Brahmamudi July 3rd Episode: బ్రహ్మముడి- కల్యాణ్‌పై 3 కేసులు- జడ్జ్ ముందు ఇరుక్కున్న కవి- అప్పును హాజరుపర్చాలని ఆర్డర్
Brahmamudi Serial July 3rd Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 3వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్, అనామిక కేసుపై కోర్టులో విచారణ జరుగుతుంది. కల్యాణ్‌పై అనామిక వరకట్నం కేసుతోపాటు మరో రెండు కేసులు పెడుతుంది. కోర్టులో కల్యాణ్‌పై జడ్జ్‌కు నెగెటివ్ అభిప్రాయం వచ్చేలా ఇరుక్కుంటాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో ఏంట్రా ఇదంతా. ప్రేమించాను అంటే పెళ్లి చేశాం. బంగారంలా చూసుకున్నా ఇలా చేస్తుందని అనుకోలేదురా అని ధాన్యలక్ష్మీ ఏడుస్తూ అంటుంది. నన్ను క్షమించమ్మా తనను ఇంటికి తీసుకొచ్చి తప్పు చేసి మీరు బాధపడేలా చేస్తున్నాను అని కల్యాణ్ అంటాడు. మీరు చేసింది తప్పే అని ఒప్పుకుంటున్నారా అని మీడియా అడుగుతుంది.
అది సమస్యగా మారుతుంది
పడి పడి మీడియా అడుగుతుంది. ఏంట్రా ఇదంతా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఆడదానికి అన్యాయం జరిగిందని తెలిసి వాళ్లు అలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. నిజం తెలిసినరోజు తిట్టిన నోళ్లే పొగుడుతాయి అని కల్యాణ్ అంటాడు. అసలు అలాంటి రోజు వస్తుందంటావా అని ధాన్యలక్ష్మీ అనుమానం వ్యక్తం చేస్తుంది. రాజ్‌ను పక్కకు తీసుకెళ్లిన కావ్య ఏంటండి అలా ఆవేశపడుతున్నారు. ఇప్పుడు మీరు ఏం చేసిన అది కవిగారికి సమస్య అవుతుందని కావ్య అంటుంది.
వాళ్లు అలా నా తమ్మున్ని అంటే ఎలా ఊరుకోవాలని రాజ్ అంటాడు. ఇప్పుడు అంతా మనవైపే తప్పుందని అనుకుంటున్నారు. దాన్ని మనం అబద్ధం అని నిరూపించాలి. నలుగురిలో ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో మీరే నాకు చెప్పారు. ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచనతో ఉండాలన్నారు అని కావ్య అంటుంది. ఇంతలో అనామిక వస్తుంది. దీనంతటికి కారణం అది. నా తమ్ముడు ప్రేమించాడన్న ఒక్క కారణంగా నెత్తినపెట్టుకున్నందుకు ఇలా చేసిందని రాజ్ అంటాడు.
నాదే తప్పు అన్నావ్
నేను ఒకసారి అనామికతో మాట్లాడి చూస్తాను అని కావ్య అంటే.. ఇంత జరిగాక మాట్లాడాల్సింది ఏముంటుంది. కోర్టులోనే తేల్చుకుందాం అని రాజ్ అంటాడు. ఒక ప్రయత్నం చేస్తే తప్పు లేదు కదా అని కావ్య అంటుంది. చూశారా డాడ్ నేను చేసింది తప్పు అన్నావ్. నాకోసం ఇవాళ ఇంతమంది సపోర్ట్‌గా నిలిచారో చూశావా అని అనామిక అంటుంది. నిజం తెలిస్తే వాళ్లంతా అపోజిట్ అవుతారని తండ్రి అంటాడు. అలా జరిగే ఛాన్సే లేదని అనామిక అంటుంది.
అనామికను మీడియా ప్రశ్నలు అడుగుతుంటే కోర్టులో తేల్చుకుంటామని అనామిక వెళ్లిపోతుంది. నువ్ ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావ్. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఓసారి ఆలోచించు అని కావ్య అంటుంది. ఇంతదూరం వచ్చాకా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఏది ఉన్న కోర్టులోనే తేల్చుకుంటాం అని లోపలికి వెళ్లిపోతుంది అనామిక. కావ్య మాట్లాడి అనామికను కేసు వెనక్కి తీసుకునేలా చేస్తుందనుకుని భయపడ్డానని అని రుద్రాణి అంటుంది.
వేరే కేసులు గుర్తుకు రాలేదా
చివరి నిమిషంలో కూడా కావ్య ఏదైనా చేయగలదు. కానీ, ఆదిలోనే దాన్ని ఆపేసి అనామిక తన గోతిలో తానే ఇరుక్కుంది. పదా కోర్టు లోపల ఏం జరుగుతుందో చూద్దాం అని అంతా లోపలికి వెళ్తారు. కోర్టు బోనులో రెండు వైపులా కల్యాణ్, అనామిక నిల్చుంటారు. ఇంతలో జడ్జ్ వచ్చి.. డౌరీ హరాస్‌మెంట్, డొమెస్టిక్ వయెలెన్స్, ఎక్స్‌ట్రా మారిటల్ అఫైర్స్ ఇంకా వేరే కేసులు గుర్తుకు రాలేదా అని అడుగుతాడు. ఆమె కేసు పెట్టిందే రాశాం అని పోలీస్ అంటాడు.
పూర్తిగా ఎంక్వైరీ చేశాకే కస్టడీలోకి తీసుకున్నారా అని జడ్జ్ అంటే.. అవును సర్ అని ఎస్సై అంటాడు. అనామిక వైపు లాయర్ వాదిస్తుంటుంది. పెళ్లికి ముందే అప్పుతో సంబంధం పెట్టుకుని పెళ్లి తర్వాత కొనసాగించాడని, రోజు టార్చర్ చేశాడని, కట్నం కోసం కర్కశంగా వేధించాడని అనామిక లాయర్ అంటుంది. తర్వాత కల్యాణ్ వైపు లాయర్ వాదిస్తాడు. కోర్టు అనుమతిస్తే.. అనామికను ప్రశ్నలు అడగాలని లాయర్ అంటే జడ్జ్ పర్మిషన్ ఇస్తాడు.
మానసిక సంఘర్షణ
పెళ్లికి ముందు కవిత్వం రాస్తాడని తెలుసా అని అనామిక అడిగితే.. తెలుసని అనామిక అంటుంది. దాంతో అనామికకు కల్యాణ్ కవిత్వాలు రాస్తాడాని ముందే తెలుసు. కానీ పెళ్లయ్యకా తనను బిజినెస్ చేయాలని పలు రకాలుగా ఒత్తిడికి తీసుకొచ్చిందని, ఇది ఎవరికీ చెప్పుకోలేని మానసిక సంఘర్షణ అని కల్యాణ్ లాయర్ అంటాడు. దీన్ని నోట్ చేసుకోమని చెబుతాడు. తర్వాత అదనపు కట్నం కోసం వేధించారంటే.. ముందు కట్నం ఇచ్చుంటారు కదా. ఎంత ఇచ్చారని లాయర్ అడుగుతాడు.
కోటి రూపాయల కట్నం ఇచ్చాం అని అనామిక అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. కట్నం తీసుకోవడమే కాదు. ఇవ్వడం కూడా నేరమే. ముందు వీళ్ల నాన్నను లోపల వేయండి అని లాయర్ అంటాడు. తర్వాత మీరు కోటి రూపాయల కట్నం ఇస్తే.. మీ పెళ్లికి ముందు మీకు రెండు కోట్ల అప్పు ఉందని, అది ఇస్తేనే పెళ్లి జరగనిస్తానని ఓ వడ్డి వ్యాపారి వచ్చాడు. అతనెవరు అని లాయర్ అడుగుతాడు. ఎవరు రాలేదు. ఎవరికి మా నాన్న అప్పు లేడని అనామిక అంటుంది.
ఇది సత్యం లేని ఆరోపణ
ఇదంతా నీ సమక్షంలోనే జరిగింది. అతను వస్తే.. కల్యాణ్ అన్నయ్య స్వరాజ్ రెండు కోట్లు ఫ్రీగా ఇచ్చాడు. దానికి సంబంధించిన చెక్ డీటెల్స్, దస్తావేజులు మీకు సమర్పించాను పరిశీలించండి అని లాయర్ అంటాడు. జ్యూవెలరి డిజైన్స్ చేసే స్వరాజ్ గ్రూప్‌కు కట్నం అడగాల్సిన అవసరం లేదు. ఇది సత్యం లేని ఆరోపణ అని కల్యాణ్ లాయర్ అంటాడు. ఇప్పటివరకు అనామిక చెప్పినవన్నీ అబద్ధపు ఆరోపణలు అని లాయర్ అంటాడు.
మరి అనామిక కోర్టుకు ఎందుకు వచ్చినట్లు. తెలిసి కాపురాన్ని నాశనం చేసుకోదు కదా అని జడ్జ్ అంటాడు. కల్యాణ్‌ను అనామిక లాయర్ ప్రశ్నలు అడుగుతానని అడుగుతుంది. అప్పు గురించి, తను పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసింది అడుగుతుంది లేడి లాయర్. వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో సంబంధం ఉందని లాయర్ అంటుంది. అనామిక అందం చూసి మోజులో పడి పెళ్లి చేసుకున్నాడు. అది భరించలేక ఈ పెళ్లిని అడ్డుకోవాలని చూసింది. దానికి సంబంధించిన వీడియో ఫైల్ మీ దగ్గర ఉంచాను అని లాయర్ అంటుంది.
పవిత్రమైన స్నేహం అన్నావ్
అప్పుతో నాకు ఉంది స్నేహం మాత్రమే. నేను తనను వేరే దృష్టితో చూడలేదు. కానీ అప్పు తనకు తెలియకుండానే ప్రేమ పెంచుకుంది. నాకు చెప్పకుండా తనలో తానే దాచుకుందని కల్యాణ్ అంటాడు. తనలో తానే భద్రంగా దాచుకుంటే నీకెలా తెలిసింది. ఇందాకే కదయ్యా.. మీది పవిత్రమైన స్నేహం అన్నావ్. అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతోందా అని జడ్జ్ అంటాడు. అంతేకాకుండా ఇదే విషయమై పోలీస్ స్టేషన్ దాకా వెళ్లిందని లాయర్ అంటుంది.
అప్పుతో మాట్లాడొద్దు అన్నందుకు శ్రీరామనవమి రోజు అనామికను కొట్టాడు అని కేసు ఫైల్ చూపిస్తుంది లాయర్. డిఫెన్స్ గారు కవిగారు అన్నావ్, సున్నితమనస్కుడు అన్నావ్. చేయి చేసుకోవడం ఏంటీ అని జడ్జ్ అడుగుతాడు. అప్పుడు పరిస్థితి వేరు. వీళ్ల స్నేహాన్ని అక్రమ సంబంధంగా మారిస్తే తట్టుకోలేక కల్యాణ్ చేయి చేసుకున్నాడు అని లాయర్ అంటాడు. ప్రతిసారి స్నేహం అనకు. ఇందాకే తను కల్యాణ్‌ను ప్రేమించిందని చెప్పాడు జడ్జ్ అంటాడు.
రేపటివరకు వాయిదా
ఈ భార్యాభర్తల మధ్య చిచ్చుకు కారణమైన ఆ మూడో మనిషి అప్పును కోర్టులో హాజరుపర్చండి. రేపటివరకు వాయిదా వేస్తున్నాను అని జడ్జ్ చెబుతాడు. తర్వాత జడ్జ్ వెళ్లిపోతాడు. కల్యాణ్‌ను పోలీసులు తీసుకెళ్లిపోతారు. ధాన్యలక్ష్మీతోపాటు మిగతా వాళ్లు బాధపడుతుంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
టాపిక్