Brahmamudi July 30th Episode: బ్రహ్మముడి- కావ్యను నిందించిన రాజ్- అల్లుడి కాళ్లు పట్టుకున్న కనకం- భర్తను నిలదీసిన కళావతి-brahmamudi serial july 30th episode raj dispute with kanakam raj ask appu about kalyan love brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi July 30th Episode: బ్రహ్మముడి- కావ్యను నిందించిన రాజ్- అల్లుడి కాళ్లు పట్టుకున్న కనకం- భర్తను నిలదీసిన కళావతి

Brahmamudi July 30th Episode: బ్రహ్మముడి- కావ్యను నిందించిన రాజ్- అల్లుడి కాళ్లు పట్టుకున్న కనకం- భర్తను నిలదీసిన కళావతి

Sanjiv Kumar HT Telugu
Jul 30, 2024 07:21 AM IST

Brahmamudi Serial July 30th Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 30వ తేది ఎపిసోడ్‌లో కావ్య వల్లే కల్యాణ్, అప్పుతమ మనసులోని ప్రేమను బయటకు చెప్పట్లేదని భార్యను నిందిస్తాడు రాజ్. దాంతో అప్పును అడగమని కావ్య చెబుతుంది. దాంతో కనకం ఇంటికి రాజ్ వెళ్తాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూలై 30వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూలై 30వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో అప్పును కల్యాణ్ ప్రేమించట్లేదని, పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని చెబుతాడు. దాంతో మరి కావ్య నాకిచ్చిన మాట సంగతేంటని కావ్యను అడుగుతుంది ధాన్యలక్ష్మీ. తనకేం అవసరం. అదెందుకు మాటిస్తుందని స్వప్న అంటుంది. ఏమో.. మీరిద్దరి ఇంట్లోవాళ్ల ఇష్టంతోనే కోడలిగా వచ్చారా అని రుద్రాణి అంటుంది. మా అమ్మ జోలికి వస్తే ఈరోజు నా అత్తవని కూడా చూడను అని స్వప్న అంటుంది.

స్వప్న రివర్స్ వార్నింగ్

ఏయ్.. అందరిముందు ఎంత మాటొస్తే అంతా.. ఏది పడితే అది మా అమ్మను అంటే నాలుక చీరేస్తాను. నరికి పోగులు పెడతాను అని రాహుల్ సీరియస్ అవుతాడు. మీ అమ్మను అంటే నీకు ఎక్కడో కాలింది కదా. మా అమ్మను అంటే మాకు కాలదా. నన్ను నరకాలంటే ముందు నీకు చేతులు ఉండాలి కదా. కాలేజీలో కరాటే నేర్చుకున్న చేతులు ఇవి అని స్వప్న రివర్స్ వార్నింగ్ ఇస్తుంది. ఆగు అక్క అని చెప్పిన కావ్య.. చూశారుగా కవిగారు. మీ మనసులో అప్పు లేదు నిజమే. కానీ, మీరు పెళ్లి చేసుకుంటేనే ఈ నోళ్లు మూతబడతాయ్ అని అంటుంది.

ఒప్పేసుకోరా. పెళ్లి చేసుకుంటానని మాటివ్వు. నీ మనసులో అప్పు లేదుగా. ఇంకా ఎవరిని పెళ్లి చేసుకుంటే ఏంటీ. మీ అమ్మ అనిందనో. ఈ రుద్రాణి అత్త అన్నదనో. మీ వదిన మాటిచ్చిందనో వెళ్లి పెళ్లి చేసుకోరా.. మాటివ్వు అని రాజ్ అంటాడు. నేను ఇప్పుడు ఇంకో పెళ్లికి రెడీగా లేను వదినా. మా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. అనామిక చేసిపోయిన గాయం ఇంకా మానకముందే నేను మళ్లీ పెళ్లికి రెడీ కాలేను. నాకు కొంచెం సమయం కావాలి అని చెప్పి కల్యాణ్ వెళ్లిపోతాడు.

సింపుల్‌గా అబద్ధం చెబుతావా

ఇప్పుడు నీ మనసుకు శాంతిగా ఉందా ధాన్యలక్ష్మీ. ఇంకా వెళ్లు అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంకోసారి నా కోడలిని నిందిస్తే అని అపర్ణ అనబోతుంటే.. దాని పళ్లు రాలగొడతాను వదినా అని ప్రకాశం అంటాడు. దాంతో ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. కల్యాణ్ దగ్గరికి వెళ్లిన రాజ్ ఏంట్రా నువ్ చేసిన పని. నీ బాధను అందరిముందు బయటపెడితే.. నీ మనసులో ప్రేమను బయటపెడితే నువ్ సింపుల్‌గా అబద్ధం చెబుతావా. నీ ప్రేమను దక్కించుకునే ధైర్యం లేదా. ఎందుకు అబద్ధం చెప్పావ్. ఒక్క కారణం చెప్పు అని రాజ్ అడుగుతాడు.

ఒక్కటి కాదు చాలా చెబుతాను. నీతో మాట్లాడి వెళ్లిన తర్వాత అప్పును కలిశా. తన ఇష్టంతోనే పెళ్లి జరుగుతుందా అని అడిగాను. తాను తన ఇష్టంతోనే పెళ్లి జరుగుతుందని చెప్పింది. అలాంటప్పుడు నాకు ఇష్టముండి ఏం లాభం అన్నయ్యా. మళ్లీ వదిన కూడా చెప్పింది నిజమే. ఇంట్లో అప్పు అంటే ఎవరికి ఇష్టముండదు. ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా తను సంతోషంగా ఉండలేదు అని కల్యాణ్ అంటాడు. ఆ కళావతి నీ మనసు పాడు చేసింది. లేనిపోని భయాలు పెంచింది. జీవితం సెకండ్ ఛాన్స్ ఇవ్వదు. నీ ప్రేమను దక్కించుకోరా అని రాజ్ అంటాడు.

మాటలు విన్న రుద్రాణి

నాకు ప్రేమ దక్కదు అన్న. తను ప్రేమిస్తుందని చెప్పినప్పుడు నేను అనామికతో పెళ్లిపీటలపై కూర్చున్నాను. నేను ప్రేమిస్తున్నప్పుడు తాను ఇంకొకరితో పెళ్లి పీటలపై కూర్చుంటుంది. మాకు రాసిపెట్టిలేదు అని కల్యాణ్ చెప్పి వెళ్లిపోతాడు. దీనంతటికి కారణం కళావతనే. తన సంగతి చెబుతాను అని కావ్య దగ్గరికి వెళ్తాడు రాజ్. నువ్ ఏం చేస్తున్నావో తెలుసా అని రాజ్ అడుగుతాడు. అప్పుడే ఆ మాటలు వినేందుకు రుద్రాణి వస్తుంది.

కల్యాణ్ మనసులో ఎవరున్నారో నీకు తెలిదా అని రాజ్ అడిగితే.. అది కాదు ముఖ్యం. కవిగారు ఏం చెప్పారనేది ముఖ్యం అని కావ్య అంటుంది. అలా నువ్వే చెప్పించావ్. అప్పు ఇంట్లో అడుగుపెడితే.. మా పిన్ని వల్ల. మందర లాంటి రుద్రాణి వల్ల కష్టపడాల్సి వస్తుందని లేనిపోని భయాలు చూపావ్ అని రాజ్ అంటాడు. అందరిముందే ప్రకాశం మావయ్య అడిగారు కదా. ఈ విషయంలో మనం మాట్లాడుకోవడం అనవసరం అని కావ్య అంటుంది.

పడిన నిందలు చాలు

అప్పు, కల్యాణ్ మనసులో ఏముందో నీకు తెలియదా. తెలిసి కూడా వెలుగులోకి రానివ్వడం లేదు. నీ వల్లే కల్యాణ్ విషయం బయటపెట్టట్లేదా. నువ్వే అప్పును బయటపడకుండా చేస్తున్నావ్ అని రాజ్ నిందిస్తాడు. దాంతో కావ్య ఫైర్ అవుతుంది. నేను ఆట బొమ్మలా కనిపిస్తున్నానా. అందరు నా మీద విరుచుకుపడుతున్నారు. తన వల్ల అప్పు బాధపడిందని గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పటికే మా చెల్లి మీద పడిన నిందలు చాలని, కల్యాణ్‌కు దూరంగా ఉంటే అంతా మంచిదని అనుకుంటున్నాం అని కావ్య అంటుంది.

అన్ని తెలిసి మంచి మనసుతో వచ్చిన ఆ పెళ్లి కొడుకుకు ఇంకా అనుమానాలు పెంచకూడదని చూస్తున్నాం అంతే. నేనేం విడిగా ప్రయత్నాలు చేయడం లేదు. నన్ను దోషిని చేయొద్దు అని కావ్య అంటుంది. నువ్ తెలివిగా తప్పించుకుంటున్నావ్. వాళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ పెళ్లితో వాళ్లిద్దరు విడిపోతే వాళ్ల జీవితం శూన్యం అవుతుంది. దానికి బాధ్యురాలు అవుతావ్ అని రాజ్ అంటాడు. కల్యాణ్‌ను ప్రేమిస్తున్నట్లు అప్పు మీకు చెప్పిందా అని కావ్య అడుగుతుంది.

కనకంను రెచ్చగొట్టిన రుద్రాణి

నేను ఇప్పటివరకు అప్పుతో విడిగా మాట్లాడలేదు అని రాజ్ అంటాడు. అయితే వెళ్లి మాట్లాడండి. అప్పు కూడా కల్యాణ్‌ను ఇష్టపడితే తొక్కలో రుద్రాణి మాటలే కాదు ఎవరి మాట వినకుండా మీతోపాటు నేను కూడా అప్పుతో కవిగారి పెళ్లి చేయిస్తాను అని కావ్య అంటుంది. సరే నువ్ ధైర్యాన్ని కూడగట్టుకో. రెడీగా ఉండు అని రాజ్ వెళ్లిపోతాడు. అప్పటివరకు ఆ మాటలు విన్న రుద్రాణి కూడా వెళ్లిపోతుంది. కనకంకు రుద్రాణి కాల్ చేసి నువ్ అనుకుంది అనుకున్నట్లు చేశావ్ అని రుద్రాణి అంటుంది.

అప్పుని కల్యాణ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలనే ప్లాన్ వర్కౌట్ అయిందని చెబుతున్నా. ఎవరో కాదు. ఏకంగా రాజే అప్పు కల్యాణ్ పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యేలా చేశారు అని రుద్రాణి అంటుంది. చాలు ఆపండి. ఎవరు ఏం చేసినా అప్పుకు నచ్చినవాడితోనే నేను పెళ్లి చేయిస్తాను. దాన్ని మార్చలేరు అని కనకం అంటుంది. అది మార్చేందుకు రాజ్ నీ ఇంటికి బయలుదేరాడు. దాన్ని నువ్ ఆపగలవా. అల్లుడు మాటను కాదనవా. నా దగ్గర ఎందుకు నటిస్తావ్ అని రుద్రాణి అంటుంది.

ఎందుకు అడ్డు చెబుతున్నారు

అప్పుకు నేను అనుకున్నవాడితోనే పెళ్లి అవుతుంది. అది నేను డిసైడ్ అయ్యాను అని కనకం కాల్ కట్ చేస్తుంది. హమ్మయ్యా.. కనకంకను రెచ్చగొట్టాను. ఇప్పుడు రాజ్ ఎన్ని మాట్లాడిన కనకం ఒప్పుకోదని రుద్రాణి సంబరపడుతుంది. మరోవైపు రాజ్ కనకం ఇంటికి వెళ్తాడు. అప్పును కల్యాణ్ ప్రేమిస్తున్నాడు. అప్పు కూడా కల్యాణ్‌ను మొదటి నుంచి ప్రేమిస్తుందని తెలుసు. అలాంటప్పుడు వాళ్ల పెళ్లికి ఎందుకు అడ్డు చెబుతున్నారు అని రాజ్ అడుగుతాడు.

అప్పుకు వేరే వాళ్లతో సంబంధం ఫిక్స్ అయింది. దాని మీద పడిన నిందలు అబద్ధం అని తెలుసుకున్న అబ్బాయే పెళ్లి చేసుకుంటున్నాడు. అప్పు కూడా ఈ పెళ్లికి ఇష్టపడింది అని కనకం అంటుంది. మీరు అప్పును బలవంతం చేశారని రాజ్ అంటాడు. సరే అప్పుతో మాట్లాడండి అని పిలుస్తుంది కనకం. బయటకు వచ్చిన అప్పును రాజ్ అడుగుతాడు. నన్ను ఎవరు బలవంతం చేయలేదు బావ. నా ఇష్టప్రకారమే ఈ పెళ్లి జరుగుతుందని అప్పు అంటుంది.

కనకంపై కోప్పడిన అప్పు కృష్ణమూర్తి

ఎందుకు మా పిన్నికి భయపడే కదా. మీరు అప్పును వేరే వాళ్లకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. వాళ్ల సంగతి నేను చూసుకుంటాను అని రాజ్ అంటాడు. సంవత్సరం నుంచి వాళ్లు కావ్యను అంటూనే ఉన్నారు. చూసుకున్నారా అని కనకం అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్. ఎవరితో అలా అంటున్నావ్ అని కృష్ణమూర్తి, అప్పు కనకంను కోప్పడతారు. అలా అన్నందుకు క్షమించండి. అప్పుతో కూడా చెప్పించాను. ఇక నేను చెప్పేది వినండి. ఇక ఇంతటితో ఆపేయండి అని కనకం అంటుంది.

మీరు ఇద్దరి భవిష్యత్ నాశనం చేస్తున్నారు అని రాజ్ అంటుంది. మీ ఇంటి కోడలు అయితే మాత్రం బాగుంటుందా. నా ఇద్దరు కూతుళ్లు మీ ఇంట్లో ఉన్న పరిస్థితి నాకంటే మీకే బాగా తెలుసు. ఇప్పుడు మళ్లీ మా మీద దుమ్మెత్తిపోస్తారు. అదేకాదు. అత్తింట్లో అప్పు సంతోషంగా ఉండాలంటే ఈ పెళ్లి జరగాలి అని కనకం అంటుంది. బావ నాకు కవిని పెళ్లి చేసుకోవాలని లేదు. ఇంతటితో వదిలేయండి అని అప్పు అంటుంది. మమ్మల్ని ఇలా బతకనీయండి. కాళ్లు పట్టుకుంటాను అని కనకం పట్టుకోబోతుంది.

రాజ్‌ను నిలదీసిన కావ్య

పక్కకు జరుగుతాడు రాజ్. మీ కూతురు జీవితం ఏమైపోయినా పర్లేదు అనుకుంటే ఎవరు ఏం చేయలేరు అని రాజ్ అంటాడు. మేమింతే. ఇంతకన్నా ఎదగలేం. నా కూతుళ్లు పెద్దింట్లో అడుగుపెట్టాలని అనుకున్నాను. కానీ, పెద్దింట్లో పెద్దరికం ఉంటుంది కానీ పేదింటికి గౌరవం ఉండదని తెలుసుకున్నాను. మమ్మల్ని ఇలానే ఉండనివ్వండి అని కనకం అంటుంది. దాంతో చేసేదేం లేక రాజ్ వెళ్లిపోతాడు. మరోవైపు రాజ్ కోసం దుగ్గిరాల ఇంట్లో అంతా ఎదురుచూస్తారు.

రాజ్ వెళ్లగానే మీకోసమే మీ పిన్ని, రుద్రాణి అత్త ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఇంటి ఆస్తికి తన్నుకుపోడానికి ఆ ఇంట్లో ఏ కుట్ర జరుగుతుందో మీరు పూర్తిగా తెలుసుకునే వచ్చి ఉంటారు కదా అని రాజ్‌ను అడుగుతుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో కల్యాణ్‌కు యాక్సిడెంట్ అయిందని బంటి చెప్పడంతో హాస్పిటల్‌కు పరుగెడుతుంది అప్పు. అక్కడ రాజ్ అడ్డుకని ప్రేమించనప్పుడు ఎందుకు వచ్చావని అడుగుతాడు. తాను కల్యాణ్‌ను ప్రేమిస్తున్నట్లు అప్పు చెబుతుంది. అది పక్కనే ఉండి విని కల్యాణ్ సంతోషిస్తాడు.

Whats_app_banner