Telugu OTT: థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు యూత్‌ఫుల్ రొమాంటిక్ మూవీ
Telugu OTT: తెలుగు యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్‌స్టోరీ మూవీ ప్రభుత్వ జూనియర్ కళాశాల మరో ఓటీటీలో రిలీజైంది. ఇప్పటికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ గురువారం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సినిమాలో ప్రణవ్, శగ్నశ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు.
Telugu OTT: యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ డ్రామాగా రూపొందిన ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ గురువారం ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఆహా ఓటీటీలో రిలీజ్ అవుతోన్న ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆహా ఓటీటీలో థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే రిలీజ్ కాగా...అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం మూడు నెలల తర్వాత రిలీజైంది.
టాలీవుడ్‌లోకి ఎంట్రీ...
ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో ప్రణవ్, శగ్నశ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీతోనే వీరిద్దరు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. శ్రీనాథ్ దర్శకత్వం వహించాడు. 1990 బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. మొబైల్ ఫోన్స్, ఇంటర్‌నెట్ లేని కాలంలో ప్రేమకథలు ఎలా ఉండేవన్నది ఈ సినిమాలో చూపించాడు. రియలిస్టిక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.
కథలో కొత్తదనం లేకపోవడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. నేటితరానికి కనెక్ట్ అయ్యేలా ప్రేమకథ లేకపోవడం, కామెడీ అంతగా వర్కవుట్ కాకపోవడంతో సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది. కలెక్షన్స్ కూడా పెద్దగా రాబట్టలేకపోయింది. ప్రభాస్ కల్కి టైమ్‌లో రిలీజవ్వడం కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీకి మైనస్‌గా మారింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాల కథ ఇదే...
పుంగనూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వాసు, కుమారి ఇంటర్‌మీడియట్ చదువుతుంటారు. అనుకోకుండా వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. వాసు దగ్గర కుమారి కొన్ని విషయాలు దాస్తుంది. వాటి కారణంగా ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. కుమారి ప్రేమ కోసం వాసు చనిపోవడానికి సిద్ధమవుతాడు. వాసును కుమారి ఎలా కాపాడుకుంది? వారి ప్రేమ కథ గెలిచిందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు...
ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీకి కార్తిక్, కమరన్ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. ఒకరు పాటలు సమకూర్చగా...మరొకరు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. డైరెక్టర్ శ్రీనాథ్‌కు ఇది సెకండ్ మూవీ. గతంలో కృష్ణారావ్ సూపర్ మార్కెట్ పేరుతో ఓ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించాడు. హీరో ప్రణవ్ యూట్యూబ్ వీడియోస్‌తో పాపులర్ అయ్యాడు.
ఒక్కరోజే నాలుగు తెలుగు సినిమాలు...
గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు సరిపోదాశనివారం, ఆర్‌టీఐతో పాటు డబ్బింగ్ మూవీ చాప్ర మర్డర్ కేసు తెలుగులో ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. సరిపోదా శనివారం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోండగా...ఆర్‌టీఐ మూవీ ఈటీవీ విన్‌లో రిలీజైంది.