Brahmamudi June 28th Episode: బ్రహ్మముడి- మళ్లీ అనామిక లొల్లి- ప్రకాశం, అపర్ణను అవమానించిన కోడలు- బుద్ధి లేదంటూ!
Brahmamudi Serial June 28th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 28వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్, అనామికలు కలిపేందుకు రాజ్, కావ్య ప్రయత్నిస్తారు. అనామికకు రాజ్ నచ్చజెప్పుతాడు. కల్యాణ్‌కు కావ్య సర్దిచెబుతుంది. కానీ, రుద్రాణి మాటలు విన్న అనామిక మళ్లీ రచ్చ చేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో అనామిక చేసిన తప్పును కల్యాణ్ బయటపెడతాడు. దాంతో అనామిక చెంప పగులగొట్టిన ధాన్యలక్ష్మీ కోప్పడుతుంది. ఇన్నాళ్లు నువ్వెన్ని త్పపులు చేసిన నా కొడుకును మందలించాను. నిన్నే వెనుకేసుకొచ్చాను. ఇంటి కోడలిగా నువ్ తప్పు చేసినదానిలా మిగిలిపోకూడదని చూశాను. కానీ లోకం దృష్టిలో నా కొడుకును చెడ్డవాన్ని చేశావ్ అని ధాన్యలక్ష్మీ కన్నీళ్లతో బాధగా చెబుతుంది.
మరో ఇంటి నుంచి వచ్చాం
నా కొడుకును అవమానించావ్. ఇంకా అదేదో ఘనకార్యంలా చెబుతున్నావ్. ఇదే ఇంకో ఇంట్లో జరిగి ఉంటే కొట్టిన చోట కొట్టకుండా ఉండేవాళ్లు. నా కొడుకులో దుగ్గిరాల రక్తం ప్రవహిస్తుంది కాబట్టే చేయి చేసుకోకుండా ఆగిపోయాడు అని ధాన్యలక్ష్మీ అంటుంది. స్వప్న వచ్చి మీరు కాబట్టి ఆగిపోయారు ఆంటీ. మేము మరో ఇంటి నుంచి వచ్చాం కదా. అనామిక సంగతి నాకు కావ్యకు అప్పజెప్పండి అని అనామికను కొట్టబోతుంది స్వప్న.
ఇంతలో కావ్య అడ్డుకుంటుంది. కొట్టడం ఎంతసేపు. చేయి గాల్లోకి లేచినంత సేపు పట్టదు చెంపకు తగలడానికి. అప్పుకు అన్యాయమే జరిగింది. నింద పడింది. కానీ, ఇది భార్యాభర్తల విషయం. దీనివల్ల కవిగారి కాపురం ముక్కలు కాకూడదు అని కావ్య అంటుంది. చూశావా ఒక ఆడది అంటే ఎలా ఉండాలో మా కావ్యను చూసి నేర్చుకో. అయినా మనకు అలాంటి సీన్ లేదులే అని స్వప్న అంటుంది. అనామిక ఇంకా నువ్ ఇక్కడ ఉండటం మంచిది కాదు వెంటనే నీ గదిలోకి వెళ్లు అని సుభాష్ అంటాడు.
నిందలు వేస్తుంది
దాంతో అనామిక పైకి వెళ్లిపోతుంది. అందరూ ఉన్నారు. చుట్టూ నా వాళ్లే ఉన్నారు. చెల్లికి అన్యాయం జరిగిన తొందరపడకూడదనే వదిన కూడా ఉంది. ఇలాంటి మనుషుల మధ్య అలాంటి ఆడది ఉండకూడదు. అనామిక కేవలం నన్ను ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంది. నేను బిజినెస్ చూసుకోను అని చెప్పడంతో భరించలేక ఇలాంటి నిందలు వేసి బజారున పడేసింది. కాబట్టి, నేను అనామికకు కచ్చితంగా విడాకులు ఇస్తాను. నేను జీవితంలో తనను క్షమించను అని కల్యాణ్ వెళ్లిపోతాడు.
తర్వాత ఇంట్లో జరిగే సంఘటనల గురించి రాజ్ కావ్య మాట్లాడుకుంటారు. కల్యాణ్‌కు కవిత్వం, రసజ్ఞత ఆస్వాదిస్తూ పెరిగాడు. వాడికి ఇలాంటివి తెలియవు. వాడు చాలా మానసికంగా డిస్టర్బ్ అయ్యాడు అని రాజ్ అంటాడు. అలా అని వాళ్లు విడిపోవాలను అనుకోకూడదు. కల్యాణ్, అనామిక ఎలా కలిసి ఉండాలో ఆలోచిద్దాం అని కావ్య అంటుంది. దాంతో రాజ్ చూస్తే.. తప్పుగా మాట్లాడనా అని కావ్య అడుగుతుంది. అనామిక నీ చెల్లిపై కావాలనే నింద వేసింది, క్యారెక్టర్ తప్పుబట్టింది. నీకు కోపం రాలేదా అని రాజ్ అడుగుతాడు.
కల్యాణ్ తట్టుకోలేడు
నిన్ను స్వప్ను ఏదో ఒకటి తప్పు బడుతూనే వచ్చింది. అయానా అవతలి వ్యక్తి నుంచి ఆలోచించే ఔన్యత్వం ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నాను. కోపం వచ్చింది కదా అని వాళ్ల చెడు కోరుకుంటామా. ఎలాగైన వాళ్లిద్దరి మధ్య బంధం పెరిగేలా చూడాలి అని కావ్య అంటుంది. అవును, వాళ్లు విడిపోతే కల్యాణ్ తట్టుకోలేడు. అసలే వాడి మనసు చాలా సున్నితంగా ఉంటుంది అని రాజ్ అంటాడు. వాళ్లు కలవడానికి ఏం చేయాలో ఆలోచిద్దాం అని ఇద్దరూ అనుకుంటారు.
మరుసటి రోజు అనామిక ఒంటరిగా కూర్చుని ఉంటే రుద్రాణి చూస్తుంది. పాపం జరిగినదానికి బిడ్డ దడుసుకున్నట్లు ఉంది. కాస్తా రెచ్చగొడితే దారిలో పడుతుంది అని రుద్రాణి అనుకుంటుంది. ఇంతలో రాజ్ వచ్చి అనామికతో ఏంటిది. ఈ గొడవలన్నీ అవసరమా. ఇద్దరూ సంతోషంగా ఉండాలనే కదా పెళ్లి చేశాం. కానీ, నువ్వే కల్యాణ్ మనసు బాధపెడతావ్ అని అడుగుతాడు. ఈ మాటలు చాటుగా రుద్రాణి వింటుంది. జరిగిన దాంట్లో నాది మాత్రమే తప్పుందా బావగారు అని అనామిక అంటుంది.
రాజ్ చెడగొట్టేలా ఉన్నాడే
నేను ఇక్కడికి వచ్చింది ఎవరిదో ఎంత తప్పుందో లెక్కలు తేల్చడానికి కాదు. భార్యాభర్తలు అన్నాకా గొడవలు మాములే. అవి సూర్యస్తమయంలా కరిగిపోవాలి కానీ, ఇలా దూరం అయ్యేదాకా తెచ్చుకోవద్దు అని నచ్చ జెప్పుతాడు రాజ్. అది విన్న రుద్రాణి వామ్మో ఇంత ప్లాన్ చేసి విడగొడదామనుకుంటే రాజ్ అంతా చెడగొట్టేలా ఉన్నాడే అనుకుంటుంది. నిజంగా కల్యాణ్ నీకు అన్యాయం చేస్తున్నాడని ఫీల్ అవుతున్నావా అని రాజ్ అడిగితే.. అనామిక మౌనంగా ఉంటుంది.
నీ మౌనమే సమాధానం చెబుతుంది. కల్యాణ్ అలాంటివాడు కాడు. ఒకసారి మనసు విప్పి మాట్లాడు. గొడవలు పడితే సమస్య ఇంకా పెద్దది అవుతుంది అని చెప్పి వెళ్లిపోతాడు రాజ్. తర్వాత రుద్రాణి వస్తుంది. రాజ్ కరెక్ట్‌గా చెప్పాడు. నువ్ ఇలా గొడవలు పడితే లాభం లేదు. కూల్‌గా డీల్ చేయాలని నేను కూడా చెప్పాను. తొందరపడి ఇక్కడిదాకా తెచ్చుకున్నావ్ అని రుద్రాణి అంటుంది. నేను మాట్లాడిన కల్యాణ్ వినడు అని అనామిక అంటుంది.
మంచి ఐడియా ఇచ్చారు
నువ్ మాట్లాడితే గొడవ అవుతుంది. అందుకే మీ అమ్మనాన్నను పిలిపించి పంచాయితీ పెట్టించు. పెళ్లి చేసుకుంది విడాకులు ఇచ్చేందుకా అని అడిగించు. అప్పుడు అంతా మాట్లాడి కలిపుతారు అని రుద్రాణి అంటుంది. మంచి ఐడియా ఇచ్చారు. వెంటనే వాళ్లను రమ్మని కబురు పెడతాను అని వెళ్లిపోతుంది అనామిక. చదువుకున్న దానివి నేను ఏది చెబితే అలా నమ్మేస్తావేంటీ అనామిక. ఇప్పుడు వాళ్లు వస్తే గొడవ మరింత పెద్దది అవుతుంది అని రుద్రాణి అనుకుంటుంది.
మరోవైపు కల్యాణ్ చీకటి గదిలో బాధపడుతూ ఉంటాడు. కావ్య వచ్చి మాట్లాడుతుంది. చీకటి, వెలుగు, ప్రేమ, పెళ్లి అని మాట్లాడుకుంటారు. లైట్ ఆన్ చేస్తుంది కావ్య. చూశారా కవిగారు వెలుగు రాగానే కన్నీళ్లు తుడుచుకున్నారు. అదే జీవితం. ఒకరిని ప్రేమించినప్పుడు వాళ్ల తప్పులను క్షమించాలి. లేదన్నప్పుడు తప్పుకోవాలి అని కావ్య అంటుంది. నేను తనను పెళ్లి చేసుకుని చాలా తప్పు చేశాను అని కల్యాణ్ అంటాడు.
అనుమానం తప్పా ఇంకేం లేదు
అనామిక చేసిన తప్పులన్ని క్షమించాలని అనుకున్నా. కానీ నా మీద పంతంతో నా ఫ్రెండ్ జీవితంతో ఆడుకుంది. అది క్షమించలేను అని కల్యాణ్ అంటాడు. తను చాలా పెద్ద తప్పు చేశాను. కానీ, తన వైపు ఆలోచించారా. తను ఏం కోరుకుంటుందో ఆలోచించారా. అప్పుతో మీకున్న స్నేహం తనకు నచ్చలేదు. అలాంటప్పుడు అనామికకు నచ్చినట్లు ఉండాలని ఒక్కసారి ఆలోచించారా అని కావ్య అడుగుతుంది. ఆలోచించాను. కానీ, అందులో అనామికకు అనుమానం తప్పా ఇంకేం లేదని కల్యాణ్ అంటాడు.
పెళ్లి కాకముందు అనామిక కోసం ఎన్నోసార్లు ప్రయత్నించారు. అదే ప్రయత్నాన్ని ఇప్పుడెందుకు చేయలేకపోతున్నారు. భార్య తప్పు చేస్తే సరిదిద్దాలి కానీ. విడిపోతానంటే భార్యాభర్తలే ఉండరు అని కావ్య నచ్చజెప్పుతుంది. కారణాలు చూపించి ఒంటరిగా మిగిలిపోకండి. ఒకమెట్టు దిగి కిందకు రండి మీరు కోరుకున్న ప్రేమ మళ్లీ దక్కుతుంది. నాతో పాటు వచ్చి అనామికతో మాట్లాడుతున్నారు. తనను మీరే కన్విన్స్ చేస్తున్నారు అని కల్యాణ్‌ను కిందకు తీసుకొస్తుంది కావ్య.
మొహం పగులగొట్టేదాన్ని
హాల్లో అంతా ఉంటారు. పెద్దమ్మ ఈ గొడవలు, సమస్యల వల్ల మీ ఆరోగ్యం ఏమవుతుందో అని భయంగా ఉంది. ఈ గొడవలు తగ్గాలంటే అని కల్యాణ్ చెప్పబోతుంటే నాకు విడాకులు ఇవ్వాలి అంతే కదా అని అనామిక అంటుంది. అదే కదా నువ్ చెప్పాలి అనుకుంటుంది. ఇప్పుడు నీకు పెద్దమ్మ సాకుగా దొరికింది నాకు విడాకులు ఇవ్వడానికి అని అనామిక అంటుంది. నువ్వే గనుక నా చెల్లెలివి అయుంటే మొహం పగులగొట్టేదాన్ని అని కావ్య అంటుంది.
నీ చెల్లెలు నాలా గుట్టుగా ఎందుకు ఉంటుంది. పరాయి మగాడితో, అది పెళ్లయిన వాడితో బలాదూర్ తిరుగుతుంది అని అనామిక అంటుంది. దాంతో అనామికను కొట్టేందుకు చేయి ఎత్తుతాడు కల్యాణ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో ఇందులో నువ్ చేసిన తప్పు నీకు కనిపించడం లేదా అని ప్రకాశం అడుగుతాడు. మీకు మతిమరుపు ఉందని, లోకంలో అందరూ బుర్ర తక్కువ మనుషులే ఉంటారనుకుంటున్నారా అని అనామిక అంటుంది.
అవమానించిన అనామిక
దాంతో అంతా షాక్ అవుతారు. మొత్తం పరువు తీసింది నువ్వే. నీ భర్తను, నీ అత్తను, తండ్రి తర్వాతి తండ్రి మామను, నా కోడలిని అందరిని అన్నావ్. ఇంతకు దిగజారిపోయి మాట్లాడటం అవసరమా అని అపర్ణ అంటుంది. దిగజారుడుతనం గురించి నీ దగ్గరే నేర్చుకోవాలి అని అనామిక అంటుంది. దాంతో అంతా అవాక్కయిపోతారు. అనామిక అని రాజ్ గట్టిగా అరుస్తాడు.
టాపిక్