Brahmamudi June 27th Episode: బ్రహ్మముడి- భార్య ప్లాన్ బయటపెట్టిన కల్యాణ్- అనామికకు ఎఫైర్- చెంపచెల్లుమనిపించిన అత్త-brahmamudi serial june 27th episode kalyan reveals anamika plan and dhanyalaxmi slaps anamika brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi June 27th Episode: బ్రహ్మముడి- భార్య ప్లాన్ బయటపెట్టిన కల్యాణ్- అనామికకు ఎఫైర్- చెంపచెల్లుమనిపించిన అత్త

Brahmamudi June 27th Episode: బ్రహ్మముడి- భార్య ప్లాన్ బయటపెట్టిన కల్యాణ్- అనామికకు ఎఫైర్- చెంపచెల్లుమనిపించిన అత్త

Sanjiv Kumar HT Telugu
Jun 27, 2024 07:36 AM IST

Brahmamudi Serial June 27th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 27వ తేది ఎపిసోడ్‌లో రాజ్ కావ్య శోభనం కల్యాణ్ వల్ల ఆగిపోతుంది. అప్పు తను మీడియాకు దొరకడం అనామిక ప్లాన్ అని కల్యాణ్ నిజం బయటపెడతాడు. దాంతో అనామికను కొడుతుంది ధాన్యలక్ష్మీ. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూన్ 27వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూన్ 27వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో సీతారామయ్య, ఇందిరాదేవి గదికి రాజ్ కావ్య వెళ్తుంటారు. దారిలో ఇవాళ అందరూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని రాజ్ అనుమానం వ్యక్తం చేస్తే కావ్య అవును అంటుంది. వాళ్లిద్దరిని చూసి ప్లాన్ సక్సెస్ అన్నట్లుగా ఇంట్లోవాళ్లు సంతోష పడుతూ హై ఫై ఇచ్చుకుంటారు. అపర్ణకు సుభాష్ ఇవ్వపోతే కోపంగా చూస్తుంది. దాంతో సుభాష్ ఆగిపోతాడు.

అదోల ప్రవర్తించారు

మరోవైపు వీళ్లందరిని గమనించిన రుద్రాణి నేను కాల్చిన అగ్గి పుల్ల ఇంకా చిచ్చు పెట్టట్లేదు ఏంటీ అని ఆలోచిస్తుంది. రాజ్ కావ్య గదిలోకి వెళ్లగానే అంతా చీకటిగా ఉంటుంది. ఇక్కడ లైట్ స్విచ్ కోసం కాస్తా కామెడీ నడుస్తుంది. రాజ్ లైట్ ఆన్ చేయగానే శోభనం డెకరేషన్ చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఇదన్నమాట అసలు సంగతి, వాళ్లంతా అదోల ప్రవర్తించింది దీనికేనా అని రాజ్ అంటాడు. ఇందులో అత్తయ్య గారి ప్రమేయం కూడా ఉందని చెబుతుంది కావ్య.

తర్వాత ఇద్దరికీ ఇద్దరూ ఎవరికీ వారు ప్లాన్ చేశారని అనుకుంటారు. రాజ్ కావ్య ఇద్దరూ కూడా తాము కాదని క్లారిటీ ఇచ్చుకుంటారు. తర్వాత ఇద్దరు గొడవ పడతారు. ఇంతలో రాజ్ ఆత్మ వచ్చి ఎవరు అరెంజ్ చేస్తే ఎంట్రా దద్దమ్మా. కావాల్సిందే జరుగుతుంది కదా. ఇవాళ నీ మనసులో మాట చెబుతానని చెప్పావు కదా. ఇంతకన్నా ప్రైవసీ దొరకదు. శోభనం కానివ్వు అని అంటుంది. కానీ రాజ్ ఒప్పుకోడు. నా ఉసురు తగులుతుందని రాజ్ ఆత్మ అంటుంది.

నీతో మాట్లాడాలి

దాంతో సరేలే మరి అంత బలవంత పెట్టకు అని రాజ్ గట్టిగా అంటాడు. దానికి నేనా బలవంతం పెట్టింది. అసలు నేను ఏమైనా మాట్లాడానా. మీరు అరెంజ్ చేయించి నన్ను అంటున్నారా. సరే చేయిస్తే చేయించారా. పూల పక్క.. నా పక్క.. పాలు కావాలా. పండు, స్వీట్స్ కావాలా అని కావ్య అడిగితే.. రాజ్ ప్రతిదీ వద్దంటాడు. మరి ఏం కావాలని కావ్య అంటే.. నువ్వే కావాలి. నీతో మాట్లాడాలి అని రాజ్ అంటాడు. దానికి ఆశ్చర్యపడిన కావ్య ఇవాళ మాటలు లేవు అని కావ్య అంటుంది.

తర్వాత సరే చెప్పండి అని కావ్య అంటుంది. కాసేపు తటాపటాయిస్తాడు రాజ్. తర్వాత కావ్య దగ్గరికి ప్రేమగా వెళ్లిన రాజ్ ఆమె చెంప తాకాలనుకుంటాడు. ఈ సీన్ రొమాంటిక్‌గా బాగుంటుంది. అలాగే కానీ అన్నట్లుగా ఆతృతగా చూస్తుంది రాజ్ అంతరాత్మ. కానీ, ఇంతలో అనామిక అంటూ ఫ్లవర్ వాజ్ ఎత్తేస్తాడు కల్యాణ్. దాంతో ఏంటా శబ్ధం అని ఇద్దరూ వెళ్లిపోతారు. దాంతో ఇక అవ్వదురా. నీకు శోభనం అవ్వదురా అని బాధపడుతుంది రాజ్ అంతరాత్మ.

భర్తను ఎందుకు అవమానిస్తావ్

అనామిక అని కల్యాణ్ గట్టిగా అరుస్తుంటే.. ఇంట్లో అందరూ వస్తారు. చాలా సేపు తర్వాత అనామిక వస్తుంది. ఏంటీ తప్పు చేసినదానిలా పిలుస్తున్నావ్. భయపడి పరుగెత్తుకుంటూ వస్తానని అనుకున్నావా అని అనామిక అంటుంది. నువ్ ఆడదానివి అయితే, ఇంట్లోవాళ్లు సరిగా పెంచి ఉంటే భర్తను ఎందుకు అవమానిస్తావ్ అని కల్యాణ్ అంటాడు. ఇప్పుడు ఏంటీ నీ పంచాయితీ అని అనామిక అంటుంది. దాంతో పేపర్స్ విసిరేస్తాడు కల్యాణ్.

ఏంట్రా ఆ పేపర్స్ అని అంతా అడిగితే.. విడాకుల పేపర్స్. నా భార్య అయిన ఈ దరిద్రురాలి నుంచి విడాకులు కోరుకుంటున్నట్లు కోర్ట్ పేపర్స్ అని కల్యాణ్ చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. నువ్ తప్పు చేసి, అప్పుతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికి.. ఇప్పుడు ఇలా చేసి అప్పుతో ఉండాలని అనుకుంటున్నావా అని అనామిక అంటుంది. దాంతో అనామిక అని కొట్టేందుకు చేయి ఎత్తుతాడు కల్యాణ్. కానీ, ఆగిపోతాడు. అంతా అవాక్కవుతారు.

అనామికనే కారణం

ఆ తప్పు నేను చేశానా. అది తప్పులా కనిపించేలా నువ్ చేశావ్ అని కల్యాణ్ అంటే.. నేను చేయడమేంటీ నామీదకు నెడుతున్నావేంటీ అని అనామిక అంటుంది. ఆరోజుతో అప్పుతో నేను హోటల్‌లో ఉన్నాను అని తెలిసి మీడియాను పిలిచి అల్లరి చేసింది కదా. అదంతా జరిగేలా చేసింది, మేము అల్లరి పాలు కావడానికి కారణం ఈ అనామికనే అని కల్యాణ్ అంటాడు. అంతా షాక్ అవుతారు. ఏంటో నువ్వే అనామికను అపార్థం చేసుకుంటున్నావేమో అని రుద్రాణి అంటుంది.

నువ్ రాగాలు తీయకు. సాక్ష్యాలు ఉన్నాయంటున్నాడు కదా. అంతవరకు ఆగు అని స్వప్న అంటుంది. దాంతో సాక్ష్యం ఉందని హోటల్ సీసీ టీవీ ఫుటేజ్ చూపిస్తాడు కల్యాణ్. అందులో హోటల్‌లో జరిగింది చూపిస్తారు. దాంతో అనామిక కంగారుపడుతుంది. అది చూసి కావాలనే ఇరికించారు అని ప్రకాశం అంటాడు. నేనా గడియ పెట్టింది. వాడెవడో గడియ పెట్టాడు అని అనామిక అంటే.. వాడు ఇక్కడే ఉన్నాడు అని రాము అంటూ కల్యాణ్ పిలుస్తాడు.

ఎందుకు డబ్బులు పంపించావ్

లోపలికి వెళ్లగాని గడియపెట్టమని చెప్పింది ఎవర్రా అని అతన్ని కల్యాణ్ అడిగితే.. ఈ మేడమే సార్ అని అనామికను చూపిస్తాడు అతను. దాంతో నాకేం తెలియదు. ఇదంతా అప్పు కల్యాణ్ కలిసి ఆడిన నాటకం అని అర్థం అవుతోంది. నన్ను వదిలించుకోడానికి ఇలా చేస్తున్నారు అని అనామిక అంటుంది. ఇంకా మామీదే బురద జల్లాలని చూస్తున్నావా. నువ్ ఇలా ఎందుకు నమ్ముతావ్ అని వాడి ఫోన్ తీసుకుంటాడు కల్యాణ్.

మరి నీ అకౌంట్‌ నుంచి వీడికి ఎందుకు డబ్బులు పంపించావ్. నేను కూడా నిందలు వేయగలను. వీడికి ఎందుకు డబ్బు పంపించావ్. వాడికి నీకు ఏంటీ సంబంధం అని కల్యాణ్ అంటాడు. వాడిని వెళ్లమని కోర్టుకు వచ్చి చెప్పాలని కల్యాణ్ అంటాడు. దాంతో ఎక్కడికంటే అక్కడికి వచ్చి చెబుతాను అని వాడు వెళ్లిపోతాడు. అనామిక నిజం ఒప్పుకో. ఎందుకు చేశావ్ అని ధాన్యలక్ష్మీ నిలదీస్తుంది. నేనే చేశాను. అయితే ఏంటీ అని అనామిక అంటుంది.

చెంప వాయించిన ధాన్యలక్ష్మీ

నేను భార్యగా పనికిరానా. నేనే కావాలని గడియపెట్టించాను. ఎప్పుడు దొరుకుతారని చూసి చేయించాను. నాతో కాపురం చేయకుండా దాంతో తిరుగుతావా. అందుకే ఇలా చేశాను. దాంట్లో తప్పేముంది. మీ ఇద్దరి మధ్య సంబంధం ఉంది గట్టిగా వాదిస్తుంది అనామిక. దాంతో అనామికని అందరిముందే చెంపలు వాయిస్తుంది ధాన్యలక్ష్మీ. దాంతో అంతా షాక్ అవుతారు. రాక్షసి.. నువ్ అసలు మనిషివేనా. నువ్ ఇప్పటిదాకా ఎన్ని తప్పులు చేసిన బయటపెట్టలేదు అని ధాన్యలక్ష్మీ అంటుంది.

పది లక్షలు దొంగతనంగా ఇంటికి పంపినా, నా కొడుకును ఎన్ని మాటలు అన్నా.. సర్దుకు పోతారని చూశాను. నా కొడుకునే మందలించాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో పెద్దమ్మా ఈ గొడవల వల్ల నీ ఆరోగ్యం దెబ్బతింటుందని భయంగా ఉంది. దీనిక పరిష్కారం ఒక్కటే అని కల్యాణ్ అంటుంటే.. నాకు విడాకులు ఇవ్వాలి అని అనామిక అంటుంది.

మొహం పగులగొట్టేదాన్ని

నువ్వే నా చెల్లివి అయితే మొహం పగులగొట్టేదాన్ని అని కావ్య అంటుంది. నీ చెల్లి నాలా గుట్టుగా ఎందుకు ఉంటుంది. పెళ్లయిన వాడితో బలాదూర్ తిరుగుతుంది అని అనామిక అంటే.. మళ్లీ కల్యాణ్ కోపంతో చేయి ఎత్తుతాడు.

 

WhatsApp channel