Bigg Boss Nikhil: ఏ ‘మిస్’ కోసం అలా చేశావ్: నిఖిల్‍కు నాగార్జున క్లాస్.. మణికంఠను టార్గెట్ చేసిన హౌస్‍మేట్స్-bigg boss 8 telugu today day 27 promo why you removed nabeel from tasks nagarjuna questions nikhil bigg boss updates ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Nikhil: ఏ ‘మిస్’ కోసం అలా చేశావ్: నిఖిల్‍కు నాగార్జున క్లాస్.. మణికంఠను టార్గెట్ చేసిన హౌస్‍మేట్స్

Bigg Boss Nikhil: ఏ ‘మిస్’ కోసం అలా చేశావ్: నిఖిల్‍కు నాగార్జున క్లాస్.. మణికంఠను టార్గెట్ చేసిన హౌస్‍మేట్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 28, 2024 05:43 PM IST

Bigg Boss 8 Telugu Today Promo: బిగ్‍బాస్ హౌస్‍లో నిఖిల్‍కు గట్టిగా క్లాస్ పీకారు నాగార్జున. అతడు తీసుకున్న ఓ నిర్ణయంపై ప్రశ్నలు సంధించారు. దీని కారణం ఏ మిస్ అంటూ.. సోనియా గురించి పరోక్షంగా ఉన్నారు. ఈ ప్రోమో వచ్చింది.

Bigg Boss Nikhil: ఏ ‘మిస్’ కోసం అలా చేశావ్: నిఖిల్‍కు నాగార్జున క్లాస్.. మణికంఠను టార్గెట్ చేసిన హౌస్‍మేట్స్
Bigg Boss Nikhil: ఏ ‘మిస్’ కోసం అలా చేశావ్: నిఖిల్‍కు నాగార్జున క్లాస్.. మణికంఠను టార్గెట్ చేసిన హౌస్‍మేట్స్

బిగ్‍బాగ్ తెలుగు సీజన్ 8లో నాలుగో వారం వీకెండ్ వచ్చేసింది. వైల్డ్ కార్డ్‌ల గురించి కంటెస్టెంట్లకు బిగ్‍బాస్ ఇటీవలే షాక్ ఇవ్వగా.. నాగార్జున నేడు వారితో మాట్లాడనున్నారు. వారం రోజుల ఆటపై నేటి (సెప్టెంబర్ 28) శనివారం ఎపిసోడ్‍లో కంటెస్టెంట్లతో ముచ్చటించనున్నారు. ఈ క్రమంలో నిఖిల్ తీసుకున్న ఓ నిర్ణయంపై నాగార్జున సూటిగా ప్రశ్నించారు. ఏ మిస్ కారణమంటూ అడిగారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇంట్రెస్టింగ్‍గా ఉంది.

హీరో.. జీరో ఎవరు?

హౌస్‍లో హీరో.. జీరో ఎవరు చెప్పాలని గేమ్ ఆడించారు హౌస్ట్ నాగార్జున. హీరో అనుకునే వారికి కిరీటం పెట్టాలని, జీరో అని భావించే వారి ముఖంపై క్రాస్ ముద్ర వేయాలని చెప్పారు. ముందుగా సీతకు కిరీటం పెట్టారు మణికంఠ. సీత తనకు కూడా హీరో అని నాగ్ అన్నారు.

విష్ణు.. ఏంటా నవ్వు

పృథ్వికి కిరీటం పెట్టారు నబీల్ ఆఫ్రిది. మూడు గంటలు ముఖంపై చిరునవ్వు పోకుండా ఉన్నావని, నా డొపమైన్‍లా మారుతున్నావని పృథ్వితో నాగ్ చెప్పారు. దీంతో విష్ణుప్రియ గట్టిగా నవ్వారు. దీంతో ఏంటి విష్ణు అలా నవ్వుతున్నావని నాగ్ అడిగారు. పృథ్వి, విష్ణు మధ్య ఇటీవలే ట్రాక్ మొదలైనట్టు కనిపిస్తుండటంతో నాగ్ ఇలా చెప్పారు.

టార్గెట్.. మణికంఠ

మణికంఠ.. జీరో అంటూ ఎక్కువ మంది కంటెస్టెంట్లు చెప్పినట్టు, అతడి ముఖంపై ముద్ర వేసినట్టు ప్రోమోలో తెలుస్తోంది. ముందుగా నైనిక జీరో అంటూ ముఖంపై మణి ముద్ర వేశారు. ఆ తర్వాత మణికంఠను జోరో అని నబీల్ చెప్పారు. “సపోర్ట్ చేసే వాళ్లనే ఇంటి బయటికి పంపాలని ఆలోచిస్తుంటాడు” నాగార్జునతో నబీల్ అన్నారు.

నాకే అర్థం కావడం లేదు

సోనియా, పృథ్వి సహా మరికొందరు కూడా మణికంఠ ముఖంపై ముద్ర వేశారు. జీరో అని చెప్పుకొచ్చారు. మణి చాలా అబద్ధాలు చెబుతున్నారని పృథ్వి అనగా.. అది పెద్ద నింద అని నాగ్ అన్నారు. అందుకు అతిగా ఆలోచిస్తున్నావని మణిని నాగార్జున అడిగారు. “నాకు అదే అర్థమై చావట్లేదు” అని మణి చెప్పారు. దీంతో “నీకే అర్థం కావట్లేదు.. గొడవ లేదు” అంటూ వెటకారంగా నవ్వారు నాగ్.

ఏ మిస్ కోసం అలా చేశావ్

నిఖిల్‍ను జోరో అంటూ ముఖంపై ముద్ర వేశారు ప్రేరణ. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను అడ్డుకునేందుకు అడుతున్న ఫిట్టెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ ఛాలెంజ్‍ల నుంచి నబీల్ ఆఫ్రిదిని తప్పిస్తూ నిఖిల్ తీసుకున్న నిర్ణయంపై ప్రేరణ అభ్యంతరం తెలిపారు. “ఐకమత్యంగా హౌస్‍గా ఆడాలని అని చెప్పి.. క్లాన్‍ను ఫస్ట్ పెట్టి హౌస్‍ను పడేశాడని నాకు అనిపించింది” అని ప్రేరణ అన్నారు.

దీంతో “నీకే కాదు ప్రేరణ.. నాకు అనిపించింది. సీతకు అనిపించింది” అని నాగార్జున అన్నారు. టాస్క్ పేరు చెప్పాలని నిఖిల్‍ను అడుగగా.. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని నిఖిల్ చెప్పారు. “మరి నువ్వు తీసింది ఎవరిని” అని నాగ్ ప్రశ్నించారు.

నబీల్‍ను తీసేయడం కరెక్ట్ నిర్ణయమా అని నాగ్ క్వశ్చన్ చేశారు. దీంతో నిఖిల్ బిక్కముఖం వేశారు. “నాకు ఎక్కడో మిస్ బ్యాలెన్స్ అయింది” అని నిఖిల్ అన్నారు. సోనియాతో గొడవ పడినందుకే నబీల్‍ను నిఖిల్ టార్గెట్ చేశాడన్నట్టుగా ఓ కామెంట్ చేశారు నాగ్. ఏ మిస్ కోసం అలా చేశావని అడిగారు. “మిస్ బ్యాలెన్స్ అయ్యేందుకు ఏ మిస్ కారణం” అని నాగార్జున నిలదీశారు. దీంతో హౌస్‍మేట్స్ ముసిముసిగా నవ్వుకున్నారు.

“నీ క్లాన్‍లోకి వచ్చేందుకు హౌస్‍మేట్స్ ఇష్టపడలేదు.. అది ఎందుకో అని ఆలోచించావా” అని నిఖిల్‍ను నాగ్ ప్రశ్నించారు. దీంతో ఏం చేసినా ముగ్గురం (నిఖిల్, సోనియా, పృథ్వి) కలిసి చేసుకుంటున్నామని అనుకుంటాన్నారని నిఖిల్ ఆన్సర్ ఇచ్చారు. ఏమంటారు హౌస్‍మేట్స్ అని నాగార్జున అన్నారు. దీంతో దాదాపు అందరూ ఎస్ అన్నారు. అందరూ ఎస్ అన్నారని నాగ్ చెప్పటంతో ఈ ప్రోమో ముగిసింది. నేటి ఎపిసోడ్‍లో ఈ తంతు పూర్తిగా ఉంటుంది.