Brahmamudi Promo: అప్పు అరెస్ట్- కల్యాణ్‌కు జైలు శిక్ష- ఎస్సై వార్నింగ్- రాజ్ కావ్యకు కొత్త సమస్య- సరోజపై వసు సెటైర్లు-brahmamudi guppedantha manasu serial latest episode promo appu kalyan arrest raj kavya has new trouble brahma mudi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi Promo: అప్పు అరెస్ట్- కల్యాణ్‌కు జైలు శిక్ష- ఎస్సై వార్నింగ్- రాజ్ కావ్యకు కొత్త సమస్య- సరోజపై వసు సెటైర్లు

Brahmamudi Promo: అప్పు అరెస్ట్- కల్యాణ్‌కు జైలు శిక్ష- ఎస్సై వార్నింగ్- రాజ్ కావ్యకు కొత్త సమస్య- సరోజపై వసు సెటైర్లు

Sanjiv Kumar HT Telugu

Brahmamudi Serial Latest Episode Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి, గుప్పెడంత మనసు చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్‌లలో ఏం జరగనుందనేది ప్రోమోల్లో చూస్తే..

బ్రహ్మముడి గుప్పెడంత మనసు సీరియల్స్ ప్రోమో

Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో భర్తను క్షమించలేకపోతున్న అపర్ణతో కావ్య మీ నిర్ణయం వల్ల మీరే నష్టపోతున్నారని చెప్పి వెళ్లిపోతుంది. కట్ చేస్తే కల్యాణ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తాడు బంటి. ఆ పోలిస్ స్టేషన్‌లో అప్పు అరెస్ట్ అయి ఉంటుంది. పోలీస్ స్టేషన్ లాకప్‌లో అప్పును చూసి షాక్ అవుతాడు కల్యాణ్.

చితకబాదిన కల్యాణ్

అక్కడ కొంతమంది కట్లు కట్టుకుని కూర్చుంటారు. వాళ్లను చూపిస్తూ అదిగో.. అన్నయ్య వాళ్లే అప్పు గురించి కామెంట్ చేశారు అని బంటి చెబుతాడు. దాంతో పక్కనే ఉన్న కానిస్టేబుల్ దగ్గరున్న కర్ర తీసుకుని పోలీస్ స్టేషన్ అని చూడకుండా వాళ్లను చితకబాదుతాడు కల్యాణ్. పోలీసులు ఆపిన కూడా కల్యాణ్ ఆగడు.

కవి ఆగు.. కవి ఆగు అని అప్పు చెప్పిన ఆగడు. తర్వాత ఎస్సై, ఇతర కానిస్టేబుల్స్ కల్యాణ్‌ను పట్టుకుని ఆగవయ్యా అని ఆపుతారు. వదలండి సార్ వదలండి.. వీళ్ల అంతు చూస్తాను అని కల్యాణ్ అంటాడు. దాంతో ఏయ్.. తీసుకెళ్లి లోపల వేయండయ్యా అని కానిస్టేబుల్స్‌కు ఎస్సై చెబుతాడు. దాంతో కల్యాణ్‌ను కూడా అరెస్ట్ చేసి లాకప్‌లో పెడతారు.

కల్యాణ్‌కు జైలు శిక్ష

కట్ చేస్తే రాజ్‌కు ఆ ఎస్సై కాల్ చేసి కల్యాణ్‌ను అరెస్ట్ చేసినట్లు చెబుతాడు. దానికి షాక్ అయిన రాజ్ ఏంటీ.. కల్యాణ్‌ను అరెస్ట్ చేశారా అని అంటాడు. రాజ్ పక్కనే ఉన్న కావ్య కూడా షాక్ అవుతుంది. కల్యాణ్‌ను ఎందుకు అరెస్ట్ చేశారని రాజ్ ఎస్సైని అడుగుతాడు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నందుకు జైలు శిక్ష కచ్చితంగా పడుతుంది అని ఎస్సై అంటాడు. దాంతో కావ్య రాజ్ ఇద్దరూ షాక్ అయి చూస్తారు.

Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు సీరియల్‌లో దేవయాని తనను బ్లాక్ మెయిల్ చేస్తుందని పెద్దమ్మకు చెబుతుంది అనుపమ. మహేంద్రే మను తండ్రి అన్న విషయం వసుధార రాసిన లెటర్ అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తుందని చెబుతుంది. అందుకే మనును తీసుకుని దూరంగా వెళ్లిపోతామని అనుపమ అంటుంది. కానీ, అందుకు పెద్దమ్మ ఒప్పుకోదు.

మహేంద్రపై అనుపమ ఫైర్

ఒకవేళ నిజం బయటపెడిన పెద్దగా ఏం జరగదని, కంగారుపడాల్సిన అవసరం లేదని, మహేంద్రను మను ఏం చేయడని పెద్దమ్మ చెబుతుంది. కానీ, అనుపమ మాత్రం వినదు. ఇంతలో మహేంద్ర కాల్ చేసి ఎక్కడికి వెళ్లిపోయావ్, ఇంటికి ఎప్పుడు వస్తావని అనుపమను అడుగుతాడు. కానీ, అనుపమ మాత్రం మహేంద్రపై ఫైర్ అవుతుంది.

ఇలా పదే పదే ఎందుకు కాల్ చేసి విసిగిస్తావ్ అని కోప్పడుతుంది అనుపమ. ఆమె ప్రవర్తనకు మహేంద్ర షాక్ అవుతాడు. పక్కనే ఉన్న మను మేడమ్ ఎక్కడున్నారో తెలుసు అని పెద్దమ్మకు కాల్ చేస్తాడు. కానీ, అనుపమ ఆ కాల్ లిఫ్ట్ చేసి వెంటనే ఇంటికి వచ్చేయమని, ఇక మహేంద్ర ఇంటికి తాను రానని, మను వస్తే ఓ విషయం మాట్లాడాలని కాల్ కట్ చేస్తుంది అనుపమ.

నిలదీసిన మను

మరోవైపు వసుధార ట్యూషన్ చెబుతుంటే పరువు తీయాలనుకుంటుంది సరోజ. కానీ, ఇదివరకు వసుధారను తప్పు పట్టిన వాళ్లే పొగుడుతుంటే తట్టుకోలేకపోతుంది సరోజ. రంగాను బుట్టలో వేసుకునేందుకేగా ఈ ట్యూషన్ పనులు అని సరోజ వెటకారంగా అంటే.. నీకు కూడా చదువు రాదు కదా. నీకు కూడా ట్యూషన్ ఫ్రీగా చెబుతాను అని సెటైర్లు వేస్తుంది వసుధార.

మరోవైపు అనుపమ ఇంటికి వెళ్లిన మనుకు ఇకనుంచి మహేంద్రకు దూరంగా ఉందామని అనుపమ చెప్పడంతో షాక్ అవుతాడు. అందుకు ఒప్పుకోడు. తనకు చాలా సహాయం చేసిన వాళ్లను దూరంగా పెట్టలేనని అంటాడు మను. తన మాట వినకుంటే తాను చచ్చినంత ఒట్టేనని అనుపమ గట్టిగా చెబుతుంది. కానీ, అసలు జరిగిన విషయమేంటో చెప్పమని అనుపమను నిలదీస్తాడు మను.