Bigg Boss 8 Telugu Elimination: బిగ్‍బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటే!
Bigg Boss 8 Telugu Soniya Elimination: బిగ్‍బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో లీకుల ద్వారా బయటికి వచ్చింది. ఆరుగురు నామినేషన్లలో ఉండగా.. హౌస్ నుంచి సోనియా ఆకుల ఎలిమినేట్ కానున్నారని సమాచారం వెల్లడైంది.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ నాలుగో వారం అనూహ్యమైన నామినేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. హౌస్ నుంచి ఎవరు బయటికి వెళ్లనున్నారో తాజాగా సమాచారం బయటికి వచ్చింది. నాలుగో వారం ఎలిమినేషన్ కోసం ప్రేరణ, ఆదిత్య ఓం, పృథ్విరాజ్, సోనియా, మణికంఠ, నబీల్ ఆఫ్రిది నామినేషన్లలో ఉన్నారు. వీరిలో ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్లనున్నారో లీక్‍ల ద్వారా తెలిసిపోయింది.
సోనియా ఎలిమినేట్!
బిగ్‍బాస్ నాలుగో వారంలో సోనియా ఆకుల ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఓట్లు తక్కువగా వచ్చిన కారణంగా ఆమె ఎలిమినేట్ అయ్యారని సమాచారం. గేమ్స్ సరిగా ఆడకుండా గొడవలకు కారణం అవుతున్నారనే నెగెటివ్ అభిప్రాయం సోనియాపై గట్టిగా పెరిగింది. ఈ క్రమంలోనే గ్రాఫ్ పడిపోయి ఓటింగ్‍లో ఆమె అట్టగుడున నిలిచారని టాక్.
మొదటి నుంచి గొడవలు
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కరోనా వైరస్ చిత్రంలో సోనియా ఆకుల హీరోయిన్‍గా నటించారు. మరిన్ని సినిమాల్లో కనిపించారు. ఆ ఫేమ్‍తో బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో అడుగుపెట్టారు. బలమైన కంటెస్టెంట్‍గా అంచనాలను పెంచారు. అయితే, హౌస్‍లో మొదటి నుంచే సోనియా గొడవలకు ఫేమస్ అయ్యారు. బేబక్కతో కుక్కర్ అంశంలో, శేఖర్ బాషాతో ఆరెంజ్ విషయంలో ఆరంభంలో సోనియా గట్టిగా గొడవ పడ్డారు. ఆ తర్వాత చాలా మందితో వాగ్వాదాలు చేశారు. నబీల్, యష్మి, ఆదిత్య, విష్ణుప్రియ, శేఖర్.. ఇలా ఎక్కువ మంది కంటెస్టెంట్లతో గొడవ పడ్డారు. ఎదుటి వారిని రెచ్చగొట్టేలా చాలాసార్లు మాట్లాడారు. దీంతో వాగ్వాగాలు తీవ్రంగా జరిగాయి. అదే ఆమెకు మైనస్ అయినట్టు తెలుస్తోంది.
పృథ్వి, నిఖిల్‍ను వాడుకుంటున్నారంటూ..
బిగ్‍బాస్ హౌస్‍లో నిఖిల్, పృథ్విరాజ్‍తో సోనియా క్లోజ్‍గా ఉంటున్నారు. ఫ్యామిలీ అంటూ.. పెద్దోడు, చిన్నోడు అంటూ వారిద్దరితో సెంటిమెంట్ పండించారు. ఈ ముగ్గురు ఒకే గ్రూప్ అన్నట్టుగా ఇతర హౌస్‍మేట్స్ డిసైడ్ అయ్యారు. ప్రేక్షకులకు కూడా ఇదే ఫీలింగ్ కలిగింది. నిఖిల్, పృథ్విని ఆయుధాలుగా వాడుకుంటూ.. వారిని ముందు పెట్టి ఆట ఆడుతున్నావని సోనియాను యష్మి ఓ దశలో విమర్శించారు.
ఆరంభంలో నిఖిల్, పృథ్వితో పోటీపడుతున్నట్టుగా కనిపించిన ఆ తర్వాత స్ట్రాటజీ మార్చేశారు. వారిద్దరినీ దగ్గర చేసుకున్నారు. ఈ గ్రూప్ గేమ్ కూడా ఆమెకు ప్రతికూలంగా మారింది. సోనియా చెప్పినట్టు నిఖిల్, పృథ్వి చేస్తున్నారనే అభిప్రాయాలు బలపడ్డాయి. వైల్డ్ కార్డులను తప్పించేందుకు జరుగుతున్న గేమ్‍ల నుంచి నబీల్‍ను ఔట్ చేయాలని చీఫ్ నిఖిల్ చెప్పడం వెనుక సోనియా ఉన్నట్టు అర్థమైంది. హోస్ట్ నాగార్జున కూడా వీకెండ్ ఎపిసోడ్‍లో ఇలాంటి కామెంట్లే చేశారు. ఏ మిస్ దీనికి కారణం అంటూ సోనియా గురించి ఇన్‍డైరెక్ట్‌గా అన్నారు. వారు ముగ్గురు గ్రూప్‍గా ఉన్నారని హౌస్‍మేట్స్ కూడా అభిప్రాయపడ్డారు. ఇదే సోనియాకు మైనస్ అయింది.
ట్విస్ట్ ఏమైనా ఉంటుందా!
ఈ నాలుగో వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుందనే రూమర్లు వచ్చాయి. సోనియా, ఆదిత్య ఓం కూడా హౌస్ నుంచి బయటికి వెళతారనే అంచనాలు వచ్చాయి. ఆ తర్వాత సోనియాను సీక్రెట్ రూమ్‍కు పంపుతారనే టాక్ వచ్చింది. అయితే, సోనియాను ఒక్కరే ఎలిమినేట్ కానున్నారని తాజాగా లీకులు బయటికి వచ్చాయి. ఈ ఎలిమినేషన్‍పై రేపటి (సెప్టెంబర్ 29) ఆదివారం ఎపిసోడ్‍లో క్లారిటీ రానుంది.