Horror Movie: ఈ హారర్ మూవీ బడ్జెట్ రూ.6 లక్షలు.. వసూళ్లు రూ.800 కోట్లు.. ఈ రెండు ఓటీటీల్లో చూసేయండి-horror movie paranormal activity ott prime video sreaming this movie budget 6 lakhs box office collection 800 crores ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Horror Movie: ఈ హారర్ మూవీ బడ్జెట్ రూ.6 లక్షలు.. వసూళ్లు రూ.800 కోట్లు.. ఈ రెండు ఓటీటీల్లో చూసేయండి

Horror Movie: ఈ హారర్ మూవీ బడ్జెట్ రూ.6 లక్షలు.. వసూళ్లు రూ.800 కోట్లు.. ఈ రెండు ఓటీటీల్లో చూసేయండి

Hari Prasad S HT Telugu
Sep 19, 2024 04:50 PM IST

Horror Movie: ఓ హారర్ మూవీని కేవలం రూ.6 లక్షలతో నిర్మిస్తే.. అది కాస్తా బాక్సాఫీస్ దగ్గర రూ.800 కోట్లు వసూలు చేసిందన్న విషయం తెలుసా? ప్రపంచంలో అత్యంత భారీ లాభాలు ఆర్జించి పెట్టిన సినిమాగా నిలిచిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది.

ఈ హారర్ మూవీ బడ్జెట్ రూ.6 లక్షలు.. వసూళ్లు రూ.800 కోట్లు.. ఈ ఓటీటీలో చూసేయండి
ఈ హారర్ మూవీ బడ్జెట్ రూ.6 లక్షలు.. వసూళ్లు రూ.800 కోట్లు.. ఈ ఓటీటీలో చూసేయండి

Horror Movie: హారర్ మూవీ అంటేనే తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు సాధించి పెట్టే జానర్. ప్రపంచవ్యాప్తంగా ఈ జానర్ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. సాధారణంగా చిన్న బడ్జెట్ సినిమాలు భారీ లాభాలు సాధించి పెట్టడం కామనే అయినా.. ప్రపంచంలో ఓ హారర్ సినిమా మాత్రం ఏకంగా 1.33 లక్షల శాతం లాభాలు తెచ్చి పెట్టిందంటే నమ్మగలరా?

పారానార్మల్ యాక్టివిటీ.. లాభాల పంట

మనం మాట్లాడుకున్న ఈ హారర్ మూవీ పేరు పారానార్మల్ యాక్టివిటీ. 2007లో తెరకెక్కిన ఈ అమెరికన్ మూవీని కేవలం 15 వేల డాలర్లు అంటే ఆ ఏడాది డాలర్ తో రూపాయి విలువతో పోలిస్తే రూ.6 లక్షలతో తెరకెక్కించారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లకు మరో 2 లక్షల డాలర్లు ఖర్చయ్యాయి. కానీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 194 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

అంటే అప్పట్లో డాలర్ తో రూపాయి విలువతో పోలిస్తే మన కరెన్సీలో రూ.800 కోట్లు. ఇది అలాంటిలాంటి బ్లాక్‌బస్టర్ కాదు. మేకర్స్ పై ఏకంగా 13.3 లక్షల శాతం లాభాలు కురిపించిన సినిమా ఈ పారానార్మల్ యాక్టివిటీ. ప్రపంచ సినిమా చరిత్రలో ఇన్ని లాభాలు తెచ్చి పెట్టిన మరో సినిమా లేదంటే నమ్మగలరా?

పారానార్మల్ యాక్టివిటీ ఫ్రాంఛైజీ

2007లో తొలిసారి పారానార్మల్ యాక్టివిటీ మూవీ వచ్చింది. అది ఎవరూ ఊహించనంత సక్సెస్ కావడంతో ఈ మూవీకి మొత్తంగా ఆరు సీక్వెల్స్ వచ్చాయి. అంటే మొత్తం 7 పారానార్మల్ యాక్టివిటీ సినిమాలు కలిపి 890 మిలియన్ డాలర్లు (రూ.7320 కోట్లు) వసూలు చేయడం విశేషం. ఈ సినిమాల మొత్తం బడ్జెట్ కలిపినా రూ.230 కోట్లు మాత్రమే.

ప్రపంచ సినిమాలో ఇప్పటికే ఎన్నో ఫ్రాంఛైజీలు వచ్చినా.. ఈ ఫ్రాంఛైజీ స్థాయిలో ఏదీ లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. అంతకుముందు 1999లో వచ్చిన ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ మూవీ రూ.85 లక్షలతో నిర్మిస్తే.. రూ.1045 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేయగా.. ఆ రికార్డును పారానార్మల్ యాక్టివిటీ బ్రేక్ చేసింది.

మరో విచిత్రం ఏంటంటే.. ఈ పారానార్మల్ యాక్టివిటీ సినిమాను సింపుల్ గా సీసీటీవీ కెమెరాలు, హ్యాండ్ కెమెరాల ద్వారానే చిత్రీకరించారు. డైరెక్టర్ ఓరెన్ పెలి ఈ సినిమాను తెరకెక్కించాడు. అంతేకాదు ఈ చిత్రానికి రచన, చిత్రీకరణ, ప్రొడక్షన్, ఎడిటింగ్ ఇలా అన్నీ అతడే చేయడం విశేషం.

పారానార్మల్ యాక్టివిటీ ఓటీటీ

ప్రపంచంలో అత్యంత లాభదాయక మూవీగా పేరుగాంచిన ఈ పారానార్మల్ యాక్టివిటీని ప్రస్తుతం ఓటీటీలో చూడొచ్చు. 2007లో వచ్చిన తొలి పార్ట్ నుంచి తర్వాత వచ్చిన సీక్వెల్స్ అన్నీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని ఫ్రీగా చూసే వీలుండగా.. మరికొన్నింటికి మాత్రం రూ.99 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అటు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనూ తొలి మూవీ చూడొచ్చు.

హారర్ జానర్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ఈ పారానార్మల్ యాక్టివిటీ చూస్తే తెలుస్తుంది. ఇదొక్క సినిమానే కాదు.. ఎన్నో లోబడ్జెట్ హారర్ సినిమాలు అంతకుముందు, ఆ తర్వాత, ఇప్పటికి కూడా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి.