Gundeninda Gudigantalu Today Episode: లవ్ మ్యాటర్ బయటపెట్టిన రవి- శ్రుతితో పెళ్లి జరగనివ్వనన్న బాలు- నాన్నకు మర్యాద అంటూ-gundeninda gudigantalu serial september 14th episode ravi reveals love with shruthi gundeninda gudigantalu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gundeninda Gudigantalu Today Episode: లవ్ మ్యాటర్ బయటపెట్టిన రవి- శ్రుతితో పెళ్లి జరగనివ్వనన్న బాలు- నాన్నకు మర్యాద అంటూ

Gundeninda Gudigantalu Today Episode: లవ్ మ్యాటర్ బయటపెట్టిన రవి- శ్రుతితో పెళ్లి జరగనివ్వనన్న బాలు- నాన్నకు మర్యాద అంటూ

Sanjiv Kumar HT Telugu
Sep 14, 2024 10:42 AM IST

Gundeninda Gudigantalu Serial September 14th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 14వ తేది ఎపిసోడ్‌లో శ్రుతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు ఇంట్లో వాళ్లందరికి రవి చెబుతాడు. వాళ్ల ఫ్యామిలీ నాన్నకు గౌరవం ఇస్తేనే పెళ్లి జరుగుతుందని బాలు అంటాడు. ఇలా గుండెనిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్‌లో..

గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 14వ తేది ఎపిసోడ్‌
గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 14వ తేది ఎపిసోడ్‌

Gundeninda Gudigantalu Serial Today Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రెస్టారెంట్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో అందరికీ చెబుతాడు రవి. అరేయ్.. రెస్టారెంట్‌కు ఏంట్రా.. ఇక్కడ పెళ్లి చూపులు అంట కదరా అని బాలు అంటాడు. నేను ఇంకా లైఫ్‌లో సెటిల్ కాలేదు నాన్న అని కంగారుగా రవి అంటాడు.

వీడేమో చెఫ్

వీడు కూడా సెటిల్ కాలేదు. సిగ్గు లేకుండా చేసుకోలాదా అని మనోజ్‌ను చూపిస్తూ బాలు అంటాడు. అప్పు బూజు తుడిచిన బట్టతో మనోజ్‌పై అనడంతో అతను చిరాకు పడతాడు. వీడేమో ఒక చెఫ్. వాళ్లేమో అంతా ఆస్తిపరులు. అసలు ఎలా సెట్ అవుద్ది అని మనోజ్ అనుమానం వ్యక్తం చేస్తాడు. దాంతో బాలు కౌంటర్స్ వేస్తాడు.

రవికి గొప్ప సంబంధం రావడం నీకు ఇష్టం లేదా అని అనుమానంగా అడుగుతాడు బాలు. నువ్ ఇలాగే వాగితే సర్దుకుపోడానికి వాళ్లు పూలు అమ్ముకునేవాళ్లు కాదు అని మనోజ్ అంటాడు. రవి తను ప్రేమిస్తున్న అమ్మాయి గురించి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రేమించే అమ్మాయి కుటుంబం గురించి బాలు అడుగుతాడు.

అవమానించే బ్యాచ్ అయితే

వాళ్లు నాన్నకు గౌరవం ఇచ్చేవాళ్లు అయితేనే ఒప్పుకోవాలి. ఆ ఆర్టీసీ డీఎమ్ గాడిలా నాన్నని అవమానించే బ్యాచ్ అయితే.. ఈ పెళ్లి అస్సలు జరగనివ్వను అని బాలు గట్టిగా చెబుతాడు. దాంతో సత్యం టెన్షన్ పడతాడు. రవి కూడా కంగారుపడతాడు. ప్రభావతి నెత్తి కొట్టుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇంతకుముందు ఎపిసోడ్‌లో ఇంటికి వచ్చిన బాలు రోహిణి, మనోజ్‌ను పిలుస్తాడు. వెళ్లిన పని ఏమైందని సత్యం అడుగుతాడు. నేను వెళ్లిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడి వస్త కదా అని బాలు అంటాడు. అవును, వీడు పెద్ద పెళ్లిళ్ల పేరయ్య. వెళ్లి కండక్టర్ సంబంధం కుదుర్చుకుని వచ్చాడని ప్రభావతి అంటుంది.

ఓ ఇల్లు మింగినావిడ. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా. అంతా వివరంగా చెబుతానంటాడు బాలు. వెళ్లగానే పెళ్లి సంబంధం మాట్లాడాటానికి వచ్చాను అన్నాను. ఎవరికి అన్నారు. రవికి అన్నాను. కామాక్షి అత్త కాఫీ తెచ్చుంది. వద్దత్త.. గతికితే అతకదు అన్నాను. అతకొద్దనే అని అన్నాడు రంగరావు మావయ్య అని బాలు అంటాడు. దాంతో ఎవరికి అర్థం కానట్టు మొహాలు పెడతారు. ఎవరికీ అర్థం కాలేదు కదా నువ్ బాలువి నాన్న. నాలా అడుగు అని బాలు అంటాడు.

మా నాన్న చూసుకుంటాడు

రంగరావు మావ మా రవికి మీ తమ్ముడు కూతురుని అడుగుదామని వచ్చా అని బాలులా సత్యం అంటాడు. రంగరావులా బాలు మాట్లాడి.. సత్యంను, బాలును పొగిడినట్లు, మనోజ్‌ను తిట్టినట్లు చెబుతాడు. రవి అన్న నాకు ఇష్టమేరా. కానీ, నా తమ్ముడి కూతురిని మీ ఇంటికి ఇచ్చి దాని గొంతు కోయలేనురా అని రంగారావు అన్నట్లు బాలు చెబుతాడు. మా నాన్న ఉన్నాడు కదా. నీ కూతురని మా నాన్న చూసుకుంటాడు కదా అని సత్యం అంటాడు.

మీ అమ్మ ముందు మీ నాన్న పిల్లిరా. వామ్మో మీ అమ్మ దెయ్యాల గంప, రాకాసి.. అమ్మో మావయ్య అన్న మాటలు నేను చెప్పలేను. మీ అమ్మలాంటి అత్త ఉన్న ఇంటికి నా తమ్ముడి బిడ్డను ఇచ్చి జీవితాంతం వాళ్ల ఉసురు పోసుకోలేనురా. దానికి ఏడాది పెళ్లి కాకపోయిన పర్వాలేదు. కానీ, చచ్చినా మీ ఇంటికి కోడలిగా పంపం అని బాలు రంగారావు అన్నట్లు అంటాడు. మీనా ఎంత మంచి అమ్మాయి. అన్ని పనులు చేస్తుంది. అలాంటి అమ్మాయినే కాచుకుని తింటుంది. అలాంటి ఇంటికి ఎవరైనా పిల్లను ఇస్తారా అని బాలు అంటాడు.

రేయ్.. ఆపు.. నాకు తోడబుట్టిన చెల్లెలు లేదు. నువ్వేనాకు చెల్లెలు అని రంగారావు అన్నయ్య అనేవారు. నేను నమ్మను. నా గురించి ఆయన ఇలా అంటాడని నేను అనుకోను అని ప్రభావతి అంటుంది. దాంతో రంగారావు మాట్లాడిన మాటలను రికార్డ్ చేసి వినిపిస్తాడు బాలు. అందులో ప్రభావతిని తిడతాడు రంగారావు. ఆపమని ప్రభావతి అంటుంది. ఇలా ఆ నోట ఈ నోట పాకితే రేపు మౌనికకు పెళ్లి అవుతుందా అని బాలు అంటాడు. ఏంటే నేను అంతలా రాచిరంపానా పెడుతున్నానా అని మీనాను అంటుంది ప్రభావతి.

పెళ్లయ్యే యోగ్యం లేదు

కామాక్షి అత్తయ్య కూడా అంది. అది కూడా వినిపించనా అని బాలు అంటాడు. అవసరం లేదు. పక్కనే ఉండి గోతులు తీశారు కదా. ఇంటికి రాని మంచి నీళ్లు కూడా ఇవ్వను అని ప్రభావతి అంటుంది. నన్ను అయితే బాగానే చూసుకుంటున్నారు కదా అని రోహిణి అంటుంది. అలా అంటే.. ఏంటీ అర్థం. సరే.. అరేయ్ రవిగా ఇప్పట్లో నీకు పెళ్లయే యోగ్యం లేదు అని బాలు అంటాడు. ఇప్పట్లో అని మౌనిక అంటే.. నేను బతికున్నంతకాలం. ఇంకేం చెప్పురా అని ప్రభావతి అంటుంది.

అలా ఎలా అంటార్రా.. ఒకప్పుడు ఆ అమ్మాయినే నీకు ఇద్దామనుకున్నారు కదా అని సత్యం అంటాడు. నిజమా.. నువ్వే చెడగొట్టావా నాన్న. బాగుందా. నన్ను చూసి ఇష్టపడిందా. బాగా చదువుకుందట కదా. వీడు లక్షలు మింగేసిపారిపోకుండా.. ఆ అమ్మాయితోనే నా పెళ్లి జరిగేదా నాన్న. సరే సరే ఎన్నెన్నో అనుకుంటాం. అన్ని జరుగుతాయా అని బాలు అంటాడు. దాంతో అలిగి బాలు బుగ్గగిల్లి వెళ్లిపోతుంది మీనా. వాళ్ల సంబంధం ఏంటీ.. నేనే మంచి సంబంధం చూస్తాను. పలికిమాలినవాళ్లను సంబంధం చూడటానికి పంపించకండి అని ప్రభావతి అంటుంది.

నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. రెస్టారెంట్ ఓపెన్ చేయాలని చెప్పిన రవి బాలుకు థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతాడు. బాలు గదిలోకి వెళ్తాడు. మీనా అలిగి ఉంటుంది. మీ నిజస్వరూపం తెలిసింది. ఎం నటిస్తున్నారండి. మావయ్యతో ఏం మాట్లాడుతున్నారు. అక్కడ నేను లేకుంటే బ్రేకులు లేని బండిలా దూసుకుపోయేవారు. అది అంత బాగుంటే దాన్నే చేసుకోండి. నేను మీ శోభనానికి పూలతో రెడీ చేస్తాను. బుద్ధి లేకపోతే సరి మీనా అంటుంది.

పిల్ల తల్లిని కూడా ఇవ్వరు

తన అందం గురించి బాలు పొగుడుకుంటాడు. మీ గురించి మీరే పొగుడుకోవాలి. మీ ఇంజిన్‌లో అంతుందా.. అని మీనా అంటే.. నీ సైలెన్సర్ పాడయిందే. పాత కారులో కూర్చుని కొత్త కారు గురించి మాట్లాడితే భయంగానే ఉంటుంది అని బాలు అంటాడు. నాకేం భయం లేదు. మీ అమ్మ గారిని చూసి పెళ్లికానీ రవికే పిల్లనివ్వట్లేదు. పెళ్లయిన మీకెవడు ఇస్తాను పిల్లను. పిల్ల తల్లిని కూడా ఇవ్వరు అని మీనా అంటుంది. మరి తెలిసి ఎందుకింతా. ఫిష్ తెచ్చాను. కర్రీ చేసి పెట్టొచ్చు కదా అని బాలు అంటాడు.

మీనా పంచ్ ఇస్తుంది. ఇద్దరు ఇలా సరదాగా పోట్లాడుకుంటారు. వంటపై బాలు జోకులేస్తే.. ఇంట్లో చేసేదంతా చెబుతుంది మీనా. ఒక్కొక్కరికి ఒక్కోటి చేయాలి అని చెప్పుకుంటూ పోతుంది. దాంతో ఆపిన బాలు అమ్మో వంట అంటే ఇంతుంటుందా. నిజంగానే పూలగంప నువ్ బాగానే కష్టపడతున్నావ్. జీతం కూడా ఇవ్వట్లేదు. నిన్ను కావాలనే ఉడుకించాలని అలా మాట్లాడాను. ఈ ముళ్లకంపకు ఈ జన్మకు ఉండేది ఈ పూలగంపే అని మీనాపైకి రొమాంటిక్‌గా వెళ్తాడు బాలు.

చేప ముక్కలే కావాలి

మీనా ఆపుతుంది. కానీ, మీనాను గట్టిగా హగ్ చేసుకుంటాడు బాలు. ఇద్దరూ ఒకరినొకరు రొమాంటిక్‌గా చూసుకుంటారు. వదలండి. నలుగురు పిల్లలు కావాల.. నాలుగు చేప ముక్కలు కావాలా అని మీనా అడిగితే.. వెంటనే వదిలేసి.. చేప ముక్కలే కావాలి అని బాలు వెళ్లిపోతాడు.