Jabardasth: 600 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న జబర్ధస్త్ - తెలుగులో లాంగెస్ట్ రన్నింగ్ కామెడీ షో ఇదే!
Jabardasth: జబర్ధస్థ్ కామెడీ షో గత పదేళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. టీవీ షోస్ టీఆర్‌పీ రేటింగ్‌లో టాప్ ఫైవ్‌లో ఒకటిగా కొనసాగుతోంది. 2013లో మొదలైన జబర్ధస్థ్ ఇటీవలే 600 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నది. జబర్ధస్థ్‌కు ప్రస్తుతం సిరి హనుమంత్ హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.
Jabardasth: తెలుగు బుల్లితెరపై జబర్ధస్థ్ కామెడీ షో సెన్సేషన్ క్రియేట్ చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు టీవీ షోస్‌లో ఓ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. 2013లో మొదలైన ఈ కామెడీ షో పదకొండు ఏళ్లుగా ఎనలేని ప్రేక్షకాదరణతో దూసుకుపోతుంది. జబర్ధస్థ్ స్ఫూర్తితో ఇతర ఛానెల్స్‌లో చాలా కామెడీ షోస్ ప్రారంభమైనా ఎక్కువ కాలం కొనసాగలేకపోయాయి. జబర్ధస్థ్‌కు పోటీ ఇవ్వలేకపోయాయి.
2013లో ప్రారంభం...
2013లో ప్రారంభమైన జబర్ధస్థ్ నిర్విరామంగా ఇప్పటి వరకు 600 ఎపిసోడ్స్‌కిపైగా ప్రేక్షకులను అలరిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకుంది. ఇన్నేళ్లు అయినప్పటికీ ‘జబర్దస్త్’ డిఫరెంట్ కంటెంట్, క్రియేటివ్‌గా కామెడీతో బుల్లితెర అభిమానులను మెప్పిస్తూ టాప్ కామెడీ షోగా నవ్వులను పంచుతోంది.
టీఆర్‌పీలో టాప్ ఫైవ్...
టీఆర్‌పీ రేటింగ్‌లో జబర్ధస్థ్ తెలుగు టీవీషోస్‌లో టాప్ ఫైవ్‌లో కొనసాగుతోంది. పదేళ్లు అయినా ఈ షోకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనడానకి ఇది నిదర్శనంగా షో నిర్వహకులు చెబుతోన్నారు. అంతే కాకుండా తెలుగులో లాంగెస్ట్ రన్నింగ్ టీవీ షోస్‌లో ఒకటిగా జబర్ధస్థ్ నిలిచింది. తెలుగులో అత్యధిక కాలంగా కొనసాగుతోన్న కామెడీ రియాలిటీ షోగా రికార్డ్ జబర్ధస్థ్ పేరిట ఉంది.
అనసూయ యాంకర్...
2013 ఫిబ్రవరిలో జబర్ధస్థ్ కామెడీ షో ప్రారంభమైంది. అనసూయ యాంకర్‌గా వ్యవహరించిన ఈ షోకు చాలా కాలం పాటు జడ్జ్‌లుగా రోజా, నాగబాబు కొనసాగారు. సినిమాల కారణంగా అనసూయ, రాజకీయాలతో బిజీ కావడంతో రోజా, నాగబాబు జబర్ధస్థ్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం అనసూయ ప్లేస్‌లో జబర్ధస్థ్‌కు సిరి హనుమంతు యాంకర్‌గా వ్యవహరిస్తోంది.
జడ్జ్‌లుగా రోజా, నాగబాబు తర్వాత మనో..జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, కృష్ణభగవాన్, ఇంద్రజతో పాటు పలువురు కనిపించారు. ప్రస్తుతం శివాజీ, ఖుష్బూ జబర్ధస్థ్‌కు జడ్జ్‌లుగా ఉన్నారు. జబర్ధస్థ్‌కు కొనసాగింపుగా ఎక్స్‌ట్రా జబర్ధస్థ్ కూడా ఈటీవీలో టెలికాస్ట్ అవుతోంది.
డైరెక్టర్లుగా హీరోలుగా...
‘జబర్దస్త్’లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న కమెడియన్స్ హీరోలుగా, సక్సెస్‌ఫుల్ దర్శకులుగానూ ప్రస్తుతం టాలీవుడ్‌లో రాణిస్తోన్నారు. . సుడిగాలి సుధీర్ సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడుతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. ఇటీవల రిలీజైన రాజుయాదవ్‌తో గెటప్ శ్రీను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పలు సినిమాల్లో కమెడియన్‌గా కనిపించాడు. చమ్మక్ చంద్ర, షకలక శంకర్, ఆటో రాంప్రసాద్‌తోపాటు పలువురు కమెడియన్లు జబర్ధస్థ్ కారణంగానే వెలుగులోకి వచ్చారు.
బలగంతో డైరెక్టర్‌గా ఎంట్రీ...
జబర్ధస్థ్ కమెడియన్ వేణు టిల్లు బలగం మూవీతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. మరో జబర్ధస్థ్ కమెడియన్ ధనరాజ్‌రామం రాఘవం చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తోన్నారు