Baak OTT: ఈవారంలోనే ఓటీటీలోకి రానున్న తమన్నా, రాశీ ఖన్నా కామెడీ హారర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..-tamannaah bhatia raashii khanna comedy horror movie aranmanai 4 baak to release on disney plus hotstar on june 21 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Baak Ott: ఈవారంలోనే ఓటీటీలోకి రానున్న తమన్నా, రాశీ ఖన్నా కామెడీ హారర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..

Baak OTT: ఈవారంలోనే ఓటీటీలోకి రానున్న తమన్నా, రాశీ ఖన్నా కామెడీ హారర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..

Jun 18, 2024, 05:38 PM IST Chatakonda Krishna Prakash
Jun 18, 2024, 05:38 PM , IST

  • Baak OTT Release Date: తమిళ మూవీ అరణ్మనై 4 (Aranmanai 4 ) సూపర్ హిట్ అయింది. తెలుగులో ఈ చిత్రం ‘బాక్’ పేరుతో వచ్చింది. కాగా, ఈ వారమే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.

తమిళ కామెడీ హారర్ మూవీ అరణ్మనై 4 సుమారు రూ.100కోట్ల కలెక్షన్లు సాధించి సూపర్ హిట్ అయింది. తమిళ నటుడు సుందర్ సి, స్టార్ హీరోయిన్లు తమన్నా భాటియా, రాశి ఖన్నా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. 

(1 / 5)

అరణ్మనై 4 సినిమా ఈవారంలో జూన్ 21వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగు వెర్షన్ బాక్ కూడా అదే రోజున స్ట్రీమింగ్‍కు వస్తుంది. 

(2 / 5)

అరణ్మనై 4 చిత్రం తమిళం, తెలుగుతో పాటు కన్నడ మలయాళం వెర్షన్‍లలోనూ జూన్ 21న హాట్‍స్టార్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చింది. 

(3 / 5)

అరణ్మనై 4 (బాక్) చిత్రం మే 3వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మిక్స్డ్ టాక్ వచ్చినా సుమారు రూ.100కోట్ల వసూళ్లతో సూపర్ హిట్ అయింది. తమిళంలో భారీగా కలెక్షన్లు వచ్చినా.. తెలుగులో పెద్దగా వసూళ్లు రాబట్టకోలేకపోయింది. 

(4 / 5)

ప్రధాన పాత్ర పోషించిన సుందర్ సి.. అరణ్మనై 4 చిత్రానికి దర్శకుడిగానూ వ్యవహరించారు. ఖుష్బూ సుందర్, అరుణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు. సుందర్, తమన్నా, రాశితో పాటు రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్, కోవై సరళ, యోగిబాబు కీలకపాత్రలు చేశారు. జూన్ 21 నుంచి ఈ చిత్రాన్ని హాట్‍స్టార్‌లో చూడొచ్చు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు