Gundeninda Gudigantalu Today Episode: మనోజ్‌కు తల్లి వార్నింగ్- రవి బైక్‌పై మీనా చెల్లెలు- ప్రభావతి కొడుకు పెళ్లి చూపులు
Gundeninda Gudigantalu Serial September 11th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 11వ తేది ఎపిసోడ్‌లో ఐస్ క్రీమ్ తినిపించుకుంటున్న రవి, శ్రుతిలను సురేంద్ర, శోభన చూస్తారు. రవిని చంపేస్తానని సురేంద్ర అంటాడు. శ్రుతి, సుమతిని బైక్‌పై రవి తీసుకెళ్లడం కామాక్షి చూసి ప్రభావతికి చెబుతుంది.
Gundeninda Gudigantalu Serial Today Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో మా నాన్నకు, అన్నకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం రిస్క్. అటు వైపు మీ అమ్మ నాన్న నన్ను మర్డర్ చేసేవాళ్లే కానీ, మా బాలు అన్నయ్య ఉన్నాడని ఆగుతున్నారు అని రవి అంటాడు. బాబోయ్ నువ్ 90స్ కిడ్‌వి కాదు. క్రీస్తూ పూర్వం పుట్టాల్సింది. నాలా నీకు డేరింగ్ లేదు అని శ్రుతి అంటుంది.
ఐస్ క్రీమ్ తినిపిస్తూ
నేను కూడా డేరింగ్‌గా ఉంటే.. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిందో తెలియదు. అందుకే నేను ఇలా ఉండటమే కరెక్ట్. నేను రియాల్టీలో బతుకుతాను. నువ్ డ్రీమ్స్‌లో ఉంటావ్ అని రవి అంటాడు. తర్వాత రొమాంటిక్‌గా ఉందామని శ్రుతి చెబుతుంది. తనకు క్రీమ్ తినిపించమని శ్రుతి అడిగితే.. ముందు అందరూ చూస్తున్నారు వద్దన్నా తర్వాత ఒప్పుకుంటాడు రవి. ఒకరికొకరికి ఐస్ క్రీమ్ తినిపించుకుంటారు. మరోవైపు అదే పార్లర్‌కు శ్రుతి తల్లిదండ్రులు వస్తారు.
శ్రుతికి ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకుని కూల్ చేసి మనం ఓకే అనుకున్నా సంబంధం గురించి చెప్పాలి అని సురేంద్ర అంటాడు. అది వింటున్న నమ్మకం లేదని శోభన అంటుంది. అది మన కూతురు కదా. చూస్తూ చూస్తూ నిప్పు ముట్టుకోనిస్తామా. అలాగే పెళ్లి కూడా అని సురేంద్ర అంటాడు. ఇద్దరూ లోపలికి వెళ్తారు. అక్కడ రవి, శ్రుతి ఐస్ క్రీమ్ తినిపించుకోవడం చూసి షాక్ అవుతారు. వాడిని చంపేస్తాను అని సురేంద్ర అని కోప్పడతాడు.
వాడు చస్తే శ్రుతి జీవితంలో పెళ్లి చేసుకోదు. ముందు బయటకు పదండి. మనం చూసి కూడా ఏం చేయలేదని ఇంకా రెచ్చిపోతారు అని బయటకు తీసుకెళ్తుంది శోభన. వాడిని ఏం చేసిన బాలు గాడు ఊరుకోడు. శ్రుతినే మన దారిలోకి తెచ్చుకోవాలి అని శోభన అంటుంది. నా ఫ్రెండ్ కొడుకుతో శ్రుతి పెళ్లి చేసే పని చేయాలి అని సురేంద్ర అంటాడు. ఇద్దరు వెళ్లిపోతారు. మరోవైపు బాలు గాడే నిన్ను ఇంట్లోంచి గెంటేస్తాడన్న ప్రభావతి మాటలు గుర్తు చేసుకుంటుంది మీనా.
నేను చూసుకుంటాను
ఇంతలో బాలు వస్తాడు. ఇంట్లో ఎవరి బుద్ధి మారదు. పెద్దగా ఆలోచించకు. ఓయ్.. పూలగంప అని బాలు అంటాడు. ఇంకోసారి అలా పిలవకండి అని మీనా అంటుంది. పత్రాలు నీకు ఇవ్వడం కరెక్ట్ అని నాన్న నమ్మారు అని బాలు అంటాడు. నేను కాదనట్లేదు. కానీ, దానివల్ల అత్తయ్య ప్రశాంతంగా ఉంటారా. రోహిణి మనసు నొచ్చుకోకుండా ఉంటుందా అని మీనా అంటుంది. తప్పు చేస్తే ఎవరినైనా నేను అంటాను. నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను అని బాలు అంటాడు.
ఎందుకు ఇంట్లో గొడవలకు కారణం నేనే అని అందరూ అనడానికా. ఎంత కాదనుకున్నా వాళ్లు మన ఇంటి సభ్యులే కదా అని మీనా అంటుంది. ఇలా మంచి చెడు తేడా లేకుండా అందరిని నా వాళ్లు అనుకుంటావ్ కాబట్టే నాన్న ఆ పత్రాలు నీకిచ్చాడు. వడ్డీ వ్యాపారి అమ్మను హౌజ్ అరెస్ట్ చేయడం నువ్ చూడకపోయి ఉంటే ఎలా ఉండేదో తెలుసా. నీ మంచితనాన్ని నాన్న గుర్తించారు. నా భార్య మంచితనం గుర్తిస్తే నాకు సంతోషమే కదా అని బాలు అంటాడు.
మరోవైపు శ్రుతి కోసం రవి వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో శ్రుతి వస్తుంది. ఇద్దరు బైక్‌పై వెళ్తారు. వాళ్లను కామాక్షి చూస్తుంది. ప్రభావతి గాల్లో మేడలు కడితే.. కొడుకులు ఇష్టంలేని వాళ్లతో తిరుగుతున్నారు అని అనుకుంటుంది. శ్రుతిని డ్రాప్ చేస్తాడు రవి. రవిని ప్రేమగా శ్రుతి తాకితే.. ఎవరైనా చూస్తారు అని మొహమాటపడతాడు. ప్రేమలో ఉన్నప్పుడు సొసైటీకీ భయపడకూడదు. ఐ లవ్యూ చెప్పు అని శ్రుతి అడిగితే.. రవి అలాగే చెబుతాడు.
త్వరగా జాబ్ చూసుకో
నా డబ్బింగ్ అయ్యాక బయటకు వెళ్దాం అని శ్రుతి చెబితే.. కష్టంగా ఒప్పుకుంటాడు రవి. తినడానికి ఏమైనా ఉందా అని ఫ్రిడ్జ్‌లో చూస్తాడు మనోజ్. అది చూసి ప్రభావతి విసుక్కుంటుంది. పెద్ద కొడుకువై ఇలా తిండి చూసుకుంటున్నావా. ఆ పూలమ్మేదానికి నాన్న పత్రాలు ఇస్తే ఏం చేయలేకపోయాం. ఇంత జరుగుతున్న నువ్ పనిపాట లేకుండా అని మెల్లిగా మాట్లాడుతుంది. నీకు జాబ్ లేదని రోహిణి చూసి చూడనట్లు ఊరుకుంటుందేమో కానీ, బాలుగాడు ఊరుకోడు. అసలే వాడి నోరు మంచిది కాదు అని ప్రభావతి చెబుతుంది.
ఇప్పటికే పత్రాలు దాని చేతికి పోయాయి. ఇల్లు కూడా పోకముందే త్వరగా ఏదో ఒక జాబ్ చూసుకో. లేకుంటే మనల్ని ఎవరు కాపాడలేరు అని ప్రభావతి చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు సైకిల్‌పై పూలు పెట్టుకుని తోసుకుంటూ వెళ్తుంది సుమతి. అది చూసి రవి పలకరిస్తాడు. పంచర్ అయిందని సుమతి చెబుతుంది. సైకిల్ పక్కన పెట్టు పూలు మనం తీసుకెళ్దాం అని బైక్‌పై తీసుకెళ్తాడు రవి. నీ లవ్ మ్యాటర్ ఎక్కడిదాకా వచ్చిందని సుమతి అడుగుతుంది.
మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని రవి అంటాడు. నాకు తెలుసులే. పర్లేదు చెప్పు. నేనేం ప్రపోజ్ చేయనులే. లేకుంటే ఎలా ప్రపోజ్ చేయాలో చెబుతా అని సుమతి అంటుంది. అలాంటివేం చేయకు. ఇది ఎవరికి చెప్పకుండా చాలు. మా నాన్నకు, శ్రుతివాళ్ల నాన్నకు చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. నా వల్ల అవి ఇంకా పెద్దవి అవడం నాకిష్టం లేదు అని రవి అంటాడు. ఇలా అదరికీ భయపడితే నీ ప్రేమను దక్కించుకునేది ఎప్పుడని సుమతి అంటుంది.
పూల కొట్టు అవుతుందేమో
వాళ్లిద్దరూ బైక్‌పై వెళ్లడం మళ్లీ కామాక్షి చూస్తుంది. వీడు ఇంతకుముందే ఇంకో అమ్మాయిని తీసుకెళ్లాడు. ఇప్పుడు మరో అమ్మాయిని తీసుకెళ్తున్నాడు. ఈ పిల్ల మీనా చెల్లెలు కదు. పూల గంప ఉందంటే ఎక్కడికి వెళ్తున్నారు. వీడిని ఇలాగే వదిలేస్తే.. ఇద్దరూ ముగ్గురు పెళ్లాలను తీసుకొచ్చి ఆ కొంపలో నిప్పులు పోస్తాడు అని ప్రభావతికి కాల్ చేస్తుంది. నీ ఇల్లు తొందర్లో పూల కొట్టు అవుతుందేమే అనిపిస్తుంది. నీ మూడో కొడుకు రవి మన్మథుడుని మించిపోయేలా ఉన్నాడని కామాక్షి అంటుంది.
రవి కాసేపటికి క్రితమే తెల్ల తోలు పిల్లను బైక్‌పై తీసుకెళ్లాడు అని కామాక్షి అంటే.. అవునా, అమ్మాయి బాగుందా. ఆస్తులు పాస్తులు బాగున్నాయా అని ప్రభావితి అంటుంది. వాడు ఇంకో అమ్మాయితో కూడా తిరుగుతున్నాడు అని కామాక్షి అంటే.. అందులో ఏముంది. ఆ రెండో అమ్మాయి కూడా బాగుందా అని ప్రభావతి అంటుంది. హా బాగుంది. ఆ రెండో పిల్ల నీ కోడలు అయితే నీ బతుకు బజారుపాలే. ఆ పిల్ల సుమతి. నీ రెండో కోడలు మీనా చెల్లెలు సుమతి అని కామాక్షి అంటుంది.
ఇద్దరు కలిసి మార్కెట్‌లో పూలు కొనుకుని వెళ్తున్నారనిపిస్తుంది అని కామాక్షి అంటుంది. వీడెందుకు తిరుగుతున్నాడు. ఆ పూలమ్ముకునే సంతంతా నా ఇల్లుపై పడి దోచుకునేలా ఉన్నారే. వాడి సంగతి చెబుతా అని ప్రభావతి అంటుంది. ఈకాలం పిల్లలు చెబితే వినరు. వాడిని రెచ్చగొట్టకు. కోపంలో తనను పెళ్లి చేసుకుని తీసుకొస్తాడు. వాడితో ఈ విషయం చెప్పకుండా ఏదైనా సంబంధం చూసి చేసేయ్ అని కామాక్షి అంటుంది.
పెళ్లి చూపులు
అవును, ఆ మొదటి అమ్మాయి ఎలా ఉంది. ఆస్తుపాస్తులు ఉన్నాయా అని అడుగుతుంది ప్రభావతి. మళ్లీ మొదటికి వచ్చావ్. ఈకాలం అమ్మాయిలు తమ కొంగుచుట్టూ తిరగాలని అనుకుంటున్నారు. వాడికి డిమాండ్ ఎక్కువ. త్వరగా పెళ్లి చేయ్ అని కామాక్షి అంటుంది. ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేవు. ఇంటికి వచ్చి చెబుతా అని కాల్ కట్ చేస్తుంది ప్రభావతి. మరోవైపు బాలు, మీనా కారు నడపడం, సిగ్నల్ గురించి సరదాగా మాట్లాడుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
తర్వాతి ఎపిసోడ్‌లో ఇంట్లో పెళ్లి చూపులు జరగబొతున్నాయి కాబట్టి ఊరుకుంటున్నాను. రవి, మౌనిక మీ ఇద్దరికి సంబంధం చూశాను అని ప్రభావతి చెబుతుంది. ఈ నెల నుంచి ఇంటి ఖర్చులకు లక్షలు మింగినవాడు డబ్బులిస్తాడని ఎవరో మంగమ్మ శపథం చేశారు అని బాలు అంటాడు. మనోజ్ చేసే పని ఎంత కష్టమో తెలుసా నీకు అని రోహిణి అంటే.. కష్టం చేస్తేనే కదా నాకు తెలిసేది అని మనోజ్ నోరు జారుతాడు. అసలు నువ్ జాబ్‌కే వెళ్తున్నట్లు లేదే అని బాలు డౌట్ పడతాడు.