Brahmamudi July 2nd Episode: బ్రహ్మముడి.. అప్పుతో ఒట్టు వేయించుకున్న కనకం.. తగ్గేదేలేదన్న రాజ్.. అనామిక ఓపెన్ ఛాలెంజ్-brahmamudi serial july 2nd episode kanakam demands to appu anamika challenge to kalyan on case brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi July 2nd Episode: బ్రహ్మముడి.. అప్పుతో ఒట్టు వేయించుకున్న కనకం.. తగ్గేదేలేదన్న రాజ్.. అనామిక ఓపెన్ ఛాలెంజ్

Brahmamudi July 2nd Episode: బ్రహ్మముడి.. అప్పుతో ఒట్టు వేయించుకున్న కనకం.. తగ్గేదేలేదన్న రాజ్.. అనామిక ఓపెన్ ఛాలెంజ్

Sanjiv Kumar HT Telugu
Jul 02, 2024 07:20 AM IST

Brahmamudi Serial July 2nd Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 2వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ విషయం తెలిసిన అప్పు పోలీస్ స్టేషన్‌కు వెళ్తానంటే కనకం వెళ్లకుండా ఒట్టు వేయించుకుంటుంది. న్యాయం మనవైపే ఉందని రాజ్ అంటాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూలై 2వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూలై 2వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో పోయిన పరువు ఎలాగు పోయింది. కనీసం కల్యాణ్ అయినా సంతోషంగా ఉండాలని ధాన్యలక్ష్మీతో అంటాడు రాజ్. నాకేం అర్థం కావట్లేదు. మీకు నచ్చింది చేయండి అని ధాన్యలక్ష్మీ అంటుంది. నువ్ ధైర్యంగా వెళ్లురా. న్యాయం మనవైపే ఉంది. కోర్టులో తేల్చుకుందాం అని రాజ్ అంటాడు. కల్యాణ్‌ను పోలీసులు తీసుకెళ్లిపోతారు.

అడ్డుకున్న కనకం

మరోవైపు అప్పు దగ్గరికి వచ్చిన బంటి కల్యాణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని చెబుతాడు. పాపం కల్యాణ్ మంచి వాడిపై అలా కేసు పెట్టింది. పగవాడికి కూడా అలాంటి పెళ్లాం రాకూడదు అని కనకం అంటుంది. తను మీడియా దాకా వెళ్లింది అంటే అంతా కావాలని చేస్తుంది అని కృష్ణమూర్తి అంటాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్తానని అప్పు అంటే.. కనకం అడ్డుకుంటుంది. ఇప్పుడు తను కేసు పెట్టింది నీతో సంబంధం పెట్టుకున్నాడని, అలాంటింది ఇప్పుడు నువ్ వెళ్తే అదే నిజం అవుతుందని కనకం అంటుంది.

నేను పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడు కల్యాణ్ వచ్చి కాపాడాడు. నువ్ నాకోసం అందరి కాళ్లు పట్టుకున్నావ్. ఏమైనా సాధించావా. వాళ్లందరూ ఏదో అనుకుంటారని నేను ఇలా ఇక్కడే చూస్తూ కూర్చోలేనని అప్పు అంటుంది. తను అరెస్ట్ చేయిస్తే.. నువ్ విడిపించావని పెద్ద రాద్ధాంతం చేస్తారే అని కనకం అంటుంది. అయినా వినకుండా అప్పు పోలీస్ స్టేషన్‌కు బయలుదేరుతుంది. దాంతో నువ్ ఇప్పుడు అడుగు బయట పెడితే నేను చనిపోయినంత ఒట్టు అని ఒట్టు వేయించుకుంటుంది కనకం.

మీ బావ వల్ల కాకుంటే

నీకు వెళ్లాలనిపిస్తే వెళ్లు.. కానీ, నువ్ వచ్చేలోపు నీ అమ్మ బతికి ఉండదని గుర్తుపెట్టుకుని వెళ్లు అని లోపలికి వెళ్లిపోతుంది కనకం. ఏంటీ నాన్న అమ్మ ఇలా చేస్తుంది అని అప్పు అంటే.. తను చెప్పింది కూడా నిజమేరా. ఇన్ని గొడవల మధ్యలో నువ్ వెళ్లడం వల్ల కల్యాణ్‌కు నష్టమే తప్పా లాభం జరగదురా. వాళ్లు డబ్బున్నవాళ్లురా. కల్యాణ్ అలా ఉంటే మీ బావ ఏం చేయలేడనుకున్నావా. వాళ్ల వల్ల కానప్పుడు నువ్ వెళ్లడంలో అర్థం ఉంది. ఇప్పుడు నువ్ తోడు ఉండటం తప్పా చేసేదేం లేదు అని కృష్ణమూర్తి అంటాడు.

మరోవైపు మంచి లాయర్‌ను చూడమని, ఎక్కడ తగ్గేది లేదు. కేసు బలంగా పెట్టాలని ఫోన్‌లో రాజ్ మాట్లాడుతాడు. అది విన్న కావ్య మీరు కూడా ఆవేశపడుతున్నారా. ఎప్పుడు ఆలోచించి అడుగు వేసే మీరు ఎందుకు తప్పటడుగు వేస్తున్నారు అని కావ్య అంటుంది. కల్యాణ్‌ను తన కాళ్లమీద పడమంటావా. ఎన్ని చర్చలు జరిపినా తను వినదు. నిన్ను, నీ కుటుంబాన్ని, అప్పుని ఎన్నో అంది. నిజానికి నీకే ఎక్కువ పౌరుషం రావాలి. నువ్ ఎవరి కోణంలో ఆలోచిస్తున్నావా నాకు అర్థం కావడంలేదని రాజ్ అంటాడు.

దారుణమైన పరిస్థితుల్లోకి

విడదీడయం ఎంతసేపు అండి. మీకు చెప్పేదాన్ని కాదు. కానీ, ఓసారి ఆలోచించమని చెబుతున్నాను అని కావ్య వెళ్లిపోతుంది. ఇంతలో వచ్చిన అపర్ణ కూడా కావ్య చెప్పేది నిజమే. అనామి తొందరపడింది కదా అని మనం కల్యాణ్‌కు విడాకులు ఇప్పిస్తే ఎలా అని అపర్ణ అంటుంది. ఇప్పుడు ఊరుకుంటే తను కల్యాణ్‌ను ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. అప్పుడు మనమే తప్పు చేశామని బాధపడుతుంది. అనామిక ఏం అనుకుంటుందో నాకు బాగా అర్థమైంది. కోడలు, భార్య, ఆడపిల్ల ఎలా ఉండాలి. ఇవన్నీ కావ్య నుంచి నేర్చుకోవాలి అని రాజ్ అంటాడు.

నువ్ ఎంత దూరం పెట్టిన ఓర్చుకుంది. మామకు కష్టమస్తే ఆదుకుంది. నీకు ఆరోగ్యం బాగా లేకుంటే కూతురిలా చూసుకుంది. ఏం జరిగిన ఇంటి గుట్టు బయటపెట్టలేదు. వీటిలో ఏ ఒక్కటైనా అనామిక చేయగలదా అని రాజ్ అంటే.. ఏంట్రీ నీ పెళ్లాన్ని ఆ బరితెగించినదాంతో పోలుస్తూ నీ భార్య పరువు తీస్తున్నావ్. ఇంకా ఏం చూడాల్సి వస్తుందో అని భయంగా ఉందని అపర్ణ అంటుంది. ఏం కాదమ్మా. న్యాయం మనవైపు ఉంది అని రాజ్ అంటాడు.

మనం సహాయం చేయకుంటే ఎలా

నువ్ ఎంత చెప్పినా నాకెందుకో భయంగానే ఉందని అపర్ణ చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు రుద్రాణి నవ్వుతుంది. అనామిక ఇంత తింగరిదని అనుకోలేదు. మీడియాకెక్కుతుందని తెలుసు కానీ ఇలా అరెస్ట్ చేయిస్తుందని తెలీదు. వీళ్లు భయంతో కాళ్ల బేరానికి వస్తారనుకుంటుంది. కానీ, విడాకులు ఇస్తారని తెలీదు. ఇంత చేస్తున్న దానికి మనం సహాయం చేయకుంటే ఎలా. కల్యాణ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అక్కడ మీడియా ఉండి ప్రశ్నల మీద ప్రశ్నలు వేయాలి. అది అనామిక అకౌంట్‌లోకే వెళ్తుందని రుద్రాణి అంటుంది.

ఒకవేళ కల్యాణ్‌కు కోర్టులో శిక్ష పడితే ఎలా అని రాహుల్ అంటాడు. అనామిక ఇంటికి వచ్చిన నష్టమే. విడాకులు తీసుకున్న పోయినపరువుకు ఇంట్లో వాళ్లు బాధపడుతారు. ఏది జరిగినా మనకే లాభం అని రుద్రాణి అంటుంది. సరే నువ్ చెప్పినట్లు చేస్తానని రాహుల్ వెళ్లిపోతాడు. పోలీస్ స్టేషన్ ముందు అంతా ప్లకార్డ్స్ పట్టుకుని కల్యాణ్‌ డౌన్ డౌన్ అని, అతనికి శిక్ష పడాలని గోల చేస్తుంటారు. దుగ్గిరాల కుటుంబం గురించి మంచిగానే చెప్పి అలాంటి ఇంట్లో కోడలికి రక్షణ లేదని న్యూస్ యాంకర్ చెబుతుంది.

మీడియా ప్రశ్నలు

ఇంతలో వచ్చిన రాజ్ వాళ్లు అది చూసి బాధపడుతారు. ధాన్యలక్ష్మీ చాలా ఏడుస్తుంది. వాళ్లేం అడిగిన నువ్ ఏం మాట్లాడకు పిన్ని అని రాజ్ అంటాడు. వాళ్ల దగ్గరికి మీడియా వచ్చిన నానా రకాల ప్రశ్నలు వేస్తారు. కల్యాణ్ అనామికను టార్చర్ పెట్టారా, అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా. ఇది ఇప్పుడే జరిగిందా.. చాలా రోజుల నుంచి జరుగుతుంటే బయటకు రాకుండా చేశారా అని మీడియా అంటుంది. నేను చెప్పేది వింటారా మీకు నచ్చింది రాస్తారా అని రాజ్ అంటుంది.

ఎలాంటి మచ్చ లేని ఫ్యామిలీ ఇవాళ మీకు సాడిస్ట్‌లా కనిపిస్తున్నామా అని రాజ్ అంటే.. మీరుండండి అని కావ్య మాట్లాడుతుంది. ఇంత పెద్ద ఫ్యామిలీపై ఒక అమ్మాయిపై నిందలు వేయగానే తను చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మేస్తే ఎలా అని కావ్య అంటుంది. అంటే అనామికనే తప్పుడు అలిగేషన్ పెట్టిందా. అలా తన జీవితాన్ని తానే ఎందుకు నాశనం చేసుకుంటుంది అని మీడియా వాళ్లు అడుగుతారు.

న్యాయం మా వైపే ఉంది

నేను ఆ ఇంటి కోడలినే. మధ్య తరగతి నుంచి అనుకోని పరిస్థితుల్లో ఆ ఇంటికి కోడలిగా వెళ్లాను. నేను బాగా లేనా. మా అక్క కూడా బాగానే ఉంది. అనామిక అపార్థం చేసుకుంది అంటున్నాను అని కావ్య అంటే.. కల్యాణ్ సంబంధం పెట్టుకుంది మీ చెల్లితోనే అటకదా. అందుకే సపోర్ట్ చేస్తున్నారా అని మీడియా అడుగుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్పిన మీరు నమ్మరని అర్థం అయింది. మా కల్యాణ్ ఏ తప్పు చేయలేదు. న్యాయం మా వైపే ఉంది. కోర్టులో మాకే అనుకూలంగా తీర్పు వస్తుందని కావ్య అంటుంది.

ఇంతలో కల్యాణ్‌ను పోలీసులు తీసుకొస్తారు. కల్యాణ్ ఈ గొడవ అంతా చూస్తాడు. ఏవండి మన బిడ్డ అండి. మహారాజులా ఉండేవాడు ఇలా దోషిగా నిలబడిపోయాడండి అని ధాన్యలక్ష్మీ ఏడుస్తుంది. అనామిక లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇలాగే అవుతుంది అని ప్రకాశం అంటాడు. వీళ్లందరూ కలిసి నా కొడుకు శిక్ష పడేలా చేస్తారని అనిపిస్తుందని ధాన్యలక్ష్మీ అంటుంది. మీడియా అడిగిన ప్రశ్నలకు కల్యాణ్ సరైన సమాధానాలు చెబుతాడు.

సాక్ష్యాలు కావాలి

అయినా మీడియా కావాలనే అంటుంటే రాజ్ అడ్డుకుంటాడు. కానీ, ఆవేశపడకండి అని రాజ్‌ను కావ్య తీసుకెళ్లిపోతుంది. ఏంట్రా ఇలా అవుతుంది నీకు అని ధాన్యలక్ష్మీ ఏడుస్తూ అంటే.. క్షమించమ్మా. అనామిక లాంటి ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చి మీరు బాధపడేలా చేస్తున్నాను అని కల్యాణ్ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో అనామికను కల్యాణ్ టార్చర్ పెట్టలేదని సాక్ష్యాలు నిరూపిస్తే గానీ గెలవలేం అని లాయర్ చెబుతాడు. ఇంతలో వచ్చిన అనామిక వీలైతే ఆ సాక్ష్యాలు తీసుకురండి చూద్దాం అని అనామిక ఛాలెంజ్ చేస్తుంది.

Whats_app_banner