడరా. అలా ఎందుకు ఆలోచించరు అని కావ్య నిలదీస్తుంది.
అప్పుపై నింద పోవాలి
నువ్ కల్యాణ్ మంచికోరుకునేదానివే అయితే నీ ఉద్దేశాన్ని వాడిమీద రుద్దేదానివి కాదు. నీకు తెలియకుండానే నువ్ ఇద్దరు ప్రేమికులను విడదీస్తున్నావ్. అక్కడ అప్పు, ఇక్కడ కల్యాణ్ ఇద్దరు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అని రాజ్ అంటాడు. నేను విడదీయడం లేదు. మా ఇంటి పరువు కాపాడాలని అనుకుంటున్నాను. అప్పు మీద పడిన నింద పోవాలని అనుకుంటున్నాను. ఇంతమంది నోళ్లు మూయించినట్లు అవుతుంది అని కావ్య అంటుంది.
అప్పు కల్యాణ్‌ను ఇప్పటికీ ప్రేమిస్తుందని రాజ్ అంటే.. అప్పు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఇక్కడితే వదిలేయండి అని కావ్య అంటుంది. మీ అందరి మూర్ఖత్వంతో వాళ్లిద్దరికి శిక్ష వేస్తున్నారు అని కోపంగా వెళ్లిపోతాడు రాజ్. మరోవైపు మొత్తానికి అనుకున్నది అనుకున్నట్లు సాధించావ్ మమ్మీ అని రాహుల్ అంటాడు. అప్పు పెళ్లి జరిగితేనే అనుకున్నది సాధించినట్లు అని రుద్రాణి అంటుంది. ఇంకెవరు ఆపుతారు అని రాహుల్ అంటాడు.
నువ్వే పెళ్లి చేసేలా ఉన్నావ్
ఇంకెవరు కావ్య. మనముందు పెళ్లి చేయిస్తున్నట్లు నాటకం ఆడుతూ కల్యాణ్‌ను పెళ్లి మండపానికి తీసుకొచ్చి సీక్రెట్‌గా పెళ్లి చేయిస్తుందేమో, కల్యాణ్‌ను మండపానికి రాకుండా చేయాలి అని రుద్రాణి అంటుంది. నువ్ అనవసరంగా ఆలోచిస్తూ కావ్యకు లేనిపోని ఐడియాలు ఇస్తున్నావేమో. ఇలాగే వదిలేస్తే బెటర్ అని రాహుల్ అంటాడు. శత్రువులకు అవకాశాలు ఇవ్వకూడదు, ధాన్యలక్ష్మీ అస్త్రాన్ని వాడి కల్యాణ్‌ను పెళ్లి మండపానికి రాకుండా చేస్తాను అని రుద్రాణి అంటుంది.
కల్యాణ్ పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి మండపానికి రాకున్న ఎలాగైనా చేసుకుంటాడు కదా అని రాహుల్ అంటాడు. నువ్ చెప్పింది కూడా కరెక్టే. అందుకే కల్యాణ్ ఊళ్లోనే లేకుండా చేయాలి. చేస్తా అని బయటకు వెళ్తుంది రుద్రాణి. ఏం చేస్తావో ఏమో.. నీ ఆత్రం చూస్తుంటే నువ్వే వాళ్ల పెళ్లి దగ్గరుండి చేసేలా ఉన్నావ్ అని రాహుల్ నిట్టూరుస్తాడు. ధాన్యలక్ష్మీ ఫోన్‌లో మాట్లాడుతుంటే రుద్రాణి మెల్లిగా వెళ్లి మాట్లాడుతుంది.
బెంగళూరుకు పంపించేయాలి
ఇప్పటివరకు కావ్య మనం అనుకున్నట్లు చేస్తుంది. కానీ, చివరి క్షణంలో తన అసలు ప్లాన్ మారిస్తే.. అప్పుతో కల్యాణ్ పెళ్లి జరిపిస్తే.. అప్పుడేం చేస్తావ్. అందుకే చెబుతున్నా. మన జాగ్రత్తలో మనం ఉండాలి. కల్యాణ్ అసలు ఊరిలోనే ఉండకూడదు. అప్పు మెడలో తాళి పడే వరకు కావ్యకు కల్యాణ్ అందుబాటులో ఉండకూడదు అని రుద్రాణి అంటంది. నువ్ చెప్పింది నిజమే. వాన్ని అర్జంట్‌గా బెంగళూరులో ఉన్న మా అమ్మ వాళ్ల ఇంటికి పంపిస్తాను అని ధాన్యలక్ష్మీ వెళ్తుంది.
రుద్రాణి సంతోషిస్తుంది. మరోవైపు కల్యాణ్ అప్పు పెళ్లి పత్రిక పట్టుకుని ఫీల్ అవుతుంటాడు. అది చూసి షాక్ అయి కోప్పడుతుంది ధాన్యలక్ష్మీ. పెళ్లి పత్రికను చింపేస్తుంది. ఏంటమ్మా ఏం చేస్తున్నావ్ అని కల్యాణ్ అడుగుతాడు. అదంతా రుద్రాణి వింటుంది. ఏంట్రా కోప్పడుతున్నావ్. పెళ్లి పత్రకి చించేస్తే అప్పు జీవితం బాగుండదనా. అది పెళ్లి చేసుకోబోతుంది కదరా. ఇంకా ఎందుకు దాని గురించే ఆలోచిస్తున్నావురా. ఇప్పటికైనా ఈ తల్లి మనసు అర్థం చేసుకో అని ధాన్యలక్ష్మీ అంటుంది.
నా చావు నేను చస్తా
నేను నిన్ను ఎప్పుడు అలా ఉండు ఇలా ఉండు అని చెప్పలేదు. ఓ అమ్మాయిని తీసుకొచ్చి ప్రేమించుకున్నాను అంటే పెళ్లి చేయించాను. నువ్ ఇలా బాధపడుతుంటే నాకు ఎలా ఉంటుందో ఆలోచించరా. నీ నుండి బయటకు రాలేవు. నేను అమ్మమ్మకు కాల్ చేసి చెప్పాను నువ్ వచ్చావని. నువ్ ఇప్పుడే బెంగళూరుకు వెళ్లురా. అక్కడ కొన్ని రోజులు ఉంటే నీ మనసు మారుతుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. నేను ఎక్కడికి వెళ్లను అని తెగేసి చెబుతాడు కల్యాణ్.
ఇక్కడే ఉండి ఇలా బాధపడుతూ కూర్చుంటావా అని ధాన్యలక్ష్మీ అంటుంది. నా చావు నేను చస్తాను నీకెందుకు అని కల్యాణ్ అంటే.. నేను నీ తల్లినిరా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అందుకేనా అనామికతో కలిసి అలా టార్చర్ పెట్టావ్. ఇష్టం లేకపోయినా ఆఫీస్‌కు పంపించి అన్నయ్య స్థానంలో కూర్చోబెట్టావ్. ఒక్కసారైనా నాకు ఏం కావాలో ఆలోచించావా అని కల్యాణ్ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
స్వప్నకు దొరికిన అప్పు
బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో అప్పు పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఫోన్‌లో కల్యాణ్ ఫొటోలు చూస్తూ బాధపడుతుంటుంది అప్పు. అది చూసిన స్వప్న నువ్వింకా కల్యాణ్‌ను ప్రేమిస్తున్నావ్ కదా అని అడుగుతుంది. కట్ చేస్తే.. కల్యాణ్‌కు ఫోన్ చేసిన స్వప్న అప్పు నిన్ను ఇంకా మనసులో పెట్టుకుని వేరొకరితే పెళ్లికి సిద్ధపడి తప్పు చేసిందని చెబుతుంది. అది విన్న రాజ్ ఈ కల్యాణ్ అప్పులను నమ్ముకుని లాభం లేదు. నేనే ఏదో ఒకటి చేసి వాళ్ల పెళ్లి జరిపించాలని అనుకుంటాడు.