Thriller OTT: 5 కోట్ల బడ్జెట్ - 50 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి మలయాళం బ్లాక్‌బస్టర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ
OTT:ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా కిష్కింద కాండం నిలిచింది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ డిస్నీ పస్ల్ హాట్ స్టార్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ మలయాళం మూవీలో ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి హీరోహీరోయిన్లుగా నటించారు.
Mystery Thriller OTT: మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది కిష్కిందకాండం మూవీ. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ యాభై కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. థియేటర్లలో రిలీజై రెండు వారాలు దాటినా హౌజ్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది.
అపర్ణ బాలమురళి హీరోయిన్...
కిష్కిందకాండం మూవీలో ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి హీరోహీరోయిన్లుగా నటించారు. విజయరాఘవన్ కీలక పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ మూవీకి దిన్జీత్ అయ్యథన్ దర్శకత్వం వహించాడు. ఇ
న్వేస్టిగేషన్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఊహలకు అందని ట్విస్ట్‌లతో ఆడియెన్స్‌ను అలరించింది. ఈ సినిమాలో ఆసిఫ్ అలీతో పాటు అపర్ణ బాలమురళి యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. సస్పెన్స్‌తో పాటు మానవ సంబంధాల్ని ఎమోషనల్‌గా దర్శకుడు ఈ మూవీలో చూపించాడు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో...
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నది. అక్టోబర్ 11నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోన్నట్లు చెబుతోన్నారు.
టాప్ టెన్ మూవీస్‌లో ఒకటి...
కిష్కింద కాండం మూవీ థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. 14 రోజుల్లో యాభై కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. హీరో ఆసిఫ్ అలీ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది.
అంతే కాకుండా ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా కిష్కింద కాండం రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ కేవలం ఐదు కోట్లు కావడం గమనార్హం. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ పదింతల వసూళ్లను రాబట్టింది.
కిష్కిందం కాండం మూవీ కథ ఇదే...
అపర్ణ(అపర్ణ బాలమురళి), అజయన్ (ఆసిఫ్ అలీ) ప్రేమించి పెళ్లిచేసుకుంటారు. అజయ్ తండ్రి అప్పు పిళ్లై ఓ రిటైర్డ్ ఆర్మీ మేజర్. ఆర్మీ జాబ్‌ను అర్థాంతరగా వదిలేసిన అతడు కొన్నాళ్లు నక్సలైట్‌గా పనిచేస్తాడు. క్యాన్సర్ కారణంగా భార్య మరణించడం, కొడుకు చాచు అదృశ్యం కావడంతో ఆ బాధ నుంచి తేరుకోలేకపోతాడు. ఎప్పుడు వారినే తల్చుకుంటూ బతుకుతుంటాడు.
అనుకోకుండా ఓ రోజు అతడి గన్ మిస్సవుతుంది. ఆ గన్ గురించి ఎంక్వైరీ చేసే క్రమంలో అపర్ణకు అనూహ్య విషయాలు తెలుస్తాయి. అసలు అప్పు పిల్లై గతం ఏమిటి? అప్పు పిల్లపై భార్య, కొడుకు ఎలా కనిపించకుండా పోయారు. వారి మిస్సింగ్‌కు అజయన్‌కు ఏమైనా సంబంధంఉందా అన్నదే కిష్కింద కాండం మూవీ కథ.