Brahmamudi June 29th Episode: బ్రహ్మముడి- చుక్కలు చూపించిన అనామిక.. గెంటేసిన కల్యాణ్.. మామను పోరా అంటూ! మీడియాలో బాగోతం-brahmamudi serial june 29th episode aparna support kavya anamika insults duggirala family brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi June 29th Episode: బ్రహ్మముడి- చుక్కలు చూపించిన అనామిక.. గెంటేసిన కల్యాణ్.. మామను పోరా అంటూ! మీడియాలో బాగోతం

Brahmamudi June 29th Episode: బ్రహ్మముడి- చుక్కలు చూపించిన అనామిక.. గెంటేసిన కల్యాణ్.. మామను పోరా అంటూ! మీడియాలో బాగోతం

Sanjiv Kumar HT Telugu
Jun 29, 2024 07:39 AM IST

Brahmamudi Serial June 29th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 29వ తేది ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో ప్రతి ఒక్కరిని నానా మాటలు అన్న అనామిక చుక్కలు చూపిస్తుంది. ఆమె తల్లిదండ్రులు కూడా అలాగే అంటారు. దాంతో పోరా అని మామను అంటాడు. ఇంట్లోంచి గెంటేస్తాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూన్ 29వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూన్ 29వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో అనామిక పంచాయితీ ఇంకా నడుస్తూనే ఉంటుంది. అప్పును అనామిక అనడంతో కల్యాణ్ చేయి ఎత్తుతాడు. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన అనామిక తండ్రి.. ఆగిపోయావే బాబు కొట్టు అని అంటాడు. నాన్న చూడు నాన్న ఈ కుటుంబమంతా కలిసి నాపై ఎలా దాడి చేస్తున్నారో చూడు అని అనామిక అంటుంది.

దుగ్గిరాల ఇంటిపేరు ఎత్తడానికి

ఆగిపోయావేం బాబు కొట్టు అని అనామిక తండ్రి అంటే.. కొట్టండి. నా కూతురుని కొట్టి చంపండి అని తల్లి అంటుంది. దుగ్గిరాల కుటుంబం గొప్పగా అనుకున్నాం. కానీ, ఇలా కోడలిని కొట్టి చంపేద్దామనుకుంటారని అనుకోలేదని అనామిక తండ్రి అంటే.. ఏమయ్యా పెద్ద మనిషి.. నీ కూతురు ఇక్కడ ఎంత రుద్రతాండవం చేస్తుందో నీకు తెలుసా. దుగ్గిరాల ఇంటిపేరు ఎత్తడానికి కూడా నీకు అర్హత లేదని రాజ్ ఫైర్ అవుతాడు. రాజ్ ఎంతైనా వాళ్లు ఇంటికి కూతురుని ఇచ్చినవాళ్లు అని సీతారామయ్య అంటాడు.

ఇంటికి ఇచ్చినవాళ్లు పిలిచినప్పుడు వస్తారు. కానీ, ఇలా పిలవకుండా రారు. వాళ్లని అనామికే పిలిచి ఉంటుందని స్వప్న అంటే.. అవును నేనే పిలిచాను అని అనామిక అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఎందుకు పిలిచావని ప్రకాశం అడుగుతాడు. మీ అబ్బాయి విడాకులు ఇస్తానని చెప్పాడుగా అందుకే పిలిపించాను అని అనామిక అంటుంది. ఎందుకు విడాకులు ఇస్తానని అన్నాడో నీకు తెలియదా అమ్మా అని ప్రకాశం అంటాడు.

అసలు స్వరూపం

ఏ.. మీకు మతిమరుపు ఉందని లోకంలో అందరికీ బుర్ర తక్కువ మనుషులు ఉంటారని అనుకుంటున్నారా అని అనామిక అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. అనామిక అని కల్యాణ్ కోప్పడతాడు. ఇది అసలు మనిషేనా వదినా అని కల్యాణ్ అంటాడు. ఏయ్.. ఆయన ఎవరు అనుకున్నావ్. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇప్పటివరకు మీ అమ్మాయి చిన్న పిల్ల అనుకున్నావ్. కానీ, ఇవాళే మీ అమ్మాయి అసలు స్వరూపం తెలిసింది అని ఇందిరాదేవి అంటుంది.

మా నుంచి మీ దాకా రాలేదు. అది కూడా మేము చేసిన తప్పే అవుతుంది. తప్పు తను చేసి మిమ్మల్ని పిలిచిందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఏం చేసిన చెల్లుతుందని అనుకుంటుంది. కానీ, చెల్లని నాణెంగా మిగిలిపోతుంది నీ కూతురు బతుకు అని ఇందిరాదేవి అంటుంది. ఏంటమ్మా ఇది.. మేము వచ్చాం కదా మాట్లాడేందుకు. మామగారిని పట్టుకుని అలా మాట్లాడొచ్చా అని తండ్రి అంటే.. నేనేమైనా లేనిది అన్నానా. ఉన్నదే కదా అన్నాను అని అనామిక అంటుంది.

నోరు జారకుంటే

అనామిక చెప్పు చెంపమీద తెగుతుంది. ఏంటే బరితెగించి మాట్లాడుతుంది. ఏమయ్యా నీ కూతురిని ఇలానేనా పెంచేది. ఊరుకుంటుంటే అంటూనే ఉన్నావ్. ఇలాగే చేస్తే ముగ్గురికి పేడ కొట్టి పంపిస్తాం అని స్వప్న ఫైర్ అవుతుంది. చూశారా మమ్మీ ఇది ఇక్కడ నీ కూతురు వెలుగబెట్టే కాపురం అని అనామిక అంటుంది. అనామిక నువ్ ఒక్క నిమిషం నోరు జారకుంటే కవిగారు నీతో మనసు విప్పి మాట్లాడేవారు అని కావ్య చెబుతుంది.

హోహో.. నువ్ చెబితేనే మాట్లాడుతాడా. ఎంతైనా నీ చెల్లిపై మోజు పడ్డాడు కదా. నువ్ చెబితే వింటాడులే అని అనామిక అంటుంది. అంతా చిరాకుపడతారు. ఎంతో బతిమిలాడి తీసుకొస్తే.. ఎలా అంటుందో. ఇది మీ అమ్మాయి వ్యవహారం. చాలా ఎక్కువ చేస్తుంది అని కల్యాణ్ అంటాడు. బేబి మేము మాట్లాడుతాం కదా. నువ్ ఎన్ని కష్టాలు, బాధలు పడుతున్నావో నాకు తెలుసు. నేను మాట్లాడతా కదా అని అనామిక తల్లి అంటుంది.

అదుపులో పెట్టుకోండి

మీ కూతురికి చాలా బాధలు ఉన్నాయా. బాగా తిని కూర్చోకా బాగా బలిసి అని స్వప్న అంటుంటే.. ఆగు స్వప్న. తనకు బాధలు ఉన్నాయా. తనవల్ల తన పరువు పోతుందా. మా ఇంటి పరువు పోతుందా అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. ఇప్పుడిది కుటుంబ సమస్యగా మారింది. మా అబ్బాయికి సర్దిచెప్పుకుంటాను. నీ కూతురి మాటలను అదుపులో పెట్టుకోండి అని ప్రకాశం అంటాడు. అందరూ నా కూతురినే తప్పు పడుతున్నారు. మీ అబ్బాయి ఇంకో దానితో కులుకితే దానికి ఎలా ఉంటుంది అని అనామిక తండ్రి అంటాడు.

దాంతో స్వప్న కొట్టడానికి వెళ్తుంది. రాహుల్ ఆపుతాడు. అంతా కలిసి ఆపుతారు. ఇప్పుడు అర్థమైంది. మీ కూతురుకు నేర్పడానికి ముందు మీకు సంస్కారం ఉంటే కదా అని కల్యాణ్ అంటాడు. నా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకో అని అనామిక అంటే.. దుగ్గిరాల కుటుంబంతో మీ ముగ్గురు మాట్లాడుతున్నారని గుర్తు పెట్టుకో అని కల్యాణ్ అంటాడు. ఈ దుగ్గిరాల కుటుంబం ఏమైనా దేవలోకం నుంచి ఊడిపడిందా అని అనామిక అంటుంది.

మీ నాన్న దిగజారిపోయి

అనామిక ఏమైంది నీకు. నా కుటుంబం ఏం చేసింది. నీకు కాపురం చేసే ఆలోచన, నువ్ ఈ ఇంట్లోనే ఉండాలన్న స్పృహ ఉందా నీకు అని ఇందిరాదేవి అంటుంది. మొత్తం చేసింది నువ్వే. భర్తను అన్నావ్, తండ్రి తర్వాత తండ్రి మావను అన్నావ్, అత్తను అన్నావ్, నా కోడలిని అన్నావ్. ఏదో సర్దిచెబుతారని చూస్తే మీ నాన్న కూడా దిగజారిపోయి మాట్లాడుతున్నాడు. ఇంతకీ దిగజారిపోయి మాట్లాడటం అవసరమా అని అపర్ణ అంటుంది.

దిగజారుడుతనం గురించి నువ్వే మాట్లాడాలి. ఈ వయసులో మీ ఆయన ఇంకో ఆవిడతో సంబంధం పెట్టుకుని కొడుకును కూడా కన్నాడు. అది మర్చిపోయారా అని అనామిక అంటుంది. దాంతో అనామిక చాలు.. నా సహనం హద్దులు దాటుతుందని రాజ్ అంటాడు. నాకు సహనం ఉండదా. మీరు కంపెనీకి ఎండీగా రాజ్యం ఏలుతుంటే.. ఏం పని లేకుండా ఇంట్లో ఉండేవాడికి నేను భార్యగా ఉండాలా. మీరు కావాలనే మీ తమ్ముడిని ఏం చేతకాని చవటలా చేస్తున్నారు అని అనామిక అంటుంది.

పో.. పోరా కూతురుని తీసుకుని

ఏయ్.. ఎంతమందిని అంటావే. ఎన్ని మాటలు అంటావే. ఇంతమంది పెద్దవాళ్లు నీ బాగు కోసం మాట్లాడుతుంటే రెచ్చుపోతున్నావేంటో. నా భర్తనంటావా. నువ్వు నీ తండ్రి. నీ తల్లి నా భర్త కాలు గోటికి కూడా సమానం కారు. అసలు ఏమైందే నీకు. ఏం దెయ్యం పూనిందో నీకు అని కావ్య అంటుంది. కూతురే కాదు తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు. నీతి జాతి లేని వాళ్లు. ఇలాంటి వాళ్లను రానివ్వడమే తప్పు. నీ కూతురిని తీసుకుని వెళ్లండి అని కల్యాణ్ అంటాడు.

మీరంత సంస్కారవంతులు అని అనామిక తండ్రి అంటుంటే.. రేయ్.. అని కల్యాణ్ అంటాడు. అంతా షాక్ అవుతారు. నా నోటి నుంచి మొదటి సారి జారిన తప్పుడు మాట. నువ్ నీ భార్య, నీ కూతురుని తీసుకుని పో.. పోరా.. అని కల్యాణ్ అంటాడు. కల్యాణ్ ఆలోచించే అంటున్నావా. బావ నువ్ ఏం మాట్లాడవేంటీ అని ఇందిరాదేవి అంటుంది. ఇది అసలు మన ఇల్లేనా. ఇలాంటి వాళ్లనా ఇంట్లోకి రానిచ్చాం. ఇంటి కోడల్లు ఎప్పుడైనా పెద్దవాళ్ల మీదకు తిరగబడి మాట్లాడారా అని సీతారామయ్య అంటాడు.

ప్రశాంతంగా నిద్రపోతాను

సర్దిచెప్పేందుకు టైమ్ ఇవ్వకుండా అందరినీ ఆ అమ్మాయి అన్ని మాటలు అంటుంది. మన పెద్దరికం మంటగలిసిపోయిందని సీతారామయ్య అంటాడు. వెళ్లండని కల్యాణ్ అంటాడు. వెళ్తాం. కానీ, ఇది ఇంతటితో ఆగదు. ఇంతకింత అనుభవించేలా చేస్తా. నువ్వే నా ఇంటికి వచ్చి నా కాళ్లు పట్టుకునేలా చేస్తాను అని అనామిక అంటుంది. అంతా షాక్ అవుతారు. తర్వాత అనామిక తల్లిదండ్రులతో వెళ్లిపోతుంది. కన్నీళ్లు పెట్టుకున్న కల్యాణ్ పెళ్లయిన ఇన్నాళ్లకు ఒక్కరోజైనా ప్రశాంతంగా నిద్రపోతాను అని కల్యాణ్ అంటాడు.

దాంతో అంతా కల్యాణ్‌ను ఓదార్చుతారు. కట్ చేస్తే.. ధాన్యలక్ష్మీ ఒంటరిగా ఉంటుంది. బాధపడకండి అత్తయ్య అని కావ్య అంటే.. నా కొడుకు కాపురం కూలిపోడానికి కారణం నువ్వే అని ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది. నీ చెల్లెలితో తిరిగేలా మందు మాపో పెట్టి ఇక్కడిదాకా తెచ్చారు. ఇప్పుడు నంగనాచిలా వచ్చి ఓదార్చుతున్నావా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అది విన్న అపర్ణ కోప్పడుతుంది. ఏమన్నా పడుతుందని, తలదించుకుని పోతుంది అనుకున్నావా అని అపర్ణ అంటుంది.

కోడలిని అనేముందు జాగ్రత్త

నీ కోడలు అందరినీ పూచికపుల్లలా తీసేస్తుంటే దానికి కారణం నా కోడలు అంటావా అని అపర్ణ అంటుంది. అత్తయ్య ఆవేశపడకండి అని కావ్య అంటే.. హేయ్.. ఆగు.. నాకు ఏం కాదని అపర్ణ అంటుంది. తర్వాత కావ్య గొప్పదనం గురించి ధాన్యలక్ష్మీతో అంటుంది అపర్ణ. అది వినలేక ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంటే.. గుర్తుపెట్టుకో. నా కోడలిని అనేముందు జాగ్రత్త అని అపర్ణ అంటుంది. అయ్యో అన్ని మాటలు అన్నారేంటీ అని కావ్య అంటుంది.

అసలు నీకు సిగ్గు ఉందా. పెద్దలకు గౌరవం ఇవ్వమంటే ఆత్మాభిమానం చంపుకోవడం కాదు. మీ అక్క తన అత్తకు గడ్డి పెట్టడం చూసైన అర్థం కావట్లేదా. నువ్ వెర్రిబాగులదానివా. నాకు నా కొడుకు తలవంపులు తెస్తున్నావ్. ఆవిడ గారి కోడలు మహాసాద్వి మరి. తనను అనే ధైర్యం లేక నిన్ను అంటుంది. నీకోసం చెబుతున్నాను. నువ్ నా కోడలివి. దుగ్గిరాల ఇంటికి పెద్దకోడలివి అని అపర్ణ చెబుతుంది. కట్ చేస్తే ఇంట్లో అందరూ టీవీలో న్యూస్ చూస్తుంటారు.

కల్యాణ్ అరెస్ట్

న్యూస్‌లో అనామికకు అన్యాయం జరిగినట్లు యాంకర్ చెబుతుంది. దానికి కారణం కల్యాణ్, అతని ప్రియురాలు అని చెప్పిన న్యూస్ యాంకర్ అనామిక ఇక్కడ స్టూడియోలోనే ఉన్నారు. ఆమెతోపాటు వుమెన్ వెల్ఫేర్ సంస్థకు చెందిన శ్రీమతి ఝాన్సీ గారు ఇక్కడే ఉన్నారు. ఆమె ఎలాంటి పరిష్కారం సూచిస్తారో విందాం అని చెబుతుంది. అది చూసి అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో కల్యాణ్‌కు అనామికతో విడాకులు ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నాను అని రాజ్ అంటాడు. ఇంతలో పోలీసులు వచ్చి కల్యాణ్‌ను అరెస్ట్ చేయాలంటారు. ఎందుకని రాజ్ అడిగితే.. అనామికను విడాకుల కోసం టార్చర్ పెడుతున్నట్లు కేసు పెట్టారు అని పోలీసులు చెబుతారు.

Whats_app_banner