Gundeninda Gudigantalu Today Episode: రెస్టారెంట్‌లో శ్రుతి గొడవ- బాలుకు దొరికిపోయిన రోహిణి తల్లి, కొడుకు- నిజం బయటకు!-gundeninda gudigantalu serial september 25th episode balu cautions ravi on shruthi gundeninda gudigantalu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gundeninda Gudigantalu Today Episode: రెస్టారెంట్‌లో శ్రుతి గొడవ- బాలుకు దొరికిపోయిన రోహిణి తల్లి, కొడుకు- నిజం బయటకు!

Gundeninda Gudigantalu Today Episode: రెస్టారెంట్‌లో శ్రుతి గొడవ- బాలుకు దొరికిపోయిన రోహిణి తల్లి, కొడుకు- నిజం బయటకు!

Sanjiv Kumar HT Telugu
Sep 25, 2024 08:28 AM IST

Gundeninda Gudigantalu Serial September 25th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 25వ తేది ఎపిసోడ్‌లో రవికి బాలు వార్నింగ్ ఇస్తాడు. తర్వాత రెస్టారెంట్‌లో రవితో గొడవ పడుతుంది శ్రుతి. తన నుంచి సమాధానం వచ్చేవరకు అక్కడే ఉంటానంటుంది. ఇలా గుండెనిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్‌లో..

గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 25వ తేది ఎపిసోడ్‌
గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 25వ తేది ఎపిసోడ్‌

Gundeninda Gudigantalu Serial Today Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో అత్తింట్లో తన బాధలను భర్తతో చెప్పుకుంటుంది మీనా. మీరు మంచి చేస్తున్నారని అనుకుంటున్నారు. కానీ, అది మాకు శాపంగా మారుతుంది. ఈ పెళ్లి వల్ల ఎవరికీ మంచి జరగదు. రవి మనసులో ఏముందో తెలియదు, సుమతి మనసులో ఏముందో తెలియదు. మీ అమ్మ మాటలను పట్టించుకోరు. మరి ఇంకెవరి కోసం వాళ్ల పెళ్లి చేయాలని అనుకుంటున్నారు అని మీనా అంటుంది.

ఒకటి మాత్రం అర్థమైందే.. ఇంటి అల్లుడు అంటే మీ అమ్మకు మర్యాద లేదు. ఇంకోసారి మీ ఇంటికి వస్తే చూడు. పదా అని బాలు అంటాడు. ఇద్దరు కారులో వెళ్లిపోతారు. మరోవైపు తనకు పెళ్లి వద్దని శ్రుతి అంటూ ఉంటుంది. కానీ, తల్లి శోభన వినిపించుకోకుండా వెళ్లిపోతుంది. సురేంద్ర వచ్చి కన్‌ఫ్యూజన్ పోయిందా అన అడుగుతాడు. నాకు ఏ కన్‌ఫ్యూజన్ లేదు. మీకే ఉంది. నాకు అతనంటే ఇష్టం లేదని శ్రుతి అంటుంది.

మాములు జీవితమే

నీ పెళ్లి అతనితోనే జరుగుతుంది అని చెప్పి వెళ్లిపోతాడు సురేంద్ర. కనీసం పెళ్లి అయినా పోస్ట్‌పోన్ చేయండి. నా కెరీర్‌లో ఎదగాలని అనుకుంటున్నాను అని శ్రుతి అంటుంది. నువ్ జాబ్ చేయాల్సిన అవసరం లేదు. అతనికి నువ్ జాబ్ చేయడం ఇష్టంలేదు. కెరీర్ అవసరం లేదు. అతని ఇంట్లో మహారాణిలా బతకొచ్చు అని సురేంద్ర అంటాడు. నాకు మాములు జీవితమే కావాలి. కొన్నాళ్లు మ్యారేజ్ పోస్ట్ పోన్ చేయు. టైమొచ్చినప్పుడు చెబుతాను. అప్పుడు మీరు ఎవరిని చెబితే వారినే చేసుకుంటాను అని శ్రుతి అంటుంది.

ఈ పెళ్లి ఆపితే నువ్ అనుకుంది చేయొచ్చు అనుకుంటున్నావేమో. కానీ, అలా ఎప్పటికీ జరగదు. 15వ తారీఖుకు నీ పెళ్లి. నాకు పెళ్లి పనులు ఉన్నాయి. సంజుతో వెళ్లి పెళ్లికి ఏం కావాలో కొనుక్కో అని వెళ్లిపోతాడు సురేంద్ర. చేసేదేం లేక బెడ్ రూమ్‌కు వెళ్లిపోతుంది శ్రుతి. ఇంకా ఎన్నాళ్లు ఓపికగా ఉండాలి. మా సంతోషం ఆలోచించకుండా వాళ్ల గౌరవం కోసం, మర్యాద కోసం మా నోరును కట్టేస్తారు. మన లైఫ్ గురించి మనమే ఆలోచించుకోవాలి. మన జీవితాలని మనకు నచ్చినట్లు మార్చుకోవాలి. సో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అని శ్రుతి తనకు తానే చెప్పుకుంటుంది.

మరోవైపు బయటకు వెళ్తున్న రవిని ఆపి ఎక్కడికి అని అడుగుతాడు బాలు. రెస్టారెంట్‌కు అని రవి చెబుతాడు. రెస్టారెంట్‌కు అని చెప్పి ఇంకెక్కడికైనా వెళ్తున్నావా. అలా కాకుండా ఇంకెక్కడికి వెళ్లకూడదు అని బాలు అంటాడు. ఏంటండి మీరు.. వెళ్లేవాన్ని బెదిరిస్తున్నారు అని మీనా అంటుంది. అమ్మాయి, అబ్బాయి కొంచెం మాట్లాడితే చాలు క్రష్ ఫీల్ అయి ప్రేమ అనుకుంటారు. ఆ డబ్బుడమ్మకు కూడా చెప్పు అని బాలు అంటాడు.

జీవిత సత్యాలు

డబ్బుడమ్మ ఎవరు అని మీనా అంటే.. డబ్బింగ్ ఆర్టిస్ట్. బాలు ఎవరినీ తిన్నగా పిలవడు కదా అని రవి అంటాడు. ఇంతలో రవికి శ్రుతి కాల్ చేస్తుంది. రవి కట్ చేస్తాడు. ఎవర్రా అని బాలు అడిగితే.. కస్టమర్ కేర్ అని రవి అబద్ధం చెబుతాడు. కస్టమర్ కేర్ అయితే ఓకే.. కానీ, కస్టమర్‌లా వచ్చి కేర్ చేస్తానంటేనే సమస్య అని బాలు అంటాడు. మీరు ఇవాళ చాలా జీవిత సత్యాలు చెబుతున్నారు అని మీనా అంటుంది. చిన్న గంపం కోసం వెళితే పూల గంప తల్లి పూచికపుల్లలా తీసి పడేసినప్పటినుంచి అలా వస్తున్నాయని బాలు కౌంటర్ వస్తాడు.

అటు తిప్పి ఇటు తిప్పి పూలగంపనెందుకండి మోసుకుని తీసుకెళ్తున్నారు అని మీనా అంటుంది. ఇంతలో మళ్లీ రవికి శ్రుతి కాల్ చేస్తుంది. ఎత్తి మాట్లాడొచ్చు కదా అని బాలు అంటుంది. వెళ్లనిస్తే వెళ్తూ మాట్లాడుకుంటాడు అని మీనా అంటుంది. వెళ్లామా వచ్చామ అన్నట్లు ఉండాలి. లేకపోతే గొడవలు అయిపోతాయ్ అని బాలు వార్నింగ్ ఇస్తాడు. మీకు దండం పెడతా. రవితో ఎప్పుడు మీరు ఇలా మాట్లాడలేదు. మీరైనా మాటలు అనుకోకుండా ఉంటారనుకున్నా అని మీనా అంటుంది.

నా బుర్రలో ఓ అమ్మాయి ఉంది. అందుకోసమే వెళ్లి వస్తున్నామని బాలు అంటే.. నా బుర్రలో మెదడు ఖాళీ అయిందన్నయ్య. నన్ను వెళ్లనివ్వు అని రవి వెళ్తాడు. ఓహో.. నలభీమకు కూడా కోపం వస్తుంది అని బాలు అంటే.. ఎందుకు సుమతి టాపిక్ తీస్తున్నారు అని మీనా కోప్పడుతుంది. ఇప్పటిదాకా ఫోన్ చేసింది కస్టమర్ కేర్ కాదు. శ్రుతినే. వీడు కాల్ లిఫ్ట్ చేయకుంటే వేరేవాడిని పెళ్లి చేసుకుంటుంది. అదే నేటితరం లవ్ అని బాలు అంటాడు.

మీరు లవ్‌లో డిగ్రీ చేశారు కానీ లోపలికి పదండి అని మీనా అంటుంది. నీకు మీ అమ్మకు గోరోజనం మాములుగా లేదే అని బాలు అంటాడు. దాంతో మీనంగా ఏంటీ అని కోపంగా అంటుంది. దాంతో భయపడి లోపలికి వెళ్లిపోతాడు బాలు. మరోవైపు రెస్టారెంట్ దగ్గరికి వచ్చి రవికి కాల్ చేస్తుంది శ్రుతి. కానీ, రవి కాల్ లిఫ్ట్ చేయడు. దాంతో లోపలికి వెళ్తుంది శ్రుతి. కావాలనే రెస్పాండ్ కావట్లేదు అని కోప్పడుతుంది శ్రుతి. ఇది మాట్లాడే ప్లేస్ కాదు. తర్వాత మాట్లాడదాం. సర్వ్ చేయాలని రవి అంటాడు.

అర్థం చేసుకో

దాంతో శ్రుతినే సర్వ్ చేస్తుంది. రవి వంట గురించి అందరికీ గొప్పగా చెబుతుంది. ఏమైంది నీకు అని శ్రుతిని బయటకు తీసుకెళ్తాడు రవి. నువ్ ఇలా చేస్తే నాకు జాబ్ పోతుందని రవి అంటాడు. ఇక్కడ లైఫ్ పోతుంది. జాబ్ పోతే ఇంకోటి వెతుక్కోవచ్చు. వాడితో నాకు పెళ్లి చేస్తానంటున్నారు. రవి నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నావా అని శ్రుతి అంటుంది. ఇది మాట్లాడే టైమ్ కాదు. నీకు కాల్ చేసి మాట్లాడుతాను. అర్థం చేసుకో అని రవి అంటాడు.

నాకు నీపై నమ్మకం పోయింది. ఇక్కడే ఉంటాను అని లోపలికి వెళ్లిన శ్రుతి ఆర్డర్ తీసుకోమ్మని చెబుతుంది. రవి ఇరిటేట్ చేయకని అంటే.. కస్టమర్‌తో ఇలాగేనే మాట్లాడేది. ఓనర్‌తో మాట్లాడమంటారా.. ఆర్డర్ తీసుకుని రండి. లేట్ అయిన పర్వాలేదు. చెప్పాను కదా. నీ నుంచి నాకు కావాల్సిన సమాధానం వచ్చేవరకు ఇక్కడే ఉంటాను అని శ్రుతి అంటుంది. దాంతో రవి లోపలికి వెళ్తాడు. మరోవైపు తల్లిని హాస్పిటల్ నుంచి తీసుకొస్తుంది రోహిణి.

ఇవాళ్నే చింటుని తీసుకుని ఊరికి వెళ్లమని తల్లికి చెబుతుంది రోహిణి. నేను ఎంత చేయాలో అంత చేశాను. ఇంటికెళ్లి మందులు వేసుకుని ప్రశాంతంగా ఉండు. మళ్లీ నువ్ ఊరు రావాల్సిన అవసరం ఉండదు. నన్ను ఇరికించే అవకాశం ఉండదు. కావాలంటే పనిమనిషిని పెట్టుకో. నేనే జీతం పంపిస్తాను అని రోహిణి అంటుంది. వద్దులేమ్మా. నువ్వే పార్లర్ అమ్మేసి జీతానికి పని చేస్తున్నావ్. ఇంకా ఖర్చు పెట్టించాలని అనుకోవట్లేదు అని రోహిణి తల్లి అంటుంది.

నువ్వే వాడి అమ్మ

అదంతా నా సమస్య. నాకు ఇంకో సమస్య పెట్టకు. నువ్ కష్టపడి ప్రాణాల మీదకు తెచ్చుకుని ఇక్కడికి వచ్చి నా ప్రాణం తీయకు అని రోహిణి అంటుంది. డబ్బులిస్తుంది రోహిణి. నీకు చింటును చూసుకోవడం కష్టమైతే చెప్పు హాస్టల్‌లో వేస్తాను అని రోహిణి అంటుంది. దాంతో రోహిణి తల్లి కోప్పడుతుంది. నీకు వాడు ఏం బారం అయ్యాడని అంటున్నావ్. చెప్పిందల్లా వింటున్నానని ఇష్టమొచ్చిన నిర్ణయాలు తీసుకోకు. నీలాగే నేను వాడిని అనాథలా వదిలేయలేను. ఎన్నిరోజులు అని వాడికి నిజం తెలియకుండా ఉంటుంది. నువ్వే వాడి అమ్మ అని రోహిణి తల్లి అంటుంటే రోహిణి ఆపుతుంది.

చింటు లోపలికి వెళ్లి ఆడుకో అని పంపిస్తుంది. ఇందుకే నిన్ను ఇక్కడికి రావొద్దని అంటున్నాను అని రోహిణి అంటుంది. రేపు నేను పోతే వాడిని పట్టించుకుంటావా. అనాథగా బతికే గతి పడుతుందే వాడికి అని రోహిణి అంటుంది. అమ్మను క్యాబ్ బుక్ చేసి బస్టాండ్‌కు పంపించు, నాకు పని ఉంది అని విద్యకు చెప్పి, అలాగే చింటుకు అన్యాయం చేయను అని చెప్పి వెళ్లిపోతుంది రోహిణి. మరోవైపు రవి పెళ్లి గురించి ఫ్రెండ్‌తో మాట్లాడుతాడు బాలు.

బాలు ఫ్రెండ్‌కు విద్య కాల్ చేసి క్యాబ్ బుక్ చేస్తుంది. అది లోకల్ రైడ్ అని, దానికి పెట్రోల్ డబ్బులు కూడా రావని, అన్నయ్య పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలని బాలు ఫ్రెండ్ వెళ్లిపోతాడు. ఇంతలో బాలుకు లాంగ్ డ్రైవ్ రైడ్ కాల్ వస్తుంది. దానికి తన ఫ్రెండ్‌ను పంపిస్తానని చెప్పి రాజేష్‌ను పంపిస్తాడు బాలు. రాజేష్‌ డ్రైవ్‌ను బాలు తీసుకుంటాడు. డ్రైవ్‌కు వెళ్లిన బాలు చింటును, రోహిణి తల్లిని చూస్తాడు. వారితో మాట్లాడి ఇంటికి తీసుకెళ్తాడు.

దుబాయ్ అన్నారు

మీ అమ్మాయి తిరిగి వచ్చిందా అని బాలు అడుగుతాడు. లేదు సింగపూర్‌లోనే ఉందని రోహిణి తల్లి చెబుతుంది. దుబాయ్ అని చెప్పారు అని మీనా అంటుంది. బాలు, మీనాతో తల్లి ఉండటం చూసి షాక్ అవుతుంది రోహిణి. ఇక దొరికిపోయినట్లే అనుకుంటుంది రోహిణి.