Brahmamudi July 27th Episode: బ్రహ్మముడి- ధాన్యలక్ష్మీకి మాటిచ్చిన కావ్య- అప్పుతోనే కల్యాణ్ పెళ్లి- రాజ్ ఛాలెంజ్-brahmamudi serial july 27th episode kavya enquiries with kalyan raj kavya challenge brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi July 27th Episode: బ్రహ్మముడి- ధాన్యలక్ష్మీకి మాటిచ్చిన కావ్య- అప్పుతోనే కల్యాణ్ పెళ్లి- రాజ్ ఛాలెంజ్

Brahmamudi July 27th Episode: బ్రహ్మముడి- ధాన్యలక్ష్మీకి మాటిచ్చిన కావ్య- అప్పుతోనే కల్యాణ్ పెళ్లి- రాజ్ ఛాలెంజ్

Sanjiv Kumar HT Telugu
Jul 27, 2024 09:49 AM IST

Brahmamudi Serial July 27th Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 27వ తేది ఎపిసోడ్‌లో అప్పుతో కాకుండా వేరే వాళ్లతో కల్యాణ్‌ను పెళ్లికి ఒప్పిస్తానని ధాన్యలక్ష్మికి మాటిస్తుంది కావ్య. అది తెలిసిన రాజ్ కావ్యపై ఫైర్ అవుతాడు. భార్యాభర్తలిద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూలై 27వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూలై 27వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో కల్యాణ్ పెళ్లి గురించి ఇంట్లో గొడవ చేస్తుంది ధాన్యలక్ష్మీ. కావ్యను నానా మాటలు అంటే మర్యాద ఇచ్చేదేంటని కావ్య అంటుంది. ఎవరెన్ని అన్న పడొద్దని తానే చెప్పానని, నీ మర్యాద నిలుపుకుంటే మంచిది అని అపర్ణ కూడా అంటుంది.

రుద్రాణిపై అపర్ణ ఫైర్

అప్పుకు పెళ్లి చూపులు జరిగాయని, వేరే సంబంధం చూశామని, ఆ పెళ్లి ఖాయం చేసుకుని సంతోషంగా పుట్టింటి నుంచి వస్తున్నామని కావ్య చెబుతుంది. దాంతో ధాన్యలక్ష్మీ ఆలోచనలో పడుతుంది. ఏమో చివరి నిమిషంలో నువ్వు మీ అమ్మ ఏమైనా చేస్తారు. నువ్ ముసుగు వేసుకున్నట్లే నీ చెల్లెలికి ముసుగు వేసి కూర్చోపెడితే అని రుద్రాణి అంటుంది. దాంతో రుద్రాణిపై అపర్ణ ఫైర్ అవుతుంది. నా కోడలికి ముసుగు వేసింది నువ్వు కాదు. ఇప్పుడు తనపై పడతావేంటీ. అందుకేగా నీ చెంప వాయించింది. అప్పుడే నేను కొట్టిన దెబ్బ మర్చిపోయావా అని అపర్ణ అంటుంది.

ఏంటీ మా అత్తను మీ అత్త కొట్టిందా. మంచి దృశ్యాన్ని మిస్ అయ్యానే అని స్వప్న అంటుంది. కల్యాణ్ జీవితం బాగుండాలనే నేను సంబంధం తీసుకొచ్చాను. కానీ, అంతా నా మీద పడుతున్నారు. నీ కొడుకు పెళ్లి గురించి నువ్వే చూసుకో అని రుద్రాణి అంటుంది. కావ్య నిజం చెప్పు. నిజంగా నీ మనసులో ఎలాంటి ప్లాన్ లేదా అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. మేము ఈ ఇంట్లో పడుతున్న మాటలు చాలవా. మళ్లీ నా చెల్లెలిని ఈ ఇంటికి ఎందుకు తేవాలనుకుంటాం. దానికి వేరే సంబంధం ఖాయం చేసుకుని వచ్చాం అని కావ్య బదులిస్తుంది.

కావ్య చెబితే వింటాడు

అయితే, కల్యాణ్‌ను వేరే పెళ్లికి నువ్వే ఒప్పించాలి అని ధాన్యలక్ష్మీ అంటుంది. దీనికి సంబంధం. మీ పాట్లు ఏవో మీరు పడండి అని స్వప్న అంటుంది. కావ్య మనసులో ఎలాంటి ప్లాన్ లేకుంటే కల్యాణ్‌ను వేరే పెళ్లికి ఒప్పిస్తుంది. లేకుంటే లేదని అర్థం అని ధాన్యలక్ష్మీ అంటుంది. నిజంగా నువ్ కల్యాణ్ శ్రేయస్సు కోరేదానివే అయితే ఈ సమయంలో పెళ్లి గురించి మాట్లాడవు అని అపర్ణ అంటుంది. కల్యాణ్‌కు నీ కోడలు ఎంత చెబితే అంతా. తాను చెబితే వింటాడు అని ధాన్యలక్ష్మీ అంటుంది.

సరే.. మీరు అన్నారనో.. తప్పు పడతారనో కాదు.. నిజంగా కవిగారి జీవితం బాగుంటుందంటే మీరు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు నేను ఒప్పిస్తాను అని కావ్య చెబుతుంది. దాంతో ధాన్యలక్ష్మీ సంతోషంగా ఫీల్ అవుతుంది. మరోవైపు కల్యాణ్, అప్పు కలుస్తారు. కల్యాణ్‌ను చూసి అప్పు ఎమోషనల్ అవుతుంది. అది కవర్ చేస్తూ ఎందుకు రమ్మన్నావ్ అని అడుగుతుంది. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా. మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకుంటున్నావా అని కల్యాణ్ అడుగుతాడు.

నువ్ గొడవ చేస్తావ్

మా ఇంట్లో వాళ్ల కోసం అని అప్పు అంటుంది. అంటే నీకు పెళ్లి ఇష్టం లేదనే కదా అని కల్యాణ్ అంటాడు. అప్పు మౌనంగా ఉంటుంది. ఒక్కసారి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు బ్రో. నా మనసులో ప్రేమను బయటపెట్టి నాదాన్ని చేసుకుంటాను అని కల్యాణ్ మనసులో అనుకుంటాడు. మా అమ్మ నాన్నల కోసం అని చెప్పలేను. అలా చెబితే నువ్ గొడవ చేస్తావ్. నచ్చితేనే చేసుకో అంటావ్. ఆపేందుకు ట్రై చేస్తావ్. ఇక్కడ నిన్ను, అక్కడ మా వాళ్లను బాధపెట్టడం ఇష్టం లేదు అని అప్పు అనుకుంటుంది.

ఇష్టం లేకుంటే ఎందుకు పెళ్లి చేసుకుంటాను అని అప్పు చెబుతుంది. ఇది తెలుసుకునేందుకే ఇక్కడిదాకా వచ్చాను. నువ్ ఇష్టంతో పెళ్లి చేసుకుంటే నాకంటే సంతోషించేవాళ్లు లేరు. నీకు ఎప్పుడు గొడవలే జరిగాయి. కొత్త జీవితంలో అయినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అని కల్యాణ్ షేక్ హ్యాండ్ ఇస్తాడు. అప్పు కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇద్దరూ వెళ్లిపోతుంటారు. వెనుక నుంచి అప్పును కల్యాణ్.. కల్యాణ్‌ను అప్పు చూసుకుంటూ వెళ్తారు.

పంతానికి పోయి మాటిచ్చావా

మరోవైపు కావ్య దగ్గరికి కోపంగా వస్తాడు రాజ్. కల్యాణ్‌కు పెళ్లి చేయాలని చూస్తున్నారాట. దానికి నువ్ సపోర్ట్ చేస్తున్నావట అని రాజ్ అంటాడు. ఇది మీ రుద్రాణి అత్తే చెప్పుంటారు. ఆవిడకు అన్ని వంకరగా చెప్పడం అలవాటే కదా. నేను అప్పుతో కవిగారి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నాని నానా మాటలు మీ పిన్ని అంది అని జరిగింది చెబుతుంది కావ్య. అయితే పంతానికి పోయి కల్యాణ్‌ను పెళ్లికి ఒప్పిస్తానని మాటిచ్చావా అని రాజ్ అంటాడు.

అవును అని కావ్య అంటే.. కల్యాణ్ మనసులో ఎవరు ఉన్నారో తెలుసుకునే పని లేదా అని రాజ్ అంటాడు. దీంట్లో తెలుసుకోడానికి ఏముందండి అని కావ్య అంటుంది. అయ్యో.. కల్యాణ్ మనసులో అప్పు ఉంది. ఆ సంగతి నీకు తెలుసా అని రాజ్ ఆవేశంగా అంటాడు. మీరు కూడా అనామికలా మాట్లాడతారేంటీ.. అప్పును కవిగారే ఫ్రెండ్‌లా చూస్తున్నాడు. అంతా నింద వేశారు. మీరు నిజం చేయాలని చూస్తున్నారా. అప్పును ఫ్రెండ్‌గానే ఇష్టపడుతున్నాడు అని కావ్య అంటుంది.

అప్పు పెళ్లి జరగనివ్వను

వాడి మనసేంటో నాకు తెలుసు అని రాజ్ అంటాడు. అప్పుకు పెళ్లి చూపులు అయ్యాయి. వచ్చే శుక్రవారమే పెళ్లి. అప్పుకు ఇష్టమయ్యాకే ముహుర్తం పెట్టారు అని కావ్య అంటుంది. కల్యాణ్ డిప్రెషన్‌లోకి వెళ్తాడు. ఇప్పటికే జరిగిందానికి వాడు కుమిలిపోతున్నాడు అని రాజ్ అంటాడు. ఇద్దరూ వాదించుకుంటారు. ఈ అప్పు పెళ్లి జరగకూడదు అని రాజ్ అంటే.. అవును కల్యాణ్ అప్పు పెళ్లి జరగకూడదని కావ్య అంటుంది. వేరే వాళ్లతో అప్పు పెళ్లి జరగనివ్వను అని రాజ్ అంటాడు.

సరే నేను కవిగారిని అడిగి తన మనసులో ఏముందో తెలుసుకుంటాను. మీలా అనేసుకోవడాలు, ఆలోచించడాలు ఉండవు అని కావ్య అంటుంది. ముందు చేయాల్సిన పని ఇప్పుడు చేస్తానంటున్నావా. సరే చేయు అని రాజ్ కోపంగా వెళ్లిపోతాడు. మరోవైపు రుద్రాణి తెగ సంబరపడుతూ నవ్వుతుంది. అప్పు ఈ ఇంటికి కోడలిగా రాకుండా చేశాను. అలా జరగకుండా కావ్యకు కండిషన్ పెట్టించాను. ఇంతకన్నా గెలవడం ఏముంటుంది అని రుద్రాణి అంటుంది.

కోడలిగా చేయదు

కావ్యకు అస్సలు అప్పును ఇంటి కోడలిగా చేయాలని లేదు. నువ్వే అనవసరంగా ఐడియాలు ఇస్తున్నావ్ అని రాహుల్ అంటాడు. అది నాకు తెలుసు. కానీ, అప్పును కల్యాణ్ ప్రేమిస్తున్నాడు. అది రాజ్‌తో కల్యాణ్ చెప్పాడు అని రుద్రాణి అంటుంది. వామ్మో ఇదేం ట్విస్ట్ అని రాహుల్ అంటాడు. అందుకే నేను కావ్య నుంచి నరుక్కుంటూ వచ్చాను. ఈ విషయం తెలిసాకా కావ్య నా మాటలు గుర్తుకు తెచ్చుకుని అప్పును ఇంటికి కోడలిగా చేయదు అని రుద్రాణి అంటుంది.

మరుసటి రోజు రాజ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది కావ్య. ఇంతలో కల్యాణ్ కనిపిస్తే వెళ్లి మాట్లాడుతుంది. మీరు అప్పును ప్రేమిస్తున్నారా అని కావ్య అడుగుతుంది. దాంతో కల్యాణ్ షాక్ అవుతాడు. నేను మీది పవిత్రమైన స్నేహం అంటుంటే మీ అన్నయ్య కాదంటున్నాడు. ఇది నేను చెబితే నమ్మరు కదా. అనామిక మెడలో మీరు తాళి కట్టాకా అప్పు తన మనసు చంపుకుంది. అనామిక వల్ల వచ్చిన పుకార్ల వల్ల అప్పు జీవితం నాశనం అయిందని అప్పు జీవితం బాగుండాలని మీరు కోరుకుంటున్నారు అని కావ్య అంటుంది.

రుద్రాణి మాటలే నిజం

అదే మీ అన్నయ్య దృష్టిలో ప్రేమగా కనిపిస్తోంది. నాతో వాదిస్తున్నారు. అసలు వాళ్లకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. అప్పుకు జరిగిన అన్యాయానికి మీకు కలిగిన జాలిని అంతా ప్రేమ అనుకుంటున్నారు. అప్పుకు కూడా మీపై అలాంటి దృష్టి లేదు. మీపై ప్రేమ ఉంటే పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది. ఒకవేళ మీరు ఇష్టపడ్డా సరే నేను కూడా మీ పెళ్లికి ఒప్పుకునేదాన్ని కాదు. ఒకవేళ మీ పెళ్లి అయితే.. మీ అమ్మగారు, రుద్రాణి గారు అన్న మాటలే నిజం అవుతాయి అని కావ్య అంటుంది.

అప్పు ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెడితే మీ అమ్మగారు అప్పును జీవితాంతం కోడలిగా ఒప్పుకోరు. ఇదంతా పక్కనపెట్టండి. మీ మనసులో ఏముంది. మీ అన్నయ్య ఎందుకు అంతలా అంటున్నారు. మీరు అప్పును పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా అని కావ్య అడుగుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

పెళ్లి చేయాలని

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో కల్యాణ్ మనసులో అప్పు ఉంది. నేను అప్పును కల్యాణ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని అందరిముందు రాజ్ చెబుతాడు. ధాన్యలక్ష్మీతోపాటు అంతా షాక్ అవుతారు. మీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా నేను కవిగారిని స్పష్టంగా అడిగాను. కవిగారు అప్పును ఇష్టపడటమే లేదు అని కావ్య అంటుంది. నీ మనసులో ఏముందో ధైర్యంగా చెప్పు. అప్పును పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదా అని కల్యాణ్‌ను రాజ్ నిలదీస్తాడు. కావ్య, ధాన్యలక్ష్మీ కూడా చెప్పమని నిలదీస్తారు.

Whats_app_banner