OTT Crime Thriller: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ - రాజ్యాంగంలోకి ఆర్టికల్ 21 స్ఫూర్తితో..
OTT Crime Thriller: తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ మెర్సీ కిల్లింగ్ థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శనివారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మెర్సీ కిల్లింగ్ మూవీలో సాయికుమార్, పార్వతీశం, ఐశ్వర్య కీలక పాత్రలు పోషించారు.
OTT Crime Thriller: తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ మెర్సీ కిల్లింగ్ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శనివారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో సాయికుమార్, కేరింత పార్వతీశం, ఐశ్వర్య, హారిక కీలక పాత్రల్లో నటించారు. సూరపల్లి వెంకట రమణ మెర్సీ కిల్లింగ్ మూవీకి దర్శకత్వం వహించాడు.
ఆర్టికల్ 21 స్ఫూర్తితో...
ఈ ఏడాది ఏప్రిల్‌లో మెర్సీ కిల్లింగ్ మూవీ థియేటర్లలో రిలీజైంది. రాజ్యాంగంలోకి అర్టికల్ నంబర్ 21 స్ఫూర్తితో దర్శకుడు ఈ సినిమాను తెరెక్కించాడు. తెలుగులో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన హారిక మెర్సీ కిల్లింగ్ మూవీలో కీలక పాత్ర చేసింది. కాన్సెప్ట్‌తో పాటు సాయికుమార్ యాక్టింగ్ బాగుందంటూ థియేటర్లలో రిలీజైన టైమ్‌లో సినిమాపై ప్రశంసలు వినిపించాయి.
మెర్సీ కిల్లింగ్ మూవీ కథ ఇదే..
స్వేచ్ఛ (హారిక) ఓ అనాథ. తనకు ఎదురైన అవమానాల కారణంగా తల్లిదండ్రులు ఎవరన్నది తెలుసుకోవాలని అన్వేషణ మొదలుపెడుతుంది. ఈ క్రమంలోనే షిఫ్ యార్డ్‌లో పనిచేసే మహేష్‌తో (పార్వతీశం) పాటు భారతి(ఐశ్వర్య) అనుకోకుండా స్వేచ్ఛ జీవితంలోకి వస్తారు.
స్వేచ్ఛ తండ్రిని వెతకడంతో ఆమెకు మహేష్, భారతి ఎలా సాయపడ్డారు? పరువు కోసమే బతికే రామకృష్ణమరాజుతో (సాయికుమార్) స్వేచ్ఛకు ఎలాంటి సంబంధం ఉంది? స్వేచ్ఛను చంపేయాలని అతడు ఎందుకు అనుకున్నాడు? తన ఊరివాళ్ల కోసం బసవరాజు అనే రౌడీని ఎదురించి మహేష్ ఎలాంటి పోరాటం చేశాడు? భారతికి ఎలాంటి అన్యాయం జరిగింది? అన్నదే ఈ మూవీ కథ.
మాస్ రోల్‌లో...
ఓ వైపు ప్రేమకథ...మరోవైపు తండ్రి కోసం ఓ అమ్మాయి సాగించే అన్వేషణను కలుపుతూ ఈ సినిమా సాగుతుంది. లవర్ బాయ్ పాత్రలకు భిన్నంగా మాస్ రోల్‌లో పార్వతీశం నటించాడు. మెర్సీ కిల్లింగ్ మూవీకి ఎంఎల్ రాజా మ్యూజిక్ అందించాడు. మెర్సీ కిల్లింగ్ ఓ లో బడ్జెట్ మూవీ అయినా కూడా ఐఎండీబీలో మంచి రేటింగ్ ఉంది. ఈ సినిమాకు పదికిగాను ప్రేక్షకులు 8.8 రేటింగ్ ఇవ్వడం గమనార్హం.
సరిపోదా శనివారం...
తెలుగులో చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు సాయికుమార్. తెలుగులో రీసెంట్‌గా బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన సరిపోదా శనివారం, కమిటీ కుర్రాళ్లు సినిమాలో కీలక పాత్రలు చేశాడు. సరిపోదా శనివారంలో నాని తండ్రిగా సాయికుమార్ కనిపించాడు. కమిటీ కుర్రాళ్లు మూవీలో సర్పంచ్‌గా నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్ చేశాడు.
కేరింతతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ...
మరోవైపు దిల్‌రాజు ప్రొడ్యూస్ చేసిన కేరింత మూవీతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పార్వతీశం. తొలి సినిమాలో మాస్ క్యారెక్టర్‌లో మెప్పించాడు. కేరింత తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసినా ఆ స్థాయివిజయం మాత్రం అతడికి దక్కలేదు.
నాన్నా నేను నా బాయ్‌ఫ్‌రెండ్, రోజులు మారాయి, భలే మంచి చౌక బేరమ్, జగన్నాటకం తో పాటు పలు సినిమాల్లో హీరోగా నటించాడు. ఈ ఏడాది మార్కెట్ మహాలక్ష్మి మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు.