Devara Collections: కన్నడంలో దేవర ఫస్ట్ డే కలెక్షన్స్ 30 లక్షలు - హిందీలో ప్రభాస్ ఫ్లాప్ సినిమాల కంటే తక్కువే!
Devara Collections: ఎన్టీఆర్ దేవర మూవీ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు క్రియేట్ చేసింది. యాభై నాలుగు కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. హిందీతో పాటు తమిళం, మలయాళంతో కన్నడంలో భాషల్లో మాత్రం దేవర పూర్తిగా నిరాశపరిచింది.
Devara Collections: తొలిరోజు ఎన్టీఆర్ దేవర మూవీ కలెక్షన్స్‌తో అదరగొట్టింది. వరల్డ్ వైడ్‌గా శుక్రవారం రోజు దేవర సినిమా 172 కోట్లు కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. కలెక్షన్స్‌తో కూడిన స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినిమాకు ఫస్ట్ డే మిక్స్‌డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో కలెక్షన్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఫేక్ కలెక్షన్స్ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కల్కి, సలార్ సినిమాల రికార్డులను దేవర అధిగమించిందన్నది అబద్ధమని చెబుతోన్నారు. దేవర, కల్కి సినిమాలకు సంబంధించి బుక్‌మైషోతో పాటు ఇతర టికెట్ బుకింగ్స్ యాప్‌లో అమ్ముడుపోయిన టికెట్లు, వచ్చిన కలెక్షన్స్‌ను కంపేర్ చేస్తూ తెగ ట్వీట్స్ చేస్తున్నారు.
యాభై కోట్ల కలెక్షన్స్...
తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు ఈ సినిమా యాభై కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. నైజాంలో 19 కోట్లు, సీడెడ్‌లో పది కోట్ల వరకు కలెక్షన్స్ దక్కించుకున్నది. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో పూర్తిగా తేలిపోయింది.
తొమ్మిదో స్థానంలో...
దేవర హిందీ వెర్షన్‌కు శుక్రవారం రోజు ఏడు కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. హిందీలో డబ్ అయినా సౌత్ టాప్ టెన్ సినిమాల్లో తొమ్మిదో ప్లేస్‌లో దేవర నిలిచింది. ఈ లిస్ట్‌లోటాప్ టెన్ సినిమాల్లో ప్రభాస్ సినిమాలే ఐదు ఉండటం గమనార్హం. 53 కోట్లతో కేజీఎఫ్ 2 నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది.
రెండు నుంచి ఐదు స్థానల వరకు ప్రభాస్ మూవీస్ ఉన్నాయి. నలభై ఒక్క కోట్లతో బాహుబలి 2 సెకండ్ ప్లేస్‌లో ఉండగా...37 కోట్లతో ఆదిపురుష్ మూడో స్థానంలో ఉంది. సాహో 24 కోట్లు, కల్కి 22 కోట్లతో నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. 20 కోట్లతో ఆర్ఆర్ఆర్ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. ప్రభాస్ ఫ్లాప్ మూవీస్ సాహో, ఆదిపురుష్ కంటే దేవరకు తక్కువ కలెక్షన్స్ రావడం గమనార్హం.
కన్నడంలో 30 లక్షలు...
హిందీ వెర్షన్ పర్వాలేదనిపించిన మలయాళం, కన్నడంలో ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. ఫస్ట్ డే కన్నడ వెర్షన్ 35 లక్షల కలెక్షన్స్ రాబట్టగా...మలయాళ వెర్షన్‌కు నలభై లక్షల కలెక్షన్స్ వచ్చాయి. తమిళంలో కష్టంగా ఫస్ట్ డే కోటి మార్కును ఈ మూవీ టచ్ చేసింది. తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్టీఆర్ ప్రమోషన్స్ గట్టిగానే చేసిన ఈ ప్రభావం పెద్దగా కనిపించలేదు.
దేవర మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో దేవరగా, వరగా డ్యూయల్ రోల్‌లో ఎన్టీఆర్ కనిపించాడు. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించింది.
దేవర కథ ఇదే...
ఎర్ర సముద్రం సమీపంలోని నాలుగు ఊళ్లకు దేవర (ఎన్టీఆర్) మాటే వేదం. తన స్నేహితుడు రాయప్ప(శ్రీకాంత్), మరో ఊరి పెద్ద భైరతో (సైఫ్ అలీఖాన్) కలిసి మురుగ (మురళీ శర్మ) కోసం పనిచేస్తుంటాడు దేవర. నౌకల్లో మురుగ దిగుమతి చేసుకుంటున్న అక్రమ ఆయుధాల్ని అధికారుల కంటపడకుండా ఒడ్డుకు చేరుస్తుంటాడు దేవర.
ఈ అక్రమ ఆయుధాల కారణంగా తమ తమ జీవితాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించిన దేవర మురుగ కోసం పనిచేయకూడదని నిర్ణయించుకుంటాడు.తన మాటను కాదని మురుగ కోసం పనిచేయడానికి వెళ్లిన వారిని దేవర భయపెడతాడు. అక్రమ ఆయుధాల వ్యాపారం సజావుగా సాగడానికి దేవర అడ్డు తొలగించాలని భైరా ప్లాన్ చేస్తాడు. దేవర కొడుకు వర మాత్రం అతి భయస్తుడిగా పెరుగుతాడు. అందుకు కారణం ఏమిటి? పిరికివాడిగా ఎందుకు వర నాటకం ఆడాడు? దేవర అదృశ్యం వెనకున్న కారణం ఏమిటి? ఎర్ర సముద్రం ప్రాంత వాసుల కోసం చేసిన పోరాటంలో చివరకు దేవర ఏమయ్యాడు అన్నదే ఈ మూవీ క థ.