Bigg Boss Vishnupriya Love Track: మణికంఠనే హాట్‌గా ఉంటాడు.. పృథ్వీని అవమానించిన యష్మీ.. హౌజ్‌లో విష్ణుప్రియ లవ్ ట్రాక్-bigg boss telugu 8 yashmi says manikanta hot than prithvi vishnupriya bigg boss 8 telugu september 27 episode highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Vishnupriya Love Track: మణికంఠనే హాట్‌గా ఉంటాడు.. పృథ్వీని అవమానించిన యష్మీ.. హౌజ్‌లో విష్ణుప్రియ లవ్ ట్రాక్

Bigg Boss Vishnupriya Love Track: మణికంఠనే హాట్‌గా ఉంటాడు.. పృథ్వీని అవమానించిన యష్మీ.. హౌజ్‌లో విష్ణుప్రియ లవ్ ట్రాక్

Sanjiv Kumar HT Telugu
Sep 28, 2024 06:52 AM IST

Bigg Boss Telugu 8 Vishnupriya Prithviraj Love: బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 27వ తేది ఎపిసోడ్‌లో పృథ్వీరాజ్‌కు అవమానం జరిగింది. ఆ విషయాన్ని పృథ్వీనే చెప్పుకున్నాడు. పృథ్వీరాజ్ కంటే మణికంఠనే హాట్‌గా కనిపిస్తాడు అని యాంకర్ విష్ణుప్రియతో యష్మీ చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మణికంఠనే హాట్‌గా ఉంటాడు.. పృథ్వీని అవమానించిన యష్మీ.. హౌజ్‌లో విష్ణుప్రియ లవ్ ట్రాక్
మణికంఠనే హాట్‌గా ఉంటాడు.. పృథ్వీని అవమానించిన యష్మీ.. హౌజ్‌లో విష్ణుప్రియ లవ్ ట్రాక్

Bigg Boss 8 Telugu Yashmi Manikanta: బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 27వ తేది ఎపిసోడ్‌లో బీబీ అడ్డా టాస్క్ జరిగింది. సరదాగా హౌజ్‌మేట్స్‌తో ఫన్ జెనరేట్ చేసేందుకు బిగ్ బాస్ అడ్డా అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో మరొకరి పాత్రలో ఇంకొకరు దూరి వారిలా ప్రవర్తించాల్సి ఉంటుంది.

ఆదిత్య ఓంగా నబీల్

అర్ధరాత్రి 1 గంటకుపైగా జరిగిన ఈ టాస్క్‌లో అంతా బాగా చేశారు. మొదట యాంకర్‌గా చేసిన అందరిని ప్రశ్నలు అడిగిన నబీల్ అఫ్రిది తర్వాత ఆదిత్య ఓం క్యారెక్టర్ ప్లే చేశాడు. సేమ్ ఆదిత్యం ఓంలా దింపేసిన నబీల్ బాగా కామెడీ పండించాడు. దాంతో కంటెస్టెంట్స్‌తో సహా బిగ్ బాస్ కూడా నబీల్‌పై ప్రశంసలు కురిపించి విజేతగా ప్రకటించాడు.

ఇదిలా ఉంటే, దీనికంటే ముందు ఉదయం సాంగ్ ప్లే చేసిన తర్వాత పృథ్వీని అందంగా రెడీ చేస్తుంది యాంకర్ విష్ణుప్రియ. ఆ విషయం గురించి సీత, యష్మీ, నైనిక మాట్లాడుకుంటారు. వాడు అందంగా విష్ణుకు కనిపిస్తాడేమో మనకు కాదు అని సీత అంది. తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో డ్రెస్ వేసుకున్న పృథ్వీకి కాస్తా అటు ఇటుగా మేకప్ వేసి బయటకు తీసుకొస్తుంది.

ఇవాళే డంబ్‌గా

వస్తున్నాడు.. వస్తున్నాడు.. మన ధీరుడు.. శూరుడు.. పృథ్వీరాజ్ శెట్టి అని గట్టిగా అరుస్తూ పృథ్వీని పరిచయం చేసింది. కానీ, ఎవరు అంతగా స్పందించలేదు. నిజానికి వాడు ఇవాళే డంబ్‌గా ఉన్నాడు అని సీత అంది. అలా అన్ని చేస్తే వాడికంటే మణికంఠనే హాట్‌గా ఉంటాడు అని యష్మీ అంది. అది విన్న పృథ్వీ ఏమన్నావ్. ఇది నాకు అవమానం అంటూ లోపలికి వెళ్లాడు.

ఒక్కసారి నా కళ్లతో చూడండిరా.. అని దేశముదురులో అల్లు అర్జున్ డైలాగ్ కొట్టింది విష్ణుప్రియ. ఇదిలా ఉంటే, ఎపిసోడ్ మొదట్లో పృథ్వీరాజ్‌కు దెబ్బ తగిలినచోట ఆయింట్‌మెంట్ పూస్తుంది విష్ణుప్రియ. తర్వాత సోనియా వచ్చి తినడానికి వెయిట్ చేస్తున్నామని చెబుతుంది. ఇక విష్ణుప్రియ లోపలికి వెళ్తుంది. ఇప్పటిదాకా ఏం చేశావ్ అని సీత, ప్రేరణ అడిగితే విష్ణుప్రియ చెబుతుంది.

డిస్ట్రాక్షన్ ఉంటుంది

సోనియా వాళ్లు ఉన్నారు కదా. వాళ్లు లేకుంటే అనుకోవచ్చు అని సీత అంది. అది నా పర్సనల్. నాకు పృథ్వీ అంటే ఇష్టం అన్నట్లుగా విష్ణు చెప్పింది. కానీ, అదంతా ఇప్పుడెందుకు బిగ్ బాస్ తర్వాత చూసుకోవచ్చు కదా. ఎందుకు డిస్ట్రాక్షన్ అనే అర్థంలో సీత చెప్పింది. ప్రతి మనిషికి జీవితంలో డిస్ట్రాక్షన్ ఉంటుంది కదా అని కాస్తా అలిగినట్లుగా ఫేస్ పెట్టింది విష్ణుప్రియ.

మరోవైపు విష్ణుప్రియకు పృథ్వీ పడిపోతున్నాడని, భయమేస్తుందని నిఖిల్‌తో సోనియా చెప్పుకొంది. డిన్నర్ టేబుల్‌పై ఇదే విషయంపై సీత, ప్రేరణ మాట్లాడుకున్నారు. తను జెన్యూన్‌గా ఇష్టపడుతుంది. కానీ, వాడు మాత్రం అటెన్షన్ ఎంజాయ్ చేస్తున్నాడు అని ప్రేరణ అంది. పక్కనే ఉన్న నైనిక.. ప్రతి ఒక్కరు అటెన్షన్ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆమెపై వాడు కేర్ చూపిస్తాడు అని చెప్పింది. ఇలా హౌజ్‌లో విష్ణుప్రియ, పృథ్వీరాజ్ లవ్ ట్రాక్‌పైనే డిస్కషన్ ఎక్కువగా జరిగింది.