Gundeninda Gudigantalu Today Episode: పెళ్లి కొడుకు తండ్రిని చితక్కొట్టిన బాలు.. మారిపోయిన రోహిణి బ్యూటి పార్లర్ పేరు
Gundeninda Gudigantalu Serial September 18th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 18వ తేది ఎపిసోడ్‌లో పెళ్లి చూపులకు వచ్చిన ప్రభావతి ఫ్రెండ్ ధనం భర్త నారాయణ రాజు బాలు తండ్రిని సత్యంను అవమానిస్తాడు. దాంతో నారాయణ రాజును చితక్కొడతాడు బాలు. ఇలా గుండెనిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్‌లో..
Gundeninda Gudigantalu Serial Today Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో ప్రభావతి ఇంట్లో మౌనికకు, రవికి పెళ్లి చూపులు జరుగుతుంటాయి. బాలు సెటైర్లు వేస్తుంటే.. ప్రభావతి అవి జోకులు అని కవర్ చేస్తుంది. తర్వాత మౌనిక, రవిని తీసుకొస్తారు. నువ్వేం బిజినెస్ చేస్తున్నావ్ బాబు అని ప్రభావతి ఫ్రెండ్ ధనం భర్త నారాయణ రాజు అడుగుతాడు.
వీడా.. ఆస్ట్రేలియాలో హోటల్ మేనెజ్‌మెంట్ కోర్స్ పూర్తి చేసి పెద్దవి రెండు రెస్టారెంట్‌లు పెడదామని చూస్తున్నాడు. సరైనా స్థలమే సెంట్రల్‌లో దొరకట్లేదు. నాలుగు రోజులు చూసి హైదరాబాద్‌కు వెళ్దామని చూస్తున్నాడు అని ప్రభావతి అంటుంది. మౌనిక రెండు పీజీలు చేస్తుందని, కంపెనీకి సీఈఓగా చేస్తారు చూడు ఆ పీజీలు. అమెరికా రమ్మంటున్నారు. కానీ, ఒంటరిగా పంపించడం ఇష్టంలేక పంపించలేదు. పెళ్లయ్యాక భర్తతో హనీమూన్‌కు పంపించడం బెటర్ అని ప్రభావతి అంటుంది.
స్వీట్ హాట్ లేవు
మౌనిక, రవి బాలును చూస్తే.. నన్నేం చూస్తున్నారురా అబ్బాయి, అమ్మాయి అక్కడున్నారు చూడండి అని బాలు అంటాడు. ఇవేం పెళ్లి చూపులు అమ్మ.. స్వీట్ హాట్ లేవు. ఇంక పెట్టలేదు అని ధనం కొడుకు (పెళ్లి కొడుకు) గోపి అంటాడు. శుద్ధమైన నెయ్యితో చేసిన స్వీట్స్ ఉన్నాయని చెప్పిన ప్రభావతి మీనాను తీసుకురమ్మంటుంది. మీ అబ్బాయి చాలా సిగ్గుపడతాడనుకుంటా అని నారాయణ రాజు అంటే.. మీ అబ్బాయికి సిగ్గులేదనుకుంటా.. అదే సిగ్గపడకుండా స్వీట్స్ అడిగాడు కదా అని బాలు అంటాడు.
కలుపుగోలుగా ఉండటం మంచిదే కదరా అని ప్రభావతి అంటుంది. తర్వాత ఉల్లి బజ్జి లేదా అని గోపి అడుగుతాడు. మావాడికి కొంచెం జిహ్వా చాపల్య ఎక్కువ అని కవర్ చేసిన ధనం.. ఇంతకీ మీ ఆయన ఏడే అని అడుగుతుంది. బ్యాంక్‌కు వెళ్లారు. పది లక్షలు వేద్దామని ప్రభావతి అంటుంది. పది లక్షలు కాదమ్మా.. 40 లక్షలు, ప్లస్ 17 లక్షలు అని బాలు సెటైర్ వేస్తాడు. మౌనికి, గోపి, రవి, వల్లిని ఒంటరిగా మాట్లాడుకునేందుకు పంపిస్తారు.
గోపి మాత్రం స్వీట్స్ కూడా పట్టుకెళ్తాడు. మరోవైపు శ్రుతి తమకు నచ్చిందని, ముహుర్తాలు పెట్టుకుందామని, నేను సురేంద్రకు మాటిచ్చాను అని సంజు తల్లిదండ్రులు అంటారు. ఇంతలో శ్రుతి భుజంపై చేయి వేసి.. హ్యాపీనా ముహుర్తాలు కూడా పెట్టుకుంటారట అని అంటాడు. దాంతో శ్రుతి షాక్ అవుతుంది. నేను వెళ్లాలి. అర్జంట్‌గా వెళ్లి డబ్బింగ్ చెప్పాలి అని అడుగుతుంది. ఏ స్టూడియోవాళ్లు, మనవాళ్లతో చెప్పి వార్నింగ్ ఇస్తానని సంజు తండ్రి అంటాడు.
రోజు సాలరీ ఇస్తారా
లేదు అంకుల్. మాటిచ్చాను. మాటిచ్చాకా తప్పదు కదా అని శ్రుతి అంటుంది. నువ్ నాకు బాగా నచ్చావ్ చిట్టితల్లి. వెళ్లు అని అంటాడు. దాంతో శ్రుతి వెళ్లిపోతుంది. మరోవైపు వల్లితో రవి మాట్లాడేందుకు సిగ్గుపడతాడు. మౌనికతో ఉన్న గోపి తింటూ ఉంటాడు. హోటల్ మ్యానేజ్‌మెంట్ అంటే హోటల్‌లో మేనేజర్‌గా చేసే చదువేనా అని వల్లి అంటుంది. హోటల్‌లో పని చేసిన రోజే సాలరీ ఇస్తారా. టిప్స్ కూడా ఇస్తారా అని వల్లి అంటుంది.
మరోవైపు గోపి తింటూ ఉంటాడు. ఉల్లి బజ్జిలో ఓమ ఉంటే బాగా జీర్ణం అవుతుంది. మీఅన్నయ్య కూడా బాగా వంట చేస్తాడా. చేస్తే ఇల్లరికం తీసుకెళ్దామని, కావాల్సినవి వండించుకోవచ్చు కదా అని గోపీ అంటాడు. అసలు మీరు ఏం చేస్తారు. తినడం కాకుండా అని మౌనిక అడుగుతుంది. కూర్చుని తినేంత ఆస్తి ఉంది. అందుకే తిని కూర్చుంటాను అని గోపి చెబుతాడు. మరోవైపు ప్రభావతి, ధనం కాలేజ్ డేస్ గురించి మాట్లాడుకుంటారు.
కమల్ హాసన్ లాంటి వాడు కావాలని అనేదానివి. అలాంటివాన్నే చేసుకున్నావా అని ధనం అంటుంది. అప్పుడు కలమ్ హాసన్‌లానే ఉండేవారు అని ప్రభావతి అంటుంది. ఇంతలో సత్యం వస్తాడు. సత్యంను చూసి నారాయణ రాజు, ధనం షాక్ అవుతారు. ఆయన నేను రిటైర్‌మెంట్ తీసుకోమ్మంటే తీసుకున్నారు. పెళ్లైన కొత్తలో సిక్స్ ప్యాక్ ఉండేది అని ప్రభావతి చెబుతుంది. తనేగా మీ చిన్నకోడలు. ఏదో గుడిముందు చిన్న పూల కొట్టు పెట్టుకుందని విన్నాను అని ధనం అంటుంది.
ఇండియా మొత్తం బ్రాంచ్‌లు
చిన్నదా.. అది పెద్ద పూల బొకేషాపు. ఇండియా మొత్తం పంపించే షాపు అని ప్రభావతి అంటుంది. చాల్లే అమ్మ ఆపు. నువ్ ఈపాటికే లక్ష అబద్ధాలు ఆడావు. గిన్నీస్ బుక్ రికార్డ్ తీసుకుంటే నువ్ రికార్డ్ బ్రేక్ చేస్తావ్ అని బాలు అంటాడు. ఏమైందిరా అని సత్యం అడుగుతాడు. ఇప్పుడు విన్నావ్ కదా నాన్న పూల షాపు ఉంటే.. ఇండియా మొత్తం బ్రాంచ్‌లు ఓపెన్ చేసింది అని ప్రభావతి చెప్పిన అబద్ధాలు చెబుతాడు బాలు. పెళ్లి చూపుల్లో ఉన్నాంరా. పిల్లలకు నచ్చారో లేదో తెలుసుకుందాం అని కామాక్షి అడ్డుపడుతుంది.
పెళ్లి కోసం మా అమ్మ అబద్ధాలు చెబుతుంటే నాకు రగిలిపోతుందని బాలు అంటాడు. ప్రభావతి అడ్డుకుంటే.. నువ్ ఆగు శ్రీదేవి. నీ మాటలు వింటే.. జీవితాంతం నేను, రవి, మౌనిక అబద్ధంతో బతకాలి. మా అమ్మ చెప్పినవన్ని అబద్ధాలు ధాన్యలక్ష్మీ గారు అని బాలు అంటాడు. మా ఆయన బస్సు కింద ఓ తాగుబోతోడు పడి చచ్చాడు. మా ఆయన మాట్లాడటానికి వెళితే.. దీన్ని మాకు అంటగట్టారు అని ప్రభావతి అంటుంది. ఇది కూడా అబద్ధమే మావయ్యను ఎవరు బెదిరించలేదని మీనా అంటుంది.
మనోజ్ గురించి బాలు చెబుతాడు. ఆపమని చెప్పిన ప్రభావతి.. పిల్లలను పిలిచి నచ్చారో లేదో తెలుసుకుందాం అని అంటుంది. నువ్ ఆగమ్మా. మీ ఇంటి చరిత్రలో ఏదో తిరకాసు ఉంది. మీ పిల్లల చదువులు అంతా బోగసేనా. అంటే మీ ఆయన చేతకాని దద్దమ్మా.. ఎలా బతకాలో ఎలా పెంచాలో తెలియని వెర్రివాడా.. ఇదేం సంబంధం చూశావే.. పనికిమాలిన దిక్కుమాలిన సంబంధం తూ.. అని నారాయణ రాజు అంటాడు.
చితకొట్టిన బాలు
దాంతో కోపంగా మా నాన్నను ఏమన్నావురా అని నారాయణ రాజు చెంపలు వాయిస్తాడు బాలు. ఎవరు ఆపిన ఆగకుండా కొడుతూనే ఉంటాడు బాలు. ఇంతలో గోపి వచ్చి మా నాన్నే కొడతావా అని వస్తే.. గోపిని పక్కకు తోస్తాడు. మళ్లీ వస్తే.. మిస్టర్ ఉల్లి బజ్జి మా అన్నయ్య సంగతి తెలియదు అని అడ్డుకుంటుంది. అరేయ్ పెద్దమనిషిని పట్టుకుని కొడతావా తప్పురా అని సత్యం అంటాడు. నువ్వు పెద్దమనిషివే. నీ గురించి ఎలా మాట్లాడాడు అని బాలు అంటాడు.
ఏంటీ ప్రభా ఇది ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇంత రౌడీయిజం. అప్పటికీ చెప్పేదానికి ఈ ఇంటికి సంబంధం లేదని డౌట్ వస్తుంది అని ధనం అంటుంది. నువ్ చెప్పే అబద్ధాల వల్ల నాన్ను వీడు చాతకాని వాడిగా జతకట్టాడు. ఇదంతా నీవల్లే అని బాలు అంటాడు. ఛీ ఛీ.. చిన్ననాటి స్నేహితురాలివని వస్తే ఇంత అవమానిస్తారా అని ధనం అంటుంది. నారాయణ రాజు ఏదో అనబోతుంటే.. బాలు ఆపుతాడు. ఉల్లి బజ్జి పెట్టడం రాదు కానీ రౌడీయిజం చేస్తారా అని గోపి అంటాడు.
రేయ్ ఉల్లి బజ్జి ఇటు రారా.. తిన్నదానికి డబ్బులిచ్చి వెళ్లు అని అంటాడు బాలు. నాలగు వందలు, నా భార్య సర్వీస్ చేసింది కాబట్టి.. సర్వీస్ ట్యాక్స్ ప్లస్ జీఎస్టీ 750, పైగా స్వీట్స్ తిన్నావు కాబట్టి మొత్తం వెయ్యి అని బాలు అంటాడు. టేబుల్‌పై నారాయణ రాజు డబ్బులు పడేస్తే.. చేతికిచ్చి వెళ్లమని బాలు అంటాడు. దాంతో ఇచ్చి వెళ్లిపోతారు ధనం కుటుంబం. తల పగిలిపోతుంది అనుకుంటూ కామాక్షి వెళ్లిపోతుంది. ప్రభావతి వచ్చి కోప్పడుతుంది.
సాధారణ బస్సు డ్రైవర్ భార్యవు
కష్టపడి సంబంధం తెస్తే చెడగొట్టారు. వీడి బతుక్కి ఒక్క సంబంధం అయినా తేగలడా. వీడి సంపాదనతో వీళ్లకు ఒక్క పెళ్లి అయినా చేయగలడా. శనిలా చేస్తాడనే ఇంట్లో ఉండకూడదని అన్నాను అని ప్రభావతి అంటుంది. అబద్ధాలు చెప్పి ఇల్లు తాకట్టుపెట్టిన నీకు బుద్ధిరాలేదా. అన్నీ అబద్దాలా. సరే నేను సంబంధం తేలేను. మరి నువ్ కార్ల కంపెనీ ఓనర్ తల్లివా. కారు ఏజెన్సీ తల్లివా అని బాలు అడుగుతాడు. నువ్ కూడా ఒక సాధారణ బస్సు డ్రైవర్ భార్యవే అని బాలు అంటాడు.
పెళ్లి కోసం ఎన్ని అబద్ధాలు అయినా ఆడతాను అని ప్రభావతి అంటుంది. అవి నువ్ ఆడు. మమ్మల్ని లాగకు అని బాలు అంటాడు. అయితే ఏ సంబంధంతో ఇంట్లో ఉన్నావ్. ఈ సంబంధం చెడగొట్టాలనే పనిగట్టుకుని పనిమానుకుని ఇంట్లో ఉన్నావా అని ప్రభావతి అడుగుతుంది. ఇప్పుడేంటీ ప్రభావతి నువ్ కట్టిన పేక మేడ కూలిపోయిందనా అని సత్యం అడుగుతాడు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా కలిసి ఉండచొచ్చని తెలిసిందని మీనాతో అంటాడు బాలు.
మరోవైపు రోహిణి పార్లర్‌కు ప్రభావతి వెళ్తుంది. అదే సమయంలో రోహిణితో ఇది ప్రభావతి బ్యూటి పార్లర్ కాదు.. క్వీన్స్ పార్లర్ అని ఒకామే చెబుతుంది. దాంతో రోహిణి షాక్ అవుతుంది. లోపలికి వెళ్లిన ప్రభావతి పేరు చూసి పార్లర్ పేరు మారిందేంటీ అని అడుగుతుంది.