Brahmamudi July 1st Episode: బ్రహ్మముడి- ఝాన్సీకి దొరికిపోయిన అనామిక- ఆస్తి కొట్టేయడానికి మించి ప్లాన్- కల్యాణ్‌కు శిక్ష-brahmamudi serial july 1st episode anamika accuses kalyan and plans to get duggirala property brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi July 1st Episode: బ్రహ్మముడి- ఝాన్సీకి దొరికిపోయిన అనామిక- ఆస్తి కొట్టేయడానికి మించి ప్లాన్- కల్యాణ్‌కు శిక్ష

Brahmamudi July 1st Episode: బ్రహ్మముడి- ఝాన్సీకి దొరికిపోయిన అనామిక- ఆస్తి కొట్టేయడానికి మించి ప్లాన్- కల్యాణ్‌కు శిక్ష

Sanjiv Kumar HT Telugu

Brahmamudi Serial July 1st Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 1వ తేది ఎపిసోడ్‌లో వుమెన్ వెల్ఫేర్ సభ్యురాలు ఝాన్సీ అడిగిన ప్రశ్నలకు అనామిక సమాధానం చెప్పలేకపోతుంది. తర్వాత ఆస్తి కొట్టేయడమే కాకుండా అంతకుమించి ప్లాన్ వేసినట్లుగా తల్లిదండ్రులతో అనామిక చెబుతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూలై 1వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో కల్యాణ్‌ టార్చర్ పెట్టాడంటూ అనామిక మీడియా ముందుకు వెళ్తుంది. అనామికతోపాటు వుమెన్ వెల్ఫేర్ సభ్యురాలు ఝాన్సీతో మీడియా న్యూస్ టెలీకాస్ట్ చేస్తుంది. అందులో అనామిక కష్టాన్ని చెప్పమని అడుగుతారు. తన భర్త కల్యాణ్ టార్చర్ పెట్టేవాడని, రోజు అప్పుతో తిరిగేవాడని, పేరుకే దుగ్గిరాల కుటుంబం కానీ, అక్కడ తనకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని అనామిక చెబుతుంది.

నన్ను విడాకులు ఇవ్వమంటున్నారు

కల్యాణ్ ఏ పని చేయడు. వాళ్లకు చాలా కంపెనీలు ఉన్నాయి. కానీ, కల్యాణ్ మాత్రం తింటాడు అప్పుతో తిరుగుతాడు. పడక గదిలో నన్ను టార్చర్ పెట్టేవాడు. పీకలదాకా తాగొచ్చి హింసించేవాడు. ఇదంతా ఇంట్లో వాళ్లతో మొరపెట్టుకుంటే అతన్నే సమర్ధించేవారు. నాదే తప్పు అనేవారు. ఓ హోటల్‌లో అప్పుతో కల్యాణ్ దొరికిన నాదే తప్పు అన్నారు. పైగా ఇప్పుడు నన్ను విడాకులు ఇవ్వమంటున్నారు. ఇదేంటని మా అమ్మనాన్నలతో పంచాయితీ పెట్టిస్తే వాళ్లను కూడా అవమానించి పంపించారు అని అనామిక చెబుతుంది.

అనామిక మాటలకు దుగ్గిరాల కుటుంబం, కనకం ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఈ విషయాన్ని ఝాన్సీ గారు ఎలాంటి కోణంలో చూస్తారో తెలుసుకుందాం అని యాంకర్ అడుగుతుంది. నేను ఎవ్వరిని ఏం అనను. ఏమైనా అనాలంటే మిమ్మల్ని అంటాను. ఈ అమ్మాయి నీకు ఏమవుతుంది అని యాంకర్‌ను ఝాన్సీ అడిగితే.. ఏం కాదని చెబుతుంది. మరి దుగ్గిరాల ఇంట్లో ఉండి లైవ్ చూసినట్లు మాట్లాడుతున్నారు. అనామికను కల్యాణ్ టార్చర్ పెట్టాడని అంటున్నారు అని ఝాన్సీ రివర్స్‌గా ఫైర్ అవుతుంది.

ప్రేమించి పెళ్లి చేసుకున్నాం

అనామిక చెప్పిందని యాంకర్ అంటే.. ఎప్పుడు చెప్పింది. ఆమె చెప్పకముందే మీరు చెప్పారు. ఒకవేళ చెబితే అప్పు మాయలో పడి కల్యాణ్ విడాకులు ఇస్తున్నాడని అనామిక చెప్పిందని చెప్పాలి. నేను మిమ్మల్ని, అమ్మాయిల కష్టాలను ఉద్దేశించి మాట్లాడటట్లేదు. అనామిక సమస్యను విశ్లేషిస్తాను. ఏవమ్మా అనామిక మీకు పెళ్లయి ఎంతకాలం అయింది, ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అని ఝాన్సీ అడుగుతుంది. నాలుగైదు నెలలు అయింది, ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని అనామిక చెబుతుంది.

మరి ప్రేమించినప్పుడు తెలియదా అతను ఏ పని చేయడని అని ఝాన్సీ అడిగితే.. కవితలు రాస్తాడని తెలుసు. అది చూసే పెళ్లి చేసుకున్నాను అని అనామిక అంటుంది. పెళ్లి తర్వాత కవితలు నచ్చలేదా. ఆ మనిషి నచ్చలేదా. కవితలు రాయడం కూడా ఒక విద్యే అని తెలియదా అని ఝాన్సీ అడుగుతుంది. తెలుసు. కానీ, బిజినెస్ చూసుకోమ్మంటే చూసుకోడు అని అనామిక చెబుతుంది. అత్తింట్లో కంపెనీ చూసుకునేందుకు ఎవరు లేరా అని ఝాన్సీ అడుగుతుంది.

అప్పు ప్రేమాయణం గురించి

ఉన్నారు. కానీ, కల్యాణ్ చూసుకోడు అని అనామిక చెబుతుంది. ఎలా చూసుకుంటాడమ్మా అతను కవితలు రాసే పనిమీద ఉంటే అని ఝాన్సీ అడుగుతుంది. ఇక్కడ దొరికావ్. తను నీ మాట వినట్లేదని నీ ఇగో హర్ట్ అయింది. నీ ఫస్ట్ పాయింటే వీక్ అని తేలిపోయిందని ఝాన్సీ అంటుంది. ఇప్పుడు దాని గురించి అప్పుతో సాగించే ప్రేమాయణం గురించి మాట్లాడితే బాగుంటుంది అని అనామిక అంటే.. అప్పు ముందు నుంచి పరిచయమా పెళ్లి తర్వాత నుంచా అని అడిగితే.. ముందు నుంచే పరిచయం అని అనామిక అంటుంది. మరి అప్పుడు తెలియదా వాళ్ల గురించి అని ఝాన్సీ అడుగుతుంది.

స్నేహితులు అనుకున్నాను. పెళ్లి తర్వాత తెలిసింది వాళ్ల బాగోతం అని అనామిక అంటే.. ఎలా తెలిసిందని ఝాన్సీ అడుగుతుంది. దాంతో అనామిక సైలెంట్‌గా ఉంటుంది. సరే మీ పెళ్లికి దుగ్గిరాల కుటుంబం అభ్యంతరం చెప్పిందా అని అడిగితే.. లేదు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు అని అనామిక అంటుంది. అలాంటప్పుడు అప్పును ప్రేమిస్తే కూడా ఒప్పుకునేవాళ్లు కదా అని ఝాన్సీ వివిధ రకాలుగా ప్రశ్నలు అడుగుతుంది.

నన్ను ఒత్తిడి చేస్తున్నారు

వాళ్లిద్దరి మధ్య సంబంధం ఉన్నట్లు రుజువు అయింది దానిమాట ఏంటీ. పెళ్లికి ముందు ఏం లేదని మా పెళ్లి జరిగిందని అనుకుందాం. పెళ్లి తర్వాత అప్పుతో సంబంధం కొనసాగించడం ఎంత వరకు కరెక్ట్. ఇదే న్యూస్ ఛానెల్ ఆ విషయాన్ని కవర్ చేసింది. హోటల్ గదిలో నుంచి ఇద్దరూ రావడం టెలీకాస్ట్ చేశారు. అందుకే విడాకులు కావాలని నన్ను ఒత్తిడి చేస్తున్నారు అని అనామిక అంటుంది. కావాలంటే ఆ విజువల్స్ చూపిస్తామని మళ్లీ చూపిస్తారు.

చాలు చాలు అని ఇదైతే ఆలోచించాల్సిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు భార్య తప్పు లేకుండా, తను తప్పు చేసి విడాకుల కోసం ఒత్తిడి తీసుకురావడం క్షమించరాని నేరం. నేను నీకోసం పోరాటం చేస్తాను. ఇప్పటివరకు మీరు అభిప్రాయ భేదాలతో విడిపోతున్నారనే అనామికను విమర్శించాను. కానీ, ఇప్పుడు కల్యాణ్ తప్పుందని తెలిశాకా నీకోసం మా మహిళలంతా నిలబడతాం అని ఝాన్సీ చెబుతుంది. దాంతో దుగ్గిరాల కుటుంబం షాక్ అవుతుంది.

కోపం పెంచుకుంటారు

కట్ చేస్తే అసలు నువ్ ఏం చేశావో తెలుసా బేబీ అని అనామిక తండ్రి అంటాడు. లేదు. ఇప్పుడే కరెక్ట్‌గా చేస్తున్నాను అని అనామిక అంటుంది. తప్పు చేస్తున్నావ్ బేబీ. భర్త పరువు ఇలా తీయడం కరెక్ట్ కాదుని తల్లిదండ్రులు అంటారు. అప్పుతో అలా తిరిగితే ఎలా ఊరుకుంటాని అనామిక అంటే.. అదంతా చేసింది నువ్వే కదా అని అనామిక తల్లి అంటుంది. మాదే తప్పు. నిన్ను భర్తను గుప్పిట్లో పెట్టుకోమన్నాం. కానీ, బానిసలా చేసుకోమని కాదు. ఇలా చేస్తే కోపం పెంచుకుంటారు అని అనామిక తండ్రి అంటాడు.

గుప్పిట్లో ఉండట్లేదు. చెప్పింది వినట్లేదు. అందుకే బానిసలా చేసుకోవాలనుకున్నాను. మీడియాతోనే ఆపేస్తానని ఎలా అనుకున్నారు. నా కాళ్ల దగ్గరికి వచ్చి నన్ను బాగా చూసుకునేలా చేస్తాను. ఆస్తి అంతా మనకు వచ్చేలా చేస్తాను. దానికి అంతా సిద్ధం చేశాను అని అనామిక అంటుంది. దాంతో అనామిక తల్లిదండ్రులు భయపడిపోతారు. మరోవైపు ఒంటరిగా కల్యాణ్ కూర్చుని ఆలోచిస్తుంటాడు. దుగ్గిరాల ఇంట్లో అందరూ ఇదే ఆలోచిస్తుంటారు.

పిన్ని బాబాయ్ ఒప్పుకుంటేనే

అనామిక సంబరపడిపోతుంది. రుద్రాణి, రాహుల్ కూడా అనుకుంది సక్సెస్ అని సంతోషపడతారు. మరుసటి రోజు హాల్లో అంతా ఉంటారు. రాజ్ వచ్చి ఇన్నాళ్లు నువ్ చెబుతుంటే అర్థం చేసుకోలేకపోయాను. మూర్ఖంగా ఆలోచిస్తున్నావ్ అనుకున్నాను. కల్యాణ్ కోరుకుంటున్నట్లుగా అనామికతో విడాకులు ఇప్పిద్దామనుకుంటున్నాను అని రాజ్ అంటాడు. ఏవండి తొందరపడకండి. తను ఆవేశంలో చేస్తుంది అని కావ్య అంటుంది.

ఆవేశంలో కాదు. అంతా తెలిసే చేసింది. ఇలా భయపెట్టి కల్యాణ్‌ను గుప్పిట్లో పెట్టుకుందామని చూస్తుందని సుభాష్ అంటాడు. కానీ, ఇప్పుడు విడాకులు ఇస్తే తను చేసిందే నిజం అవుతుంది. దుగ్గిరాల పరువు ఏమైపోతుందని ఇందిరాదేవి అంటుంది. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని రాజ్ అంటే.. మనం ఇవ్వాలనుకుంటే తను ఇవ్వాలి కదా అని రుద్రాణి అంటుంది. ఇస్తుంది ఇచ్చేలా చేస్తాను. కానీ, అలా చేయాలంటే పిన్ని బాబాయ్ ఒప్పుకుంటేనే అని రాజ్ అంటాడు.

కల్యాణ్ అరెస్ట్

నువ్ చెప్పు పిన్ని నువ్వింకా అనామికను కోడలిగా ఒప్పుకుంటావా. ఇంటికి తీసుకురావాలనుకుంటున్నావా అని రాజ్ అడుగుతాడు. నా కొడుకును అందరిలో అవమానించినదాన్ని ఎలా కోడలిగా ఒప్పుకుంటాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. అనామిక ఇంటి కోడలిగా పనికిరాదు. విడాకులు ఇస్తే అయినా కల్యాణ్ మనశ్శాంతిగా ఉంటాడు అని ప్రకాశం అంటాడు. చిన్న మావయ్య మీరు కూడా ఆవేశపడితే ఎలా. విడిపోవడం సమస్యకు పరిష్కారం కాదని కావ్య అంటుంది.

ఇంతలో పోలీసులు వస్తారు. కల్యాణ్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్దామని వచ్చామని పోలీసులు అంటారు. దాంతో అంతా షాక్ అవుతారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని రాజ్ అడిగితే.. ప్రతిరోజు విడాకుల కోసం తన భర్త టార్చర్ పెడుతున్నాడని అనామిక కెసు పెట్టారు అని ఎస్సై అంటాడు. నాకిప్పుడు అంతా అర్థం అవుతోంది. అనామిక కావాలనే చేస్తుంది. ఇప్పుడు తనను బతిమిలాడి ఇంటికి రావాలని చేస్తుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అని రాజ్ అంటాడు.

క్షమించమని అడగాలని

కానీ, కల్యాణ్ అరెస్ట్ అయితే తనతోపాటు మన పరువు కూడా పోతుంది. సమస్యను ఇక్కడే పరిష్కరించుకుంది బెటర్ అని అపర్ణ అంటుంది. సరే మామ్. అనామికతో నేను మాట్లాడుతాను. కేసు వెనక్కి తీసుకోమ్మని అడుగుతాను. కానీ, అలా చేయాలంటే కల్యాణ్ వెళ్లి తనను క్షమించమని అడగాలని అంటుంది. తిరిగి తనను కోడలిగా తీసుకురమ్మని అడుగుతుంది. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని రాజ్ అడుగుతాడు.

దానికి నేను చచ్చినా ఒప్పుకోను అన్నయ్య. నాకు తన మొహం కూడా చూడాలని లేదు. తను నన్ను డబ్బు కోసమే ప్రేమించదని తెలుసుకోలేకపోయాను. అలాంటిది తనతో ఎలా కాపురం చేస్తాను అని కల్యాణ్ అంటాడు. నీ భయాన్ని అర్థం చేసుకోగలను పిన్ని. పోయిన పరువు ఎలాగు పోయింది. కానీ, ఇప్పుడు ఆలోచించాల్సింది కల్యాణ్ సంతోషం అని రాజ్ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

కల్యాణ్ డౌన్ డౌన్

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో పోలీస్ స్టేషన్‌కు కల్యాణ్ వెళ్తాడు. అక్కడ ప్లకార్డ్స్ పట్టుకుని కల్యాణ్ డౌన్ డౌన్.. కల్యాణ్‌కు శిక్ష పడాలని మహిళలు గొడవ చేస్తుంటారు. కల్యాణ్ వాళ్లు రాగానే మీడియా వచ్చి అక్రమ సంబంధం పెట్టుకోవడం, టార్చర్ పెట్టడం గురించి ప్రశ్నలతో వేధిస్తారు.