Bigg Boss Today Promo: బాండింగ్ కోసం కాదు.. గేమ్ కోసం వచ్చా: సోనియాకు యష్మి పంచ్.. ఆ ముగ్గురు మళ్లీ ఒకే జట్టు!: వీడియో-bigg boss telugu 8 today promo i am not here for emotional bonds yashmi punch to soniya in clans selection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Today Promo: బాండింగ్ కోసం కాదు.. గేమ్ కోసం వచ్చా: సోనియాకు యష్మి పంచ్.. ఆ ముగ్గురు మళ్లీ ఒకే జట్టు!: వీడియో

Bigg Boss Today Promo: బాండింగ్ కోసం కాదు.. గేమ్ కోసం వచ్చా: సోనియాకు యష్మి పంచ్.. ఆ ముగ్గురు మళ్లీ ఒకే జట్టు!: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 25, 2024 11:14 AM IST

Bigg Boss Telugu 8 Today Promo: బిగ్‍బాస్ హౌస్‍లో రెండు క్లాన్‍లలో ఎవరు ఉండాలనే ప్రక్రియ నేడు సాగనుంది. సీత కొత్త చీఫ్‍గా ఎంపికవటంతో ఈ తంతు జరగనుంది. ఈ సందర్భంగానూ సోనియాపై యష్మి పంచ్‍లు వేశారు.

Bigg Boss Today Promo: బాండింగ్ కోసం కాదు.. గేమ్ కోసం వచ్చా: సోనియాకు యష్మి పంచ్.. ఆ ముగ్గురు మళ్లీ ఒకే జట్టు!: వీడియో
Bigg Boss Today Promo: బాండింగ్ కోసం కాదు.. గేమ్ కోసం వచ్చా: సోనియాకు యష్మి పంచ్.. ఆ ముగ్గురు మళ్లీ ఒకే జట్టు!: వీడియో

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో కొత్త చీఫ్‍గా సీత ఎంపికయ్యారు. కాంతార క్లాన్‍కు ఆమె చీఫ్ అయ్యారు. శక్తి క్లాన్‍కు నిఖిల్ చీఫ్‍గా కంటిన్యూ అయ్యారు. ప్రస్తుతం ఈ సీజన్‍లో నాలుగో వారం సాగుతోంది. కాంతార క్లాన్‍కు గత చీఫ్‍గా ఉన్న అభయ్ ఆ పోస్ట్ పోగొట్టుకోవటంతో పాటు ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ఎంపిక ప్రక్రియ తర్వాత సీత కొత్త చీఫ్ అయ్యారు. దీంతో రెండు క్లాన్‍లలో ఏ కంటెస్టెంట్లు ఉంటారనే ప్రక్రియ నేటి (సెప్టెంబర్ 25) ఎపిసోడ్‍లో ఉండనుంది. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది.

అక్కడ గుర్తింపు దక్కలేదు

కాంతార క్లాన్ చీఫ్‍గా ఎంపికైన సీతను గద్దెపై కూర్చోవాలని బిగ్‍బాస్ చెప్పటంతో ఈ ప్రోమో మొదలైంది. ఆ తర్వాత ఏ క్లాన్‍లో ఉండాలో నిర్ణయించుకోండని కంటెస్టెంట్లకు బిగ్‍బాస్ చెప్పారు. నిఖిల్ చీఫ్‍గా ఉన్న శక్తి క్లాన్‍లో తనకు గుర్తింపు దొరకలేదని విష్ణుప్రియ అన్నారు. తనకు సీత దగ్గర ఉండాలని ఉందని చెప్పారు.

నిఖిల్‍లో కోర్డినేషన్, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే అతడి క్లాన్‍లోకి వెళుతున్నానని సోనియా అన్నారు. తాను చీఫ్‍గా సీతను పూర్తిగా నమ్ముతున్నానని నైనిక అన్నారు. “శక్తి క్లాన్‍లో ఇప్పటికే బలం ఉంది. అందుకే ఆడడానికి నేను ఎక్కువగా ముందుగు రాలేదు. అందుకే ఇక్కడ ఉండి నేను ఆడతా. మంచి పోటీ ఇస్తానని అనుకుంటున్నా” అని నైనిక చెప్పారు.

తాను నిఖిల్ క్లాన్‍కు వెళ్లాలని అనుకుంటున్నానని పృథ్వి చెప్పారు. అతడు గుడ్ లీడర్ అని, స్ట్రాంగ్‍గా అనిపిస్తాడని అన్నారు.

నిఖిల్ కంటే సీత రియల్

సీత, నిఖిల్‍ను పోలిస్తే.. సీత తనకు బాగా రియల్ అనిపిస్తారని నబీల్ ఆఫ్రిది చెప్పారు. అందుకే వాళ్ల క్లాన్‍లోకి వెళ్లి టాస్కులు బాగా ఆడి బెస్ట్ ఇద్దామని అనుకుంటున్నా అని నబీల్ చెప్పారు. నబీల్ అలా అనే సరికి నిఖిల్ కాస్త కోపంగా కనిపించారు.

సోనియాపై యష్మి మళ్లీ..

సోనియాను యష్మి గౌడ మళ్లీ టార్గెట్ చేశారు. ఎమోషనల్ బాండింగ్స్ (బంధాలు) ఏర్పరుచుకునేందుకు తాను హౌస్‍లోకి రాలేదని, ఆట ఆడేందుకు వచ్చానంటూ సోనియాకు పంచ్ వేశారు యష్మి. “ఈ హౌస్‍కు ఏదో ఎమోషనల్ బాండింగ్స్ ఏర్పరుచుకునేందుకు నేను రాలేదు. స్పోర్టివ్‍గా గేమ్ ఆడడానికి వచ్చా. కాంతార టీమ్‍లోని ప్రతీ ఒక్కరు స్పోర్టివ్‍గా తీసుకుంటారు.. ఆడతారనే నమ్మకం నాకు ఉంది. అందుకే కాంతార టీమ్‍కు వెళతా” అని యష్మి అన్నారు.

అయితే, కాంతార క్లాన్‍వైపుగా యష్మి వెళుతుంటే ఒక్క నిమిషం బిగ్‍బాస్ అంటూ నైనిక అడ్డుకోవటంతో ఈ ప్రోమో ముగిసింది. అయితే, నైనిక కాంతార క్లాన్‍కు వెళ్లాలనుకోవటంతో యష్మి.. శక్తి టీమ్‍కు వెళ్లేందుకు సిద్ధమైనట్టు లీక్‍ల ద్వారా వెల్లడైంది.

మళ్లీ ఆ ముగ్గురు ఒకే క్లాన్‍లో..

నిఖిల్ చీఫ్‍గా ఉన్న శక్తి క్లాన్‍నే సోనియా, పృథ్విరాజ్ మరోసారి ఎంపిక చేసుకున్నారు. దీంతో మళ్లీ ఈ ముగ్గురు ఒకే జట్టులో ఉండే అవకాశం ఉంది. నిఖిల్, పృథ్విని వాడుకుంటూ, ముందు పెడుతూ ఆట ఆడుతున్నావని సోనియాపై యష్మి ఇటీవలే ఫైర్ అయ్యారు. ఈ తరుణంలో మళ్లీ నిఖిల్, సోనియా, పృథ్వి ఒకే క్లాన్‍లో ఉండేలా కనిపిస్తున్నారు. అయితే, ఏ క్లాన్‍లో ఎవరు ఉంటారనే విషయం నేటి ఎపిసోడ్‍లో తేలనుంది.