Gundeninda Gudigantalu Today Episode: పెళ్లి తాంబూలం తీసుకెళ్లిన బాలు- కొట్టినట్లు చెప్పిన మీనా తల్లి- తాగొచ్చారా అంటూ!-gundeninda gudigantalu serial september 24th episode parvathi declines balu request gundeninda gudigantalu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gundeninda Gudigantalu Today Episode: పెళ్లి తాంబూలం తీసుకెళ్లిన బాలు- కొట్టినట్లు చెప్పిన మీనా తల్లి- తాగొచ్చారా అంటూ!

Gundeninda Gudigantalu Today Episode: పెళ్లి తాంబూలం తీసుకెళ్లిన బాలు- కొట్టినట్లు చెప్పిన మీనా తల్లి- తాగొచ్చారా అంటూ!

Sanjiv Kumar HT Telugu
Sep 24, 2024 08:44 AM IST

Gundeninda Gudigantalu Serial September 24th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 24వ తేది ఎపిసోడ్‌లో మీనాను పట్టుకుని పార్వతి ఇంటికి వెళ్తాడు బాలు. తాంబూలం ఇస్తూ రవితో సుమతి పెళ్లి మాట్లాడేందుకు వచ్చాను అని బాలు చెబుతుంది. ఇలా గుండెనిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్‌లో..

గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 24వ తేది ఎపిసోడ్‌
గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 24వ తేది ఎపిసోడ్‌

Gundeninda Gudigantalu Serial Today Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో బాలు ఎవరినైనా ప్రేమించడం గురించి అడుగుతుంది మీనా. ప్రేమ దోమ పడదని బాలు అంటాడు. అమ్మమ్మ వాళ్ల ఊరులో ఎవరు లేరా అని మీనా అంటుంది. నేనేం మాట్లాడుతున్నాను.. నువ్వేం మాట్లాడుతున్నావ్ అని బాలు అంటాడు. వాళ్లిద్దరికి పెళ్లి చేస్తే ఏమవుతుందండి అని మీనా అంటుంది.

ఆ బొమ్మ తీసుకుని తలపై కొడతా.. ఇద్దరు మర్చిపోతారని అంటే.. మళ్లీ పెళ్లి చేయాలని అంటావేంటీ. డబ్బున్న వాళ్లు అయితే చాలు మా నాన్నను అవమానించింది కూడా పట్టించుకోదు మా అమ్మ. అందుకే నాకు వచ్చిన ఆలోచన వెంటనే అమలు చేయాలని అనుకుంటున్నాను అని బాలు అంటాడు. రవికి ఓ అమ్మాయిని చూసారన్నారు. ఆ విషయమేనా అని మీనా అంటే.. పొద్దునే లేచి రెడీ అవు ఇద్దరం కలిసి ఓ చోటికి వెళ్లాలి అని బాలు పడుకుంటాడు.

కథలుగా చెప్పుకుంటారు

నా నిద్ర చెడగొట్టి మీరు మాత్రం ప్రశాంతంగా పడుకుంటున్నారా.. ఎక్కడికై ఉంటుంది అని మీనా ఆలోచిస్తుంది. కట్ చేస్తే.. ఉదయం కారులో బాలు, మీనా బయలుదేరుతారు. బాలు పాత పాటలు పాడుతుంటే మీనా ఆపుతుంది. నన్ను నేను పొగుడుకోడానికి మాటలు సరిపోవు. అందుకే పాటలతో పొగుడుకుంటున్నాను అని బాలు అంటాడు. ఎవరి వారిని పొగుడోకూకుడదు అని మీనా అంటుంది. ఇప్పుడు నేను చేయబోయే పనికి కథలు కథలుగా గొప్పగా చెప్పుకుంటారు. నీ భర్త మెదడులో ఇంత గొప్ప ఆలోచన మెదిలిందా అనుకుంటావ్ అని బాలు అంటాడు.

ఏదో అయింది.. సొంత డబ్బా కొట్టుకునే దెయ్యం పట్టింది. బూత వైద్యుడిని కలవాలి. నిమ్మకాయ కొట్టాలి అని మీనా అంటుంది. నేను ఓ పని చేయాలనుకుంటున్నాను అని బాలు అంటాడు. ఏంటో తీసుకెళ్తున్నారు. కాఫీ, టీ ఇవ్వలేదని అత్తయ్య గారు అంటారని మీనా అంటే.. అఖండ జ్ఞానిని నేనున్నాగా.. నేను చూసుకుంటాను అని బాలు అంటాడు. ఓ చోట ఆపి పళ్లు కొంటాడు బాలు. ఇద్దరు ఫన్నీగా కొట్లాడుకుంటారు, సెటైర్లు వేసుకుంటారు.

మీనా ఇంటి దగ్గర ఆపి అత్తయ్య అత్తయ్య అని లోపలికి వెళ్తాడు బాలు. ఏదైనా గొడవ జరిగిందా అని మీనా తల్లి పార్వతి అంటుంది. నీకు కొంచెం కూడా అర్థం కాలేదా అని మీనా అంటే.. ఏమైందే అని కంగారుపడుతుంది పార్వతి. నాకు ఏం అర్థం కాలేదని మీనా అంటుంటే.. అత్తయ్య మీ ఇంట్లో ఇత్తడి పెళ్లెం ఉందా అని అడిగి తీసుకురమ్మంటాడు. దాంతో పార్వతి ఇత్తడిపళ్లెం తీసుకొస్తుంది. అందులో పూలు, పళ్లు పెడతాడు బాలు.

తాగి వచ్చారా

ఇదంతా ఏంటీ అల్లుడుగారు అని పార్వతి అంటే.. ఏంటండి అప్పటినుంచి ఏంటీ ఏంటీ అని అడుగుతున్నారు. నేనేమైనా నాటు బాంబులు పెట్టానా. పళ్లే కదా పెట్టాను అని బాలు అంటాడు. దేవుడు ఫొటోల దగ్గరికి వెళ్లి మీనాను పిలిస్తే.. వెళ్తుంది. మావయ్య ఫొటో దగ్గర నిలబడండి అని పార్వతికి చెబుతాడు బాలు. దాంతో అలాగే చేస్తుంది పార్వతి. మీనాను తాంబూళం పట్టుకోమ్మంటాడు. నేను మీ ఇంట్లో మంచి చేయడానికి ఇలా వచ్చాను అని బాలు అంటాడు.

ఈ ఇంటి బరువు బాధ్యతలు నేను కూడా పంచుకోవాలి. పెళ్లికి ఎదిగిన కూతురు ఇంట్లో ఉండటం బరువు. ఆ బరువును గుండెలమీదకెళ్లి దింపుకోడవం బాధ్యత అని బాలు అంటాడు. కరెక్టే కానీ, నాకేం అర్థం కావట్లేదు. మీరేమైనా తాగొచ్చారా అని పార్వతి అంటుంది. ఛీ ఎధవ జీవితం.. ఆఖరుకు అత్తయగారు కూడా అనుమానిస్తున్నారా.. పోలీసుల ముందు ఊదినట్లు ఊదమంటారా అని బాలు అంటే.. అయ్యో వద్దని పార్వతి అంటుంది.

మా రవి మంచోడు. బాగా చదువుకున్నోడు. ఉద్యోగం కూడా చేస్తున్నాడు. వాడికి మీ సుమతినిచ్చి పెళ్లి చేయడానికి తాంబూలం తీసుకొచ్చాను అందుకోండి అని బాలు అంటే.. వెంటనే తాంబూలం వదిలిపెడుతుంది మీనా. చూశారా ఇలాంటి గుడ్ న్యూస్ చెబితే షాక్ అవుతారనే చెప్పలేదని బాలు అంటాడు. ఇది గుడ్ న్యూసా అని మీనా అంటుంది. ఏ రవికి ఏం తక్కువ అని బాలు అంటాడు. ఏం తక్కువ కాదు బాబు. రవి మంచోడు. ప్రయోజకుడు అని పార్వతి అంటుంది.

అత్తయ్యకు చెప్పారా

కదా. అందుకే మీ సుమతిని మా రవికి ఇచ్చి చేస్తే మీ బరువు తగ్గిపోతుంది. నా బాధ్యత తీరిపోతుంది. ఏమంటారు అని బాలు అంటారు. కాదంటాను అని పార్వతి అంటుంది. దాంతో బాలు షాక్ అవుతాడు. ఈ పెళ్లి జరగకూడదని అంటున్నా అల్లుడు గారు. కారణం మీ పక్కనే ఉంది. సాక్ష్యం మీ పక్కనే ఉంది. నాతోటి ఎందుకు చెప్పిస్తారు. మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదు అని పార్వతి అంటుంది. ఈ విషయం అత్తయ్యకు చెప్పారా అని మీనా అడుగుతుంది.

ముందు మా నాన్నకు చెబుతాను. తర్వాత అమ్మను నాన్న ఒప్పిస్తాడు అని బాలు అంటాడు. నా పరిస్థితి ఏం చేద్దామనుకుంటున్నారు. మీరు నన్ను ఓ మాట అడగాల్సింది. ఇలా మీతో తీసుకొచ్చినందుకు మీ అమ్మగారు నన్ను బతకనిస్తారా. ఇది ఎక్కడికి దారితీస్తుందో మీకు తెలుసా అని మీనా అంటుంది. మా రవిని మీ సుమతికి ఇచ్చి చేయడానికి మీకు వచ్చిన సమస్య ఏంటని బాలు అడుగుతాడు. మాలాంటి పేదవాళ్లు అంతస్థుమించి ఆలోచించ కూడదని మీనా పెళ్లితోనే మాకు అర్థమైంది. మళ్లీ ఆ తప్పు చేయాలనికోవట్లేదు అని పార్వతి అంటుంది.

అంత డీప్‌గా మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు అని బాలు అంటాడు. మీనా ఏం చెప్పనే నేను. ఎవరి గురించి చెప్పను. సుమతి చదువుకుంటుంది. పెళ్లి వయసు రాలేదు. పెళ్లి వయసు వచ్చాకా మాకు తగిన సంబంధం చూస్తాం. మీ గొప్ప మనుసుకు నిజంగా మొక్కాలనిపిస్తుంది. కానీ, మీరు తెచ్చిన ముళ్లకిరీటాన్ని మీనా మోసినట్లు సుమతి కూడా మోయాలని తల్లిగా కోరుకోవట్లేదు. మీ తల్లి గురించి ఆలోచించట్లేదు. ఆవిడ ఒప్పుకుంటుందని, మీరు ఒప్పించగలరని అనుకుంటున్నారా అని పార్వతి అంటుంది.

దినదిన గండంగా

మీరు మీ అమ్మ గారి గురించి ఆలోచించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారా. రవితో మా సుమతి మాట్లాడితినే ఓర్వటం లేదు. మేమే మీ ఇంటి మీదకు పంపిస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు చేస్తే.. మీ అమ్మగారు చెప్పిందే నిజం అవుతుంది. ఆ నింద మోయాల్ససిన అవసరం మాకు లేదు. ఇప్పటికే మీనా గురించి పడే దిగులు చాలు. సుమతిని కూడా మీ ఇంటికే ఇచ్చి దినదినగండంగా బతకలేను. రాత్రి మీనా నుంచి ఫోన్ వస్తే దడదడగా ఉంటుంది. మీ అమ్మ నుంచి ఫోన్ వస్తే గుండె గడగడలాడుతుంది అని పార్వతి అంటుంది.

పూలమ్ముకునే పేదోళ్లమే కానీ.. కూతురుని బానిసగా అమ్ముకునే వాళ్లం కాదు అని పార్వతి అంటుంది. మనోళ్లు కదా అని వచ్చాను. కానీ, మా అమ్మ ఎప్పుడు నన్ను మీనాని విడదీయాలని చూడలేదు అని చెప్పి వెళ్లిపోతాడు బాలు. నేనేమైనా తప్పుగా మాట్లాడనా. అల్లుడు గారు కోపంగా వెళ్లారు అని పార్వతి అంటుంది. ఇప్పుడే కరెక్ట్ మాట్లాడావ్. నా అప్పుడే సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోయావ్. నువ్వేం బాధపడకు. ఆయనతో నేను మాట్లాడతాను అని మీనా వెళ్లిపోతుంది.

పార్వతి అన్న మాటలను గుర్తు తెచ్చుకున్న బాలు కోపంగా డ్రైవ్ చేస్తుంటాడు. ఓ చోట ఆపి మీనాను దిగమంటాడు బాలు. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారే. ఇంత దారుణంగా మాట్లాడి పంపిస్తారా. మొహం మీద కొట్టినట్లు మాట్లాడుతుంది మీ అమ్మ. పెళ్లి చేసుకోవడం పిల్ల చెప్పాలి. పిల్ల తల్లికాదు అని బాలు అంటాడు. మీ అమ్మకు ఇష్టంలేకుండా నాకు పెళ్లి చేశారు. నేను పడే కష్టాలు చూడట్లేదా. రోహిణి వచ్చాక నన్ను ఎలా చూస్తున్నారు. పూలమ్ముకునేవాళ్లు మనుషులు కాదా అని మీనా అంటుంది.

నీ మనసులో ఇంత బాధా ఉందా

నీకు అన్నం పెట్టనట్లు, చిత్రహింసలు పెడుతున్నట్లు చెబుతున్నావ్ అని బాలు అంటాడు. చిత్రహింసలు అంటే ఏంటండి.. కొట్టాలా తిట్టాలా, వాతలు పెట్టాలా. మనసు ముక్కలు అయ్యేలా ఒక్క మాట అంటే చాలు. చచ్చేంత వరకు గుర్తుంటుంది. మమ్మల్ని దొంగల కుటుంబం అంటున్నారు అది చాలదా. మా అమ్మను అడిగే ముందు మీ అమ్మను అడగలాని తెలియదా అని మీనా నిలదీస్తుంది. ఒకరోజు నేను గుడిలో అంగప్రదర్శన చేశాను గుర్తుందా. అది ఎందుకు చేశానో చెప్పలేదు. నా గురించి, కుటుంబం గురించి, చెల్లి గురించి తప్పుగా మాట్లాడితేనే దేవుడికి మొరపెట్టుకున్నాను అని మీనా అంటుంది.

అంత నరకంగా ఉంటుంది ఆ మాటలు పడితే.. దానికన్న చావడం మేలు అనిపిస్తుంది. చిత్రహింసలు అంటే అవి. నేను భరిస్తున్నాను కదా. మళ్లీ నా చెల్లి కూడా పడాలా అని మీనా ఏడుస్తుంది. నీ మనసులో ఇంత బాధ ఉందా. అయినా నేను చేసిందే మంచి పని. రవి మంచోడు. సుమతిని బాగా చూసుకుంటాడు. మీకు నాన్న లేనందుకు మీ అమ్మ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు అని బాలు అంటాడు.

మీ మనసులో ఉంది నాకు అర్థమైంది. కానీ, పెళ్లి అంటే మనం నలుగురు అనుకోవడం కాదు. నేను పడే బాధలను నా చెల్లి కూడా చూడాలా అని మీనా అంటుంది. అదంతా నేను చూసుకుంటాను కదా అని బాలు అంటే.. మీరు గాయానికి మందు మాత్రమే రాయగలు అని మీనా అంటుంది.