Brahmamudi July 24th Episode: బ్రహ్మముడి- అప్పుకు పెళ్లి చూపులు- అడ్డుపెట్టుకున్న రాజ్- కల్యాణ్ బాధ చూసి సంతోషపడిన అన్న-brahmamudi serial july 24th episode kanakam meets kavya swapna appu marriage arrangements brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi July 24th Episode: బ్రహ్మముడి- అప్పుకు పెళ్లి చూపులు- అడ్డుపెట్టుకున్న రాజ్- కల్యాణ్ బాధ చూసి సంతోషపడిన అన్న

Brahmamudi July 24th Episode: బ్రహ్మముడి- అప్పుకు పెళ్లి చూపులు- అడ్డుపెట్టుకున్న రాజ్- కల్యాణ్ బాధ చూసి సంతోషపడిన అన్న

Sanjiv Kumar HT Telugu
Jul 24, 2024 07:55 AM IST

Brahmamudi Serial July 24th Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 24వ తేది ఎపిసోడ్‌లో అప్పుకు మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చూపులు అరెంజ్ చేస్తుంది కనకం. దానికి కావ్య స్వప్నను ఇంటికి పిలుస్తుంది. అప్పు పెళ్లి చూపులను అడ్డుపెట్టుకుంటాడు రాజ్. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూలై 24వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూలై 24వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో అప్పుపై రాసిన కవితను చూస్తూ ఉంటాడు కల్యాణ్. తనను అప్పు కలవద్దని అంతగా చెప్పిన తర్వాత కూడా తనపై నాకున్న అభిప్రాయాన్ని చెప్పడం కరెక్ట్‌ కాదు అని అనుకున్న కల్యాణ్ ఆ కవిత్వాన్ని మడిచి పక్కకు పడేస్తాడు. అప్పుడే మెట్లు ఎక్కుతున్న రాజ్ అదంతా చూస్తాడు. వెళ్లి ఆ పేపర్ తీసుకుని చదువుతాడు రాజ్.

మంచి సంబంధం వచ్చింది

అప్పుపై మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని ఏం లేనట్లు ఇంతకాలం నటిస్తున్నావారా. నీలో నువ్వే బాధపడుతూ నీ ప్రేమను నీలోనే సమాధి చేయాలని చూస్తున్నావా. నా తమ్ముడు ఇంత బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నీ ప్రేమను బయటపెట్టడమే కాదు.. దాన్ని గెలిపిస్తాను చూడు అని రాజ్ అనుకుంటాడు. తర్వాత మరోవైపు అప్పుకు పెద్దమ్మ మంచి సంబంధం చూశారని, అబ్బాయి కానిస్టేబుల్ అట. ఇల్లు కూడా ఉందట అని సంతోషంగా చెబుతుంది కనకం.

అది సరే ముందు అప్పుకు విషయం చెప్పావా అని కృష్ణమూర్తి అంటాడు. అది అని కనకం అంటుండగా.. అప్పు కనిపిస్తుంది. దాంతో షాక్ అవుతారు ఇద్దరూ. తర్వాత అన్నదంతా విన్నావ్‌గా అప్పు నీకు పెద్దమ్మ మంచి సంబంధం చూసింది. ఏమంటావ్ అని కనకం అంటుంది. జీవితంలో ప్రతిదీ నేనే నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాను. కానీ, నేను తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు చాలా బాధపడ్డారు. ఇక నేను ఏ నిర్ణయం తీసుకోవాలని అనుకోవట్లేదు. మీకు నచ్చింది చేయండని అప్పు అంటుంది.

కావ్య స్వప్నను రమ్మను

అది కాదురా. ఇది నీ జీవితం. నీ ఇష్టప్రకారం జరగాలని కృష్ణమూర్తి అంటాడు. ఆ జీవితం మీరు ఇచ్చిందే కదా. మీకు నచ్చినట్లు చేస్తే అయినా మీరు సంతోషంగా ఉంటారు కదా అని అప్పు వెళ్లిపోయింది. దాంతో అప్పు పెళ్లికి ఒప్పుకుందని కనకం సంతోషపడుతుంది. నాకెందుకు తొందరపడుతున్నామని అనిపిస్తుంది. మనం సరైన నిర్ణయం తీసుకోలేనప్పుడు ఎవరైనా సలహా అడగాలి. కావ్య, స్వప్నను ఇద్దరిని రమ్మని చెప్పు. వాళ్లకు కూడా మనం తీసుకున్న నిర్ణయం సరైనదే అని అనిపిస్తే పెళ్లి చేద్దామని కృష్ణమూర్తి అంటాడు.

అంతేగా అని కనకం వెళ్తుంది. మరోవైపు రాజ్‌ను చేసిందంతా చేసి ఏం తెలియని సుద్ధపూసలా ఎలా చూస్తున్నాడో చూడండి అని కావ్య అంటే.. రాజ్ నవ్వుతాడు. తర్వాత ఒక వేలు పట్టుకోమ్మని కావ్య అంటుంది. దేనికని రాజ్ అంటే.. మనకు పుట్టేది అమ్మాయా.. అబ్బాయో చూద్దాం అని కావ్య అంటుంది. దాంతో రాత్రే శోభనం అయింది అప్పుడే పిల్లల దాకా వెళ్లావా అని రాజ్ అంటాడు. బిడ్డలు పుడితే పేర్లు పెట్టాలి కదా. ఎవరు పుడితే ఏ పేరు పెట్టాలి అని ఆలోచించాలి కదా. అసలు ఏ హాస్పిటల్‌లో పురుడుపోసుకోవాలి అని కావ్య అంటుంది.

పిల్లల పెళ్లి శోభనంపై కావ్య

అన్నప్రాసణ అయితే కాశీలో అన్నపూర్ణ గుడిలోనే చేయాలి. అక్షరాభ్యాసం బాసర సరస్వతి ఆలయంలోనే చేయాలి అని కావ్య చెబుతుంది. మరి పెళ్లి ఎక్కడ చేద్దామని రాజ్ అంటే.. జైపూర్‌లో ఒక కోట బుక్ చేసి డెస్టినేషన్ వెడ్డింగ్ చేద్దాం అని కావ్య అంటుంది. మరి శోభనం అని రాజ్ అంటే.. మన బూత్ బంగ్లా ఉండనే ఉందిగా. నయా పైసా ఖర్చు లేదని కావ్య అంటుంది. నీ బొంద అప్పుడే అంతదూరం వెళ్లిపోయావేంటే అని రాజ్ అంటే.. కావ్య నవ్వుతుంది.

ఇంతలో కావ్యకు ఫోన్ వస్తే ఎవరని రాజ్ అడుగుతాడు. మా అమ్మ.. కాబోయే అమ్మమ్మ అని కావ్య అంటుంది. దాంతో పిల్లోను కావ్యపై విసురుతాడు రాజ్. అమ్మమ్మనా అమ్మమ్మ ఎవరే అని కనకం అడుగుతుంది.

ఏం లేదని కావ్య అంటుంది. రాత్రి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఏంటని కనకం అడిగితే.. బూత్ బంగలా అని కావ్య చెప్పబోతుంటే నోరు నొక్కేస్తాడు రాజ్. అదేంటే బూత్ బంగలా ఏంటని కనకం అడుగుతుంది. నేను మీ అల్లుడు ఓ రెస్టారెంట్‌కు వెళ్లాం అని కావ్య చెబుతుంది.

మీ నాన్న తండ్రి కాబోతున్నాడా

అవునా.. శుభవార్తేనే. నేను కూడా గుడ్ న్యూస్ చెబుదామనే కాల్ చేశాను. అప్పుకు మంచి సంబంధం వచ్చిందే. ఇవాళ పెళ్లి చూపులు. నువ్ స్వప్న ఇద్దరూ రండి. అల్లుడు గారిని కూడా తీసుకురా అని కనకం అంటుంది. నిజంగా ఇది గుడ్ న్యూసే అమ్మ. తప్పకుండా వస్తాం అని కావ్య కాల్ కట్ చేస్తుంది. ఏంటీ గుడ్ న్యూస్ అంటున్నావ్. మీ నాన్న మళ్లీ తండ్రి కాబోతున్నాడా అని రాజ్ అంటాడు. ఛీ ఆపండి. అవేం మాటలు అని కావ్య అంటుంది.

తర్వాత అప్పు పెళ్లి చూపుల గురించి చెప్పిన కావ్య మీరు కూడా రావాలి అని కావ్య అంటుంది. దాంతో షాక్ అయిన రాజ్ నాకు పని ఉంది. మీరు వెళ్లండని చెబుతాడు. సరే అని స్వప్న దగ్గరికి వెళ్తుంది కావ్య. అప్పుకు పెళ్లి చూపులు అడ్డం పెట్టుకుని కల్యాణ్ మనసులో ఉన్న ప్రేమ బయటపెట్టించాలని రాజ్ అనుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు అప్పుకు పెళ్లి చూపులు అని తెలిసి బంటి వచ్చి అడుగుతాడు.

ముగిసిపోయిన అధ్యాయం

నువ్ చేస్తుంది తప్పు అక్క. నువ్ కల్యాణ్‌ను పెళ్లి చేసుకో అక్కా. కల్యాణ్ మంచి వాడు. నువ్ కూడా ఇష్టపడ్డావ్ కదా. ఇప్పుడు విడాకులు కూడా వచ్చాయి అని బంటి అంటాడు. వాడు కూడా ఇష్టపడాలి కదా. ఫ్రెండ్‌లాగే చూశాడు. విడాకులు వచ్చాయి కదా అని పెళ్లి చేసుకోవాలా. నా ఇష్టానికంటూ రెస్పెక్ట్ లేదా. నా ప్రేమ ఒక ముగిసిపోయిన అధ్యాయం. ఇప్పటికే అమ్మనాన్నలు చాలా బాధపడ్డారు. ఇక వాళ్లని బాధపెట్టాలని లేదు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే వాళ్లు సంతోషిస్తారు అని అప్పు అంటుంది.

మరి నీ సంతోషం అని బంటి అంటే.. అప్పు సైలెంట్‌గా ఉంటుంది. నాకు చెప్పాలనిపించింది చెప్పాను అని బంటి అంటాడు. స్వప్న కావ్య ఇంటికి వస్తారు. దాంతో ఇద్దరూ కలిసి వస్తున్నారని చాలా సంతోషిస్తుంది కనకం. రెండు కళ్లు సరిపోవట్లేదే అని కనకం అంటుంది. అక్కా చెల్లెళ్లు అంటే ఇలా ఉండాలని కృష్ణమూర్తి అంటాడు. ఎక్కడ ఏ వంక పెట్టి అప్పు పెళ్లికి ఒప్పుకోదో అని గుండెదడగా ఉందని కనకం అంటుంది. పెళ్లి చూపులకు ఒప్పుకుంది అది చాలని కావ్య అంటుంది.

కోడలు అయ్యే లక్షణం ఉందా

తర్వాత ఎన్ని అవమానాలు భరించావే అని కావ్య అంటుంది. ఆ అనామికకు చెప్పుతో కొట్టినట్లు చేశారు కదా అని స్వప్న అంటుంది. ఇప్పుడు అదంతా ఎందుకులే అని అప్పు అంటుంది. స్వప్న అలాగే చూస్తే.. ఏంటే అలాగే చూస్తున్నావ్ అని కనకం అడుగుతుంది. దీనిలో ఏ సైడ్ అయినా కోడలు అయ్యే లక్షణం కనిపిస్తుందా అని స్వప్న అంటుంది. దాంతో అంతా నవ్వుతారు. ఇప్పుడు అలా కనిపించేలా మనం రెడీ చేద్దాం అని కావ్య అంటుంది.

మరోవైపు వీడి మనసులో అప్పుపై ప్రేమ ఉందని వీడితోనే చెప్పిస్తాను. రివర్స్ గేరులో వెళ్తాను అని రాజ్ అంటాడు. ఇప్పుడు కథ సుఖాంతం కాబోతుంది. ముగ్గరు అక్కా చెల్లెళ్ల కథ. అప్పు కథ మొదలు కాబోతుంది. కావ్య, స్వప్న వెళ్లిన విషయం తెలియదా. అప్పు ఏం చెప్పలేదా. కళావతి కూడా చెప్పలేదా. ఆఖరికి స్వప్న కూడా చెప్పలేదా అని రాజ్ అంటాడు. ఏం జరిగింది అన్నయ్య. ఇంత టెన్షన్ పెట్టి ఏం చెప్పకుండా వెళ్తున్నావ్. అప్పుకు ఏమైంది అని కల్యాణ్ అడుగుతాడు.

అప్పు జీవితం బాగుండాలని

అప్పుకు మంచి జీవితం ప్రారంభం కాబోతుంది. అప్పుకు ఇవాళ పెళ్లి చూపులు అని రాజ్ చెబుతాడు. దాంతో కల్యాణ్ షాక్ అవుతాడు. చాలా మంచి సంబంధం అట, చాలా మంచివాడు అట. ఎంతైనా అప్పు చాలా అదృష్టవంతురాలు. ఇప్పుడు అనామిక వాళ్ల అందరి నోళ్లు మూతపడతాయి. మీ మధ్య ఉందని అన్నవాళ్లంతా ఏదో ఉందన్నవాళ్లు ఏం లేదని అనుకుంటారు. అంతే కదా. అప్పు జీవితం బాగుండలానే కదా కోరుకున్నావ్ అని రాజ్ అడుగుతాడు.

అవును తటాపటాయిస్తూ అంటాడు కల్యాణ్. అప్పు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతుంది. ఇక ఏ సమస్య ఉండదు కదా అని రాజ్ అంటాడు. కల్యాణ్ బాధపడటం చూసి రాజ్ నవ్వుకుంటాడు. అవును మీరిద్దరు ఫ్రెండ్స్ కదా. అప్పు ఈ విషయం ఎందుకు చెప్పలేదని రాజ్ అంటే.. వదిన స్వప్న కూడా చెప్పలేదని కల్యాణ్ అంటాడు. ఎందుకు చెప్పలేదని రాజ్ ఆలోచిస్తున్నట్లు చేస్తాడు. అయినా ఎలా చెబుతారు. నువ్ వెళ్లి అక్కడ కూర్చుంటే బాగుండదు కదా అని రాజ్ అంటాడు.

అప్పు చేయకుండా

కల్యాణ్ అవును అన్నట్లు తల ఊపుతుంటే.. రాజ్ నవ్వుతాడు. లేనిపోని సమస్యలు వస్తాయని నీకు చెప్పొద్దు అనుకున్నారేమో. రేపు పెళ్లి కూడా ఇలాగే చేస్తారేమో అని రాజ్ అంటే.. కల్యాణ్ మరింత బాధపడతాడు. లేనిపోని నిందలన్ని పోయి అప్పు శాశ్వతంగా అత్తింటికి వెళ్లిపోతుంది. నీకు కావాల్సింది అంతే కదా అని రాజ్ అంటాడు. అప్పు పెళ్లికి వాళ్లు అప్పు చేయకుండా సాయం చేయాలి. అది నేను చూసుకుంటాను అని రాజ్ చెబుతాడు.

కల్యాణ్ బాధపడుతూ ఉంటాడు. అంతే కదా అని అనుకున్నది సక్సెస్ అయిందనుకుని వెళ్లిపోతాడు రాజ్. మరోవైపు అప్పును అందంగా రెడీ చేస్తారు కావ్య స్వప్న. అప్పు మాత్రం కాస్తా ఇబ్బంది పడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

కట్నకానుకలు వద్దు

తర్వాతి ఎపిసోడ్‌లో పెళ్లి చూపులకు వచ్చినవాళ్లకు కట్నకానుకలు ఏం వద్దని చెబుతారు. దాంతో సంతోషించినా కనకం పంతులును ముహుర్తం చూడమంటుంది. వచ్చే శుక్రవారం మంచి ముహుర్తం ఉందని పంతులు చెబుతాడు. తర్వాత అప్పు బయటకు వెళ్తే.. కావ్య, స్వప్న వచ్చి ఏంటే అలా ఉన్నావని అడుగుతారు. కొంపదీసి ఈ పెళ్లిగానీ నీకు ఇష్టంలేదా అని కావ్య అడుగుతుంది.

Whats_app_banner