Bigg Boss 8 Telugu: సైకో అంటూ అభయ్‍కు నాగార్జున చివాట్లు.. రెడ్ కార్డ్ నుంచి కాపాడిన హౌస్‍మేట్స్: కానీ అతడే ఔట్!
Bigg Boss 8 Telugu Day 20: అభయ్ నవీన్ ఎఫెక్ట్‌తో బిగ్‍బాస్ వీకెండ్ ఎపిసోడ్‍లో హీట్ పెరిగిపోయింది. అతడికి నాగ్ రెడ్ కార్డ్ చూపించటంతో కంటెస్టెంట్లు షాక్ అయ్యారు. మణికంఠకు కూడా నాగార్జున క్లాస్ తీసుకున్నారు. ఈ ఎపిసోడ్ ఎలా సాగిందంటే..
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ మూడో వారం వీకెండ్ శనివారం (సెప్టెంబర్ 21) ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. అభయ్ నవీన్‍తో పాటు కొందరు కంటెస్టెంట్లను హోస్ట్ కింగ్ నాగార్జున నిలదీశారు. బెలూన్ టాస్క్‌పై కూడా చర్చ సాగింది. ముఖ్యంగా బిగ్‍బాస్‍ను దూషించిన అభయ్‍పై నాగ్ చాలా సీరియస్ అయ్యారు. రెడ్ కార్డ్ టెన్షన్ పెట్టేసింది. యష్మి విషయంలో మణికంఠపై కూడా నాగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే..
ఏఎన్నార్ పాటలతో..
అలనాటి దిగ్గజ నటుడు, తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి సందర్భంగా ఆయన పాటలతో ఈ వీకెండ్ ఎపిసోడ్‍లో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కాసేపు హౌస్‍లో పరిస్థితులను చూపించారు. టాస్కుల గురించి నిఖిల్, అభయ్ కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆరెంజ్‍లను పిండి జ్యూస్ తీసే టాస్కులను టీమ్‍లకు పెట్టారు బిగ్‍బాస్.
సోనియాది తప్పు అన్న అభయ్.. నాగ్ ఫైర్
రేషన్ కోసం జరిగిన బెలూన్ టాస్కు గురించి సంచాలక్‍గా చేసిన సోనియాను నాగార్జున ప్రశ్నించారు. ఆ తర్వాత ఆ గేమ్ ఆడిన అభయ్ నవీన్‍ను లేపి నిఖిల్‍ను విన్నర్‌గా సోనియా నిర్ణయం తీసుకోవడం కరెక్టేనా అని ప్రశ్నించారు. దీంతో సోనియాది తప్పుడు నిర్ణయం అని గేమ్ రూల్స్ చెప్పారు అభయ్. అయితే, సంచాలక్ నిర్ణయం ఫైనల్ అని అభయ్‍పై నాగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బాక్స్ బయటికి వెళ్లి ఆడావని, సోనియా చెప్పినా వినలేదని అభయ్‍ను నిలదీశారు.
చాలా తప్పులు.. సైకోలాగా ఉన్నావ్
బిగ్‍బాస్ పెట్టిన నిబంధలను అభయ్ పలుసార్లు విమర్శించిన వీడియోలను నాగార్జున చూపించారు. “ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. ఎన్ని మిస్టేక్సో తెలుసా.. అభయ్ నువ్వొక సైకోలాగా ఉన్నావ్” అని నాగార్జున అన్నారు. బిగ్‍బాస్‍ను అభయ్ దూషించిన సందర్భాలను చూపించారు. అవహేళన మాట్లాడిన మాటలను చూపించారు. దీంతో అభయ్ తల దించుకున్నారు.
“నీ ఫేసే.. నీ వాయిసే.. అన్నీ లఫంగి మాటలే. మనిషి పుట్టుకపుట్టావా.. సైకో గాడిలా ఉన్నావ్” అని బిగ్‍బాస్‍ను అభయ్ అన్న మాటలను తిరిగి చెప్పారు నాగార్జున. బిగ్‍బాస్‍కు రెస్పెక్ట్ ఇవ్వకపోవటం పెద్ద తప్పు అని చివాట్లు పెట్టారు. సారీ అంటూ మోకాళ్లపై కూర్చొని చెప్పారు అభయ్. కోడిగుడ్ల టాస్క్ మినహా అంతా కష్టపడ్డానని అన్నారు. బిగ్‍బాస్ ఎలా నడిపిస్తే అలా ఆడాల్సిందేనని నాగార్జున చెప్పారు. కంటెస్టెంట్లందరికీ ఇదే చెబుతున్నానని అన్నారు.
రెడ్ కార్డ్.. కాపాడిన కంటెస్టెంట్లు
అభయ్‍కు రెడ్ కార్డ్ చూపించారు నాగార్జున. తలుపులు ఓపెన్ చేసి హౌస్ నుంచి బయటికి వెళ్లిపో అని నాగ్ అన్నారు. దీంతో తనకు మరో ఛాన్స్ ఇవ్వాలని అభయ్ చెప్పారు. మిగిలిన కంటెస్టెంట్లు కూడా అతడికి సపోర్ట్ చేశారు. అతడికి మరో అవకాశం ఇవ్వాలని మిగిలిన కంటెస్టెంట్లు కూడా అన్నారు. దీంతో అభయ్‍కు మరో ఛాన్స్ ఇచ్చారు నాగార్జున. రెడ్ కార్డ్ వెనక్కి తీసుకున్నారు.
అమ్మాయిలు భేష్.. పెరిగిన ప్రైజ్‍మనీ
ఎగ్స్ టాస్కులో అమ్మాయిలు అదరగొట్టారని నాగార్జున అన్నారు. దీంతో ప్రైజ్‍మనీకి రూ.6లక్షలు యాడ్ అయిందని నాగార్జున తెలిపారు. దీంతో బిగ్‍బాస్ 8 క్యాష్ ప్రైజ్ ఇప్పటి వరకు రూ.11.60లక్షలకు చేరింది.
ప్రేరణకు క్లాస్
ప్రేరణ, విష్ణుప్రియ గొడవకు సంబంధించిన వీడియోను కూడా నాగార్జున చెప్పారు. విష్ణును ప్రేరణ రాక్షసి, క్యారెక్టర్ లెస్ అనడంపై నాగార్జున ఫైర్ అయ్యారు. దీనికి గాను విష్ణుకు సారీ చెప్పారు ప్రేరణ. సంస్కారం ఎటుపోతోందని నాగ్ అన్నారు. ప్రేరణ ఫొటో దగ్గర పెట్టిన గుడ్డును నాగార్జున పగులగొట్టారు. పతివ్రత అని విష్ణుప్రియ అనడంపై నాగ్ కోప్పడ్డారు.
ప్రేరణ, విష్ణు మధ్య దోశ విషయాన్ని మణికంఠ పెద్దది చేశారని నాగార్జున చెప్పారు. తాను కూడా అదే చెప్పానని పృథ్వి అన్నారు. అయితే, మణి డిఫెండ్ చేసుకున్నారు. మధ్యలో వెళ్లవద్దని మణికి నాగ్ సూచించారు.
సోనియాకు రెడ్ ఎగ్ ఇవ్వడంపై నిఖిల్‍ను నాగార్జున ప్రశ్నించారు. ఇతరులు బాగా ఆడినా సోనియాకే ఎందుకు ఇచ్చారని అడిగారు. దీంతో కారణాలను నిఖిల్ తెలిపారు. పృథ్వి కంట్రోల్‍లో లేకపోవడంపై నాగార్జున క్లాస్ తీసుకున్నారు.
యష్మి విషయంలో మణిపై అసంతృప్తి
మణికంఠను కన్ఫెషన్ రూమ్‍కు నాగార్జున పిలిచారు. మణికంఠ కౌగిలించుకోవడంపై యష్మి బాధపడడాన్ని అతడికి చూపించారు. ఆడపిల్ల బాధపడితే హౌస్ నుంచి బయటికి వెళతావని నాగార్జున హెచ్చరించారు. తాను ఇంకోసారి ఇలా చేయనని మణికంఠ అన్నారు.
అభయ్ ఎలిమినేట్!
రెడ్ కార్డ్ నుంచి అభయ్‍ను కంటెస్టెంట్లు కాపాడారు. అయితే, ఓటింగ్‍లో చివరగా ఉండటంతో అతడు రేపటి ఆదివారం ఎపిసోడ్‍లో ఎలిమినేట్ అవుతాడని లీకుల ద్వారా బయటికి వచ్చింది. ఈ విషయంపై రేపటి ఎపిసోడ్‍లో క్లారిటీ రానుంది.
ఈ వారం మొదట్లో చీఫ్‍గా ఉన్న అభయ్.. తనను తానే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారు. ఒకవేళ ఇప్పుడు ఎలిమినేట్ అయితే.. అదే ఇప్పుడు అతడి కొంప ముంచినట్టు అవుతుంది. బిగ్‍బాస్‍ను తిట్టడం, ఈవారం టాస్కుల్లో సరిగా పాల్గొనకపోవటంతో అభయ్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.