Malayalam Thriller OTT: ఓటీటీలోకి తెలుగు హీరోయిన్ మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ మూవీ - దృశ్యం సినిమాకు మించి ట్విస్ట్‌లు-meena malayalam thriller movie anandapuram diaries streaming on manorama max ott soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Thriller Ott: ఓటీటీలోకి తెలుగు హీరోయిన్ మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ మూవీ - దృశ్యం సినిమాకు మించి ట్విస్ట్‌లు

Malayalam Thriller OTT: ఓటీటీలోకి తెలుగు హీరోయిన్ మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ మూవీ - దృశ్యం సినిమాకు మించి ట్విస్ట్‌లు

Nelki Naresh Kumar HT Telugu
Sep 20, 2024 09:53 AM IST

Malayalam Thriller OTT: సీనియ‌ర్ హీరోయిన్ మీనా లీడ్ రోల్‌లో న‌టించిన మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ మూవీ ఆనందపురం డైరీస్ ఓటీటీలోకి వ‌స్తోంది. మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ థ్రిల్ల‌ర్ మూవీలో టాలీవుడ్ యాక్ట‌ర్ శ్రీకాంత్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు.

మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ ఓటీటీ
మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ ఓటీటీ

Malayalam Thriller OTT: సీనియ‌ర్ తెలుగు హీరోయిన్ మీనా లీడ్ రోల్‌లో న‌టించిన మ‌ల‌యాళం మూవీ ఆనంద‌పురం డైరీస్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో శ్రీకాంత్ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు. జ‌య రోస్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ మార్చి 1న థియేట‌ర్ల‌లో రిలీజైంది.

ఆరు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి...

థియేట‌ర్ల‌లో రిలీజైన ఆరు నెల‌ల త‌ర్వాత ఆనంద‌పురం డైరీస్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ నెల 27 నుంచి సినిమా స్ట్రీమింగ్ ఉండ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. మ‌నోర‌మా మ్యాక్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్‌లో కూడా ఈ థ్రిల్ల‌ర్ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

రెండేళ్ల త‌ర్వాత రీఎంట్రీ...

ఆనంద‌పురం డైరీస్ మూవీతో దాదాపు రెండేళ్ల త‌ర్వాత మ‌ల‌యాళంలోకి రీఎంట్రీ ఇచ్చింది మీనా. చివ‌ర‌గా 2022లో మోహ‌న్‌లాల్‌, పృథ్వీరాజ్ హీరోలుగా న‌టించిన బ్రో డాడీ మూవీలో మీనా క‌నిపించింది. రెగ్యుల‌ర్ థ్రిల్ల‌ర్ మూవీకి భిన్న‌మైన క‌థాంశంతో ద‌ర్శ‌కుడు జ‌య‌రోస్ రాజ్ ఆనంద‌పురం డైరీస్ మూవీని తెర‌కెక్కించాడు.

క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు మ‌త్తు ప‌దార్థాల బారిన ప‌డి యువ‌త త‌మ జీవితాల్ని ఎలా నాశ‌నం చేసుకుంటున్నార‌నే సందేశాన్ని ఇవ్వాల‌ని అనుకున్నారు. కానీ కాన్సెప్ట్‌ను థ్రిల్లింగ్‌గా స్క్రీన్‌పై ఆవిష్క‌రించ‌లేక‌పోవ‌డంతో సినిమా యావ‌రేజ్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. మీనా యాక్టింగ్‌కు మాత్రం మంచి పేరొచ్చింది.

లాయ‌ర్ పాత్ర‌లో...

ఆనంద‌పురం డైరీస్ మూవీలో నందిని అనే పాత్ర‌లో మీనా క‌నిపించింది. నందిని క్యాన్స‌ర్ బారిన ప‌డి కోలుకుంటుంది. విడాకులతో పెళ్లి జీవితం ముగియ‌డంతో ఆ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు మ‌ధ్య‌లోనే వ‌దిలేసిన లా డిగ్రీని పూర్తిచేయాల‌ని అనుకుంటుంది. కాలేజీలో చేరుతుంది. అదే కాలేజీలో నందిని స్నేహితుడు ఆదిత్య‌న్‌కు హ‌రి అనే వ్య‌క్తికి మ‌ధ్య గొడ‌వ‌లు ఉంటాయి.

ఇంత‌లోనే మాలిని అనే అమ్మాయి డెడ్‌బాడీ కాలేజీలో దొరుకుతుంది. ఈ హ‌త్య‌కు ఆదిత్య‌న్ కార‌ణ‌మ‌ని పోలీసులు ఆరెస్ట్‌చేస్తారు. మ‌రోవైపు కాలేజీలో ఆదిత్య‌న్ మ‌త్తు ప‌దార్థాలు స‌ప్ల‌య్ చేస్తున్నాడంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తాయి. అనుకోని ప‌రిస్థితుల్లో ఆదిత్య‌న్ కేసును వాదించాల్సిన బాధ్య‌త నందినిపై ప‌డుతుంది.

లాయ‌ర్‌గా తాను చేప‌ట్టిన తొలి కేసులో నందిని గెలిచిందా? ఆదిత్య‌న్‌ను ఈ కేసులో ఇరికించింది ఎవ‌రు? డ్ర‌గ్స్ విష‌యంలో నందిని తెలుసుకున్న వాస్త‌వాలు ఏమిటి? నందినిని ప్రేమించిన సుంద‌ర‌రాజ్ ఎవ‌రు? అన్న‌దే ఆనంద‌పురం డైరీస్ మూవీ క‌థ‌.

తెలుగులో సూప‌ర్ హిట్ మూవీస్‌...

ఆనందపురం డైరీస్ మూవీలో కీల‌క పాత్ర‌లు పోషించిన మీనా, శ్రీకాంత్ తెలుగులో చాలా సినిమాలు చేశారు. మీనా ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా పేరుతెచ్చుకున్న‌ది. చిరంజీవి, వెంక‌టేష్, బాల‌కృష్ణ‌ల‌తో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా క‌నిపించింది. తెలుగులో ఒక‌రికి ఒక‌రు, ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులేతో పాటు ప‌లు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా విల‌న్‌గా శ్రీకాంత్ క‌నిపించాడు. ఇటీవ‌లే రిలీజైన హార‌ర్ మూవీ పిండ‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు.

టాపిక్