OTT Horror Comedy: మరో ఓటీటీలోకి తమన్నా హారర్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..-tamannaah bhatia tamil horror comedy movie aranmanai 4 to stream on jiocinema ott in hindi language after prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror Comedy: మరో ఓటీటీలోకి తమన్నా హారర్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Horror Comedy: మరో ఓటీటీలోకి తమన్నా హారర్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 28, 2024 05:01 PM IST

Aranmanai 4 OTT: అరణ్మనై 4 చిత్రం మరో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే నాలుగు భాషల్లో ఓ ఓటీటీలో ఉండగా.. హిందీలో మరో ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టనుంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది.

OTT Horror Comedy: మరో ఓటీటీలోకి తమన్నా హారర్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
OTT Horror Comedy: మరో ఓటీటీలోకి తమన్నా హారర్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

తమిళ హారర్ కామెడీ మూవీ అరణ్మనై 4 మంచి హిట్ అయింది. సుందర్ సి, స్టార్ హీరోయిన్లు తమన్నా భాటియా, రాశీ ఖన్నా ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేశారు. బాక్ పేరుతో ఈ చిత్రం తెలుగులో వచ్చింది. అరణ్మనై 4 మూవీ ఈ ఏడాది మే 3న థియేటర్లలో రిలీజ్ అయింది. మిక్స్డ్ టాక్ వచ్చినా.. రూ.100కోట్ల కలెక్షన్లను దక్కించుకొని బంపర్ హిట్ అయింది. ఈ మూవీ ఇప్పటికే ఓ ఓటీటీలో ఉండగా.. ఇప్పుడు ఇంకో ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.

స్ట్రీమింగ్ వివరాలివే..

అరణ్మనై 4 సినిమా హిందీ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ హిందీలో అక్టోబర్ 1వ తేదీన జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది.

ఇప్పటికే నాలుగు భాషల్లో..

అరణ్మనై 4 సినిమా జూన్‍లోనే డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి మంచి వ్యూసే రాగా.. కొన్ని సీన్లపై ట్రోలింగ్ కూడా నడిచింది. ఇప్పుడు, అక్టోబర్ 1న ఈ చిత్రం హిందీలో జియోసినిమా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

అరణ్మనై 4 చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన సుందర్ సీ.. దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రాన్ని హారర్ కామెడీగా తెరకెక్కించారు. ఈ మూవీలో కొంతభాగం ఔట్‍డేటెడ్‍గా ఉందంటూ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం దుమ్మురేపింది. ఆరంభం నుంచే తమిళంలో మంచి కలెక్షన్లు దక్కించుకుంది.

అరణ్మనై 4 మూవీలో లాయర్ శరవణ్ పాత్రను సుందర్ చేయగా.. ఆయన సోదరి సెల్వి క్యారెక్టర్ పోషించారు తమన్నా భాటియా. రాశీ ఖన్నా డాక్టర్ మాయగా నటించారు. ఈ చిత్రంలో రామచంద్ర రాజు, యోగిబాబు, సంతోష్ ప్రతాప్, వీటీవీ గణేశ్, కోవై సరళ కీరోల్స్ చేశారు.

అరణ్మనై 4 కలెక్షన్లు

అరణ్మనై 4 చిత్రం సుమారు రూ.40కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ మూవీ సుమారు రూ.100 కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది. తమిళంలో భారీ వసూళ్లను రాబట్టింది. అయితే, తెలుగులో మాత్రం చతికిలపడింది. హాట్‍స్టార్ ఓటీటీలో ఈ మూవీ మంచి వ్యూస్ దక్కించుకుంది. అక్టోబర్ 1న జియోసినిమాలో హిందీలో వచ్చే ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

అరణ్మనై 4 మూవీని అవ్నీ సినీమ్యాక్స్, బెంజ్ మీడియా పతాకాలపై ఖుష్బూ సుందర్, అరుణ్ కుమార్, షణ్ముగం ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. హిప్‍హాప్ తమిళ మ్యూజిక్ అందించిన ఈ మూవీకి ఈ కృష్ణస్వామి సినిమాటోగ్రఫీ చేశారు.

అరణ్మనై 4 స్టోరీలైన్

లాయర్ శివ శంకర్ (సుందర్) సోదరి శివానీ (తమన్నా భాటియా) హఠాత్తుగా చనిపోతుంది. దీంతో శంకర్ షాక్ అవుతాడు. ఈ క్రమంలోనే శివానీ భర్త అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. శివానీది ఆత్మహత్య కాదని, ఆమె మరణం వెనుక మిస్టరీని తెలుసుకునేందుకు శివ శంకర్ నిర్ణయించుకుంటాడు. శివానీ మరణానికి కారణం ఏంటి? శివ శంకర్ నిజాన్ని ఈ మిస్టరీని ఛేదించాడా? అనే విషయాలు అరణ్మనై 4 స్టోరీలో ప్రధానంగా ఉంటాయి.